చంద్రబాబు అధికారంలో ఉండగా, ఏపి అంటే చెప్పిన నిర్వచనం, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని. ఆయన దానికి తగ్గట్టే పని చేసారు. అమరావతిని ప్రపంచంలో మేటి నగరాల్లో పెట్టేందుకు, ఆయన చెయ్యని ప్రయత్నం లేదు. అలాగే పోలవరం గురించి కూడా, ఆయన ఎలా పని చేసారో అందరికీ తెలుసు. ఏమి లేని ప్రాజెక్ట్ ని, 73 శాతానికి తీసుకొచ్చారు. ప్రతి సోమవారం, పోలవరం గురించి సమీక్షలు చేస్తూ, పనులు పరుగులు పెట్టించారు. ప్రభుత్వం మారింది, జగన్ వచ్చారు. అమరావతి ఆగిపోయింది, పోలవరం ఆగిపోయింది. మరి ఈ రెండు, రెండు కళ్ళుగా చూసిన చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుంది ? ఒకసారి ఊహించుకోండి. కళ్ళ ముందే అమరావతి శిధిల నగరం అయిపోతుంది. ఇప్పుడు ఏకంగా అమరావతినే మార్చేస్తున్నాం అని లీకులు ఇస్తున్నారు.

cbn 22082019 2

ఇక పోలవరం విషయంలో కూడా ఇదే పరిస్థితి. చంద్రబాబు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి, పోలవరం పనులు ఆగిపోయాయి. ఇప్పుడు ఏకంగా కాంట్రాక్టర్ ని మార్చే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. నవయుగ ని తప్పించింది. అలాగే రివర్స్ టెండరింగ్ కు వెళ్ళింది. దీని పై నవయుగ కోర్ట్ కు వెళ్ళింది. దీంతో హైకోర్ట్, ప్రభుత్వానికి షాక్ ఇస్తూ, రివర్స్ టెండరింగ్ పై ఇచ్చిన నోటిఫికేషన్ ను సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ సంగతి ఏమి అవుతుందో, ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. చంద్రబాబు ఉంటే, ఈ ఏడాది చివరకు పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేవి. ఇప్పుడు, ఆ పరిస్థితి లేదు. అయితే హైకోర్ట్, తీర్పు రాగానే, చంద్రబాబు స్పందించారు. అందుబాటులో ఉన్న మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.

cbn 22082019 3

పోలవరం రీటెండరింగ్ ని హైకోర్ట్ సస్పెండ్ చేసింది. ఇది ఇంతటితో ఆగదు. ఈ జాప్యం, పోలవరం ప్రాజెక్ట్ పై పడుతుంది. ఎప్పటికి ప్రాజెక్ట్ పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి వస్తుంది. ఈ జగన్ ప్రభుత్వానిది పిచ్చి అనుకోవాలో ? లేక రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలో అర్ధం కావటం లేదని చంద్రబాబు అన్నారు. పోలవరం లాంటి ప్రాజెక్ట్ లతో ప్రయోగాలు వద్దని, ఎంత మంది చెప్పినా, వీళ్ళు వినే స్టేజ్ లో లేరని చంద్రబాబు అన్నారు. జగన్ మోహన్ రెడ్డి మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ఈ నిర్ణయాల వల్ల ఆయనకు ఏమి కాదని, రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని, భవిష్యత్తుని నాశనం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. పోలవరంలో లేని అవినీతి కోసం ఆరాట పడుతున్నారని, కేంద్రం ఎన్ని సార్లు చెప్పినా, వీరికి అర్ధం కావటం లేదని చంద్రబాబు అన్నారు. ఒక్కసారి న్యాయ వివాదం మొదలైతే, ఎన్ని ఏళ్ళు పడుతుందో, ఈ ప్రభుత్వానికి తెలుసా అని చంద్రబాబు అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. అటు కేంద్రం నుంచి, ఇటు కోర్టుల నుంచి షాకులు తగులుతూనే ఉన్నాయి. దీని అంతటికీ కారణం, మొండి పట్టుదల, చంద్రబాబు ముద్రలు చెరిపేయాలనే తాపత్రయం. ప్రతి విషయంలోనే ఇదే ధోరణితో ముందుకు వెళ్తూ, జగన్ ప్రభుత్వం ప్రతి నిర్ణయంలోనూ ఇబ్బందుల్లో పడుతుంది. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో అన్నట్టు రాష్ట్ర శాశ్వతం. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంతే కాని, గత ప్రభుత్వం చేసినవి అన్నీ నేను రద్దు చేస్తాను అంటే, ప్రభుత్వ వ్యవహారాల్లో అది నడవదు. ఏ కేంద్ర ప్రభుత్వం కాని, ఏ కోర్ట్ లు కాని, ఈ ధోరణిని ఒప్పుకోవు. ఇప్పుడు జగన్ ఇలా చేస్తే, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు కూడా జగన్ చేసినవి అన్నీ ఆపేసి కొత్తవి మొదలు పెడితే ?

court 22082019 2

అందుకే ఈ ధోరణిని ఏ మాత్రం ఉపేక్షించం అంటూ, అలాంటి సంకేతాలే అటు కేంద్రం, ఇటు కోర్ట్ లు ఇస్తున్నాయి. తాజాగా, పోలవరం పై నవయుగని తప్పించి, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై, నవయుగ హైకోర్ట్ కు వెళ్ళింది. ముఖ్యంగా హైడల్ ప్రాజెక్ట్ విషయంలో, మేము 2021 నవంబర్ నాటికి కట్టి ఇస్తాం అని చెప్తున్నా, ప్రభుత్వం రివెర్స్ టెండరింగ్ కి వెళ్లి, 58 నెలల సమయం అంటుందని, ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని, మా టెండర్ ని రద్దు చేసే తప్పు మేము ఏమి చెయ్యలేదు అంటూ, నవయుగ కోర్ట్ లో వాదనలు వినిపించింది. దీని పై హైకోర్ట్ ఈ రోజు, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నవయుగ కంపెనీకు హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ జగన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సస్పెండ్‌ చేసింది.

court 22082019 3

అంతే కాదు, కొత్త టెండర్ కు వెళ్ళ వద్దని స్పష్టం చేసింది. నవయుగ కంపెనీ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్‌కో జారీ చేసిన ప్రిక్లోజర్‌ నోటీసును హైకోర్టు సస్పెండ్‌ చేసింది. అయితే దీని పై ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుంది. సుప్రీం కోర్ట్ కు వెళ్తుందా, లేక నవయుగ నే కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి. మరో పక్క, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, మా మాట వినకుండా, రివర్స్ టెండరింగ్ కు ఎందుకు వెళ్లారు అంటూ, రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని మొత్తం రిపోర్ట్ ఇవ్వమని, అడిగిన సంగతి తెలిసిందే. దీని పై కూడా, కేంద్రం ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటించే అవకాసం ఉంది. మరి జగన్ ప్రభుత్వం, ఏమి చేస్తుందో వేచి చూడాలి.

మొన్నటి వరకు అనధికార మిత్రులుగా ఉన్న వైసీపీ, బీజేపీ పార్టీలు, ఇప్పుడు ఒకరి పై ఒకరు రాజకీయ దాడులు చేసుకుంటున్నాయి. నిన్న జగన్ యాంటీ హిందూ అంటూ, బీజేపీ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. ఈ రోజు కూడా జగన్ ప్రభుత్వం పై బీజేపీ పార్టీ విరుచుకు పడింది. వరదలల్లో సరిగ్గా వాటర్ మ్యానేజ్మెంట్ చేయ్యక పోవటం, పోలవరం టెండర్లు, రాజధాని తరలింపు పై, బీజేపీ, వైసిపీ పై రాజకీయ దాడి చేస్తుంది. అయితే ఈ రోజు విజయసాయి రెడ్డి చాలా రోజుల తరువాత మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఇన్ని విమర్శలు చేసినా, వారిని ఒక్క మాట కూడా అనే సాహసం చెయ్యలేదు. వారిని ఏమి అనకపోగా, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా పై ప్రశంసలు కురిపించారు. అయితే, పోలవరం ప్రాజెక్ట్ విషయం పై, విద్యుత్ ఒప్పందాల సమీక్ష పై, కేంద్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది కదా అని విలేఖరులు ప్రశ్నించారు.

vsreddy 21082019 2

దీనికి విజయసాయి రెడ్డి సమాధానం చెప్తూ, జగన్ మోహన్ రెడ్డి ఏమి చేసినా, మోడీ, అమిత్ షాలకు చెప్పే చేస్తారని చెప్పారు. వారి అనుమతితోనే అన్ని పనులు చేస్తారు అంటూ, పోలవరం రివర్స్ టెండరింగ్, విద్యుత్ ఒప్పందాల సమీక్షను, మోడీ, షా ల పై తోసేసే ప్రయత్నం చేసారు. అయితే విజయసాయి రెడ్డి వ్యాఖల పై, బీజేపీ పార్టీ వెంటనే స్పందించింది. ముందుగా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ, పోలవరం టెండర్ల విషయంలో, విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో, కేంద్ర ప్రభుత్వం వద్దు అని చెప్తున్నా, జగన్ మోహన్ రెడ్డి, ఆయన ఇష్టం వచ్చినట్టు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రధాని మోడీ చెప్పిన మాట వినటం నేర్చుకోవాలి అంటూ మండి పడ్డారు.

vsreddy 21082019 3

ఇక కొద్ది సేపటికే, విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి. ఢిల్లీలో ఈ రోజు సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తో చర్చలు జరిపి, వారి అంగీకారం తరువాతే పోలవరం విషయంలో, విద్యుత్ ఒప్పందాల విషయంలో ముందుకు వెళ్తున్నాం అని చెప్పిన విజయసాయి రెడ్డి మాటలు కరెక్ట్ కాదని సుజనా అన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పరిపలన ఉండదని, ఎవరి నిర్ణయాలు వారు తీసుకుంటారనే విషయం విజయసాయి రెడ్డి గుర్తుంచుకోవాలని అన్నారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు వింతగా ఉన్నాయని అన్నారు. అసలు ఏ ప్రాతిపదికన, మోడీ, అమిత్ షా, మీకు భోరోసా ఇస్తారని సుజనా ప్రశ్నించారు. ఇలాంటి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు అని, కేంద్రం చెప్పే ప్రతి అభ్యంతరానికి, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుందని, విజయసాయి రెడ్డి గుర్తుంచుకోవాలని అన్నారు.

నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, మా జగన్ చేసే ప్రతి పని, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా లకు చెప్పే చేస్తున్నాం అని, అన్ని విషయాలు వాళ్లకు చెప్పి, వాళ్ళ అంగీకారంతోనే చేస్తున్నాం అంటూ మీడియాతో చెప్పుకొచ్చారు. నిన్న విలేఖరులతో మాట్లాడుతూ, విద్యుత్ ఒప్పందాల రాద్దు, పోలవరం రీటెండరింగ్ పై కేంద్రం, మీ పై గుర్రుగా ఉంది కదా అని అడిగిన సందర్భంలో, ఏమి లేదు, అన్నీ వాళ్ళకు చెప్పే చేస్తున్నాం అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యాఖ్యల పై ఇప్పటికే బీజేపీ నేతలు తిప్పి కొట్టగా, ఈ రోజు బీజేపీ ఏపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ కూడా విజయసాయి రెడ్డి మాటలు ఖండించారు. ఈ విషయం పై అధిష్టానికి ఫిర్యాదు చేస్తానని, వాళ్ళు చేసిన తప్పులు, మా మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు కేంద్రం మంత్రులు కూడా ఈ విషయాల పై విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు.

jagan 22082019 2

విద్యుత్ ఒప్పందాల రద్దు పై ప్రధానికి, హోం మంత్రికి చెప్పి చేస్తున్నాం అని విజయసాయి రెడ్డి అంటే, కేంద్ర విద్యుత్‌ మంత్రి ఆర్కే సింగ్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కు తగ్గిందని చెప్పారు. ఈ మేరకు మాకు లేఖ రాసారని, ముందుగా చెప్పినట్టు అన్ని విద్యుత్ ఒప్పందాలు సమీక్ష చెయ్యటం లేదని, ఎక్కడైతే అనుమానం ఉందొ, అవి మాత్రమే చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం మాకు చెప్పిందని కేంద్ర మంత్రి అన్నారు. అయితే తాజాగా జగన్ మోహన్ రెడ్డి, ప్రధానమంత్రి కార్యాలయం కార్యాలయం నుంచి లేఖ వచ్చినట్టు తెలుస్తుంది. పెద్ద ఎత్తున దేశంలో విదేశీ పెట్టుబడులు వస్తున్న నేపధ్యంలో, మీరు ఇలా చేస్తే కనుకు, ఆ ఎఫెక్ట్ మొత్తం దేశం మీద పడుతుందని, ఆ లేఖలో రాసినట్టు సమాచారం.

jagan 22082019 3

అయితే ఈ విషయం పై ఇప్పటికే అనేక సార్లు కేంద్రం, జగన్ మోహన్ రెడ్డిని హెచ్చరించింది. అయినా జగన్ దిగి రాలేదు. అలాగే ట్రిబ్యునల్ వార్నింగ్ ఇచ్చింది. మరో పక్క 42 కంపనీలు హై కోర్ట్ కు వెళ్ళటంతో, కోర్ట్ కూడా మొట్టికాయలు వేసింది. అయినా సరే జగన్ మోహన్ రెడ్డి విద్యుత్ ఒప్పందాలు సమీక్షించి తీరుతానని కూర్చున్నారు. ఈ నేపధ్యంలో, వారం క్రితం జపాన్ రాయబారి కార్యాలయం నుంచి, అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఘాటు లేఖ రావటంతో, ఇక డైరెక్ట్ గా ప్రధాని మంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. దీంతో, ఇక జగన్ మోహన్ రెడ్డి, తప్పనిసరిగా, తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేసిన డ్యామేజ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, కేంద్ర మంత్రి.

Advertisements

Latest Articles

Most Read