కేంద్ర ఎన్నికల అధికారితో పాటుగా, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసారు. తిరుపతి ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసేందుకు, అధికార పార్టీ చేస్తున్న అరాచకాన్ని వారికి స్వయంగా తెలిపారు. పెద్ద ఎత్తున లారీల్లో, బస్సుల్లో, సుమోలలో, పక్క నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను డంప్ చేస్తున్నారని, చంద్రబాబు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో అన్ని చోట్ల జరుగుతున్న అరాచకాల పై చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి ఫిర్యాదు చేసారు చంద్రబాబు. దొంగ ఓటర్లను కళ్యాణమండపాల్లో, అపార్ట్ మెంట్ ల్లో ఉంచారని, ఆ లిస్టు కూడా చెప్పారు. వెంటనే దొంగ ఓట్లు వేస్తున్న వారిని పట్టుకోవాలని చంద్రబాబు వారికి విజ్ఞప్తి చేసారు. వారి పై వెంటనే చర్యలు తీసుకుని, ఇది అడ్డుకట్ట వేసి , ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చంద్రబాబు కోరారు. రాష్ట్ర, కేంద్ర ఎన్నికల అధికారులకు చంద్రబాబు నిన్న రాత్రి కూడా లేఖ రాసారు. అయినా ఎక్కడ అడ్డుకట్ట వేయలేకపోయారు.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన లోక్ సభ ఎంపీ గల్లా జయదేవ్, రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్. ప్రక్కన ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి, జిల్లాల నుండి అధికార పార్టీకి చెందిన వ్యక్తులు తిరుపతి పార్లమెంటు పరిధిలోకి చొరబడుతున్నారు. తిరుపతి పార్లమెంటులోని సరిహద్దు ప్రాంతాలలోని చెక్ పోస్ట్ ల వద్ద సరైన నిఘా లేదు. తిరుపతి పార్లమెంటు సరిహద్దు ప్రాంతాలలో నిఘా లేకపోవడంతో అనేక మంది బయటి వ్యక్తులు లోపలికి చొరబడుతున్నారు. 17 వ తారీకున జరగబోయే ఉప ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడేందుకు చీకటి మంతనాలు జరుపుతున్నారు. ఊర్లలో లేనివాళ్ళు, వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళు, చనిపోయిన ఓటర్లను గుర్తించి వారి ఓట్లను 17వ తారీకు ఉదయాన్నే రిగ్గింగ్ చేసుకోవడానికి అధికార వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు బయట వ్యక్తులు భారీగా వచ్చి చేరుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘానికి ఇదివరకే తెలియజేసింది.

tirupati 160420221 2

పుంగనూరు నుండి 1. AP 09 U 8146, 2. AP 03 TJ 0482, 3. AP 03 T 1152 నెంబర్లు గల బస్సులలో భారీ సంఖ్యలో తిరుపతి పార్లమెంటు లోకి వస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఒక వర్గం పోలీసు అధికారులు అధికార వైకాపాతో కుమ్మక్కై బయటి వ్యక్తులను లోనికి అనుమతించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సంఘం ప్రభావవంతంగా పని చేసేందుకు 23 స్టాటిక్ నిఘా టీంలను, 40 ఫ్లయింగ్ నిఘా టీంలను వెంటనే నియమించాలి.ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఎన్నికల సంఘం తక్షణమే తగు చర్యలు చేపట్టాలి. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో, ప్రత్యేకంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో అదనపు కేంద్ర బలగాలను మోహరించి బయటి వ్యక్తులను నియంత్రించండి. దొంగ ఓట్లు వేయకుండా నియంత్రించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉంది. పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయటానికి పాక్కాగా సిద్ధం అయ్యారు. పోలీసులకు సరైన విధంగా ఆదేశాలు ఇవ్వండి.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రత్యర్ధుల పై కేసులు పెడుతుంది అంటూ, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతూ ఉంటాయి. చివరకు సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసే, ముసలి వాళ్ళ పై కూడా సిఐడి కేసు పెట్టి వేధిస్తున్నారు. అయితే ఇది కాస్త శ్రుతి మించి, చంద్రబాబు లాంటి పెద్ద స్థాయి నేతల పై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే దాకా వ్యవహారం వచ్చింది. ఇప్పుడు చివరకు దేశ ద్రోహం కేసులు కూడా పెడుతున్నారు. ఇప్పటికే ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు పై, దేశ ద్రోహం ఆరోపణలు చేసారు. ఆయన్ను సస్పెండ్ కూడా చేసారు. ఆయన ఈ విషయం పై న్యాయ పోరాటం చేస్తున్నారు అనుకోండి. అది వేరే విషయం. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత, మరో దేశ ద్రోహం కేసు నమోదు అయ్యింది. చిత్తూర్ జిల్లాకు చెందిన జడ్జి రామకృష్ణ పై దేశ ద్రోహం కేసు నమోదు చేసారు. ఎవరైనా దేశ ద్రోహం అంటే, పక్క దేశాల వారికి మన దేశ రహస్యాలు చేరవేయటం, లేదా దేశంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేయటం లాంటివి అని అందరూ అనుకుంటారు. అయితే ఇక్కడ మాత్రం, అది కాదు. గతంలో ఇంటలిజెన్స్ చీఫ్ విషయంలో అయినా, జడ్జి రామకృష్ణ విషయంలో అయినా, ఎందుకు దేశ ద్రోహం కేసు పెట్టారో అర్ధం కావటం లేదు. కేవలం కక్ష సాధింపులో భాగం అనే ప్రతిపక్షాల మాటలకు బలం చేకురినట్టు అయ్యింది.

judge 16042021 2

ఇంతకీ ఆయన పై ఎందుకు కేసు పెట్టారో తెలుసు. కేవలం జగన్ మోహన్ రెడ్డిని విమర్శించినందుకు. ఒక టీవీ ఛానల్ డిబేట్ లో, జగన్ మోహన్ రెడ్డిని విమర్శించారని, ఎవరో కేసు పెడితే, దాన్ని పట్టుకుని, దేశ ద్రోహం కేసు పెట్టటంతో, ఆయన్ను అరెస్ట్ చేసారు. జడ్జి ముందు ప్రవేశపెట్టటంతో, ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. అమెరికా మానవ హక్కుల నివేదికలో, ఆంధ్రప్రదేశ్ లో దళితుల పై జరుగుతున్న అరాచకాల గురించి ప్రస్తావించిన విషయం పై, ఒక టీవీ ఛానల్ చర్చలో, జడ్జి రామకృష్ణ పాల్గున్నారు. ఆ చర్చలో జగన్ ని కంసుడితో పోల్చి, ఈ రక్షసడుని, రాక్షన పాలనను అంతం చేయటానికి, నేను కృష్ణుడిగా మారి, జగన్ ను శిక్షించాలని చూస్తున్నా అంటూ వ్యాఖ్యలు చేసారు. దీనికి నొచ్చుకున్న జయరామచంద్రయ్య అనే వ్యక్తి, జడ్జి రామకృష్ణ పై కేసు పెట్టటంతో, ఆయన్ను అరెస్ట్ చేసారు. అయితే దీని పై స్పందించిన జడ్జి రామకృష్ణ, గతంలో చంద్రబాబుని నడి రోడ్డు పై కాల్చేయలని జగన్ చెప్పిన వ్యాఖ్యలు కంటే, నాది తప్పు ఏమి కాదని, జగన్ సర్వ నాశనం అయిపోతాడు అంటూ శాపనార్ధాలు పెట్టారు.

ఈప్రభుత్వం అడ్డగోలు, అరాచక, అప్రజాస్వామిక ప్రభుత్వమని, రాజ్యాంగమంటే ఏమాత్రం నమ్మకలేని ప్రభుత్వమని, చట్టాలన్నా, న్యాయశాస్త్రాలన్నా, ఏమాత్రం నమ్మకంలేని అవినీతిప్రభుత్వం అధికారంలో ఉండటం తెలుగువారి దురదృష్టమని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య మండి పడ్డారు. శుక్రవారం ఆయనమంగళగిరిలోనిపార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే "రేపు తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. నిన్న సాయంత్రం ప్రచారానికి స్వస్తిపలికారు. ఇతరపార్టీల నా యకులను అక్కడినుంచి పోలీసులు పంపించేశారు. అధికారపార్టీవారు మాత్రం అక్కడే తిష్టవేసింది. రాష్ట్ర కేబినెట్ లోని మంత్రులంతా చిత్తూరు, నెల్లూరులోనే తిష్ట వేసిన విషయం డీజీపీకి తెలుసునా అని ప్రశ్నిస్తు న్నా. పిల్లి కళ్లుమూసుకొని పాలుతాగిన చందాన డీజీపీ కళ్లుమూసుకొని అంతా బాగుందని అనుకుంటున్నారు. రేపు ఎన్నిక ఉంటే, తిరుపతిలో అందరినీ పంపిచేస్తే, ఇంకా రాష్ట్రకేబినెట్ మొత్తం, ఆ రెండుజిల్లాల్లో గోతికాడ నక్కల్లా కూర్చొని ఉన్నారు. నిన్నటివరకు వీరంతా రాష్ట్రఎన్నికలకమిషన్ తో దోబూచూలాడుకున్నారు. స్టేట్ ఎన్నికలకమిషనర్ తో ఆటలాడి ఆయన్ని పంపిం చారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికలకమిషనర్ తోకూడా అలానే దోబూచులాడుతున్నారు. రేపు ఎన్నికలుంటే, అక్కడ ఏంచేస్తున్నారు వీరంతా? మంత్రులకు అక్కడ ఏంపని? ఇప్పటికైనా మించిపోయింది లేదు, గౌరవ డైరె క్టర్ జనరల్, నెల్లూరు చిత్తూరు జిల్లాలోని మంత్రులను తరిమేయాలి. ఆయనకు ఆహక్కుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన కేంద్రఎన్నికలసంఘం పరిధిలో పనిచే స్తున్నారు. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికో, జగన్మోహన్ రెడ్డికో భయపడాల్సిన పనిలేదు. ఎన్నికల కమిషన్ చెప్పందని చెప్పి మంత్రు లను తరమేయండి. మంత్రులకు అక్కడేంపని? ముఖ్యమంత్రి దీనిపై ఏంసమాధానం చెబుతారు? ఏం తందనాలు ఆడటానికి మంత్రులంతా అక్కడున్నారు? అవకాశం దొరికితే దుర్మార్గం చేయాలని, అవకాశం దొరి కితే దొంగఓట్లు వేయాలని, అవకాశం దొరికితే రిగ్గింగ్ చేయించొచ్చని, అవకాశం దొరికితే అప్రజాస్వామిక చర్య లకు పాల్పడవచ్చనే మంత్రులంతా అక్కడున్నారా?

ఎలాగైనా, ఏంచేసైనా సరే గురుమూర్తిని గెలిపించి, ము ఖ్యమంత్రి మెప్పు పొందాలన్నదే మంత్రులందరి లక్ష్యం. గోతికాడ నక్కల్లా ఎందుకుఉన్నారు వారంతా అక్కడ? ఒక అరాచకమంత్రి, బెట్టింగ్ మంత్రిని అక్కడ వదిలేస్తే వారు చూసుకుంటారుగా? కేబినెట్ మొత్తం అక్కడే ఉం డటంపై నేను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ని కలుస్తాను. ఓటర్లను ప్రభావితంచేయడానికి, ఏదోరకంగా దుర్మార్గా నికి పాల్పడటానికే మంత్రులంతా అక్కడున్నారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) విజయానంద్ ఒక లాఠీ తీసుకొని అవసరమైతే మంత్రులందరినీ అక్కడినుంచి తరిమేయాలని కోరుతున్నా. డీజీపీ తన డ్యూటీ తాను చేయడంలేదు కనుక, సీఈవో అయినా ఆపనిచేయాలి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలోని తిరుపతి పార్లమెం ట్ ఉపఎన్నిక జరుగుతుంటే, బయటిప్రాంతాలనుంచి బస్సుల్లో జనాలను తరలిస్తున్నారు. ఎందుకు అలా తర లిస్తున్నారని నేను అడుగుతున్నా. పీలేరు, పుంగనూ రు, మైదుకూరు, తదితర నియోజకవర్గాలనుంచి జనా లను ఎందుకు తరలిస్తున్నారో డీజీపీ సమాధానం చెప్పాలి. ఎందుకు తరలిస్తున్నారు..ఎక్కడికి తరలిస్తు న్నారో... గ్రహించి పోలీస్ శాఖ అప్రమత్తమవ్వాలని కోరుతున్నాను. పోలీసులు చెక్ పోస్ట్ లన్నీ ఏంచేస్తు న్నాయి? అంతమంది బస్సుల్లో వస్తుంటే, లాడ్జీలు, కళ్యాణమండపాలు తనిఖీ చేయాల్సిన పనిలేదా? పోలీ స్ వ్యవస్థ నిద్రాణంగా ఉందనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి? ఊరిచివర ఉన్న ఏసీ కళ్యాణమండ పాల్లో అంతమంది ఎందుకున్నారో తనిఖీ చేయాల్సిన బాధ్యత డీజీపీపై లేదా? ఈవిధంగా బయటినుంచి జనాల్ని తరలి స్తున్నారని, వారున్న ప్రాంతాలను తని ఖీ చేయాలని మేము ఎప్పుడో తెలియచేశాం. కానీ ఆ పనిచేయలేదు. చట్టం-నేరం చేయిచేయి కలిపి సాగు తున్నాయి. బయటినుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంతమందిని దించారో పోలీసుల కు తెలియదా? ఎన్నికలసంఘం ఏంచేస్తోంది.

ఎన్నికల పరిశీలకులను అప్రమత్తంచేయాలి. బయటినుంచి వచ్చిన జనంతో ఏంఅరాచకాలు చేయబోతున్నారు? బూత్ లు క్యాప్చర్ చేస్తారా? లేక రిగ్గింగు చేయిస్తారా? స్థానికఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తారా? టీడీపీ ఓటర్లు అధికంగా ఉండే గ్రామాలను భయాందోళనలకు గురిచేస్తారా? ఏంచేయబోతున్నారో తెలియాలి. ఎన్ని చేసినా, ఎన్నిచెప్పినా కూడా కిందిస్థాయిలో అవేమీ జర గడంలేదు? క్షేత్రస్థాయిలో ఏంజరుగుతుందో తెలియడా నికి ఎన్నికలకమిషనర్ ఒకకమిటీని వేయాలని కోరు తున్నాం. నిన్న మేంచెప్పాము... అంబులెన్సులు తని ఖీచేయమని...ఎన్నిచేశారో చెప్పమనండి? డీజీపీ ఈ ఎన్నికపై ఒక్క స్టేట్ మెంట్ కూడా ఎందుకివ్వలేదు? పారదర్శకంగా ఎన్నికలుజరపాలి.. ఎవరైనా తప్పుచేస్తే వెంటనే చర్యలుతీసుకోండనే మాట ఆయన ఎందుకనలే దు? ఆయన అలాఉన్నారంటే మీఇష్టమొచ్చినట్టు చేసు కోమనే కదా అర్థం. ఇదెక్కడి కేబినెట్.. ఇదెక్కడి ఎన్నిక ల నిర్వహణ? స్థానికఎన్నికల్లో చేసినట్టేచేసి, గెలవాల నా...లేక 5లక్షల మెజారిటీ తీసుకురాకపోతే ముఖ్యమంత్రి చెవులు పిండుతారని మంత్రుల భయ మా? అందుకోసమే మంత్రులంతా అక్కడున్నది. అం దుకోసమేనా వారంతా అవసరమైతే దౌర్జన్యాలు చేయ డానికి సిద్ధంగా ఉన్నది. లాడ్జీలు, కళ్యాణమండపా లు తనిఖీచేయండి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని క్లోజ్ గా అబ్జర్వ్ చేయాలి. ఆయనప్రతికదలికపై నిఘా పెట్టమని కోరుతున్నా. అంబులెన్సులు, సాక్షి ఓబీ వ్యాన్లనుకూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని తాము కోరు తున్నాము. తెలుగుదేశం నాయకులెవరూ అక్కడ లేరు. ఆ జిల్లాలు, ఆ నియోజకవర్గాల్లోనివారు తప్ప, బయటివారెవరూ లేరు. పాత్రికేయులుకూడా ఇటువంటి వాటి గురించిగట్టిగా రాయాలనికోరుతున్నా. స్లిప్పులు పంపిణీ కూడా వాలంటీర్లే చేస్తున్నారు. వాలంటీర్లు ఉద్యోగులు కారు, వారిని నియమించింది ప్రభుత్వ బాధ్యతలకోసం కాదు. వారంతా వైసీపీ ప్రచారకులు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎన్నికలకమిషన్ ఇదంతా గమనించిందికానీ, పోలీసులు, రెవెన్యూ అధికారులు చేయాల్సినవిధంగా డ్యూటీ చేయడం లేదు. ఎన్నికల సంఘం ఆదేశాలను పోలీస్, రెవెన్యూ వ్యవస్థలు అమలు చేయకుంటే, ఈ అడ్డగోలు ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని ఎవరుకాపాడాలి.

Advertisements

Latest Articles

Most Read