పన్నులపేరుతో ఇప్పటికే ప్రజల్ని పీక్కుతింటున్న జగన్ రెడ్డి, ఆయనప్రభుత్వం తాజాగా పట్టణాలు, నగరాల్లోని ఖాళీస్థలాలపై పన్నులేస్తోందని, కట్టకపోతే వాటిలో సచివాలయాలు, వైసీపీకార్యాలయాలు కడతామంటూ జనాల్ని బెదిరిస్తోందని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే మీకోసం...! “జగన్ రెడ్డి రాష్ట్రంలో నయాదందాకు తెరలేపాడు. నగరాలు, పట్టణాల్లోని ప్రైవేట్ స్థలాల్ని ఆక్రమించమని తనపార్టీవారికి ఆదేశాలు ఇచ్చినట్టున్నాడు. ఖాళీస్థలాలు కనిపిస్తేచాలు, వాటికి పన్నులు కట్టాలని కట్టకుంటే సచివాలయాలు, వైసీపీకార్యాలయాలు కడతామంటూ బెదిరిస్తున్నారు. రాజమహేంద్రవరంలోని ఖాళీస్థలాల్లో ఇప్పటికే ఈ పద్ధతి ఫాలో అవుతున్నా రు. ఏ నిబంధనలప్రకారం రాజమహేంద్రవరంలోని ఖాళీస్థలాల్లో ప్లెక్సీలు పెట్టారో అధికారులు చెప్పాలి. ప్రభుత్వం ఆదేశిస్తే పెట్టారా..లేక స్థానిక మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం చూపారా? ఇప్పటికే చెత్తపై పన్నువేసిన జగన్ ప్రభుత్వం, చెత్తప్రభుత్వంగా పేరుపొందింది. ఇప్పుడు ఖాళీస్థలాల ఆక్రమణతో కబ్జాల ప్రభుత్వంగా మారబోతోంది. పన్నులు కట్టకపోతే స్థలాలు కబ్జాచేయడమేంటి? ప్రజలస్థలాలు, ప్రభుత్వ స్థలాలు కొట్టేసి, వాటిని తక్కువధరకు తనవారికి కట్టబెట్టాలన్నది పాలకుల ఆలోచనా? టీడీపీప్రభుత్వం పట్టణాల్లో ఏర్పాటుచేసిన అన్నాక్యాంటీన్లు మూసేసి, వాటిలో అడ్డగోలుగా సచివాలయాలు పెట్టారు. మరలా సచివాలయాల పేరుతో ప్రైవేట్ స్థలా లను ప్రభుత్వం కబ్జాచేయడం ఏమిటి?

భూసర్వేపేరుతో పల్లెల్లోని భూముల్ని కొట్టేయ డానికి సిద్ధమైన జగన్ రెడ్డి, తాజాగా పట్టణాల్లోని స్థలాల్నికూడా కబళించడానికి రెడీ అయ్యా డు. స్థలయజమానులు విదేశాల్లోనో, ఇతరప్రాంతాల్లోనో ఉంటారు.. అలాగని కనిపించిన స్థలాలన్నింటినీ కబ్జాచేస్తారా? యజమానులకు నోటీసులు ఇవ్వకుండా, కనిపించిన స్థలాన్నల్లా కబ్జాచేస్తామంటే ప్రజలుచూస్తూ ఊరుకుంటారా? స్థలం ఉండి పన్నులు కట్టక పోతే, ప్రజల్లో అవగాహనపెంచి, వారినుంచి పన్నులు రాబట్టాలి. అంతేగానీ కనిపించిన జాగాలన్నింటినీ కబ్జాచేయడమేంటి? ప్రజలఆస్తుల పత్రాలపై ముఖ్యమంత్రి, ఆయన తండ్రి ఫోటోలు వేయడం జగన్ రెడ్డి కీర్తి కండూతికి పరాకాష్ట. భూరక్ష-భూసర్వేతో ఈప్రభుత్వం ఏంసాధించాలనుకుంటోంది? రైతులు, ఇతరుల సొంత ఆస్తులకు సంబంధించిన పత్రాలపై ముఖ్యమంత్రి, ఆయనతండ్రి ఫోటోలు పెట్టడమేంటి ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీరంగులు వేసినట్టు, ప్రజల ఆస్తిపత్రాలపై జగన్ రెడ్డి బొమ్మ లు వేస్తున్నారా? ప్రజల్ని ఏం ఉద్ధరించాడని ఈ ముఖ్యమంత్రి తనబొమ్మలు, తనపార్టీ రంగులు వేస్తున్నాడు? కీర్తికండూతి కోసమే జగన్ రెడ్డి ప్రభుత్వసొమ్ముతో ప్రజల ఆస్తులపై తనబొమ్మలు ముద్రిస్తున్నాడు. సాక్షి మీడియాలో చేస్తున్న దుష్ప్రచారంచాలక, ప్రతి ఇంటి లో తనఫోటో, ప్రతిపత్రంలో తనబొమ్మ ఉండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నాడా?

సెంటు పట్టా పేరుతో ప్రజలకు ఇచ్చిన ఇళ్లస్థలాలన్నీ నిరుపయోగమైనవే. ఉద్యోగులుకు జీతాలు ఇవ్వలేని జగన్ రెడ్డి, పేదలకు ఇళ్లుకట్టిస్తాడా? తాడేపల్లి ప్యాలెస్ కే సక్రమంగా పన్నుకట్టని జగన్ రెడ్డి, పేదలస్థలాలకు పన్నులు ఎలావేస్తాడు? అవికట్టలేదని వాటిని ఆక్రమించు కోవడం ఏమిటి? ప్రభుత్వాన్ని నడపడంలో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి, ఏదో రూపంలో ప్రజల్నిబెదిరించి, భయపెట్టి, తనబొక్కసం నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రానికి పైసా ఆదాయం, ప్రజలకు ఇసుమంత మేలుచేయని జగన్ రెడ్డి, ఇలా భూములు, స్థలాల కబ్జాతో ఎన్నాళ్లు ప్రజల్ని వేపుకుతింటాడు? కనిపించిన ఖాళీస్థలాలన్నీ కబ్జా చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి విరమించుకోవాలి. లేకుంటే ప్రజలు ఆయన్ని, ఆయన ప్రభుత్వాన్ని పాతరేయడం ఖాయం. రాష్ట్రంలో పోలీసులమద్ధతు తప్ప, ఎవరిమద్ధతు ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికిలేదు” అని రఫీ స్పష్టంచేశారు.

ఈ రోజు పార్లమెంటులో రిషికొండ తవ్వకాల అంశం ప్రస్తావనకు వచ్చింది, పర్యావరణ ఉల్లంఘనలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా చర్యలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది అంటూ కేంద్రం సంచలన ప్రకటన చేసింది. ఈ రోజు రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ఆయన స్పందిస్తూ, రిషికొండలో తవ్వకాలపై కమిటీని నియమించాం అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు కమిటీ నియామకం జరిగిందని అన్నారు. ఈ నెల12న ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించాం అని అన్నారు. నియామక ప్రకటన చేసిన నాటి నుంచి వారం రోజుల్లో రిషికొండలో పర్యటించాలని కోరాం అని కూడా ఆయన చెప్పారు. పర్యటనలో తవ్వకం పనుల గురించే కాకుండా ఏపీ హైకోర్టు వ్యక్తం చేసిన ఇతర అభిప్రాయాల గురించి కూడా పరిశీలన చేయాలని కోరడం జరిగిందని చెప్పారు. పర్యటన పూర్తయ్యాక 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరాం అని అన్నారు.పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఉల్లంఘనలు జరిగితే పర్యావరణ చట్టాల ప్రకారం సంస్థలు, అధికారులు.. రాష్ట్ర ప్రభుత్వాలపై చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని రాజ్యసభలో కేంద్ర పర్యావరణ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చూబే స్పష్టం చేసారు.

రైతులమోటార్లకు మీటర్లు బిగించే నెపంతో జగన్ రెడ్డి వారిమెడలకు ఉరితాళ్లు బిగిస్తున్నాడని, ఈ వ్యవహారంలో టెండర్ నిబంధనలు మార్చిమరీ, తన బంధువు సంస్థ అయిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కు మేలుచేయడానికి రైతులసొమ్ము దోచిపెడుతున్నాడని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి జీ.వీ.రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలు క్లుప్తంగా మీకోసం...! “ రైతులమోటార్లకు మీటర్లు బిగిస్తూ, వైసీపీప్రభుత్వం రైతులమెడకు ఉరితాళ్లు బిగిస్తోంది. ఏదైనా గుత్తేదారుసంస్థ ఒకప్రాజెక్ట్ కడితే, దానిభద్రత కొన్నేళ్లవరకు సదరుసంస్థే పర్యవేక్షించాలి. కానీ స్మార్ట్ మీటర్ల విషయంలో, భద్రతఅంశాల్లో జగన్ రెడ్డి బంధువు కంపెనీ షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కి లబ్దికలిగేలా టెండర్ నిబంధనలు మార్చారు. కేంద్ర్రప్రభుత్వం ఇచ్చే అప్పుకోసం స్మార్ట్ మీటర్ల పేరుతో జగన్ రెడ్డి రైతుల్ని ఇబ్బందిపెట్టడం అన్యాయం. రైతులుముందు విద్యుత్ బిల్లులుచెల్లిస్తే తరువాత తామువారి ఖాతాల్లోకి డబ్బులు వేస్తామంటున్న ప్రభుత్వం, అంతిమంగా అన్నదాతల్ని ముంచేస్తుంది. భవిష్యత్ లో ఉచితవిద్యుత్ కు కూడా మంగళం పాడనుంది. ఒక్కో స్మార్ట్ మీటర్ బిగింపు, నిర్వహణకు రూ.7 నుంచి రూ.8వందలు అవుతుంటే, రూ.12వేలని చెప్పడం దోపిడీకోసం కాదా? టెండర్ నిబంధనల్లో మార్పులతో ప్రభుత్వం రూ.5వేలకోట్ల దోపిడీకి సిద్ధమైంది. ఒక్కో స్మార్ట్ మీటర్ బిగించడానికి, నిర్వహణకు కలిపి మహారాష్ట్రంలో రూ.700 నుంచి రూ.800 అవుతోంది. కానీ ఏపీ ప్రభుత్వంరూ.12వేలుఅవుతోందని తప్పుడు లెక్కచెబు తోంది. ఒక్కో మీటర్ బిగించడానికి రూ.7 నుంచి రూ.8వందలు అవుతుంటే, అనుబంధపరికరాలు, ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అనిప్రభుత్వం రూ.12వేలు వసూలుచేయడం ముమ్మాటికీ పాలకులు బరితెగింపే. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సామగ్రి ధరలు తక్కువున్నా కూడా ప్రభుత్వం ఎందుకింతలా దోపిడీచేస్తోంది.

షిర్డీసాయి సంస్థకోసమే ప్రభుత్వం ఇలా రైతుల్ని దోచుకునేలా విధానాలు రూపొందించిందా? స్మార్ట్ మీటర్ల టెండర్లు పిలిచేటప్పుడే ప్రభుత్వం అధికధరలు కోట్ చేసి, టెండర్లు పిలిచింది. రూ.6,400కోట్లతో టెండర్ వ్యాల్యూని నిర్ధారించింది. స్మార్ట్ మీటర్ల బిగింపు టెండర్ ని ముఖ్యమంత్రి బంధువుసంస్థ అయిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కు ప్రభుత్వం అప్పగించింది. రైతులమోటార్లకు మీటర్లు పెట్టడమే పెద్దతప్పు అయితే, దాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించి, కిక్ బ్యాక్ పద్ధతిలో దోపిడీకి పాల్పడటం మరోతప్పు. రూ.6,400కోట్ల టెండర్ వ్యాల్యూలో దాదాపు రూ.5వేలకోట్లు కిక్ బ్యాక్ ద్వారా తిరిగి ప్రభుత్వానికే చేరేలా టెండర్ నిబంధనలు మార్చారు. టెండర్లను షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కు కట్టాబెట్టాలనుకున్నప్రభుత్వం, నిబంధనలను కూడా ఆసంస్థకు తగినవిధంగా మార్చేసింది. ఏ నిబంధనలు పెడితే మనం అనుకున్నసంస్థకు టెండర్ వస్తుందో అని ముందే ఆలోచించి చేయడంవల్ల , ఆఖరికి ఒకసంస్థకే టెండర్ దక్కుతుంది. అయినవారికి టెండర్ కట్టబెట్టడమేకాక, భవిష్యత్ లో సప్లిమెంటరీ అగ్రిమెంట్స్ పేరుతో ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. మీటర్ల బిగింపులో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో గతంలోపిలిచిన టెండర్లని ప్రభుత్వం అక్టోబర్ లో రద్దుచేసింది.

మీటర్ల ముసుగులో పాలకులుచేస్తున్న దోపిడీతో డిస్కమ్ లు, విద్యుత్ తయారీ సంస్థలు మూతపడే పరిస్థితి. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా మీటర్ల బిగింపు చేపట్టిన ప్రభుత్వానికి, ఇప్పటికే వాస్తవాలు బోధపడి ఉండాలి. స్మార్ట్ మీటర్ల బిగింపులో ప్రభుత్వం టెండర్లుకట్టబెట్టిన కాంట్రాక్ట్ సంస్థకు మెయింటెనెన్స్ పీరియడ్ నిబంధన ఎందుకు పెట్టదు? మెయింటెనెన్స్ సమయంలో మీటర్లు చెడిపోయినా, వర్షానికి తడిచి పాడైనా సదరు కాంట్రాక్ట్ సంస్థే వాటిని తిరిగి భర్తీచేయాలి. ఆ విధంగా ప్రభుత్వం ఎందుకు ఆలోచించదు? మెయింటెనెన్స్ పీరియడ్ లో సమస్యలు వస్తే, తిరిగి మరలా కొత్తగా టెండర్లు పిలుస్తారా? మీటర్ల బిగించేటప్పుడే ప్రభుత్వం వాటర్ ప్రూఫ్ మీటర్లు ఎందుకు బిగించదు? మీటర్లు బిగించడం నుంచి తరువాత జరిగే మెయింటెనెన్స్ వ్యవహరాలన్నింటిలో అనుకూలసంస్థను అడ్డంపెట్టుకొని రైతుల్నిదోపిడీచేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమా? రాష్ట్రంలోని మూడు డిస్కమ్ ల పరిస్థితి దారుణంగా ఉంది. వాటికి చెల్లించాల్సిన రూ.26వేలకోట్లను ప్రభుత్వం చెల్లించడంలేదు. మీటర్ల బిగింపుతో డిస్కమ్ ల జాబితాలో మరింత నష్టంచూపి, తరువాత మొత్తం ప్రైవేట్ పరంచేయాలన్నదే రాష్ట్రపాలకులు ఉద్దేశంలా కనిపిస్తోంది. డిస్కమ్ లు నష్టపోతే, ఆ ప్రభావం విద్యుత్ ఉత్పత్తిసంస్థలైన జెన్ కో వంటి సంస్థలపై కూడా పడుతుంది. విద్యుత్ సంస్థలు దెబ్బతింటే, అంతిమంగా రైతుకుఉచిత విద్యుత్ లభించదు. ఇవన్నీ ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతున్నాయంటే ఎవరూ నమ్మరు. రైతుల్ని దోచుకునేలా ప్రభుత్వం మీటర్లు బిగించేచర్యలకు పాల్పడితే, న్యాయస్థానాల ద్వారా పాలకులు దోపిడీని అడ్డుకుంటాము. రైతులుకూడా ప్రభుత్వంచెప్పేవి నమ్మకుండా జాగ్రత్తతో వ్యవహరించాలి” అని జీ.వీ.రెడ్డి హితవుపలికారు.

ఈ రోజు టిడిపి అధినేత చంద్రబాబు, విజయనగరం జిల్లాలో పర్యటన ఉన్న సంగతి తెలిసిందే . దీని కోసం చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్ట్లో దిగి,  ఆ తరువాత రోడ్డు మార్గంలో విజయనగరం చేరుకుంటారు. అయితే చంద్రబాబు వస్తున్నటైం లో  వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో పోలీస్ లు చూపించిన అత్యుత్సాహానికి మీడియా వాళ్లు మండి పడ్డారు. వైజాగ్ ఎయిర్ పోర్ట్ లోపలికి మీడియా వాహనాలకి అనుమతి లేదని, మీడియా వాళ్లు కవరేజ్ ఇవ్వడానికి అనుమతి లేదని  పోలీసులు ఆంక్షలు విదించడంతో మీడియా వాళ్లు ఒక్కసారిగా విస్తుపోయారు.

Advertisements

Latest Articles

Most Read