ఎగ్జిట్‌ పోల్‌ సర్వేల ఫలితాలతో రాజకీయ వర్గాల్లో టెన్షన్‌ అమాంతం పెరిగిపోతోంది. దీంతో వాస్తవ ఫలితాలపై సామాన్య జనంలో కూడా ఉత్కంఠ పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా పలు సంస్థలు సర్వేల ఫలితాలు ప్రకటించడం, అవన్నీ పరస్పర విరుద్ధంగా వుండడంతో అందరిలో అయోమయం నెలకొంది. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అర్థంకాని పరిస్థితిలో పడ్డారు. అయితే జిల్లాలో మాత్రం మిగిలిన సంస్థల ప్రకటనల గురించి జనం పట్టించుకోవడం లేదు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఈ రాష్ట్రానికి చెందిన వారు కావడం, చాలా ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు నిర్వహించిన నేపథ్యం వుండడంతో ఆయన ప్రకటన మాత్రం జిల్లా ప్రజలపై గణనీయమైన ప్రభావం చూపుతోంది. లగడపాటి సర్వే ఫలితాలతో ఆదివారం సాయంత్రం దాకా జోరుమీదున్న వైసీపీ వర్గాలను నీరసం ఆవహించింది. ఆ పార్టీ నేతలను అభద్రతా భావానికి లోను చేసింది. అదే సమయంలో టీడీపీ శ్రేణుల్లో జోష్‌ను పెంచింది. ప్రతిసారీ ఎన్నికల సందర్భాల్లో ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఫలితాల పట్ల జనం ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నడుమ హోరాహోరీ పోటీ జరిగింది. మధ్యలో జనసేన కూడా టీడీపీ, వైసీపీ గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో పోటీ ఇచ్చింది. రాష్ట్ర రాజకీయాల్లో నాయకత్వం విషయంలో కొత్త తరాన్ని తీసుకొస్తున్న ఎన్నికలు కావడంతో జనంలో ఫలితాల పట్ల విపరీతమైన ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది.

గత నెల 11న పోలింగ్‌ ముగియడంతో అప్పటి నుంచీ జిల్లాలో ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తలు గెలుపు తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చివరి విడత పోలింగ్‌ ఆదివారం కావడంతో ఆదివారం సాయంత్రం వరకూ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఫలితాల వెల్లడిపై నిషేధం వున్న సంగతి తెలిసిందే. దీంతో ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు నిర్వహించిన సంస్థలు ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఫలితాలను ప్రకటించాయి. దేశవ్యాప్తంగా పలు మీడియా, ప్రైవేటు సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఫలితాలు పరస్పర భిన్నంగా వుండడంతో రాజకీయవర్గాలతో పాటు సామాన్య జనం కూడా అయోమయంలో పడ్డారు. సర్వే ఫలితాలు వెల్లడించిన సంస్థల్లో కొన్ని మాత్రమే పేరుప్రతిష్టలు కలిగినవి. మిగిలినవి ప్రాముఖ్యత, విశ్వసనీయత లేనివన్నది జనం భావన. అయితే ప్రతిష్టాత్మక సంస్థలు బయటపెట్టిన సర్వే ఫలితాలు కూడా ఏకరీతిలో లేకపోవడమే అయోమయానికి దారితీస్తోంది.

జాతీయస్థాయి ప్రాముఖ్యత కలిగిన సర్వే సంస్థలు వెల్లడించిన ఫలితాలను నిజానికి విద్యాధికులు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. అదే లగడపాటి రాజగోపాల్‌ వెల్లడించిన ఆర్‌జీ ఫ్లాష్‌ టీమ్‌ సర్వే ఫలితాలు మాత్రం జిల్లావ్యాప్తంగా రాజకీయ వర్గాలను, సామాన్య జనాన్ని గణనీయంగా ప్రభావితం చేశాయి. ఎందుకంటే లగడపాటి ఈ రాష్ట్రానికి చెందిన రాజకీయ నేత. జనానికి బాగా తెలిసిన వ్యక్తి. ఆయన చాలా కాలంగా ఎన్నికలప్పుడు ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు నిర్వహించడం, ఆ ఫలితాలు చాలా వరకూ వాస్తవానికి చేరువగా వుండడం కూడా జిల్లా ప్రజలకు తెలుసు. ఇటీవలి తెలంగాణ ఎన్నికల విషయంలో ఆయన అంచనా కొంతమేరకు తప్పినప్పటికీ ఆదివారం తిరుపతిలో ఆయన తాజా సర్వే ఫలితాలు వెల్లడించే సందర్భంలో తన సర్వే విశ్వసనీయత, నిబద్ధతల గురించి చేసిన వ్యాఖ్యలు జనంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ కారణంగా ఆదివారం రాత్రి లగడపాటి వెల్లడించిన ఫలితాలు జిల్లాలో రెండు ప్రధాన పార్టీల శిబిరాలను షేక్‌ చేసింది. అప్పటి దాకా వైసీపీ శ్రేణులు గానీ, నేతలు గానీ ఎన్నికల్లో గెలిచేది తమ పార్టీయేనని, అధికారం కూడా తమదేనని బలంగా నమ్ముతూ వచ్చాయి. వారిలో అలాంటి భావన ఏర్పడేలా పార్టీ నేతలు కూడా బిల్డప్‌ ఇస్తూ వచ్చారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఓ విధమైన అభద్రతా భావం నెలకొంది. నేతలు పైకి ధైర్యంగానే వున్నా కార్యకర్తల్లోనే హుషారు తగ్గింది. అలాంటిది లగడపాటి ప్రకటనతో వైసీపీ శ్రేణులు పూర్తిగా డీలా పడ్డాయి.

 

కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో 21విపక్ష పార్టీల నేతల భేటీ ముగిసింది. ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో చర్చించిన ఎన్డీయేతర పార్టీల నేతల బృందం ఆ తర్వాత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ను కలిసింది. ఈ నెల 23న ఓట్ల లెక్కింపు సందర్భంగా వీవీప్యాట్ స్లిప్పులు, ఈవీఎంల లెక్కింపులో తేడావస్తే నియోజకవర్గంలోని మొత్తం స్లిప్పులు లెక్కించాలని డిమాండ్‌ చేసినట్టు సమాచారం. సుమారు గంటకు పైగా జరిగిన ఈ భేటీ సందర్భంగా 8 పేజీల మెమోరాండాన్ని నేతలు సీఈసీకి అందజేశారు. ఈ మెమోరాండంలో పలు అంశాలను కీలకంగా పొందుపరిచారు. ఏప్రిల్‌ 8న సుప్రీంకోర్టు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 5వీవీప్యాట్లు లెక్కించాలని ఇప్పటికే ఆదేశించిందని నేతలు గుర్తుచేశారు.

ec 21052019

చివరి రౌండ్‌ ఈవీఎంల లెక్కింపు పూర్తికాకుండానే వీవీప్యాట్లు లెక్కించాలని డిమాండ్‌ చేశారు. లెక్కింపు ముగిసే వరకు ఈవీఎంలు, వీవీప్యాట్లు కౌంటింగ్‌ కేంద్రంలోనే ఉంచాలని కోరినట్టు తెలుస్తోంది. వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో సరైన మార్గదర్శకాలను రిటర్నింగ్‌ అధికారులు, కౌంటింగ్‌ అధికారులకు ఇవ్వకపోవడాన్ని విపక్ష నేతలు సీరియస్‌గా ప్రస్తావించినట్టు సమాచారం. ఈవీఎంలను ట్యాంపర్‌ చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారని, వీవీప్యాట్లు లెక్కించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెనకడుగు వేయడానికి కారణాలేంటని నిలదీసినట్టు సమాచారం. వీవీప్యాట్ల కౌంటింగ్‌లో ఎందుకు ఇప్పటివరకు నియమనిబంధనల్ని రూపొందించలేదని ప్రశ్నించాయి.

ec 21052019

ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఐదు వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో ఈసీ ఎందుకు వెనకాడుతోందని నిలదీసినట్టు సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం ఏడు దశల్లో జరిగిన ఎన్నికల నిర్వహణలో విఫలమైందని, విపక్షాలు లేవనెత్తిన ఏ ముఖ్యమైన అంశాన్నైనా ఎందుకు పట్టించుకోలేదని తీవ్రంగా ప్రశ్నిస్తూ నేతలు నిరసన వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం తీరును ఎండగడుతూ తమ వాదనను విన్పించిన విపక్షాల నేతలు ఎలాంటి కార్యాచరణను ప్రకటిస్తారో చూడాలి.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై శాప్‌ మాజీ ఛైర్మన్‌ పీఆర్‌ మోహన్‌ డీజీపీ ఠాకూర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం డీజీపీని కలిసిన ఆయన తన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయకుండా చట్టాన్ని ఉల్లంఘించా రంటూ ఫిర్యాదు చేశారు. 2015 జనవరి 28వ తేదీన ప్రభుత్వం రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌)కు తనను ఛైర్మన్‌గా నియమిస్తూ శాప్‌కు ఉత్తర్వులు జారీ చేసిందని పీఆర్‌ మోహన్‌ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దానికి అనుబంధ ఉత్తర్వులు జారీ చేయలేదని పేర్కొన్నారు.

cs 21052019

ఆయన ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులనే నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తుచ తప్పకుండా అమలు చేయాల్సిన ఉన్నతాధికారి ఉదాశీనత చూపడం వల్ల తాను తీవ్ర మనోవ్యధకు గురయ్యానని ఆ ఫిర్యాదులో వివరించారు. తన నియామకం న్యాయమైనదా? కాదా? ఎందుకు తనకు అనుబంధ ఉత్తర్వులు ఇవ్వలేదు? అనే అంశాలపై తాను రెండేళ్ల పాటు వ్యధకు లోనయ్యానని పేర్కొన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన ఉన్నతాధికారి చట్టాన్ని నిర్లక్ష్యం చేసినందున వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఇప్పటికే శ్రీకాళహస్తి వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ నెల 8వ తేదీన అర్జీ కూడా ఇచ్చానని వివరించారు.

cs 21052019

పీఆర్‌ మోహన్‌ చేసిన ఫిర్యాదుపై అవసరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఠాకూర్‌ తిరుపతి అర్బన్‌ ఎస్పీని ఆదేశించారు. శ్రీకాళహస్తికి చెందిన పీఆర్‌ మోహన్‌ గతంలో కూడా పలు పర్యాయాలు శాప్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు కుటుంబాలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన ఈయన 2014లో టీడీపీ ఏర్పడిన ఆరు నెలలకే శాప్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అయితే ఉత్తర్వుల అమలులో జాప్యం జరగడంతో ఈ పర్యాయం ఆ పదవిని చేపట్టలేకపోయారు.

ఎన్నికల ఫలితాల ప్రకటనకు సమయం దగ్గరపడ్డ సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, పంజాబ్‌, హరియాణాలోని పలు ప్రాంతాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు వర్గాలు ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌ రూంల వద్ద ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం(ఈసీ).. ఆ వార్తలన్నీ కేవలం వదంతులేనని, భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలను భద్రపరిచామని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ నియోజవర్గ పరిధిలో ఓ వాహనంలో భారీ ఎత్తున ఈవీఎంలను తరలిస్తున్నారని ఆరోపిస్తూ బీఎస్పీ అభ్యర్థి అఫ్జల్‌ అన్సారీ అనే అభ్యర్థి స్థానికంగా ఉన్న ఓ స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

evm 21052019 1

దీంతో జిల్లా రిటర్నింగ్‌ అధికారి అక్కడికి చేరుకొని స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద పార్టీలకు చెందిన ప్రతినిధులను కూడా ఉండడానికి అనుమతించడంతో ఆందోళన విరమించారు. మరో ఘటనలో వారణాసికి సమీపాన గల చందౌలీ నియోజకవర్గంలో మంగళవారం ఉదయం ఈవీఎంలను కౌంటింగ్ సెంటర్‌ కాంప్లెక్స్‌లోని ఓ గదిలో భద్రపరచడాన్ని సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు చరవాణిలో చిత్రీకరించారు. అలాగే పోలింగ్‌ ముగిసిన రెండు రోజుల తరవాత ఈవీఎంలను ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించడం వీడియోలో గమనించవచ్చు. దీనిపై స్పందించిన ఎన్నికల యంత్రాంగం.. వీడియోలో చూపించిన ఈవీఎంలు చందౌలీ నియోజవర్గానికి చెందిన రిజర్వ్‌ యూనిట్లని తెలిపారు.

evm 21052019 1

పోలింగ్‌ రోజున తరలించే క్రమంలో ఏర్పడ్డ ఇబ్బందుల కారణంగా వాటిని స్ట్రాంగ్‌ రూంలకు చేర్చడంలో ఆలస్యమైందని వివరించారు. మరో ఘటనలో దొమరియాగంజ్‌కు చెందిన జిల్లా ఎన్నికల అధికారి ఈవీఎంల తరలింపుపై సంబంధిత సిబ్బందిని ఫోన్‌లో ప్రశ్నిస్తుండగా.. అవతలివైపు నుంచి సరైన సమాధానం రాకపోవడం గమనార్హం. బిహార్‌, హరియాణా, పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలే వెలుగులోకి రావడం ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌.. ‘‘హఠాత్తుగా ఈవీఎలంను తరలిస్తున్నారన్న వార్తలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి? వాటిని ఎవరు తరలిస్తున్నారు? ఈ క్రతువు ఇప్పుడే ఎందుకు జరుగుతోంది? దీనిపై ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించాల్సి ఉంది’’ అని ట్విటర్‌ వేదికగా అభిప్రాయపడ్డారు.

Advertisements

Latest Articles

Most Read