రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫామ్‌-7 ఫిర్యాదుల్లో దాదాపు అన్నీ తప్పుడువేనని పోలీసుల దర్యాప్తులో బయటపడుతోంది. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన పేర్ల ఆధారంగా ఎవరిని విచారించినా ‘మాకు తెలియదు’ అనే సమాధానమే వస్తోంది. దీంతో ఐపీ అడ్ర్‌సల ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అసలు సూత్రధారులను గుర్తించే పనిలో పడింది. సిట్‌ అధిపతి ఐజీ సత్యనారాయణ బుధవారం రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదితో భేటీ అయ్యారు. ఫిర్యాదుల్లో నకిలీవిగా భావిస్తున్న 2.74 లక్షల దరఖాస్తులకు సంబంధించి ఐపీ అడ్ర్‌సలు కావాలని కోరారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజక వర్గాల్లోనూ ఓట్ల తొలగింపునకు ఫామ్‌-7 దరఖాస్తులను ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. వారిచ్చిన చిరునామా ఆధారంగా దర్యాప్తు చేసేందుకు వెళ్లిన పోలీసులు... ‘ఓటు తొలగించాలని మీరు ఫిర్యాదు చేశారు కదా?’ అని అడగ్గానే ‘నేనా...’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమ పేరుతో ఫిర్యాదు చేసిన విషయం కూడా చాలామందికి తెలియదు. ఫిర్యాదుదారుల్లో ఎక్కువమంది నిరక్షరాస్యులే ఉన్నట్లు విచారణలో వెలుగులోకి వస్తోంది.

aadala 16032019

ఒక్కరోజే 1.50లక్షల దరఖాస్తులు.. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల తొలగింపు దరఖాస్తులు ఈసీకి పంపాలని వైసీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఫిబ్రవరి చివరివారంలో కేడర్‌కు ఆదేశాలు వెళ్లాయి. తెలంగాణలో డేటా చోరీ వివాదం కూడా అప్పుడే మొదలైంది. మొత్తం వ్యవహారాన్ని అటువైపు మళ్లించిన ఆ పార్టీ అదే అదనుగా ఫిబ్రవరి 27న ఒక్కరోజే 1.50లక్షల ఫామ్‌-7 దరఖాస్తులను అప్‌లోడ్‌ చేసింది. అయితే ఈ విషయాన్ని అధికార పార్టీ గుర్తించింది. అప్పటికే ఎలక్టోరల్‌ ఆఫీసర్లు వాటిపై విచారణ ప్రారంభించారు. దాదాపు అన్నీ నకిలీ ఫిర్యాదులని తేలడంతో కేసులు నమోదవడం, సిట్‌ ఏర్పాటు చేయడం, ఎవరి ఓటూ తొలగించడం లేదంటూ ఈసీ ప్రకటించడం వెంటవెంటనే జరిగిపోయాయి.

 

aadala 16032019

ఫామ్‌-7 కేసుల్లో కీలకమైన ఐపీ అడ్ర్‌సల కోసం ఇప్పటికే ఈసీని కోరామని, తాజాగా సీడాక్‌ సంస్థకు లేఖ రాశామని సిట్‌ అధిపతి సత్యనారాయణ తెలిపారు. వివరాలు అందిన వెంటనే దర్యాప్తు వేగవంతం చేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఫిర్యాదులందాయని, అత్యధికంగా తిరుపతిలో 10,980 దరఖాస్తులపై విచారణ చేస్తున్నామని చెప్పారు. అనకాపల్లిలో 10,200, చీపురుపల్లి 8,214, గాజువాక 5,785, అనపర్తి 7,088, గోపాలపురం 7,800, భీమవరం 5వేలు, ఆదోని 5,110, కడప 5,501, ధర్మవరం 6,804 ఇలా రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5వేలకు పైగా తప్పుడు ఫిర్యాదులు వచ్చినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.

‘‘రాష్ట్రవ్యాప్తంగా 98 లక్షల మంది చెల్లెమ్మలు ఉన్న నేను ఎంతో అదృష్టవంతుడిని. మీ తోబుట్టువులు, కన్నవారు ఎన్నిసార్లు పసుపు-కుంకుమ పెట్టారో తెలియదు. నేను బతికున్నన్ని రోజులు మీకు పసుపు కుంకుమ కానుక ఇస్తూనే ఉంటా’’ అని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడపడుచులకు హామీ ఇచ్చారు. రైతులకు ‘అన్నదాత సుఖీభవ’ శాశ్వతంగా అమలు చేస్తామన్నారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఎన్నికల ప్రచార సన్నాహక శంఖారావంలో భాగంగా పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత... నూజివీడు, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘‘నేను బతికి ఉన్నన్ని రోజులు మీకు పసుపు కుంకుమ అందుతుంది. ఇదే విషయాన్ని మీ అత్తమామలకు చెప్పండి. చంద్రన్న మాకు జీవితాంతం భరోసా ఇస్తున్నాడని చెప్పండి. ఆడపడుచు సౌభాగ్యంతోనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది’’ అని చంద్రబాబు తెలిపారు.

mp 21032019

‘రాష్ట్రం కోసమే మోదీతో పొత్తు పెట్టుకున్నాను. కానీ, నమ్మక ద్రోహం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు! ప్యాకేజీ అన్నారు.. అదీ ఇవ్వలేదు’ అని ఆక్రోశించారు. నవ్యాంధ్ర ప్రదేశ్‌ను ప్రపంచ పటంలో నంబర్‌ వన్‌ స్థానంలో నిలబెట్టాలని నాడే కంకణం కట్టుకున్నానని తెలిపారు. పండించిన పంటలకు సరైన ధరలు లేక, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే వారని... ఒక రైతు బిడ్డగా వారి సమస్యలను తెలుసుకుని, దేశంలో మరే ప్రభుత్వం చేయని విధంగా రూ.24,500 కోట్లు రుణమాఫీ చేశామని తెలిపారు. మరికొంత సొమ్ము మాత్రమే రావాల్సి ఉందని... ఎన్నికల్లోపు అది కూడా రైతుల ఖాతాలో పడుతుందని చెప్పారు. ‘‘అన్నదాతా సుఖీభవ శాశ్వతంగా అమలవుతుంది. రైతాంగానికి ఇంత చేస్తున్నందున తెలుగుదేశం పార్టీని రైతులు ఆశీర్వదించాలి’’ అని కోరారు. పింఛను రూ.2 వేలకు పెంచి... ప్రతి ఇంటికీ పెద్దకొడుకుగా ఉంటానన్న మాట నిలబెట్టుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో 11 లక్షల గృహ ప్రవేశాలు జరిగాయని... మొత్తం 29 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు.

 

mp 21032019

‘‘2019 ఎన్నికలు ప్రజా ఎన్నికలు కావాలి. 5 కోట్ల మంది ఒకేతాటిపైకి రావాలి. 25 లోక్‌సభ స్థానాలు సొంతం చేసుకుని... కేంద్రంలో పట్టు సాధించాలి’’ అని పేర్కొన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది జూలై నాటికి మెట్టప్రాంతంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని, ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ‘‘నా జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఇక వెనుతిరగను. ఆ పని సాధించి తీరుతా. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాను. 62 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం’’ అని ప్రకటించారు. నామినేషన్ల విషయంలో జాగ్రత్త... ‘‘ఇప్పుడు ధర్మపోరాటానికి దిగుతున్నాం. నామినేషన్లలో తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించండి. ఎదుటివారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకండి. కుట్రదారులు పొంచి ఉన్నారు జాగ్రత్త’’ అని పార్టీ అభ్యర్థులను చంద్రబాబు అప్రమత్తం చేశారు. ఏలూరు టీడీపీ కార్యాలయం నుంచి బుధవారం ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అందరు టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రమాణం చేయించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎంపీ అభ్యర్థులు శివరామరాజు, మాగంటి బాబుతో సహా 15 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో బాబు తన సమక్షంలోనే ప్రమాణ పత్రం చదివించారు. అభ్యర్థులందరికీ ఆయనే బి- ఫామ్‌ అందించారు.

లేపాక్షి మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకులు కొండూరు మల్లికార్జున పార్టీ వీడుతారన్న సమాచారం లేపాక్షిలో కలకలం రేపింది. పార్టీకి విధేయుడైన మల్లికార్జునకు పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదన్న అలక బూని వైసీపీలోకి వెళ్తారన్న సమాచారం మంగళవారం రాత్రి గుప్పుమంది. ఈనేపథ్యంలో అహుడా చైర్మన్‌ అంబికా లక్ష్మీనారాయణ, పార్టీ కోఆర్టీనేటర్‌ శ్రీనివాసరావులు బుధవారం ఉదయం రంగంలోకి దిగారు. కొండూరు వెళ్లి మల్లికార్జున స్వగృహంలో సుదీర్గంగా చర్చలు జరిపారు. పార్టీ ఆవిర్బావం నుంచి టీడీపీలో ఉన్నా తనతోపాటు నావెంట నడిచే నాయకులు, కార్యకర్తలకు సముచిత న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్త పరిచినట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్‌గా ఉన్నా తనుకు గర్తింపు ఏది అని ప్రశ్నంచినట్లు తెలుస్తోంది.

balayya 21032019 2

గుర్తింపు లేనప్పుడు పార్టీలో ఎందుకు ఉండాలని తనపై నాయకులు, కార్యకర్తలు ఒత్తిడి తీసుకువచ్చినట్లు అంబికా, శ్రీనివాసరావు వద్ద వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎమ్మెల్యే బాలయ్యతో నేరుగా మల్లికార్జునతో మాట్లాడించారు. ఎమ్మెల్యే తనకు న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో పార్టీ మారే అలోచనలు లేదని మల్లికార్జున తేల్చి చెప్పారు. కోండూరుకు చిలమత్తూరు నాయకులు చంద్రదండు రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్సార్‌అహ్మద్‌, లేపాక్షి ఎంపీపీ హనోక్‌, నాయకులు చలపతి, రామాంజినమ్మ, శివప్ప చర్చంచారు. అయితే మల్లికార్జున పార్టీ మారుతారన్న సమాచారం హిందూపురంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ప్రతిపక్ష వైసీపీపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. కామన్ సెన్స్ ఉన్నవారిని ఎవరిని అడిగినా వైసీపీ బీజేపీకి బీ-టీమ్ అని చెబుతారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కాళ్ల దగ్గర ఆంధ్రా ఆత్మగౌరవం తాకట్టుపెడుతున్న టీ-టీమ్ ఎవరంటే వైసీపీ అనే చెబుతారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలకు ఏమాత్రం పౌరుషం, రోషం ఉన్నా, వాళ్లు బీజేపీకి బీ-టీమ్, కేసీఆర్ చేతిలో కీలుబొమ్మ కాదని ఏపీ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కావాల్సింది సిగ్గు, లజ్జ కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకు కామన్స్ సెన్స్ చాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి అండగా నిలిచింది చంద్రబాబు అనీ, అభివృద్ధిని పరుగులెత్తిస్తోంది చంద్రబాబేనని పసికందుకు కూడా తెలుసన్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో చూసి ఓటేయాలని కోరారు. ఈ మేరకు చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.

cbn fire 21032019

‘‘జగన్‌ లాంటి వ్యక్తికి ఓట్లేస్తే శాంతి భద్రతలుండవు. ఇంటికో రౌడీ, బజారుకో దుర్మార్గుడు పుట్టుకొస్తారు. అడిగే హక్కు ఉండదు. మాట్లాడితే తన్నే పరిస్థితి వస్తుంది. స్టేషన్‌కు వెళితే పోలీసులు కేసులు తీసుకోని పరిస్థితులు వస్తాయి. ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసే వారికి గుణపాఠం చెప్పాలి’’ అని చంద్రబాబు కోరారు. వైఎస్‌ ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతితో పెట్టుబడిదారులు, ప్రభుత్వ ఉద్యోగులు జైలుకు వెళ్లారని, ఇప్పుడు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే.,పెట్టుబడులన్నీ వెనక్కివెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వైకాపాకు ఓటేస్తే మరణశాసనమేనని పేర్కొన్నారు. తాను అనుభవం ఉన్న డ్రైవర్‌నని, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించానని చెబుతూ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తాను జీవించి ఉన్నంత వరకూ ఆడపిల్లలకు ‘పసుపు-కుంకుమ’ అమలు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. తమ పార్టీ విజయం ఏకపక్షం కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌,మోదీ, జగన్‌లు కలసి చేస్తున్న లాలూచీ రాజకీయాన్ని తిప్పికొట్టాలని చెప్పారు.

cbn fire 21032019

‘‘ఇవి ప్రజా ఎన్నికలు కావాలి. రాష్ట్రంలోని అయిదు కోట్ల మంది ప్రజలు ముక్తకంఠంతో తెలుగుదేశానికి మద్దతు పలకాలి. మీరే అభ్యర్థులుగా భావించి పార్టీకి ఏకపక్ష విజయం అందించాలి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలలో పార్టీ అభ్యర్థులను గెలిపించాలి ’’ అని చంద్రబాబునాయుడు కోరారు. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు మన పిల్లలు వెళ్లారంటే తన దూరదృష్టే కారణం అని చెప్పారు. రూ. 24,500 కోట్లు రుణమాఫీ చేశానని తెలిపారు. ‘జగన్‌ లాంటి వ్యక్తికి ఓట్లు వేస్తే శాంతి భద్రతలు ఉండవు. ఇంటికో రౌడీ, బజారుకో దుర్మార్గుడు పుట్టుకువస్తారు. అడిగేహక్కు ఉండదు. మాట్లాడితే తన్నే పరిస్థితి వస్తుంది. స్టేషన్‌కు వెళితే పోలీసులు కేసులు తీసుకోని పరిస్థితులు వస్తాయి. ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసే వారికి గుణపాఠం చెప్పాలి’’ అని చంద్రబాబు కోరారు.

Advertisements

Latest Articles

Most Read