తండ్రి చంద్ర‌బాబులాగే త‌న‌యుడు లోకేష్ విజ‌న‌రీలోనూ నెంబ‌ర్ వ‌న్. సీబీఎన్ మాదిరిగానే దూర‌దృష్టితో లోకేష్ ఆరంభించిన ప‌థ‌కాలు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయి. రాజ‌కీయ వ్యూహాల‌లోకి వ‌చ్చేస‌రికి చంద్ర‌బాబు నాన్చుడు దోర‌ణికి పూర్తిగా భిన్నం లోకేష్ అని తేలిపోయింది. త‌న‌పైనా ఎవ‌రైనా ఆరోప‌ణ‌లు చేస్తే, ఏళ్లుగా వారి ఆరోప‌ణ‌లు భ‌రిస్తారే కానీ..నిజం ఇద‌ని చంద్ర‌బాబు చెప్ప‌రు. ఇదే ఆయ‌న‌కి పెద్ద న‌ష్టం చేకూర్చే అంశం. బాబాయ్‌ని చంపేసి చంద్ర‌బాబు మీద నెపం నెట్టేసి ``నారాసుర ర‌క్త‌చ‌రిత్ర‌`` అని రాస్తే సీబీఐ బాబాయ్ ని వేసేసింది ఇంటి గొడ్డ‌లే..వేసింది బిడ్డ‌లే అని ప్ర‌క‌టించేవ‌ర‌కూ సీబీఎన్ స్పందించ‌లేదు. లోకేష్‌కి చంద్రబాబు గారి లాగా సాగదీయటాలు, మొహమాటాలు లేవు.. ఉన్నది ఉన్నట్టు చెప్పేయటమే లోకేష్ స్టైల్. చంద్ర‌బాబు ఎన్నిక‌ల తేదీలు ప్ర‌క‌టించి నామినేష‌న్ గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతున్న‌ప్పుడు అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టిస్తారు. మొహ‌మాటం, సీటు లేదంటే బాధ‌ప‌డ‌తారోన‌నే ఆలోచ‌న‌లో బాబు తేల్చ‌రు, ముంచ‌రు. త‌న‌యుడు లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో తండ్రి చంద్ర‌బాబుకి భిన్న‌మైన తీరుతో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంలోనూ, టిడిపిపై చేసే ఆరోప‌ణ‌లు తిప్పికొట్ట‌డంలోనూ స్పాంటేనియ‌స్‌గా రియాక్ట‌వుతున్నారు. ధ‌ర్మ‌వ‌రంలో టిడిపి నుంచి అభ్య‌ర్థి ఎవ‌రు అనే డైల‌మాకి ఒక్క డైలాగ్ తో క్లారిటీ ఇచ్చేశారు. ప‌రిటాల శ్రీరామ్ వ‌స్తున్నాడు ఆశీర్వ‌దించండి అని స‌భికుల హ‌ర్ష‌ధ్వానాల మ‌ధ్య ప్ర‌క‌టించారు. పెనుగొండలో మాత్రం అభ్య‌ర్థి విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించి త‌న రాజ‌కీయ ప‌రిణ‌తిని చాటారు. సీనియ‌ర్ నేత‌లు పార్ధసారధితో పాటు, సవితమ్మకు కూడా స‌మ ప్రాధాన్యం ఇచ్చిన లోకేష్‌.. ఇక్క‌డి సీటు విష‌యం మాత్రం ఎటువంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్టు ఉండి ఢిల్లీ వెళ్ళటం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయంసం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటన ఆసక్తి రేపుతుంది. పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా, తాను ప్రభుత్వ ఓటు చీలనివ్వను అని, ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అంతే కాదు ఇక్కడ ఏపిలో జగన్ కు సహకరిస్తున్న బీజేపీ నాయకత్వం పై ఆగ్రహంగా ఉన్నారు. ఇక్కడ ఏపి బీజేపీ నేతలు కొంత మంది, జగన్ పై ఇస్తున్న ఫీడ్ బ్యాక్ వల్లే, జగన్ కు ఢిల్లీ లో షీల్డ్ దొరుకుంటుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా, ఇక్కడ బీజేపీ నేతల పై అసహనం వ్యక్తం చేసారు. ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఆయన భేటీ అవ్వనున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ టూర్ గురించి మీడియాకు సమాచారం ఇవ్వలేదు. మీడియా వాళ్ళు జనసేనని సంప్రదించగా, వ్యక్తిగత పర్యటన అంటూ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన ముందుగా లీక్ ఇవ్వకుండా ఉండటానే, ఇలా చేసారని తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారం పై, ఇప్పుడు చర్చ జరుగుతుంది. పవన్ ఢిల్లీ టూర్ పై వైసీపీ కూడా ఆరా తీస్తుంది. తమకు బీజేపీతో ఉన్న సంబంధాలు ఎక్కడ దెబ్బ తింటాయా అని భయపడుతుంది.

ఏ శాఖ స‌మాచార‌మైనా ప్ర‌భుత్వం నుంచి ప్ర‌క‌టించేది స‌ల‌హాదారుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డే. సీఎం ప్ర‌తినిధిగా, మంత్రుల త‌ర‌ఫునా ఆయ‌నే మీడియా ముందుకొస్తారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల ఆరోప‌ణ‌ల‌కీ ఆయ‌నే వివ‌ర‌ణ ఇస్తారు. ఉద్యోగ సంఘాల‌తో చ‌ర్చ‌లు ప్ర‌క‌ట‌న‌ల‌న్నీ చూసుకునేది స‌జ్జ‌లే. ఇటీవ‌ల  కాలంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి టోన్ డౌన్ అవుతూ వ‌స్తోంది. మీడియా ముందుకు మ‌ళ్లీ నానీల‌ను వ‌దులుతున్నారు. మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పించిన త‌రువాత కూడా కొడాలి నాని, పేర్ని నానిలు ప్ర‌త్యేక ప్రెస్మీట్లు పెడుతున్నారు. స‌బ్జెక్టుతో సంబంధంలేకుండా విప‌క్షాల‌ని బూతులు తిట్టాలంటే కొడాలి నానీ మీడియా ముందుకు తీసుకొస్తోంది వైసీపీ. కాపులు, జ‌న‌సేన గురించి విమ‌ర్శ‌లు గుప్పించాలంటే పేర్ని నాని వ‌స్తున్నారు. మంత్రులంతా ఆల్మోస్ట్ మ్యూట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. రెడ్డి సామాజిక‌వ‌ర్గ మంత్రులైతే నోరు మెద‌ప‌డంలేదు. సీఎం జ‌గ‌న్ రెడ్డి కూడా స‌భ‌ల‌కు వెళ్లిన‌ప్పుడు ముస‌లి చంద్ర‌బాబు, దుష్ట‌చ‌తుష్ట‌యం, పేద‌ల‌తో ప్ర‌యాణం, పెత్తందారుల‌తో యుద్ధం వంటి డైలాగులూ ఆపేశారు. గ‌త కొద్దిరోజులుగా మంత్రి ప‌ద‌వులు లేక‌పోయినా వైసీపీ మీడియా-సోషల్ మీడియా నానీల బైట్ల‌తోనే ఫీడ్ న‌డుపుతోంది.

నీటిపారుద‌ల శాఖా మంత్రి అంబ‌టి రాంబాబు అన్నివిధాలుగా వార్త‌ల్లో వ్య‌క్తి. ఇప్పుడు మ‌రో విష‌యంలోనూ అంబ‌టిపై అంద‌రి దృష్టి ప‌డింది. అంబ‌టిపై  సొంత నియోజ‌క‌వ‌ర్గంలో, సొంత పార్టీ వైసీపీ నుంచే అస‌మ్మ‌తి స్వ‌రాలు వినిపిస్తున్నాయి. ఇవి ఏకంగా స‌త్తెన‌ప‌ల్లి సీటుకే ఎస‌రు పెట్టే స్థాయికి చేరాయి. సత్తెనపల్లి వైసీపీ నేత‌ చిట్టా విజయభాస్కర్ రెడ్డి పార్టీ ఆత్మీయ సమావేశం పెట్టి అంబ‌టి పేరు ప్ర‌స్తావించ‌కుండానే  వైసీపీకి డ్యామేజ్ చేస్తున్న‌వాళ్లు ఎంత పెద్ద‌వాళ్ల‌యినా లెక్క‌చేయ‌మంటూ వ్యాఖ్యానించారు. స‌త్తెన‌ప‌ల్లిలో బ‌ల‌మైన కేడ‌ర్ త‌న‌కు ఉంద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు స‌త్తెన‌ప‌ల్లి టికెట్ త‌న‌కే ఇవ్వాల‌ని విజయభాస్కర్ రెడ్డి ఈ స‌మావేశంలో డిమాండ్ చేశారు. మ‌రోవైపు స‌త్తెన‌ప‌ల్లికి చెందిన వైసీపీ నేత సయ్యద్ మాబుకు విభేదాలు మంత్రి అంబటి రాంబాబుకి విభేదాలు తీవ్రం అయ్యాయి. దీంతో మాబు కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. అంబ‌టి రాంబాబుతో అంటీముట్ట‌న‌ట్టు ఉంటున్నారు. దీంతో మాబు పార్టీ వీడుతార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇటీవ‌లే టిడిపిలో చేరిన మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ సత్తెనపల్లిలో వైసీపీ నేత సయ్యద్ మాబు ఇంటికి వెళ్లారు. సత్తెనపల్లి రాజకీయాలపై మాబుతో కన్నా చర్చలు జ‌రిపార‌ని స‌మాచారం. ఓ వైపు కీల‌క నేత టికెట్ రేసులో ఉన్నాన‌ని ప్ర‌క‌టించ‌డం, మ‌రోవైపు మ‌రో కీల‌క నేత పార్టీ వీడేలా కనిపిస్తుండ‌డంతో అంబ‌టికి స‌త్తెన‌ప‌ల్లిలో చెక్ పెట్టే దిశ‌గా వైసీపీ అసంతృప్తులు పావులు క‌దుపుతున్నారు. అంబ‌టి రాంబాబుకి సొంత పార్టీ నుంచే ఎదుర‌వుతున్న ఇబ్బందులు త‌మ‌కి ప్ల‌స్సుగా మార్చుకునే వ్యూహంతో టిడిపి చురుగ్గా త‌మ వ్యూహాన్ని అమ‌లు చేస్తోంది.

Advertisements

Latest Articles

Most Read