తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు కడపలో పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఈ రోజు రెండో రోజు కడపలో పర్యటిస్తూ, నియోజకవర్గాల వారీగా సమీక్ష నిరవహిస్తున్నారు. ఈ సందర్భంలో చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి లోనైయ్యారు. ఒక కార్యకర్త పరిస్థితి తెలుసుకుని, చంద్రబాబు కారులోనే అలా ఓక రెండు నిమిషాలు ఉండి పోయారు. తరువాత సమీక్షా సమావేశంలో, కూడా చంద్రబాబు ఆ కార్యకర్తకు ఆర్ధిక సాహయం చేస్తూ, భావోద్వేగానికి లోనైయ్యారు. చంద్రబాబుని అలా చూసిన, కార్యకర్తలు, నేతలు కూడా, ఒక్క నిమిషం పాటు, అలాగే ఉండి పోయారు. వివరాల్లోకి వెళ్తే, పులివెందుల నివాసి అయిన, సూర్యనారాయణరెడ్డి బాధ విని చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా, చంద్రబాబు అతనికి ఆర్ధిక సహాయం చేసారు. తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా, ఆదుకుంటుంది అని భరోసా ఇచ్చారు.

cbn 26112019 2

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకు పడ్డారు. జగన్‌ మోహన్ రెడ్డి ఒక ఉన్మాది, రాక్షసుడు అని, చంద్రబాబు ఆరోపించారు. తెలుగుదేశం కార్యకర్తలను వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నాడని ఆయన ఆరోపించారు. జగన్‌ అనుచరులంతా ఉన్మాదుల్లా మారి తెలుగుదేశం కార్యకర్తలను వేధిస్తూ పైశాచికానందం పొందుతున్నారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని చంద్రబాబు అన్నారు. మీడియా, పత్రికల గొంతు నొక్కి, నిజాలను బయటకు రాకుండా చూస్తున్నారని అన్నారు. ఆరు నెలల్లోనే, 640 మంది తెలుగుదేశం కార్యకర్తల పై దాడులు చేసారని, దౌర్జన్యాలు, అరాచకాలు చేసి, ప్రజలను కూడా భయపెడుతున్నారని అన్నారు.

cbn 26112019 3

కొంత మంది పోలీసులు కూడా, చట్ట ఉల్లంఘన చేసి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని అన్నారు. అధికార యంత్రాంగం దుర్వినియోగం చెయ్యటం, పరాకాష్టకు వెళ్లిందని చంద్రబాబు అన్నారు. వారు అనుకున్న వారికే, పెన్షన్లు, పధకాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారని అన్నారు. ఉపాధి హామీ పధకం డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదని అన్నారు. వ్యాపారుల దగ్గర జే టాక్స్ తీసుకుంటున్నారని అన్నారు. చివరకు మీడియా పై కూడా ఆంక్షలు పెట్టారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం, వైసీపీ గుండాలు చేసే పనికి, వడ్డీతో సహా, చెల్లించేలా చేస్తానని అన్నారు. ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పై, ప్రైవేటు కేసు పెడతామని చంద్రబాబు అన్నారు. బజారులోనే మీ మోఖాల పై ఊసేలా చేస్తానని చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎవరైనా ఎక్కడైనా అవినీతి చేస్తే, కాల్ చెయ్యండి అంటూ టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేసింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ 14400 అనే నెంబర్ ఏర్పాటు చేసారు. అయితే ఇది చంద్రబాబు 1100 కాన్సెప్ట్ కు, కాపీ. అయితే జగన్ గారు ఆ నెంబర్ తీసేసి, కొత్త నెంబర్ పెట్టరు. ఇది ఇలా ఉంటే, 14400 కు ఫోన్ చేస్తే, 15 రోజుల్లోగా, సమస్య పరిష్కరించాలని, ఇందులో ఒక రూల్. అయితే తెలుగుదేశం నేత వర్ల రామయ్య, ఆ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసారు. జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి సియంగా ఉండగా చేసిన, అక్రమార్జనపై అధ్యయనం చేయాలని ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ హయంలో జరిగిన దోపిడీ పై విచారణ చెయ్యాలని, ఈ ఫిర్యాదును స్పెషల్ ది గా భావించి, సచివాలయానికి తీసుకెళ్లి అధికారులకు ఇవ్వాలని కాల్ సెంటర్ సిబ్బంది ఆయనకు సూచించారు. తన ఫిర్యాదు పై 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని, మళ్ళీ 15 రోజుల తరువాత ఫోన్ చేస్తానని వర్ల రామయ్య అన్నారు. అయితే, కాల్ సెంటర్ సిబ్బంది మాత్రం, ఏమి చెయ్యాలో తెలియక అవాక్కయ్యారు.

varla 26112019 2

ఇక మరో పక్క బొత్సా వ్యాఖ్యల పై కూడా తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చెందిన రాజధాని ప్రాంతాన్ని శ్మశానంతో పోల్చిన మంత్రి బొత్స సత్యనారాయణను మంత్రివర్గం నుంచి బర్త్‌రఫ్‌ చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ డిమాండ్‌ చేశారు. మంగళవారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాయలంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సైబరాబాద్‌లా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు. రాజధానిలో 35 లక్షల మందికి శాశ్వత నివాసం, 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలని భావించారు. రాజధాని నుండి వచ్చిన ఆదాయంతో 13 జిల్లాలు అభివృద్ధి జరుగుతుంది. సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చు. రాజధానిలో 9 నగరాలు నిర్మించాలని 60 శాతం పనులు పూర్తి చేశారు. కానీ వైసీపీ నేతలు రాజధానిపై ఇష్టం వచ్చినట్లు దుష్రచారం చేస్తున్నారు. రాజధానిపై వైసీపీ నేతలు నక్క పురాణం చెప్పారు. రాజధాని ముంపుకు గురవుతుందని, వరద వస్తుందని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని, అవినీతి జరిగిందని రకరకాల ఆరోపణలు చేశారు. కానీ ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. రాజధానిని బొత్స శ్మశానంగా వర్ణించడం సిగ్గుచేటు. 25 రోజుల్లో 33 వేల ఎకరాలు రైతులచ్చిన ప్రాంతాన్ని శ్మశానంతో పోలుస్తారా? 29 గ్రామాల ప్రజలు నివిసిస్తున్న ప్రాంతాన్ని శ్మశానం అంటారా? రాజధానిలో ఇప్పటికే హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలు జరిగాయి.

varla 26112019 3

వాటిని శ్మశానంతో పోలుస్తారా? గతంలో హైమావతి, భ్రమరావతి అంటూ అవమానించారు. ఇప్పుడు ఏకంగా శ్మశానం అంటూ కించపరుస్తున్నారు. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గం నుండి బర్త్‌రఫ్‌ చేయాలి. లేకుంటే బొత్స వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి వ్యాఖ్యలుగా పరిగణించాల్సి వస్తుంది. రాష్ట్రంలో మంత్రులు, స్పీకర్‌, ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు వింటుంటే.. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టారా లేక బూతుల మీడియం ప్రవేశపెట్టారా అనే అనుమానం కలుగుతోంది. మంత్రులు నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నారు. విద్యారుల్ని, నిరుద్యోగుల్ని ఒక మంత్రి కుక్కలతో పశువులు పోల్చారు. తన నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో స్సీకర్‌ మహిళలలను అవమానపరిచేలా మాట్లాడతారా? రాజ్యాంగబద్దమైన, బాధ్యతాయుతమైన స్సీకర్‌ ఇలాగేనా మాట్లాడేది.? వైసీపీ నేతల నుండి బూతు పురాణం తప్ప ఒక్కటైనా మంచిమాట వచ్చిందా.? ఈ మంత్రుల వ్యవహారశైలి చూసి ప్రజలు ఇది మంత్రివర్గం కాదు, 'కంత్రి'వర్గం అనుకుంటున్నారు. బొత్సను వెంటనే బర్త్‌ రప్‌ చేయాలి, స్పీకర్‌ మహిళలకు క్షమాపణ చెప్పాలి. మంత్రులు, స్పీకర్‌ ఈవిధంగా బూతులు మాట్లాడుతుంటే సీఎం జగన్‌ ఏం చేస్తున్నారు. విని ఎంజాయ్‌ చేస్తున్నారా? లేక ఆయనే ఇలా మాట్లాడిస్తున్నారా? బొత్స వెంటనే సస్సెండ్‌ చేసి తన పరిపాలన విధానాన్ని నిరూపించుకోవాలని అనురాధ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ప్రభుత్వం అమరావతి పై, చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా, అమరావతి ప్రాంతంలో, ఈ నెల 28న పర్యటించి, అమరావతి ఎలా ఉందొ ప్రజలకు చూపించనున్నారు. అయితే చంద్రబాబు అమరావతి పర్యటనకు ముందే, వైసీపీ ఎదురుదాడి ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి బొత్సా అమరావతి పై చేసిన వ్యాఖ్యలు, తీవ్ర దుమారాన్ని రేపాయి. మొన్నటి దాక అమరావతిని భ్రమరావతి అంటూ అవమానపరిచిన వైసీపీ, ఇప్పుడు అమరావతిని "స్మశానం" అంటూ పోల్చటం పై, తీవ్ర దుమారం రేపింది. ఆంధ్రుల రాజధానిని, "స్మశానం" తో పోల్చటం పై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. "రాజధాని శ్మశానాన్ని చూసి ఏడవడానికి వస్తున్నావా చంద్రబాబు" అంటూ బొత్సా చేసిన వ్యాఖ్యల పై తీవ్ర దుమారం రేగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఈ వ్యాఖ్యల పై తీవ్రంగా స్పందించారు. 5 కోట్ల మంది రాజధానిని, "స్మశానం"తో పోలుస్తారా అంటూ విమర్శించారు.

botsa 26112019 2

బొత్స వ్యాఖ్యలపై మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. "రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. రాజధానిని స్మశానంతో పోల్చడం గర్హనీయం. మంత్రి బొత్స సత్యనారాయణను తక్షణమే బర్తరఫ్ చేయాలి. ప్రజా దేవాలయం శాసన సభను స్మశానంతో పోల్చుతారా..? న్యాయ దేవాలయం హైకోర్టును స్మశానంతో పోల్చుతారా..? సచివాలయం వీళ్ల కళ్లకు స్మశానంలా కనిపిస్తోందా..? అమరావతిలో 29గ్రామాలను స్మశానంతో పోలుస్తారా..? 34వేల ఎకరాలిచ్చిన రైతుల త్యాగాలను అవహేళన చేస్తారా..? బొత్సను బర్తరఫ్ చేయకపోతే స్మశానం వ్యాఖ్యల వెనుక సీఎం జగన్ ప్రోద్భలం ఉన్నట్లే. మంత్రి బొత్స,సీఎం జగన్ ఎక్కడ కూర్చుంటున్నారు..? స్మశానంలోనే రోజూ కూర్చుంటున్నారా..? పరిపాలన ఎక్కడ నుంచి వీళ్లు చేస్తున్నారు..? స్మశానంలో కూర్చుని పాలన చేస్తున్నారా..?"

botsa 26112019 3

"దేవేంద్రుడి రాజధాని అమరావతిగా చరిత్ర చెబుతోంది. ప్రధాని మోడి మన అమరావతికి శంకుస్థాపన చేశారు. పుణ్యనదులు, పుణ్యక్షేత్రాల మట్టితో శంకుస్థాపన చేశాం. దేశ, విదేశీ ప్రతినిధులంతా అమరావతి శంకుస్థాపనకు హాజరయ్యారు. మ్యాప్ లో అమరావతిని చూపకపోతే టిడిపి ఎంపిలు లోకసభలో పట్టుబట్టి సాధించారు. రాజధానిగా అమరావతిని గుర్తిస్తున్నామని గడ్కరీయే చెప్పారు. అలాంటిది వైసిపి నేతలు అమరావతిని అభివృద్ది చేయకపోగా అవమానించడం గర్హనీయం. చట్టసభలను అవమానించినందుకు ప్రివిలేజ్ నోటీసు ఇస్తాం. రాజధాని ప్రజలనే కాదు, యావత్ రాష్ట్ర ప్రజలను మంత్రి బొత్స అవమానించారు. మంత్రిగా ఉండే అర్హతను ఆయన కోల్పోయారు. బొత్సను వెంటనే మంత్రి పదవినుంచి బర్తరఫ్ చేయాలి. " అంటూ యనమల స్పందించారు.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 15 రోజుల క్రితం వరుసగా రెండు ప్రెస్ మీట్లు పెట్టి, తెలుగుదేశం పార్టీని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వివిధ టీవీల్లో మాట్లాడుతూ, చంద్రబాబు పై కూడా పౌరుషంగా మాట్లాడారు. అయితే తరువాత తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు తిప్పి కొట్టటం, వంశీ దాని పై మళ్ళీ స్పందించటం ఇవన్నీ జరిగి పోయాయి. అయితే ఆ సందర్భంలో వంశీ మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన కూడా పోలేదు అని, ఇప్పుడే విమర్శలు చేస్తున్నారని, అసలు ఇసుక ఇప్పుడు ఎలా తీస్తారు అంటూ ప్రశ్నించారు. ఒక ఒక్క వరదలు ఉండి, నదులు ఒప్పొంగుతున్నాయి, ఎలా ఇసుక తీస్తారు అంటూ వంశీ ప్రశ్నిస్తూ, చంద్రబాబు నేనే ఫోన్ కనిపెట్టా, నేనే కంప్యూటర్ కనిపెట్టా అని చెప్తూ ఉంటారు కదా, ఆయనకు ఏమైనా తెలిసిన టెక్నాలజీ ఉంటే చెప్పండి, వరదల్లో కూడా ఇసుక బయటకు తీస్తారు అంటూ వంశీ విమర్శలు గుప్పించారు. వంశీ వ్యాఖ్యల పై చంద్రబాబు నిన్న కడప జిల్లా సమీక్షలో మాట్లాడారు.

vamsi 26112019 1

"ఒకాయిన అంటాడు, వరదల్లో కూడా ఇసుకను తీసే టెక్నాలజీ చంద్రబాబు వద్ద ఉందేమో చెప్పండి అంటూ వెటకారం చేస్తున్నాడు. వరదలు ఏమైనా కొత్తా, పక్క రాష్ట్రాల్లో వరదలు లేవా, ఇక్కడ ఇసుక కొరత ఎందుకు ఉంది అని ప్రశ్నించారు. నేను టెక్నాలజీ మీకు ఇవ్వనవసరం లేదు, బోటు తియ్యలేని మీరు, ధర్మాడి సత్యాన్ని తెచ్చుకున్నారు కదా, అతనికి చెప్పండి, ఆటను టీంతో కలిసి, ఇసుక తీసి పెడుతారు. మీకు చేతకానికి ధర్మాడి సత్యం చేస్తారు. దీనికి టెక్నాలజీ ఏమి అవసరం లేదు అంటూ" చంద్రబాబు వంశీకి కౌంటర్ ఇచ్చారు. ఇసుక కొరత వరదల వల్ల అని చెప్పి తప్పించుకుంటున్నారని, నిజానికి వీళ్ళు ఇసుకను బ్లాక్ లో అమ్ముకుంటూ, ప్రజలకు ఇసుక లేకుండా చేస్తున్నారని అన్నారు. ఆ వీడియో ఇక్కడ చూడవచ్చు. https://youtu.be/oPScNvPksMw

vamsi 26112019 1

అలాగే పార్టీ గురించి మాట్లాడుతూ, నాయకులు పార్టీలు మారుతున్నా ఏమాత్రం ఆత్మ స్టైర్యం దెబ్బతినకుండా తెదేపా వెన్నంటే నడుస్తున్న కార్యకర్తలే పార్టీకి భవిష్యత్తని చంద్రబాబునాయుడు పేర్కొన్నట్లు నియోజకవర్గ బాధ్యుడు కస్తూరి విశ్వనాథనాయుడు దిశాని పేర్కొన్నారు. పార్టీ అధినేత ఆధ్వర్యంలో సోమవారం కడపలో నియోజకవర్గాల సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమానికి రైల్వేకోడూరు నియోజకవర్గ నేత పంతగాని నరసింహ ప్రసాద్, రాజంపేట బాధ్యుడు, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగలరాయుడుతోపాటు ఐదు మండలాలకు చెందిన ప్రధాన నాయకులు, క్రియాశీల కార్యకర్తలు పాల్గొన్నారు. గత ఎన్ని కల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై సమీక్ష జరిగినట్లు వారు చెప్పారు. పోలింగ్ కేంద్రం స్థాయి నుంచి ఆరా తీసిన చంద్రబాబు ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద నాయకులు పనిచేసినప్పటికీ ప్రతిసారీ -కోడూరులో పార్టీ అభ్యర్థి ఓడిపోతుండడం విచారకరమన్నారు. వర్గ రాజకీయాలు, ఇతర నాయకత్వ లోపాలపై ఆయన దృష్టికి -రేశం తీసుకెళ్లారు. విభేదాలు పక్కన పెట్టి కలసికట్టుగా ముందుకు సాగితేనే భవిష్యత్తు ఉంటుందని, అలాగే కొనసాగితే కార్యకర్తల కోసం నాయకులను వదులుకోవడానికి కూడా పార్టీ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించినట్లు వారు వివరించారు. పార్టీ ఎవరిని నాయకులుగా నియమిస్తుందో మిగతావారు వారిని అనుసరించినప్పుడే క్రమశిక్షణతో ముందుకు వెళ్లగలమని చెప్పారన్నారు.

 

Advertisements

Latest Articles

Most Read