జూనియర్ ఎన్టీఆర్... 2009లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పని చేసారు. తరువాత కాలంలో, సినిమాల్లో బిజీ అయ్యి, రాజకీయాలకు దూరంగా జరిగారు. అయితే జూనియర్ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ రిలేషన్ పై అనేక అభిప్రాయాలు వ్యక్తం అవుతూ వచ్చాయి. ముఖ్యంగా కొడాలి నాని వ్యవహారంలో, ఎన్టీఆర్ కి, తెలుగుదేశం క్యాడర్ నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. అయితే తాను మాత్రం, కట్టే కాలే వారుకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటానాని, అనేకసార్లు స్పష్టం చేసారు కూడా. కాని, ప్రతి సారి, ఎన్టీఆర్, చంద్రబాబు మధ్య గ్యాప్ పెంచటానికి ప్రత్యర్ధి పార్టీలు చూస్తూ ఉండేవి. ముఖ్యంగా లోకేష్ ఎంటర్ అయిన తరువాత, లోకేష్ కోసం ఎన్టీఆర్ ని బలి ఇస్తున్నారు అంటూ ప్రత్యర్ధులు ప్రచారం చేసే వారు. నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నేను సినిమాల్లో పేరు తెచ్చుకోవాలి అని ఎన్టీఆర్ ఎన్ని సార్లు చెప్పినా, ప్రచారాలు మాత్రం ఆగలేదు.
అయితే అనేక సందర్భాల్లో మాత్రం, చంద్రబాబు, ఎన్టీఆర్ కు అండగా నిలబడ్డారు. అలాగే ఎన్టీఆర్ కూడా కావలసిన సమయంలో ముందుకొచ్చారు. చంద్రబాబు 2014లో ప్రమాణస్వీకారం చేసిన సమయంలో, అలాగే 2018లో లోకేష్ మంత్రి అయిన సందర్భంలో, ప్రమాణస్వీకారానికి హరికృష్ణ హాజరయ్యారు. సంవత్సరం క్రితం, హరికృష్ణ మరణ వార్తా విని, చంద్రబాబు అన్నీ తానై చివరి కార్యక్రమాలు జరిపించారు. ఇద్దరి మధ్య ఇంత మంచి సంబంధాలు ఉన్నా, ప్రచారాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి తరువాత, ఈ రోజు మరోసారి చంద్రబాబు, ఎన్టీఆర్ కలుసుకున్నారు. ఈ రోజు హరికృష్ణ సంవత్సరీకం కావటంతో, ఆ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అందరూ పాల్గున్నారు.
ఎన్టీఆర్ , కళ్యాణ్ రాం తో, చంద్రబాబు చాలా సేపు మాట్లాడారు. చంద్రబాబు ప్రస్తుతం చెయ్యి నొప్పితో బాధ పడుతున్న విషయం తెలిసిందే. ఆ విషయం పై, ఎన్టీఆర్, చంద్రబాబు ఆరోగ్యం పై ఆరా తీసారు. ఇరువురు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఓటమి గురించి ప్రస్తావిస్తూ, మీరు కష్టపడి పని చేసారు, ప్రజలకు ఎంతో సేవ చేసారు, కొన్నాళ్ళు ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోండి అని చెప్పినట్టు సమాచారం. అలాగే, చంద్రబాబు కూడా, ఎన్టీఆర్ కు షూటింగ్ లో అయిన గాయం గురించి ఆరా తీసారు. మొత్తానికి, హరికృష్ణ మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకున్న టీఆర్ఎస్, వైసిపీ పార్టీలు, ఈ సీన్ చూసి మాత్రం ఇబ్బంది పడక తప్పదు. మళ్ళీ ఎదో విష ప్రచారంతో వాళ్ళు ముందుకు రావటం, వీళ్ళు కడుక్కుంటు కూర్చోవటం మామూలే అనుకోండి.