అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందే గన్నవరం శాసనసభ్యులు డా.వల్లభనేని వంశీ విజయం సాధించారు. ప్రస్తుత విజయ డెయిరీ ఛైర్మన్ మండవ జానకిరామయ్య అనారోగ్య కారణంగా రాజీనామా చేయగా ఆ పదవికి ఎన్నిక అనివార్యం అయ్యింది. ఆ పదవికి ఎమ్మెల్యే వంశీ చలసాని ఆంజనేయులు ను ప్రతిపాదించగా అదే ఛైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న దాసరి బాలవర్ధనరావు ఎలాగైనా ఎన్నికను ఆపాలని ప్రయత్నించారు. వేగంగా స్పందించిన ఎమ్మెల్యే వంశీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు వద్ద తనకు ఉన్న ప్రాధాన్యతను ఉపయోగించి రాజకీయ చాణిక్యతతో ఎన్నిక జరిగేలా చలసాని ఆంజనేయులుకు ఛైర్మన్‌గా ఎన్నికయ్యేలా పరిస్థితులు కల్పించారు.

vamsi 22052019

తెలుగుదేశం పార్టీలో అనేక పదవులను అనుభవించి ఈ సార్వత్రిక ఎన్నికలలో వై.సీ.పీ లో చేరిన దాసరి బ్రదర్స్ ను తీవ్రంగా దెబ్బతీస్తూ చలసాని ఆంజనేయులును విజయ డెయిరీ ఛైర్నన్ స్థానంలో కూర్చోబెట్టడంలో వంశీ విజయం సాధించారు. ఇది ఇలా ఉంటే, కృష్ణా మిల్క్ యూనియన్ వివాదంపై సీఈఓ ద్వివేదికి వైసీపీ ఫిర్యాదు చేసింది. మిల్క్ యూనియన్ చైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులుని నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ద్వివేదికి వైసీపీ నేత దాసరి బాలవర్ధనరావు ఫిర్యాదు చేశారు. మిల్క్ యూనియన్ చైర్మన్ ని రాత్రికి రాత్రే మంత్రి దేవినేని ఉమ మార్చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా రాజకీయ నియామకాలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

వీవీప్యాట్ల అంశంలో ప్రతిపక్షాలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఓట్ల లెక్కింపు సమయంలో తొలుత అయిదు వీవీప్యాట్లను లెక్కించాలంటూ విపక్షాలు చేసిన డిమాండ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదని, వీవీప్యాట్లను మొదట లెక్కించడం కుదరదని తేల్చి చెప్పింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఓట్ల లెక్కింపు జరుగుతుందని స్పష్టం చేసింది. లెక్కింపు సమయంలో వీవీప్యాట్లను తొలుత లెక్కించాలని, అందులో ఏ ఒక్క దాంట్లో తేడా వచ్చినా ఆ నియోజకవర్గంలోని మొత్తం వీవీప్యాట్లను లెక్కించేలా మార్గదర్శకాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష నేతలు నిన్న ఎన్నికల సంఘాన్ని కలిసి విషయం తెలిసిందే.

ec 22052019

రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌, ఏపీ, రాజస్థాన్‌, దిల్లీ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, అశోక్‌గహ్లోత్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ల నేతృత్వంలో 22 రాజకీయ పార్టీలు మంగళవారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి 11 పేజీల వినతిపత్రం అందజేశాయి. దీనిపై బుధవారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈసీ తెలిపింది. ఈ మేరకు నేడు సమావేశమైన ఎన్నికల సంఘం.. విపక్షాల డిమాండ్‌ను తిరస్కరించింది. మరో పక్క రాష్ట్రం విషయానికి వస్తే, తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీస్‌ ఓట్లు లెక్కించి ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల లెక్కింపు చేపడతామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు.

ec 22052019

మధ్యాహ్నం 12గంటల లోపు ఫలితాల ట్రెండ్స్‌ తెలిసిపోతాయన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు తర్వాతే ఫలితం ప్రకటిస్తామని ద్వివేది స్పష్టంచేశారు. ఈవీఎంలో సాంకేతిక సమస్యలు ఉంటే వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కిస్తామని స్పష్టంచేశారు. బుధవారం ఆయన ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడుతూ.. ‘‘36 కౌంటింగ్‌ కేంద్రాల్లో సుమారు 350 లెక్కింపు హాళ్లు పెట్టాం. ప్రతి అసెంబ్లీ స్థానానికి ఒక పరిశీలకుడు, పార్లమెంట్‌ స్థానానికి మరో పరిశీలకుడు ఉంటారు. రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల ఆధ్వర్యంలో లెక్కింపు జరుగుతుంది. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, రిటర్నింగ్‌ అధికారులు, పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాం. ఇప్పటికే లెక్కింపునకు ఏర్పాట్లన్నీపూర్తయ్యాయి. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలించేందుకు ఈసీఐ నుంచి ఇద్దరు పరిశీలకులు రాష్ట్రానికి వచ్చారు. వాళ్లు ఎప్పటికప్పుడు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు’’ అని చెప్పారు.

ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఒక్క రోజు ముందు కలకలం చెలరేగింది. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత శేఖర్ రెడ్డిని బుధవారం ఉదయం దారుణంగా హత్య చేశారు. శేఖర్ రెడ్డి టీడీపీ సీనియర్ నేత, కోట్ల ప్రధాన అనుచరుడు అయిన శేఖర్ రెడ్డి మృతి టీడీపీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక టీడీపీ నేత శేఖర్ రెడ్డి మృతిపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోట్ల సుజాతమ్మ అనుచరుడు శేఖర్ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. డోన్ మండలం, చాపలకొత్తూరులో శేఖర్ రెడ్డి బైక్ ను అడ్డగించిన దుండగులు ఆయనపై దాడి చేశారు.

tdp 22052019

రాడ్లు, కర్రలతో దాడి చేసిన దుండగులు అనంతరం బండరాయితో తలపై మోదారు. దీంతో తీవ్రరక్తస్రావం అయిన శేఖర్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.అనంతరం దుండగులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. చాపలకొత్తూరు వద్ద శేఖరరెడ్డి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీస్ అధికారులు శేఖర్ రెడ్డి భౌతికకాయాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. ఈ హత్యతో కర్నూలు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

tdp 22052019

ఇక ఈ ఘటనపై ఏపీ ఐటీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆధునిక సమాజంలో ఇలాంటి ఆటవిక చర్య అమానుషమని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు . ఈ దారుణానికి తెగబడ్డ దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. శేఖర్ రెడ్డి కుటుంబానికి టీడీపీ అన్నవిధాలుగా అండగా ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు. శేఖర్ రెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. కోట్ల సుజాతమ్మ అనుచరుడైన శేఖర్ రెడ్డి చనిపోవడంపై పలువురు టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.

 

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి కేవలం మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. నువ్వా-నేనా అన్నట్టుగా జరిగిన ఈ ఉత్కంఠ పోరులో విజేత ఎవరోనన్న ఆసక్తి తెలుగు రాష్ట్రాల ప్రజల్లో నెలకొంది. పోటీ చేసిన పార్టీల అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గెలుపుపై టీడీపీ, వైసీపీలు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే.. వైసీపీలోని కొందరు మాత్రం జగన్ అప్పుడే సీఎం అయిపోయినట్లు ఫ్లెక్సీలు కడుతూ నానా హంగామా చేస్తున్నారు. ‘దరపడి ఓ కోయిల.. ముందే కూసింది అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ ఫ్లెక్సీ చూడండి. ఈ వైసీపీ నేత పేరు దవులూరి దొరబాబు. పెద్దాపురం వైసీపీ నేత. ఆయన పేరుతో కట్టిన ఫ్లెక్సీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

jagan 22052019 1

తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద ఆయన పార్టీపై అభిమానంతో ఓ ఫ్లెక్సీని కట్టించారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్‌కు శుభాకాంక్షలు’ అని ఆ ఫ్లెక్సీపై ప్రింట్ చేయించారు. పార్టీలపై, ఆ పార్టీల అధినేతలపై అభిమానం ఉండటం సహజం. అయితే.. ఆ అభిమానం అత్యుత్సాహంగా మారి ఎన్నికల ఫలితాలు రాక ముందే ఈ తరహా ఫ్లెక్సీలు కట్టించడం చూస్తుంటే.. ఫలితాలు ప్రతికూలంగా వస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఫ్లెక్సీ మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో ఈ తరహా ఫొటోలను వైసీపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. జగన్ బ్యాచ్ ఎంత వెర్రెక్కి ఉందో చెప్పే చేష్టలు ఇవి...

 

Advertisements

Latest Articles

Most Read