జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ దారులకు షాక్ ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. పెన్షన్ లబ్దిదారుల విషయంలో, జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తెసుకుంటూ, ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో లబ్దిదారులు కాని వారు కూడా, పెన్షన్ తీసుకుంటున్నారని, అలాంటి వారిని ఏరి పారేయటానికి, ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్తుంది. బోగస్ పెన్షన్ దారులు ఎక్కువగా ఉన్నారని, తమకు వస్తున్న ఫిర్యాదులు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యంగా కుల వృత్తుల పెన్షన్ లు, మెడికల్ కారణాలు చెప్పి పెన్షన్ తీసుకునే వారి విషయంలో, ఒంటరి మహిళల పెన్షన్ లో నిజమైన లబ్దిదారులను గుర్తించాలని ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి కొత్త నిబంధనలు ఇస్తూ, ఉత్తర్వులు ఇచ్చింది. ఇక నుంచి పెన్షన్ పొందాలి అంటే, కుల వృత్తి వారి జీవనాధారం అయి ఉండాలని స్పష్టం చేసింది. దీనికి అవసరమైన పత్రాలు అన్నీ, ఎక్సైజ్‌, సాంఘిక సంక్షేమ శాఖ, చేనేత, జౌళిశాఖ, మత్స్యశాఖ, వైద్యశాఖలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక వాలంటీర్ల సహాయంతో, ఈ దరఖాస్తులు పరిశీలించి, ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ 21 రోజుల్లో తీసుకోవాలని నిర్ణయం చేసింది. అయితే ఈ నిర్ణయంతో, నిజమైన లబ్దిదారులు కూడా నష్టపోయే అవకాసం ఉందని, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఒక్కొక్కరికీ ఒక్కో గుర్తింపు ఉంటుంది. అలాగే విజయసాయి రెడ్డికి కూడా, ఒక గుర్తింపు ఉంది. తన హోదాని మరిచి, ఆయన పెట్టి వెకిలి ట్వీట్లు చాలా చండాలంగా ఉంటాయి. ఒక్కోసారి, సభ్య సమాజంలో, ఇలాంటి వారు ఎందుకు ఉన్నారా అని అనుకునే వారు కూడా ఉన్నారు. మొన్న చంద్రబాబు పుట్టిన రోజు నాడు పెట్టిన ట్వీట్ కానీ, నిన్న పవన్ కళ్యాణ్ ని పావలా అంటూ, చిల్లరగా పెట్టిన ట్వీట్ కానీ, వెగుటు పుట్టిస్తుంది. ఇప్పుడు మరింత ముందుకు వెళ్లి, ఆడవారిని కూడా టార్గెట్ చేసారు. టిడిపి ఎమ్మల్యే గంటా శ్రీనివాస్ భార్యని, చౌదరి మేడం అంటూ, జుబుక్సాకరంగా ట్వీట్ చేసారు. విశాఖలోని సింహాచలం దేవస్థానంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో, గంటా భార్యని, ‘గంటా సతీమణి చౌదరి మేడం' అంటూ హేళనగా ట్వీట్ చేసారు. సింహాచలం దేవస్థానంలో ఉద్యోగులను గంటా భార్య నియమించారు అంటూ, ట్వీట్ చేసారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఆమెను "చౌదరి మేడం" అంటూ సంబోధించటం ఏమి సంప్రదాయమో మరి. విజయసాయి రెడ్డి, ఇలా రోజు రోజుకీ ఎందుకు దిగజారి ట్వీట్లు పెడుతున్నారో అర్ధం కావటం లేదు. ఆయన ఇంకా మారడా అని సామాన్య ప్రజలు అడిగే పరిస్థితి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు క-రో-నా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. గత ఏడాది జూన్, జూలై నెలల కాలంలో, రోజుకు పది వేల కేసులు వరుకు వచ్చేవి. ఇప్పుడు అదే స్థాయిలో ఈ రోజు కేసులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఒక్క రోజు కొత్తగా 9,716 కరోనా కేసులు వచ్చాయి. 38 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసులు 60,208 ఉండగా, డిశ్చార్జయినవారు 9,18,985 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా ఇప్పటి వరకు 9,86,703 పాజిటివ్ కేసులు ఉండగా, 7,510 మంది మృతి చెందారు. ఇక ఏపిలో ప్రభుత్వ పనితీరు పై, ప్రతిపక్షం టిడిపి ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగుదేశం నాయకులు కాకి గోవింద రెడ్డి మాట్లాడుతూ, "రాష్ట్రంలో క-రో-నా సెంకండ్ వేవ్ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతుంది. క-రో-నా-తో ఇప్పటి వరకు షుమారు 7000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సెక్రటరియేట్ లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ప్రాణాలు కోల్పోయారు. క-రో-నా బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాల్సిన భాధ్యత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఉంది. భారతదేశంలో ఓదార్పు పేరు చేబితే జగన్ మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. ఆనాడు పాదయాత్రలో అనేకమందిని ఓదార్చారు. మరి ఈ రోజు క-రో-నా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న అభాగ్యలను ఓదార్చాల్సిన భాధ్యత మీపై లేదా? ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాకుండా ప్రభుత్వ ఉద్యోగులు క-రో-నా కట్టడి చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులవి ప్రాణాలు కావా? మీవే ప్రాణాలా అని మేం ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. క-రో-నా మహమ్మారి భారినపడి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తున్నారు."

"క-రో-నా మొదటి దశలో మద్యం షాపులు తెరిచి క-రో-నా వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేసింది. ప్రభుత్వం ఆదాయం చూసుకుంది కానీ ప్రజల ప్రాణాలను గాలికొదిలేసింది. ఈరోజు క-రో-నా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరమని ప్రపంచ సంస్థలు, డాక్టర్లు చెబుతున్న క్రమంలో...ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు వచ్చి క-రో-నా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ప్రజలను ఓదార్చాలని డిమాండ్ చేస్తున్నాం. క-రో-నా వ్యాప్తికి కారణమౌతున్న మద్యం దుకాణాలను ప్రభుత్వం తక్షణమే మూసివేయాలి. జగన్ మోహన్ రెడ్డి, ఆయన మంత్రి వర్గం తక్షణమే బయటకు వచ్చి క-రో-నాపై ప్రజల్ని చైతన్యవంతులను చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల్ని మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయిన సంగతి అందరికీ తెలుసు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఈ రోజు ఫ్రంట్ లైన్ వర్కర్లకు జీతాలు ఇవ్వడం లేదు. అనేక మందిని ఉద్యోగాల నుండి తీసివేశారు. ఎవరిని ఎప్పుడు తీసేస్తారో, ఎప్పుడు తీసుకుంటారో తెలియని పరిస్థితి. టీకా ఎప్పుడు వస్తుందో తెలియదు. హాస్పిటల్ లో బెడ్ లు ఎక్కడున్నాయో తెలియదు. ఆక్సిజన్ ఎక్కడుందో తెలియని పరిస్థితులలో రాష్ట్ర ప్రజలు ఆందోళనలో ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం." అని అన్నారు.

పోలవరంలో జరుగుతున్న తాజా సమస్యల పై, శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ, "పట్టుదలకు,నిబద్ధతకు,చిత్తశుద్దికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగం అద్దం పట్టింది ఆనాడు. కాంట్రాక్టర్లు కమిషనర్లపై శ్రద్ద ఈనాడు. అంచనాలు పెంచుకోవడం తప్ప ప్రాజెక్టులను పూర్తి చేసే ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. దేశంలో అత్యంత పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటి కాని పనులు చేస్తే రెండేళ్లల్లో కేవలం 0.89 శాతం, వ్యయం అంచనాలు మాత్రం అమాంతంగా రూ.3,222 కోట్లు పెంపు ఇది జాతీయ ప్రాజెక్టు పోలవరానికి పట్టిన గ్రహణం. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని మెఘాకు అప్పగించి మూడు నెలల్లోనే ఇసుక ధరల పేరుతో రూ.500 కోట్లు దోచిపెట్టారు. ఇప్పుడు మరో 1600 కోట్లు దోచిపెట్టేందుకు సిద్దపడ్డారు. మొత్తం మీద రూ.2,100 కోట్లు ప్రజాధనం దోపిడీకి కుట్ర పన్నారు. కాంట్రాక్టర్లు, కమీషన్లపై చూపుతున్న శ్రద్ధ రైతు ప్రయోజనాలపై చూపడం లేదు. జగన్ రెడ్డి అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి పోలవారన్ని తన ఆదాయానికి కల్పవృక్షంగా మార్చుకున్నారు గాని ప్రాజెక్టు పూర్తి మాత్రం గాలికివదిలేశారు. పోలవరాన్ని అడ్డం పెట్టుకొని దోచుకోవాలన్న ద్యాసలో కొంతైనా ప్రాజెక్టు పూర్తి మీద పెట్టి ఉంటే బాగుండేది."

polavaram 221042021 2

"ఇప్పుడు కూడా కేవలం దోచుకునేందుకే అంచనాలు పెంచుకున్నారని అర్ధమవుతుంది. ఇప్పటికే పోలవరం అప్పుడు పూర్తి అవుతుంది, ఇప్పుడు పూర్తి అవుతుందని ఆరంభ సూరత్వం పలికిన జగన్ రెడ్డి 2022 జూన్ నాటికి కూడా కష్టమే అవుతుందని మరో సారి మాట మార్చేందుకు సిద్ధంగా ఉండాలి. ఎటూ ఆయన మడమ తిప్పడం, మాట మార్చడం పూర్తిగా అలవాటై పోయింది. తెలుగుదేశం హయాంలో పోలవరం అంచనాలు దోచుకునేందుకు పెంచుకున్నారని ఊదరగొట్టిన జగన్ అండ్ కో భజన గనం నేడు ఏం చెబుతారు? రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టులను నీరుగార్చారు. ఒక్క ప్రాజెక్టుకు రెండేళ్లల్లో తట్ట మట్టి ఎత్తలేదు, బొచ్చ కాంక్రీట్ వేయలేదు. జలవనరుల ప్రాజెక్టులు పూర్తి చేయకుండా అభివృద్ధిని అటకెక్కించిన జగన్ రెడ్డి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. " అని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read