అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాయలసీమని ప్రగతిపథంలోకి తీసుకెళ్తానన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి మాటలు నీటిమూటలేనని మరోసారి స్పష్టమైందని ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తారు. మూడేళ్ల క్రితం కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ, మూడేళ్లలో పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. మూడేళ్లు పూర్తి అయినా ఉక్కు కర్మాగారం నిర్మాణంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీనిపై సోషల్మీడియా వేదికగా ప్రతిపక్ష టిడిపి నేతలు వ్యంగ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో 15వేల కోట్ల పెట్టుబడితో నిర్మించబోయే స్టీల్ ఫ్యాక్టరీకి 2019 డిసెంబరు 23న సీఎం జగన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్లలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేసి 25వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తామన్నారు. పనిలో పనిగా తనకు అస్సలు సూటు అవ్వని చిత్తశుద్ధి, నిజాయితీ, విశ్వసనీయత అంటూ ఏవో కబుర్లు కూడా చెప్పారు. మూడేళ్లు పూర్తయ్యింది. కడప స్టీల్ ఫ్లాంట్ శిలాఫలకం వెక్కిరిస్తోంది. దీనిపై ప్రతిపక్ష టిడిపి నాడు జగన్ ఇచ్చిన హామీలు, నేటి దుస్థితిని వివరిస్తూ పోస్టులతో ప్రశ్నిస్తున్నారు.

ఇద్దరు టాప్ హీరోలు ఒక చోట కలిస్తే ? ఇద్దరు టాప్ నేతలు ఒక చోట కలిస్తే ? తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యే వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని కలిసారు. ఇంకో విధంగా చెప్పాలి అంటే తెలుగు సినీ ఇండస్ట్రీ టాప్ హీరోలు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. బాలకృష్ణ నటిస్తున్న వీరసింహా రెడ్డి సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ రోజు బాలయ్య షూటింగ్ చేస్తున్న వీరసింహా రెడ్డి సెట్ కు, పవన్ కళ్యాణ్ వచ్చి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ భేటీ ఎందుకు జరిగింది అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక పోతే ఇప్పటికే అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా పవన్ కళ్యాణ్ వస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఈ షూటింగ్ కూడా ఈ వారమే జరుగుతుందని చెప్తున్నారు. సంక్రాంతికి ఈ ఎపిసోడ్ వస్తుందని అంటున్నారు. మొత్తం మీద ఇద్దరు టాప్ హీరోలు ఒక్క చోట చేరితే, దబిడి దిబిడే మరి.

రాజాంలో బీసీ వర్గాలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. బీసీ వర్గాలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ప్రసంగం:- "టీడీపీ ఆవిర్భావం ముందు....ఆవిర్భావం తరువాత బీసీల జీవితాలను చూడాలి. టీడీపీ ఆవిర్భావంతో రాజకీయంగా, సామాజికంగా బీసీ వర్గాల్లో మార్పులు వచ్చాయి. 50 శాతం పైగా ఉన్న బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావాలని టీడీపీ ప్రణాళికలు రూపొందించి.. అమలు చేసింది. నాడు కేంద్రంలో ఒక్కటే మంత్రి పదవి వస్తే...దాన్ని ఎర్రంనాయుడుకి ఇచ్చిన ఘటన టీడీపీది. అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, కె.ఇ. కృష్ణమూర్తి, దేవేందర్ గౌడ్ వంటి బీసీ నేతలకు పదవులు ఇచ్చింది టీడీపీనే. ఎన్టీఆర్ హయాంలోనే బీసీ కమిషన్ ఆవిర్భించింది. బీసీలలో వంశాపార్యపరంగా కులవృత్తులు, చేతి వృత్తులు వచ్చాయి. అందుకే వారి కోసం ప్రత్యేక పథకాలు తెచ్చి ఆర్థికంగా పైకి తీసుకువచ్చాం. బీసీల ఆర్థిక స్థితిగతుల్లోమార్పులు తెచ్చేందుకు కంకణం కట్టుకుని టీడీపీ పనిచేసింది. కల్లుగీత కార్మికులు జీవితాలు చాలా దారుణంగా ఉండేవి. ప్రమాదం జరిగితే ఎవరూ ఆదుకునే వారు కాదు...కానీ టీడీపీ వచ్చిన తరువాత వారిని ఆదుకున్నాం. జగన్ రెడ్డి సొంత మద్యం అమ్మకుంటున్నాడు. టీడీపీ వచ్చిన తరువాత కల్లుగీత కార్మికులకు 20 శాతం ప్రభుత్వ మద్యం షాపులు కేటాయిస్తాం. బీసీల పథకాలకు డబ్బులు లేవు కానీ...సాక్షి పేపర్ కు ప్రకటనల కోసం మాత్రం వందల కోట్లు ఇస్తున్నారు
స్కూళ్లలో సాక్షి పేపర్ తప్ప మరో పేపర్ లేదని స్వయంగా కోర్టు ఆక్షేపించింది. చైనాలో మావో తీరుపై ఆగ్రహంతో అక్కడి ప్రజలు ఆయన విగ్రహాలు తొలగించారు. జగన్ చేసే తప్పుడు పనులకు రాష్ట్రం నుంచి జగన్ ను పూర్తిగా తరిమేయడం ఖాయం. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్య కారులకు పెట్రోల్ డీజిల్ సబ్సిడీ ఇచ్చి ఆదుకునేవాళ్లం. చేపలవేట విరామంలో మత్స్య కార కుటుంబాలకు బియ్యం సరుకులు ఇచ్చి సహాయం చేశాం. మత్స్య కారుల కోసం అధునిక బోట్లు అందుబాటులోకి తెచ్చింది టీడీపీయే.

విశ్వబ్రాహ్మణల పరిస్థితి రాష్ట్రంలో మరింత దారుణంగా ఉంది. ఒకప్పుడు రికవరీ పేరుతో వీరిపై తప్పుడు కేసులు పెట్టేవారు. మంగళసూత్రం తయారైన తర్వాతే ముహూర్తం పెట్టుకునే పరిస్థితి నాడు ఉండేది. విశ్వబ్రాహ్మణులకు అంత డిమాండ్ ఉండేది. బీసీలలో అన్ని వృత్తుల వారూ ఆర్థికంగా దెబ్బతిన్నారు. బీసీలలో 140 కులాలు ఉన్నాయి. వారందరినీ ఆదుకుంటాం. వీటి కోసమే 54 బిసి సాధికార కమిటీలు వేశాం. ఉత్తరాంధ్రంలో ఇప్పుడు జగన్ ఎవరిని పెట్టారు...సాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం ఏంటి? సాయిరెడ్డి, సుబ్బారెడ్డిలు ఎవరు ఇక్కడ రాజకీయం చేయడానకి.... రావడానికి మీరెవరని వాళ్లను బొత్స ఎందుకు అడగలేకపోతున్నాడు? జగన్ కంటే ముందు పీసీసీ అధ్యక్షుడు అయిన బొత్స..ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు.? ఎందుకు ఊడిగం చేస్తున్నాడు.? మంత్రిగా ఉన్న అధర్మాన ఏం చేస్తున్నాడు.? పెద్దిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, సజ్జల వంటి వారిని పెట్టుకుని మమ్మల్ని ప్రశ్నిస్తారా? మన బీసీలు అయిన సుధాకర్ యాదవ్ వంటి వారిని టిటిడి బోర్డు చైర్మన్ ను చేశాం. జగన్ బీసీలకు పదవులు ఇవ్వడు గాని...వారి ఒట్లు మాత్రం కావాలి. బీసీలకు ఆదరణ కోసం తెచ్చిన రూ.300 కోట్ల విలువ చేసే పరికరాలు తప్పు పట్టిపోతున్నా ఇవ్వలేదు. ఆదరణ పథకాలకు తప్పు పట్టిచ్చిన మీ ప్రభుత్వానికి తుప్పు పట్టడం ఖాయం.

పేద వారికి ఆదరణ పథకం వచ్చి ఉంటే అదే జీవనాధారంగా నిలిచేది. ఉత్తరాంధ్రలో తోటపల్లిలో ప్రారంభించింది నేనే....పూర్తి చేసింది నేనే. మద్దివలస ప్రాజెక్టను మనమే పూర్తి చేశాం. ఉత్తరాంధ్రలో వ్యవసాయం, ఉపాధిని నాశనం చేశారు. ఈ ప్రాంతంలో ధాన్యం కొనే పరిస్థితి లేదు. ధాన్యం కొనడం లేదు గానీ....మోటార్లకు మీటర్లు పెడుతున్నారు. కొల్లు రవీంద్రలాంటి వారిపై అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టారు. జగన్ రెడ్డీ నిన్ను జైల్లో వెయ్యలేమా.? అజాత శత్రువు లాంటి కొల్లు రవీంద్రపై కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతారా? అచ్చెన్నాయుడుపైనా అక్రమ కేసు పెట్టిన జగన్ రెడ్డి ఏం పీకాడు.? 72 రోజులు అచ్చెన్నను జైల్లో పెట్టావు. జగన్ జైల్లో ఉన్నాడు కాబట్టి...అందరూ జైల్లో ఉండాలి అని అంటున్నారు. చివరికి కళా వెంకటరావు, అయ్యన్న పాత్రుడుపైనా కేసులు పెట్టారు. 72 ఏళ్ల అయ్యన్నపై రేప్ కేసు పెట్టిన జగన్ ను ఏమనాలి? బీసీ మహిళ గౌతు శిరీషపైనా కేసులు పెట్టారు. గౌతు లచ్చన్న లాంటి కుటుంబ సభ్యురాలిపై కేసు పెట్టారు. గౌతు లచ్చన్న కుటుంబం అంటే కూడా గౌరవం లేదా? కూన రవిపై అయితే కేసులే కేసులు..బీసీలపై కక్ష సాధించిన నిన్ను ఇంటికి పంపడం ఖాయం. ఇంత దారుణాలు చేసిన జగన్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేద్దాం. బీసీలకు జగన్ హయాంలో అన్యాయం జరుగుతోంది. ఈ నష్టాన్నంతా పూర్తి చేసేది తెలుగు దేశమే. నన్ను 40 ఏళ్లు ఆదరించి గౌరవించిన బీసీలకు న్యాయం చేస్తా. పార్టీ బీసీ సాధికార కమిటీ ద్వారా బీసీల కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం.

రాష్ట్రంలో వైసీపీ రోజు రోజుకీ రెచ్చిపోతుంది. మొన్న మాచర్ల సీన్ మర్చిపోక ముందే, ఈ రోజు తంబళ్లపల్లి ముదివేడు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుని. ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. అక్కడ నుంచి మొదలైన రచ్చ చివరకు మాచర్ల లాగే, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతల రాళ్ల దా-డి వరకు వెళ్ళింది. అక్కడితో ఆగకుండా ముదివేడులోని టీడీపీ సానుభూతిపరుల ఇళ్లలోకి వైసీపీ కార్యకర్తలు చొరబడి దా-డి చేసారు. వైసీపీ కార్యకర్తల దా-డిలో పలువురు టిడిపి కార్యకర్తలకి తీవ్ర గాయాలు అయ్యాయి. దా-డి దృశ్యాలను సోషల్ మీడియాలో లైవ్ ప్రసారం చేసారు వైసీపీ కార్యకర్తలు. ఏకంగా లైవ్ పెట్టి, తాము ఇలా చేస్తాం, ఎవడైనా మాకు లెక్క లేదు అనే విధంగా, వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఇప్పటికే మాచర్ల ఘటన పై టిడిపి పోరాటాలు చేస్తూ ఉండగానే, ఈ రోజు మళ్ళీ తంబళ్లపల్లిలో రెచ్చిపోయింది వైసీపీ. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉండటంతోనే, ఈ ఇబ్బందులు అని టిడిపి నేతలు వాపోతున్నారు.

Advertisements

Latest Articles

Most Read