ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎన్నికల సంఘం లొంగిపోయిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ఈసీ పనితీరు భేష్‌ అంటూ ప్రశంసించారు. దీంతో ఈరోజు ప్రణబ్‌ ముఖర్జీ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం)పై వస్తున్న ఆరోపణలపై తాను ఆందోళన చెందుతున్నట్లు వెల్లడించారు. ఈవీఎంల ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా పవిత్రమైందని.. ఎటువంటి అనుమానాలు లేకుండా చేయాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈవీంలపై వస్తున్న ఆరోపణలు తనను ఆందోళనకు గురి చేస్తున్నాయంటూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈవీఎంల ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా పవిత్రమైందన్న ఆయన ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు.

evmtampering 21052019

అదేవిధంగా 'ఓటర్ల తీర్పును ట్యాంపరింగ్‌ చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై నాకు ఆందోళన కలిగింది. ఈసీఐ అధీనంలో ఉన్న ఈవీఎంల రక్షణ, భద్రత మొత్తం ఎన్నికల సంఘానిదే. ప్రజాస్వామ్య మూలాలను సవాలు చేసేలా ఊహాగానాలు రావడం సరికాదు. ప్రజల తీర్పు చాలా ఉన్నతమైనది. వారికి సంబంధించిన అన్ని అనుమానాలకు తీర్చాలి. మన వ్యవస్థలపై దృఢమైన విశ్వాసం ఉన్న వ్యక్తిగా నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. మన వ్యవస్థల సమగ్రత బాధ్యత ఎన్నికల సంఘంపై ఆధారపడి ఉంది. ఎటువంటి ఊహాగానాలు లేకుండా చేయాల్సి ఉంది' అంటూ ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు.

evmtampering 21052019

కాగా, ఈనెల 19న లోక్‌సభ ఎన్నికలు ముగిసేంత వరకూ ఎన్నికల కమిషన్ తన స్వయంప్రతిపత్తికి తిలోదకాలిచ్చి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిందంటూ విపక్షాలు ఈసీని తప్పుపట్టాయి. ప్రధాని మోదీకి, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు ఇచ్చిన వరుస క్లీన్ చీట్లపైనా ఈసీపై విమర్శలు ఎక్కుపెట్టాయి. మోదీ, అమిత్‌షాలకు క్లీన్ చిట్ ఇవ్వడంపై తన అసమ్మతిని రికార్డు చేయనందునే కమిషన్ మీటింగ్‌లను తాను బహిష్కరించినట్టు ఎన్నికల కమిషనర్లలో ఒకరైన అశోక్ లవాసా అభిప్రాయపడటాన్ని కూడా విపక్షాలు తవ వాదనకు బలం చేకూర్చినట్టు క్లెయిమ్ చేసుకున్నాయి.

నెలన్నరపాటు సాగిన ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఫలితాలు రావాల్సి ఉంది. ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు స్థిరంగా ఉన్న ఫ్యూయల్ ధరలు పెరిగే అవకాశం ఉందా? గత రెండు నెలల్లో ఎదుర్కొన్న నష్టాలను పూడ్చుకునేందుకు ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజల్ ధరలు పెరిగితే తమపై ప్రభావం చూపుతుందన్న కారణంతో కేంద్ర ప్రభుత్వం కంపెనీలను కట్టడి చేసింది. పోలింగ్ కొనసాగే ఏప్రిల్, మే నెలల్లో ఫ్యూయల్ ధరలను పెంచవద్దని, స్టేబుల్​గా ఉంచాలని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్ మార్కెటింగ్ సంస్థలను ఆదేశించింది.

modi ennikala baadudu

దీంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నా, దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగలేదు. ఈ క్రమంలో తాజాగా ధరలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈ సంస్థలు కోరే అవకాశం ఉంది. కొన్ని నెలలుగా వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి, అనుకున్న దాని కంటే ఎక్కువగానే ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది మే నెలలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫ్యూయల్ రేట్లు పెంచడమే ఇందుకు ఉదాహరణ. పోలింగ్ సమయంలో ఓ వారంపాటు ధరలు పెరగకుండా ఆపిన ప్రభుత్వం, తర్వాత మాత్రం భారీగా పెంచుకుంటూపోయింది.

modi ennikala baadudu

లోక్​సభ ఎన్నికలు పూర్తయిన తర్వాతి రోజే పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం దేశవ్యాప్తంగా పెట్రోల్ 8 నుంచి 10 పైసలు, డీజిల్ 15 నుంచి 16 పైసలు పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డేటా ప్రకారం ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.71.12, డీజిల్ 66.11గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినందువల్లే ఇక్కడ ఫ్యూయల్ ధరలు పెరిగాయి. క్రూడ్ ఆయిల్ పరిమిత సరఫరాకు ఆయిల్ ఉత్పత్తి దేశాలు ఒప్పుకున్నాయని సౌదీ అరేబియా ఎనర్జీ మంత్రి ఖలీద్ అల్ ఫలీ ప్రకటించిన తర్వాత క్రూడ్ ఆయల్ ధరలు 1 శాతం వరకు పెరిగాయి.

జనసేనకు దక్కేవి నాలుగైదు సీట్లు మాత్రమే అంటూ ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించడంతో పవన్‌ అభిమానుల్లో అలజడి రేపింది. భీమవరంలో అంతా సవ్యంగా సాగితే పవన్‌దే గెలుపు అనుకుంటున్నా అనుమాన పొరలు కమ్ముకున్నాయి. ఫలితాలు పార్టీకి ఉత్తేజకరంగా ఉంటాయా..? నీరసపడేలా చేస్తాయా..? అంటూ జనసేనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్నలు ఎన్నో వినిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ భీమవరం నుంచి పోటీ చేయాలని ఆకస్మిక నిర్ణయంపై అందరిలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. స్వగ్రామం మొగల్తూరు వున్న నరసాపురం, పొరుగునే వున్న పాలకొల్లు నియోజక వర్గాలను కాకుండా భీమవరంలో ఎందుకు పోటీ చేయాలనుకున్నారు ? అంటూ అనేక ప్రశ్నలు వ్యక్త మయ్యాయి. ఒక పార్టీ అధినేతగా పవన్‌ మిగతా స్థానాల్లో పర్యటించి, ప్రచారం చేసి చివరగా భీమ వరంలోను సుడిగాలి ప్రచారం చేశారు.

pk 21052019

ఆఖరుకు ఇక్కడ ఒక సామాజిక వర్గం వారు ఇష్టపడే అల్లూరి సీతారామరాజు వంద అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానంటూ భరోసా ఇచ్చి ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సొంత సామాజికవర్గం యా వత్తు తన వెంటే నిలుస్తుందని భావించారు. తగ్గట్టు గానే ఆయా సామాజిక వర్గాల పెద్దలతో మనసు పంచుకున్నారు. పార్టీ లక్ష్యాలను ఏకరవు పెట్టారు. తాను రెండుచోట్ల పోటీ చేస్తున్నా.. భీమవరానికి ప్రత్యేకత ఉందని, ఈ గడ్డ తన సొంత గడ్డ అంటూ స్ఫూర్తిని నింపారు. స్వచ్ఛందంగా అభిమానులు ప్రచారం చేశారు. ఏజెంట్లుగా వ్యవహరించి పోలింగ్‌ బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నారు. పోలింగ్‌ ముగిసిన తరువాత గెలుపుపై ధీమా ప్రదర్శించారు. ఎగ్జిట్‌పోల్స్‌ అనంతరం పార్టీ మీదవున్న ప్రజాభిమానం తాము ఆశించినట్టుగా ఓటు రూ పంలో మారలేదా ? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

pk 21052019

2009 పీఆర్పీ పోటీకి దిగినప్పుడు ఇంతకంటే రాజకీయాలు ఇంకో కోణంలో వెళ్లాయని, అప్పుడూ ముక్కోణపు పోటీ మాదిరిగానే ఈసారి ఉన్న.. పరిస్థితులు తమకు ఎందుకు అనుకూలంగా మారలేదనే స్వరాన్ని వినిపిస్తున్నారు. భీమవరంలో పవన్‌కల్యాణ్‌ గట్టెక్కుతారా ? లేదా ? అనే దానిపై ఇప్పుడు మరోమారు హాట్‌ టాపిక్‌ అయ్యింది. పాలకొల్లులో చిరంజీవికి ఎదురైన అనుభవమే రిపీట్‌ కాబోతుందా ? అనేది మరికొందరి అనుమానం. ఇప్పటికీ గెలుపు మీద కాస్తంత ధీమాతోవున్న అభి మానులు ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలను తేలిగ్గా తీసు కుంటున్నారు.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం నుంచే వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సమీక్షించనున్నారు. నిజానికి మంగళవారం ఇక్కడ ఆయన పార్టీ అభ్యర్థులతో భేటీ అవుతారని.. కౌంటింగ్‌ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తారని వైసీపీ వర్గాలు తొలుత వెల్లడించాయి. ఆదివారం ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు వెలువడ్డాక తన షెడ్యూల్‌ మార్చుకున్నారని.. అభ్యర్థులతో భేటీని రద్దుచేసుకున్నారని తాజాగా పేర్కొన్నాయి. బుధవారం సాయంత్రం ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకుని.. అతి ముఖ్య నేతలతో సమావేశమవుతారు. తాజా రాజకీయ పరిస్థితులు, జాతీయ మీడియా వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్‌, స్థానికంగా వచ్చిన ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలపై విశ్లేషిస్తారు.

sameeksha 21052019

కేంద్రంలో ఎన్‌డీఏనే మళ్లీ వస్తుందని దాదాపు అన్ని సర్వేలూ స్పష్టం చేసినా.. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వచ్చేసరికి ఏకరూపంగా లేవు. కొన్ని చానళ్లు/సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఇవ్వగా.. మరికొన్ని మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారని పేర్కొన్నాయి. ఆంధ్రా ఆక్టోపస్‌ లగడపాటి రాజగోపాల్‌ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుందని తన సర్వేలో తెలిపారు. జగన్‌, వైసీపీ ముఖ్య నేతలు ఇప్పుడు ఈ సర్వేపైనే చర్చించుకుంటున్నారు. లగడపాటికి ఆయాచిత లబ్ధి జరిగిందని.. అందుకే టీడీపీకి అనుకూల సర్వే ఇచ్చారని వైసీపీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తెలంగాణలో ఆయన చెప్పిన ఫలితాలు తప్పయ్యాయని బయటకు అంటున్నా.. అంతర్గతంగా మాత్రం ఆ సర్వేపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.

sameeksha 21052019

అధికార పక్షానికీ.. వైసీపీకి మధ్య 8-5 నుంచి 10 శాతం వరకూ తేడా ఉంటుందన్న జాతీయ సర్వే సంస్థల అభిప్రాయాన్ని వైసీపీ విశ్వసించడం లేదు. ఎన్నికల్లో పది శాతం తేడా అంటే.. ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని.. పోలింగ్‌ జరిగిన వెంటనే ఎవరు గెలుస్తారో చెప్పేయవచ్చని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కానీ బూత్‌ స్థాయిలో అలాంటి పరిస్థితి లేదని.. పోటీ నువ్వానేనా అనేట్లుగా ఉందని చెబుతున్నారు. ఎవరు నెగ్గుతారేది ఫలితాల రోజు వరకు ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొందని ఆంతరంగికంగా స్పష్టం చేస్తున్నారు. ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు తమలో కొంత ధీమా నింపినా.. మరోవైపు ఆందోళనా కలిగిస్తున్నాయని అంగీకరిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read