గత పది రోజులుగా విజ్రుంబిస్తున్న దొంగల ముఠా, ఓట్లు తొలగించటం, డేటా దొంగతనం చెయ్యటం, ఫేక్ వీడియోలతో కులాలను రెచ్చగొట్టటం లాంటివి చూసాం. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి, విగ్రహాల ధ్వంసం అనే కొత్త ప్లాన్ ఎత్తుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, కృష్ణా జిల్లాలో గుర్తుతెలియని దుండగులు రెచ్చిపోయారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాలకు నిప్పుపెట్టడంతో పాటు ధ్వంసం చేశారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి ఎవ్వరూ లేని సమయంలో కొందరు దుండగులు స్తంభాలగరువు, నెహ్రూ నగర్, ఏటుకూరు రోడ్డు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాలకు నిప్పు పెట్టారు. పెట్రోల్ లో ముంచిన వస్త్రాలను విగ్రహంపై వేసి మంట పెట్టారు.
అలాగే నెహ్రూనగర్ లో ఎన్టీఆర్ విగ్రహం తలను ఆకతాయిలు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ నేతలను సముదాయించారు. బాధ్యులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనను విరమించిన టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదును అందజేశారు. అయితే ఈ వ్యవహారం పై తెలుగుదేశం పార్టీ నేతలు, వైసీపీ పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. "ఇలాంటి అరాచకాలు చేసి ఎన్నికల ముందు శాంతి భద్రతలకు ముప్పు తేవడమే వాళ్ళ అజెండా. రాష్ట్రం తగలబడిపోయినా పరవాలేదు, ఎలాగైనా అధికారం కావాలి అనే నికృష్టుడి కులగజ్జి అభిమానులు ఇంతకంటే గొప్పగా ఆలోచించలేరు." అని వాపోతున్నారు.
అయితే ఇది ఒక పెద్ద కుట్రగా అనుమానిస్తున్నారు. "ఇవ్వాళ ఎన్టీఆర్ విగ్రహాల మీద దాడి జరిగింది కదా, రెండు రోజుల్లో దళిత నాయకులు, వైఎస్ఆర్ కాకా మిగతా కుల నాయకుల విగ్రహల మీద కూడా వీళ్ళే దాడి చేస్తారు అది ఎన్టీఆర్ అభిమానుల దాడి అని బయటకి చెప్తారు. వచ్చే రెండు నెలలు అభివృద్ధి, సంక్షేమం ప్రజలు మర్చిపోయేలా చేసి, అరాచకం, అశాంతితో ప్రజలను ఉంచే ఎత్తులు ఇవన్నీ, తెలుగుదేశం శ్రేణులు సంయమనం పాటించాలి" అంటూ తెలుగుదేశం కార్యకర్తలకి చెప్తున్నారు. పొరపాటున కూడా వైసీపీ ట్రాప్ లో పడొద్దని, ఒకవేళ పడితే, రాష్ట్రం రావణ కాష్టం చేసే ప్లాన్ చేసారని, అందరూ అలెర్ట్ గా ఉండాలని ఆదేశాలు ఇస్తున్నారు. చూద్దాం, ఎన్నికల లోపు ఎన్ని చూడాలో..