ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా నడుస్తుంది, ఉద్యోగులకు జీతాలు పడటం లేదు అనే విషయం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13వ తేదీ వచ్చినా చాలా మంది ఉద్యోగులకు ఇంకా జీతాలు పడటం లేదు. ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ ది కూడా అదే పరిస్థితి. అప్పు పుట్టటం లేదు, వస్తున్న ఆదాయం వస్తున్నట్టు రిజర్వ్ బ్యాంకు ఓడి కింద జమ వేసుకుంటుంది. ఈ తరుణంలో ఈ రోజు ఉద్యోగులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. తమకు ఎన్నో సమస్యలు ఉన్నాయని, చివరకు ఇప్పుడు జీతం ఇస్తే చాలు అనే పరిస్థితికి తీసుకొచ్చారని, మాకు రావలసిన బకాయల మేము అడగకుండా, కుట్ర ప్రకారం జీతం ఆపేసి, జీతం ఇస్తే చాలు అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందా అని ప్రశ్నించారు. జీతాల కోసం కూడా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, రోడ్డుకు వచ్చి పడ్డాం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తుందో అర్ధం కావటం లేదని అన్నారు. మేము దాచుకున్న డబ్బులు కూడా వాడేసారని, ఇప్పుడు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని వాపోయారు.

కొంత మందికి పదవి అలంకరణ.. కానీ కొంత మందికి మాత్రం పదవులతో పని ఉండదు. వారి ఇమేజే వారికి అలంకరణ.. అలంటి టాలేస్ట్ ఇమేజ్ ఉన్న నేత చంద్రబాబు నాయుడు గారు. ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయనకు దేశ రాజకీయాల్లో పేరు ఉందని అందరూ అనుకుంటారు కానీ, నిజానికి ఆయనకు ప్రపంచ నాయకులతో ఉన్న పరిచయాలు కూడా మాట్లాడుకోవాలి. గతంలో బిల్ క్లింటన్, టోనీ బ్లెర్, బిల్ గేట్స్, ఇలా ప్రపంచ స్థాయి వారితో చంద్రబాబుకు పరిచయాలు ఉన్నాయి. తాజాగా బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్, ఈ రోజు టిడిపి అధినేత చంద్రబాబును కలిసారు. ఆయన నివాసంలో చంద్రబాబుతో చాలా సేపు భేటీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న అంశాలు, భారత్, బ్రిటన్ దేశాల మధ్య సంబంధాలు పై చర్చించారు. జీ-20కి భారత్ నాయకత్వం వహించటం, దానికి చంద్రబాబు ఇచ్చిన ప్రెజెంటేషన్ గురించి కూడా చాలా సేపు ఇరువురూ మాట్లాడుతున్నారు.

cbn 13122022 2

ఇక చంద్రబాబు, తన ఇంటికి వచ్చిన గారెత్ విన్ ఓవెన్ ను మర్యాదపూర్వకంగా శాలువా కప్పి సన్మానించారు. గారెత్ విన్ ఓవెన్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగానే, సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుని ఆయన వచ్చి కలవటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈ భేటీ గురించి గారెత్ విన్ ఓవెన్ తన ట్విట్టర్ లో కూడా పంచుకున్నారు. చంద్రబాబుతో ఉన్న ఫోటో షేర్ చేసి, చంద్రబాబుని కలవటం సంతోషంగా ఉందని, ఆయనతో వివిధ అంశాల పై చర్చించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ మరోసారి చంద్రబాబు రేంజ్ ఏంటో చాటి చెప్పింది. అయితే ఈ ట్వీట్ పై కూడా వైసీపీకి చెందిన చిల్లర పేటీయం బ్యాచ్ వెకిలిగా స్పందిస్తూ, చంద్రబాబుని కించపరిచేలా రిప్లై లు ఇస్తున్నారు. ఎంత చేసినా వారి ఆనందమే కానీ, చంద్రబాబు రేంజ్ ఏమైనా పడిపోతుందా ? ఆయన అంటే ఏంటో, వారికి తెలియకుండా పోతుందా ?

ఈ రోజు హైకోర్టు సంచలన ఆదేశాలు జరీ చేసింది. టీటీడీలోని ముగ్గురు తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి, పిటీషన్ దాఖలు అయ్యింది. ఆ పిటీషన్ పై విచారణ జరిపిన ధర్మసనం, టిటిడి ఈవో ధర్మారెడ్డికి నెల రోజుల జైలు శిక్ష, అదే విధంగా రూ.2 వేలు జరిమానా విధిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా కేసు విషయం చూసుకున్నట్టు అయితే, టీటీడీ పరధిలో ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తూ, వాళ్ళు క్రమబద్దీకరణ కోసం గతంలో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. పిటీషన్ పైన సుదీర్ఘమైన విచారణ జరిపిన ధర్మాసనం, ముగ్గురినీ కూడా క్రమబద్దీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉద్యోగులు చాలా కాలంగా సర్వీస్ లో ఉండటంతో, వాళ్ళకు పెర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ మధ్యంతర ఉత్తర్వులని దేవాదాయ ఈవో పట్టించుకోక పోవటంతో, వాళ్ళు కోర్టు దిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు. ఈ రోజు దీని పై విచారణ జరిగింది. రెండు తరుపున వాదనలు వినిపించారు.

హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చినా కూడా, కావాలనే ఆదేశాలు అమలు చేయలేదని, కోర్టు ముందు పిటీషన్ తరుపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. దీని పైన అటు టిటిడి వాదనలు, పిటీషనర్ తరుపున వాదనలు విన్న న్యాయస్థానం, ఉద్దేశపూర్వకంగానే ఆదేశాలు అమలు చేయలేదని భావిస్తూ, టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలుశిక్ష, జరిమానా విధించింది హైకోర్టు. అయితే దీని పై టిటిడి ఈవో తమ శిక్షను తీసి వేయాలని, హైకోర్టు ముందు అపీల్ చేసుకునే అవకాసం ఉంది. అపీల్ చేసుకుంటే హైకోర్టు ఏమి చెప్తుందో చూడాలి. దీని పై అపీల్ కు వెళ్తారా , లేక డివిజనల్ బెంచు కు అపీల్ కు వెళ్తారా అనేది చూడాల్సి ఉండి. గతంలో కూడా ఇలాగే అధికారులకు జైలు శిక్ష విధించినా,వారు క్షమాపణ చెప్పి అపీల్ చేయటంతో, గతంలో హైకోర్టు ఆ శిక్షను వెనక్కు తీసుకుంది. మరి ఈ సారి ఏమి అవుతుందో చూడాలి. అయితే ఇలా కోర్టు దిక్కరణ చేయటం అనేది, ఈ ప్రభుత్వంలో అతి సాధారణం అయిపొయింది

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవటం పై, పార్లమెంట్ దృష్టికి వచ్చింది. ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఇబ్బందులపై టీడీపీ ఎంపీ కనకమేడల రాజ్యసభలో ప్రస్తావించారు. ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈరోజుకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన రాజ్యసభకు తెలిపారు. జీతాలు ఇవ్వడానికి కూడా కేంద్రం ఇచ్చే నిధులు దారి మళ్లించే పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సబ్‍ప్లాన్ కింద కేంద్రం ఇస్తున్న నిధులను ఏపీలో పెద్ద ఎత్తున దారి మళ్లిస్తున్నారని, రాజ్యసభ దృష్టికి తెచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్‍ప్లాన్ కింద కేంద్రం ఇచ్చిన రూ.8,400 కోట్లు, రూ.1000 కోట్లను దారి మళ్లించారని చెప్పారు. జీవోలు, మెమోలు ఇచ్చి మరీ నిధులను దారి మళ్లిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ లో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తున్న విషయాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు కూడా ఏపీలో పర్యటించి నిర్ధారించారని తెలిపారు.

rs 13122022 2

గిరిజన ప్రాంతాల్లో భూములను అధికార పార్టీ నేతలు భారీగా ఆక్రమిస్తున్నారని, అలాగే గిరిజన ప్రాంతాల్లో వైద్యం సహా కనీస మౌలిక సదుపాయాలు లేవని తెలిపారు. గర్భిణులను నలుగురైదుగురు కలిసి కిలోమీటర్ల మేర మోసుకెళ్లాల్సిన పరిస్థితులు ఏపీలో ఉన్నాయని, వాల్మీకి బోయలను కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలి దీనికి సంబంధించి 2017లో టీడీపీ హయాంలో శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం అని టీడీపీ ఎంపీ కనమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభకు చెప్పారు. చివరకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వటానికి కూడా, కేంద్రం ఇచ్చే నిధులని దారి మళ్ళించి, జీతాలు ఇచ్చే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకుని వచ్చారని, ఈ విషయం పై కేంద్రం దృష్టి సారించి, రాష్ట్రంలో జరుగుతున్న దారుణాన్ని ఆపాలని, లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోతుందని తెలిపారు. మొత్తానికి రాష్ట్రంలో గత రెండు వారులుగా జీతాలు రాలేదనే సంగతి ఇప్పుడు రాజ్యసభలో కూడా మారు మోగింది. ఈ విషయం తెలిసి రాజ్యసభ కు ఆశ్చర్యపోయింది.

Advertisements

Latest Articles

Most Read