రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల చరిత్రలో నేటి దినం అత్యంత దురదృష్టకరమని, కరోనాపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఉద్యోగులసంక్షేమాన్ని గురించి ఆలోచన చేయకపోవడం బాధాకరమని టీడీపీ ఎమ్మెల్సీ పీ. అశోక్ బాబు వాపోయారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కరోనాతో ఇప్పటికే సచివాలయంలో నలుగురు ఉద్యోగులు చనిపోయారని, ఇద్దరు ఉపాధ్యాయలుకూడా మరణించారని, ఇక వైద్యులు, నర్సులైతే మొదటిదశలోనే చాలామంది చనిపోయారని అశోక్ బాబు తెలిపారు. చనిపోతున్నాకూడా ప్రాణాలను లెక్కచేయకుండా ఫ్రంట్ లైన్ వారియర్లైన పారిశుధ్యకార్మికులు, వైద్యులు, నర్సులు, ఇతరేతరవిభాగాలకు చెందిన వారు పనిచేస్తేనే తొలిదశ కరోనాను చాలావరకు నియంత్రిం చడం జరిగిందని అశోక్ బాబు చెప్పారు. దాదాపు ఏపీలో 100కులోపు కరోనా కేసులు నమోదవ్వడం జరిగిందన్నారు. తరువాత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయబట్టే, రెండోదశకరోనావ్యాప్తిలో రాష్ట్రం, అటూ ఇటూగా మహారాష్ట్రతో పోటీపడుతోందన్నారు. కరోనా నియంత్రణలో ఉద్యోగులే ప్రధానపాత్ర వహించారని, వైద్యవిభాగంతోపాటు, ప్రభుత్వ పాలనాయంత్రాంగం కూడా ప్రధానభూమిక పోషించిందని అశోక్ బాబు అభిప్రాయపడ్డారు. ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే అవకాశాన్ని (వర్క్ ఎట్ హోమ్) గతప్రభుత్వమే కల్పించిందని, 80శాతం ఉద్యోగులకు అలాంటి అవకాశాన్ని కల్పించవచ్చన్నారు. రెండోదశ కరోనాను నియంత్రించడంతోపాటు, ఉద్యోగులంతా విధిగా పనిచేస్తేనే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడవచ్చ న్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదుగానీ, దేశంలో అవసరమైన చోట పరీక్షలు రద్దుచేయడం, లాక్ డౌన్ అమలుచేయడం, రాత్రి కర్ఫ్యూ విథించడం వంటి నిర్ణయాలను అనేక ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయన్నారు. సమాజం కోసం ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న అశోక్ బాబు, ఆసుపత్రుల్లో పడకలకొరత, ఆక్సిజన్ కొరత వంటి సమస్యలున్న విషయాన్ని గుర్తించాలన్నారు.

ఇతరరాష్ట్రాలతో పోలిస్తే కొంతలో కొంత ఏపీలో ఆక్సిజన్ కొరత 50శాతం మాత్రమే ఉందన్నారు. ప్రభుత్వఉద్యోగులు కరోనాతో ఆసుపత్రుల్లో చేరితే, వారిని చేర్చుకోవడంలేదని, బెడ్లు (పడకలు) కూడా దొరకడంలేదన్నారు. ప్రభుత్వఉద్యోగు లకు కరోనా వచ్చాక హాడావుడిచేసేబదులు, వారికి ఆ సమస్య రాకముందే ప్రభుత్వంచర్యలు తీసుకుంటే మంచిదని అశోక్ బాబు హితవుపలికారు. ప్రభుత్వపథకాలు అమలుకావాలన్నా, ప్రజలకు సేవలు అందాలన్నా, రెండోదశ కరోనాను నియంత్రించాలన్నా, అన్నిరకాల ఉద్యోగులు పనిచేస్తేనే అవి సాధ్యమవు తాయన్నారు. మున్సిపల్ , వైద్యారోగ్య శాఖలతోపాటు పోలీస్, రెవెన్యూ శాఖల ఉద్యోగులు విధిగా బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కోవిడ్ వ్యాక్సిన్లు పంపిణీచేయాలంటే కేవలం అది ఒక్క వైద్యశాఖతోనే సాధ్యంకాదన్నారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేయాలంటే, అన్నిశాఖలు సమన్వయంగా పనిచేయాలన్నారు. వైద్యులు, నర్సులకు మాత్రమే పీపీఈ కిట్లు అందిస్తే సరిపోదని, అన్నిశాఖల విభాగాధిపతులు, వారికింద పనిచేసే నాలుగోతరగతి ఉద్యోగులవిషయంలో కూడా అన్నిజాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని టీడీపీఎమ్మెల్సీ స్పష్టంచేశారు. సచివాలయంలో నలుగురు ఉద్యోగులు, కొన్నిచోట్ల ఉపాధ్యాయులు మరణించినా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోందన్నారు.

ప్రాణం అన్నింటికంటే ముఖ్యమైనదని, ఉద్యోగులు, ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వంపైనే ఉందన్నారు. సచివాలయంలో పనిచేసే ఉద్యోగులతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే వారందరికీ ఇంటినుంచి పనిచేసే అవకాశం కల్పించాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. రాష్ట్రఉద్యోగుల సంఘం అధ్యక్షుడే కరోనాతో ఆసుపత్రిలోచేరాడన్నారు. ఉద్యోగులను రెండోశ్రేణి పౌరులుగా చూడకుండా, వారికి ఇంటినుంచి పనిచేసే అవకాశం కల్పించాలని, అలాచేస్తే నే ప్రభుత్వ పనితీరు ప్రజలకు చేరుతుందన్నారు. పరిపాలనను మరింత సమర్థంగా నిర్వహించాలని ప్రభుత్వానికి ఉంటే, వెంటనే ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే అవకాశాన్ని కల్పించాలన్నారు. అలానే చనిపోయినఉద్యోగులు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. కరోనాతో మరణించినప్పుడు ఫ్రంట్ లైన్ వారియర్లకు వర్తించే ప్రయోజనాలనే ఇతర ఉద్యోగులకు కూడా ప్రభుత్వం వర్తింపచేయాలని అశోక్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కో-వి-డ్ వ్యాప్తి- ప్రజాప్రతినిధుల బాధ్యత అనే అంశంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సోమవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ క-రో-నా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్థిష్ట ప్రణాళితో ముందుకెళ్లాలని, పటిష్ట వ్యూహం అమలు చేయాలని తెలిపారు. కొ-వి-డ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులు ప్రజలకు అండగా నిలబడటమే కాక, వారికి సరైన మార్గదర్శకత్వం అందిస్తూ ముందుండి దిశానిర్దేశం చేయాలి. క-రో-నా 2వ దశలో ప్రపంచంలోనే అత్యధిక కేసులు భారతదేశంలో నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 38 శాతం కేసులు మన దేశంలోనే నమోదవుతున్నాయి. ఇతర దేశాల్లో పోలిస్తే టీకా ప్రక్రియ భారత్ లో నెమ్మదిగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ సహా ప్రజలందరికీ టీకా అందించాలి. ఓవైపు క-రో-నా నిబంధనలను కఠినంగా అమలుచేస్తూ, మరోవైపు టీకా ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా వైరస్ కు అడ్డుకట్ట వేయాలి. ఏపీలో క-రో-నా సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల నమోదులో దేశంలోనే ఏపీ 5వ స్థానంలో ఉంది. పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 9.6 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 7,437మంది వైరస్ కు బలయ్యారు.

cbn 19042021 2

క-రో-నా నిబంధనలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. టెస్టింగ్, ట్రేసింగ్ , ట్రాకింగ్ విషయంలో కేంద్రం మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించకపోవడం వల్ల పరిస్థితి చేయిదాటింది. క-రో-నా మొదటి దశలో ఏపీ ప్రభుత్వం ఎలాగైతే ఒక వ్యూహమంటూ లేకుండా వ్యహరించిందో సెకండ్ వేవ్ లోనూ అదే రీతిలో వ్యవహరించడం బాధాకరం. దేశంలో అత్యధిక పాజిటివ్ కేసులు ఏపీలోనే నమోదవుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 14 నుంచి 20 ఉండటం ఆందోళన కలిగించే అంశం. విపత్కర పరిస్థితుల్లోనే నాయకత్వ సామర్థ్యం బయటపడుతుంది. వైద్య రంగంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలి. పారామెడికల్ సిబ్బంది తమ విధులను యుద్ధప్రాతిపదికన నిర్వర్తించేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే రోజువారీ టెస్టుల సంఖ్యను పెంచాలి. టీకా ప్రక్రియను వేగవంతం చేయాలి. ప్రభుత్వం, అధికార యంత్రాంగం మధ్య సమన్వయం, నిర్ధిష్ట ప్రణాళికల రూపకల్పనతో ద్వారా క-రో-నా వైరస్ కట్టడి సాధ్యమవుతుంది.

క-రో-నాతో భారత దేశం విలవిల లాడుతుంది. ఈ నేపధ్యంలోనే లాక్‍డౌన్ దిశగా పలు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నారు. అలాగే పాఠశాలలు, విద్యాసంస్థలు మూసివేస్తున్నారు. మాల్స్, సినిమాహాళ్లు కూడా ఎక్కడికక్కడ మూసివేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఆరు రోజులు లాక్‍డౌన్ ప్రకటించారు. రాజస్థాన్‍లో 15 రోజులు లాక్‍డౌన్ ను ఆ ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో ఏడు రోజులు లాక్‌డౌన్ ప్రకటించారు. తమిళనాడులో ప్రతి ఆదివారం లాక్‍డౌన్ విధిస్తూ, అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జమ్ము-కశ్మీర్‍లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది. హర్యానాలో కూడా నైట్ కర్ఫ్యూ పెట్టారు. ఇక ఉత్తరప్రదేశ్‍లో కూడా నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  బిహార్‌, పంజాబ్‍, గుజరాత్‌, కర్నాటక, ఉత్తరాఖండ్, ఛండీగడ్‍, అండమాన్ నికోబార్‍లో కూడా నైట్ కర్ఫ్యూ విధించారు. కర్నాటక కూడా లాక్‍డౌన్ దిశగా వెళ్తుంది. ఇక్కడ ఛత్తీస్ గఢ్‍లో 17 జిల్లాల్లో లాక్‍డౌన్ విధించారు.  తెలంగాణలో పెరుగుతున్న క-రో-నా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలోనూ క-రో-నా విజృంభిస్తుంది. ఏపీలోని విద్యాసంస్థల్లో క-రో-నా కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం లాక్ డౌన్ విషయంలో తీసుకోలేదు. ఈ  రోజు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేదాని పై  చూడాల్సి ఉంది? - భారత్‍లో క-రో-నా కేసులు పెరగడంతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దు చేసుకున్నారు.

సచివాలయ ఉద్యోగుల మృతి దురదృష్టకరం - నారా చంద్రబాబునాయుడు. ఉద్యోగులకు ఇంటి నుంచే విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలి. ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్న క-రో-నా బారిన పడకుండా ఉద్యోగులు సంరక్షణకు ప్రభుత్వం అన్ని విధాలా రక్షణ చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. వారం రోజుల వ్యవధిలో సచివాలయంలో నలుగురు ఉద్యోగులు క-రో-నా బారిన పడి మృతి చెందడం రాష్ట్రంలో ఉన్న భయంకర పరిస్థితికి అద్దం పడుతుంది. క-రో-నాతో సాధారణ పరిపాలన శాఖ సెక్షన్ ఆఫీసర్ శ్రీ రవికాంత్, ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీ శ్రీ పద్మారావు, పంచాయితీ రాజ్ సెక్షన్ ఆఫీసర్ శ్రీమతి శాంతి కుమారి మృతి చెందడం దురదృష్టకరం, బాధాకరం. బాధిత కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వ అన్ని విధాల ఆదుకోవాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రణాళికా లోపం, అవగాహనా రాహిత్యంతో ప్రభుత్వ ఉద్యోగులు క-రో-నా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఉద్యోగుల రక్షణపై ముఖ్యమంత్రి ఎందుకు శ్రద్ద పెట్టడం లేదు? తాడేపల్లి ప్యాలెస్ నుంచి ముఖ్యమంత్రి కాలు బయటకు పెట్టకుండా ఉద్యోగులను మాత్రం తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని బెదిరింపులకు దిగడం దుర్మార్గం. క-రో-నాపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలసత్వం ప్రదర్శించడం వల్లే రాష్ట్రంలో క-రో-నా విశ్వరూపం చూపిస్తోంది.

serious 19042021 2

ఆదాయం కోసం మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులకు డ్యూటీలు వేసి జగన్ ప్రభుత్వం వేధించింది. క-రో-నా నియంత్రణలో విఫలమైన ముఖ్యమంత్రిగా శ్రీ జగన్ రెడ్డి దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిచారు. కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ కోసం రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ వాక్సినేషన్ ను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలి. ఉద్యోగులకు ఎన్-95 మాస్కులు, పిపిఇ కిట్లు, శానిటైజర్ వంటివి అందజేయడంతో పాటు ఇంటి నుంచే విధులు నిర్వర్తించేలా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. క-రో-నా బారిన పడిన ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ మెరుగైన వైద్యం ఉచితంగా అందించాలి. రిటైర్ అయిన ఉద్యోగుల ఆరోగ్యంపై కూడా శ్రద్ద తీసుకుని మెరుగైన వైద్యం అందించాలి. అవసరమైన ఉద్యోగస్తులందరినీ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వారికి తగిన సౌకర్యాలు కల్పించాలి.

Advertisements

Latest Articles

Most Read