వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆమె చెల్లి వైఎస్ షర్మిల మధ్య మనః స్పర్ధలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. జగన్ మొహన్ రెడ్డి, షర్మిల ను వాడుకుని వదిలేసారని, షర్మిల పార్టీ కోసం ఎంత కష్టపడినా, ఆమెకు గుర్తింపు రావటం లేదని, షర్మిల తెలంగాణాలో కొత్త పార్టీ పెట్టారని, షర్మిల సన్నిహిత వర్గాలు అంటున్నా, ఇప్పటి వరకు అటు షర్మిల వైపు నుంచి కానీ, ఇటు జగన్ వైపు నుంచి కానీ ఎక్కడా, ఎలాంటి రియాక్షన్ వారి నుంచి బహిరంగంగా రాలేదు. మీడియా షర్మిలను అడుగుతూ ఉండగా, ఆమె దాట వేస్తూ, అది జగన్ నే అడగండి అంటూ సమాధానం ఇచ్చే వారు. ఇక జగన్ మోహన్ రెడ్డి వైపు నుంచి అయితే, ఆయన ఎలాగూ మాట్లాడడు, ఆయన మీద వచ్చిన ఆరోపణలకే సమాధానం చెప్పడు, ఇంకా ఆయన ఈ విషయం పై మీడియాతో ఏమి మాట్లాడతారు. అయితే ఈ రోజు షర్మిల బయట పడిపోయారు. అందరూ చూస్తూ ఉండగా, ఆమె ఇచ్చిన రియాక్షన్ అందరికీ షాక్ ఇచ్చింది. పక్కనే విజయమ్మ ఉన్నా, షర్మిల చేసిన వ్యాఖ్యలు, విజయమ్మ రియాక్షన్ షాక్ ఇచ్చింది. ఇక విషయానికి వస్తే ఈ రోజు షర్మిల, హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నాచౌక్‌లో దీక్ష చేస్తున్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఉద్యోగాల భర్తీ కోసం అని, షర్మిల ఈ రోజు దీక్ష చేస్తున్నారు.

sharmila 1542021 2

ఈ దీక్షలో విజయమ్మ కూడా పాల్గున్నారు. అయితే ఈ రోజు ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. షర్మిల దీక్షా శిబిరంలో, మీడియా కెమెరాలు అడ్డుగా వచ్చాయి. దీంతో షర్మిల స్వయంగా ఆ మీడియా చానల్స్ వారిని పక్కకి తప్పుకోమని చెప్పారు. ఈ సందర్భంగా సాక్షి మీడియా అక్కడే ఉండగా, ఇంకా చాల్లే వెళ్లమ్మ, మాకు ఎలాగూ మీ సాక్షిలో కవరేజ్ ఉండదుగా అంటూ, బహిరంగంగా సాక్షి పై వ్యాఖ్యలు చేసారు. దీంతో పక్కనే ఉన్న విజయమ్మ ముందు షాక్ తిన్నా, తరువాత షర్మిల చేతి మీద చేత్తో తట్టారు. అయినా షర్మిల ఆపలేదు. దీంతో ఇప్పటి వరకు షర్మిల, జగన్ మధ్య ఏదో ఉంది అంటూ, వస్తున్న ఆరోపణలకు, బలం చేకూరినట్టు అయ్యింది. ఎందుకుంటే సాక్షి అంటే జగన్, జగన్ అంటే సాక్షి అనేలా, అందులో వార్తలు ఉంటాయి. జగన్ భార్య భారతి స్వాయంగా సాక్షి చూసుకుంటూ ఉంటారు. దీంతో ఇప్పుడు షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలతో, బహిరంగంగా అసహనం వ్యక్తం చేయటంతో, జగన్ కు, షర్మిల కు మధ్య ఉన్న వైరం నిజమే అనే విధంగా అర్ధమవుంది.

తిరుపతి లోకసభ నియోజకవర్గం ఉపఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి హిందువా? కాదా? ముందు చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. ఢిల్లీలోని తన నివాసంలో బుధవారం సాయంత్రం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో గురుమూర్తి అర్హతపై అనేక సందేహాలు లేవనెత్తారు. తిరుపతి లోకసభ నియోజకవర్గం ఎస్సీల కోసం రిజర్వ్ చేసిన నియోజకవర్గమని, అందులో ఎస్సీలు మాత్రమే పోటీ చేయడానికి అర్హులని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం, హిందూ, సిక్కు, బౌద్ధమతాలను ఆచరిస్తున్నవారు మాత్రమే షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉండడానికి అర్హులని, ఏ ఇతర మతాన్ని ఆచరించే వారైనా ఎస్సీ జాబితాలో కొనసాగడానికి వీల్లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమార్తి గూడూరులో బిషప్ ఆశీర్వచనం తీసుకుని, ఆ దృశ్యాలను ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారని గుర్తుచేస్తూ.. ఏమతం ఆశీర్వాదం తీసుకోవడాన్ని తాము తప్పు బట్టడం లేదని, అయితే తిరుపతి వంటి ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రంలో దర్శనం చేసు కోకుండా అన్యమత దీవెనలు మాత్రమే తీసుకోవడం కచ్చితంగా అనుమానించాల్సిన విషయమేనని జీవీఎల్ విశదీకరించారు. ఇదే విషయాన్ని లేవనెత్తినందుకు తమ పార్టీ నేత సునీల్ దేవధర్‌పై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయననన్నారు.

gvl 15042021 2

సునీల్ దేవధర్ పై చేస్తు న్న వ్యాఖ్యలు చూస్తుంటే తిరుమలకు వెళ్లి గుండు చేయించుకుని, నిలువు నామాలు పెట్టుకునే ప్రతి ఒక్కరినిహేళనచేసినట్టుగానే ఉందని జీవీఎల్ మండిపడ్డారు. గురుమూర్తి నామినేషన్ పత్రాలను అంగీకరించారంటే తప్పుడు ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చినట్టేనని, అది చెల్లదని జీవీఎల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. గురుమూర్తి పోటీ చేయడానికి ఏమాత్రం అర్హత లేదని, ఆయన మరేదైనా జనరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసుకోవచ్చునని వ్యాఖ్యానించారు. గురుమూర్తి ఎస్సీ సర్టిఫికెట్ వ్యవహారంపై తాము అన్ని రాజ్యాంగ సంస్థల దృష్టికి తీసుకెళ్లి న్యాయపోరాటం చేస్తామని జీవీఎల్ ప్రకటించారు. వైకాపా ఎన్నికల పోస్టర్లో హిందూ మతాన్ని ప్రచురించడం కూడా నియమావళి ఉల్లంఘించడమేనని అన్నారు. అయితే గురుమూర్తిని వైసీపీ ప్రకటించి దాదాపుగా నెల రోజులు అవుతున్నా, పోలింగ్ కి రెండు రోజులు ముందు, జీవీఎల్ ఇప్పుడు ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారో అర్ధం కావటం లేదు.

ఈ రోజు సత్యవేడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేసారు. అయితే చంద్రబాబు ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగుస్తుంది. చివరకు రోజు కూడా చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసారు. చంద్రబాబు బహిరంగ సభ ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. నిన్న రాళ్ల వర్షం.. నేడు విద్యుత్ సరఫరా నిలిపివేతతో చంద్రబాబు ఫైర్ అయ్యారు. "నేను వెళ్లిన చోట కరెంటు కట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు – నా సభలను ఎందుకు అడుగడుగునా అడ్డుకుంటున్నారు? – ఉన్మాదుల్లారా ఖబడ్దార్ - నా సభలో రాళ్లు వేస్తే దానికి నేనే ఆధారాలు ఇవ్వాలంట – వైసీపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు – ఎంతో మంది దళితులకు ఉన్నత పదవులు ఇచ్చిన పార్టీ టీడీపీ – అంబేడ్కర్ ఆశయాలను ఎన్టీఆర్ స్ఫూర్తిగా తీసుకున్నారు – పేదల కోసం బతికిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ - బాలయోగి, ప్రతిబాభారతికి పదవులు ఇచ్చిన పార్టీ టీడీపీ – వైసీపీ రెండేళ్ల పాలనలో అభివృద్ధి ఏమైనా జరిగిందా? - జగన్ తన కేసుల కోసం ప్రత్యేక హోదా ఊసే ఎత్తడం లేదు – 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు – ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే జైలుకెళ్తాడని జగన్ భయం – కొత్త బ్రాండ్ల మద్యం తెచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు - కరోనా ఉధృతంగా ఉన్నప్పుడు మద్యం షాపులు తురిచారు – టీచర్లను క్యూల దగ్గర కాపలా పెడతారా – కరోనా నియంత్రణ చేయలేని అసమర్థ సీఎం జగన్ – జగన్ ను చూసి పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు"

cbn 14042021 2

"నమ్ముకున్న వాళ్లను సీఎం పిడిగుద్దులు గుద్దుతున్నాడు – నా పోరాటం పదవి కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్తు కోసం – సమైక్యాంధ్ర అభివృద్ధికి విజన్ 2020 రూపొందించా – నవ్యాంధ్ర అభివృద్ధికి విజన్ 2029 తయారు చేశా – శ్రీసిటీలోని 180 పరిశ్రమల్లో 90 మా పాలనలోనే వచ్చాయి – రూ. 4 వేల కోట్లతో హీరో మోటార్స్ తీసుకువచ్చాం – మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు వేస్తున్నారు – రైతు కూలీల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది – సత్యవేడులో ఇసుక దొంగ వ్యాపారమే వైసీపీ కార్యకర్తలకు దినచర్య – నా సభలకు జనం స్పందన చూశాక భయం పట్టుకుంది – రాష్ట్ర విభజన కష్టాలున్నా ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చా – ఇప్పుడు కమిటీలు వేస్తున్నారు తప్ప పీఆర్సీ ఇవ్వలేదు – దోచుకొనేందుకు ఒక్కొక్కరికీ ఒక్కో ప్రాంతాన్ని పంచారు – చెప్పుకునేందుకు ఏమీలేకే వైసీపీ నేతలు సభలు పెట్టడం లేదు" అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. రేపు ప్రచారం చివరి రోజు, సాయంత్రానికి ప్రచారం ముగియనుంది.

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా, మాజీ మంత్రి దేవినేని ఉమా, తిరుపతిలో జరిగిన ప్రెస్ మీట్ లో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించి, సిఐడి నమోదు చేసిన కేసులో, ఈ కేసులో నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులు ఇచ్చిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ రోజు ఉదయం 10.20 గంటలకు కృష్ణా జిల్లా, గొల్లపూడిలో ఉన్న దేవినేని ఉమా నివాసానికి వచ్చిన సిఐడి పోలీసులు ఈ నోటీసులు అందించారు. అయితే ఉదయం 1030 గంటలకు కర్నూల్ లోని సిఐడి కార్యాలయానికి విచారణకు హాజరు కావాలి అంటూ, ఆ నోటీసులో సిఐడి అధికారులు పేర్కొన్నారు. అయితే కృష్ణా జిల్లాలో ఉదయం 10.20 గంటలకు నోటీసులు ఇచ్చి, నెల్లూరు జిల్లా ఎన్నికల ప్రచరంలో ఉన్న దేవినేని ఉమాని, ఉదయం 1030 గంటల కల్లా కర్నూల్ రావాలని నోటీసుల్లో పేర్కొనటం పై, అందరూ షాక్ తిన్నారు. అసలు పది నిమిషాలలో, ఎలా విచారణకు వస్తారని ? కనీసం విజయవాడలో ఉన్నా పది నిమిషాల్లో రావటం కుదరదు కాదా, అసలు ఇది ఎలా సాధ్యం అనుకుని, ఈ పని చేసారు అంటూ తెలుగుదేశం నేతలు వాపోతున్నారు. అరాచకానికి, ఇది మరో మెట్టు అని వాపోతున్నారు. ఇంతకంటే అరాచకం ఎక్కడా ఉండదు అనుకున్న ప్రతి సారి జగన్ మోహన్ రెడ్డి, అంతకు మించి చేస్తున్నారని వాపోతున్నారు.

uma 15042021 2

అయితే దేవినేని ఉమా ఆరోపణలకు సంబంధించి, కర్నూల్ లో ఉండే నారాయణ రెడ్డి అనే అడ్వొకేట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఈ కేసు నమోదు చేసినట్టు, సిఐడి పేర్కొంది. సెక్షన్ 464, 465, 468, 469, 470, 471, 505, 120(బీ) కింద కేసులు పెట్టారు. ఇక ఈ కేసు విషయానికి వస్తే, జగన్ మోహన్ రెడ్డి 2014 మ్యానిఫెస్టో సమయంలో మాట్లాడుతూ, తిరుపతిని కించపరిచారు అనేది టిడిపి వాదన. ఆ రోజు జగన్ మాట్లాడుతూ ""ఎందుకు ఒక మంచి సిటీ ఉండాలి, ఒక మహా నగరం ఉండాలి అంటే దానికి కారణం ఉంది. కారణం ఏమిటి అంటే, ఇవాళ, ఇక్కడ ఉన్న ఎవరిని అయినా కూడా, నేను వచ్చి తిరుపతిలో మీరు ఉండండి అంటే ఎవరూ రారు. మీలో ఎవరిని అయినా కూడా, మీరు వచ్చి పలనా చోట ఉండండి అంటే ఎవరూ ఉండరు. ఏ కార్డియాక్ స్పెషలిస్ట్ అయినా కూడా, ఏ గొప్ప చదువులు చదివిన వ్యక్తీ అయినా కూడా హైదరాబాద్ లో ఉండటానికి ఇష్ట పడతాడు, బెంగుళూరు లో ఉండటానికి ఇష్ట పడతాడు, బొంబాయిలో ఉండటానికి ఇష్ట పడతాడు, ఢిల్లీలో ఉండటానికి ఇష్ట పడతాడు కానీ ఏ వ్యక్తి కూడా, ఒరిస్సాలో ఉండటానికో, బీహార్ లో ఉండటానికో, లేదా తిరుపతిలో ఉండటానికో ఇష్టపడరు. కారణం, ఆ వ్యక్తికి తను ఓన్ చేసుకునే ఒక గొప్ప సిటీ ఒకటి ఉండాలి " అంటూ తిరుపతి పై మాట్లాడారు. అయితే దేవినేని ఉమా పోస్ట్ చేసిన వీడియోలో, ఆడియో మాత్రం ఇదే ఉన్నా, వీడియో వేరుగా ఉందని, కేసు నమోదు చేసారు.

Advertisements

Latest Articles

Most Read