వరద అంచనా కోసం అంటూ, రెండు రోజుల పాటు, కేవలం చంద్రబాబు ఇంటి పైన డ్రోన్లు ఎగరేస్తూ, రెండో రోజు పట్టుబడిన మనుషులు, మమ్మల్ని జగన్ పంపించారని ఒకసారి, జగన్ ఇంట్లో ఉండే కిరణ్ పంపించారని ఒకసారి చెప్తూ, పట్టుబడ్డారు. అయితే ఈ విషయం పై తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఎన్ఎస్జీ భద్రతలో ఉండే చంద్రబాబు నివాసంపై డ్రోన్ ఎగరేస్తూ, ఎన్ఎస్జీ పర్మిషన్ తీసుకోక పోవటం, అలాగే ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వదలటం వంటి అంశాల పై తెలుగుదేశం తీవ్రంగా పరిగణించింది. ఒక పక్క చంద్రబాబు భద్రత తగ్గిస్తూ, మరో పక్క, ఇలా ఆయాన ఇల్లు, అన్ని ఆంగెల్స్ నుంచి వీడియో తీసి, బయటకు వదిలారని, దీంట్లో కుట్ర కోణం ఉందని, జగన్ ఇంట్లో ఉండే కిరణ్ ఎవరో తేలాలి అని, తెలుగుదేశం పార్టీ ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ విషయం పై చంద్రబాబు కూడా, డీజీపీకి ఫోన్ చేసి వివరణ అడిగారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తుంటే, ఏమి చేస్తున్నారని నిలదీశారు. ఈ మొత్తం అంశం పై, డీజీపీ ఈ రోజు స్పందించారు. చంద్రబాబు ఇంటి పై డ్రోన్ ఎగిరిన విషయం పై, ఎలాంటి కుట్ర లేదని తేల్చి చెప్పారు. ఇరిగేషన్ డిపార్టుమెంటు వాళ్ళు, డ్రోన్ వీడియో తీసారని చెప్పారు. అయితే, ఈ విషయం పై లోకల్ పోలీసులకు చెప్పకపోవటంతో, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, ఆ రోజు ఏమి జరుగుతుందో, ఎవరికీ తెలియలేదని అన్నారు. ఇక పై ఎవరైనా డ్రోన్ ఎగరెయ్యాలి అంటే, కచ్చితంగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. స్థానిక పోలీసుల పర్మిషన్ కచ్చితంగా తీసుకోవాలని, లేకపోతే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
మరో పక్క తెలుగుదేశం పార్టీ మాత్రం, ఈ అంశం పై దూకుడుగా వెళ్తుంది. ఇప్పటికే ఈ విషయం పై గుంటూరు ఐజీని కలిసి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేసారు. ఈ రోజు గవర్నర్ గవర్నర్ బిశ్వభూషణ్ ను కూడా కలిసి ఫిర్యాదు చేసారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు,అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని సహా ఇతర ముఖ్య నేతలు, గవర్నర్ ను కలిసి, అక్కడ జరిగిన విషయం పై క్లారిటీ ఇచ్చారు. అలాగే వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని, వారిని ఆదుకోవాలని కోరారు. అలాగే, చంద్రబాబు నివాసంపై డ్రోన్ ఎగరేసిన ఘటనపై ప్రయివేట్ కేసు దాఖలు చేయాలని కూడా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది.