చీరాలలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీకి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. చీరాల టీడీపీ అభ్యర్థి కరణం బలరాం దగ్గర రాజశేఖర్ పీఏగా పనిచేస్తున్నారు. బలరాం వియ్యంకుడి ఆసుపత్రిలోకి వెళ్లి మరీ రాజశేఖర్‌పై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్తలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆసుపత్రిలో బలరాం తనయుడు వెంకటేష్ తన అనుచరులతో సమావేశమయ్యారు. దీన్ని గమనించిన వైసీపీ కార్యకర్తలు బాధితుడి దగ్గరకు వెళ్లి తాము చికిత్స కోసం వచ్చామని చెప్పారు. అయితే ఆసుపత్రిలో ఓపీ సమయం అయిపోందని, ఇప్పుడు రోగులను చూడరని రాజశేఖర్ చెప్పాడు.
అతడి సమాధానం విన్న నిందితులు.. తాము చికిత్స కోసం రాలేదని దాడి చేయడానికి వచ్చామని చెప్పారు. వైసీపీ కార్యకర్తలు తమతో తెచ్చుకున్న ఆయుధాలతో రాజశేఖర్‌పై దాడి చేశారు. రాజశేఖర్ అప్రమత్తం కావడంతో చిన్న గాయాలతో బయటపడ్డాడు. బాధితుడికి అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడ్డవారిని మనోజ్, వెంకటేష్‌గా గుర్తించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో పక్క, గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కనగలలో పీహెచ్సీ డాక్టర్ రమేష్‌పై వైసీపీ కార్యకర్తల దాడికి తెగబడ్డారు. మందుల విషయంలో వైసీపీ కార్యకర్తలు డాక్టర్‌తో గొడవపడ్డారు.