చంద్రబాబు అమరావతి పర్యటనతో, అమరావతి 29 గ్రామాల్లో ఉన్న వైసీపీ సానుభూతి పరులు, చంద్రబాబును అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసి విఫల యత్నం చేస్తున్నారు. చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సు పై, రాళ్ళ దాడి కూడా చేసారు. చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సు అద్దం కూడా పగుళ్ళు వచ్చింది. అయినా ఎక్కడా దడవకుండా చంద్రబాబు ముందుకే వెళ్తున్నారు. నేను రాజధాని రైతుల తరుపున పోరాడటానికి వచ్చాను, పార్టీలకు అతీతంగా రైతులు నష్టపోతున్నారు, అలాంటిది నన్ను రావద్దు అని రైతులు ఎందుకు అడ్డుకుంటారు, వారు వైసీపీ పెట్టిన పైడ్ ఆర్టిస్ట్ లు అని వారి మొఖం చూస్తూనే అర్ధమవుతుందని చంద్రబాబు అన్నారు. నాలుగు రోజుల నుంచి మంత్రులు మాట్లాడుతున్న మాటలు చూస్తూనే, ఇలాంటిది ఏదో ప్లాన్ చేసారని అర్ధమవుతుందని అన్నారు. నేను ప్రతిపక్ష నాయకుడుని అని, మాజీ ముఖ్యమంత్రిగా చేసానని, తనకు ఎక్కడైనా పర్యటించే స్వెఛ్ ఉందని, ఈ ప్రభుత్వం ఆ వాతావరణం కల్పించాలని చంద్రబాబు అన్నారు.

bus 28112019 2

వీరి ఉడత ఊపులకు భయపడేది లేదని, అమరావతిని ఎలా చేసారో, ఈ ఆరు నెలల్లోనే ఎంత నాశనం చేసారో, ఈ దేశానికి చూపించే, వెనక్కు తిరుగుతానని చంద్రబాబు అన్నారు. మరో పక్క పోలీసులు కూడా, ఎక్కడికక్కడ వీరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నీచమైన కుట్రలకు వైసీపీ ప్రభుత్వం తెరలేపింది అని చంద్రబాబు అన్నారు. రాజధాని పట్ల ఐదు కోట్ల ఆంధ్రులకు ఉన్న భావోద్వేగాలు వైసీపీ వాళ్లకు తెలుసని ఆయన అన్నారు. అందుకే ఒక పథకం ప్రకారం దుష్ప్రచారాలు చేసి అమరావతిని క్రమక్రమంగా చంపాలన్న నీచమైన కుట్రలకు వైసీపీ తెరతీసిందని చంద్రబాబు అన్నారు. ఆ కుట్రలను బయటపెట్టేందుకే తాను అమరావతిలో పర్యటిస్తున్నానన్నారు.

bus 28112019 3

మరో వైపు జరుగుతున్న పరిణామాలను పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. తెలుగుదేశం శ్రేణులు కూడా పెద్ద ఎత్తున రావటంతో, ఇరు వర్గాల మధ్య గొడవలు జరగకుండా, రాయపూడి ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు, రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇక్కడకు వచ్చేది ప్రజా సమస్యల పోరాటానికి అని, అప్పట్లో చంద్రబాబు ఇలాగే అనుకుని ఉంటే, జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే వారా అని ప్రశ్నిస్తున్నారు. మొన్న చలో ఆత్మకూరు కూడా ఇలాగే చేసారని, ఇసుక దీక్షకు స్టేడియంలో పర్మిషన్ ఇవ్వలేదని, గుర్తు చేస్తున్నారు.

కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్లక్ష్యం చేస్తుంది అంటూ, అమరావతిలో ఈ ఆరు నెలల్లో ఏమి జరిగింది, వాస్తవ పరిస్థితిని ప్రజలను వివరించటానికి, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అమరావతి పర్యటనకు ఈ రోజు వెళ్లారు. అయితే, చంద్రబాబు అమరావతి పర్యటనకు వెళ్ళే ముందు, జరిగిన సీన్ చూసి, ఒక్కసారిగా అక్కడ నిశబ్ద వాతావరణం నెలకొంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు, ఉదయం 8 గంటలకు ముఖ్య నేతలు, కార్యకర్తలు చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. అయితే చంద్రబాబు 9 గంటల సమయంలో, అక్కడ ఉన్న నేతలతో కలిసి, ఆయన నివాసం పక్కనే ఉన్న ప్రజా వేదిక స్థలం వద్దకు వచ్చారు. చంద్రబాబు అమరావతి పర్యటనకు బయలుదేరే ముందు, నడక ద్వారా బయలుదేరి, ప్రజా వేదిక పరిస్థితి ఎలా ఉందొ చూపిస్తాను అంటూ, అక్కడ ఉన్న నేతలకు, కార్యకర్తలకు చూపించారు.

praja 28112019 2

అయితే ఆరు నెలలు అయినా ప్రజా వేదిక వద్ద ఉన్న వ్యర్ధాలు అలాగే ఉన్నాయి. రేకులు, ఇనుప కడ్డీలు, స్లాబ్, ఇతర వ్యర్ధాలు అన్నీ అక్కడే ఉన్నాయి. చంద్రబాబు అక్కడ సీన్ చూసి, ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఇక్కడే ఎన్నో కలెక్టర్ల సమావేశాలు పెట్టేవారమని, ఎంతో మంది ప్రజలను, కలుసుకుని, వారి సమస్యలను పరిష్కరించే వారమని, గుర్తు చేసుకుని బాధ పడ్డారు. అక్కడే ఉన్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలు, ఇదేంటి, ఇంకా ప్రజా వేదిక కూల్చిన సందర్భంలో, ఉన్న వ్యర్ధాలు ఇక్కడే ఉన్నాయి అంటూ, చూసి షాక్ అయ్యారు. ఆరు నెలలు గడిచినా, ఇక్కడ నుంచి వ్యర్ధాలు తియ్యలేదు అంటే, జగన్ మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటో అర్ధమవుతుందని అన్నారు.

praja 28112019 3

ప్రతి రోజు చంద్రబాబు, తన ఇంటికి వెళ్తూ, ప్రజా వేదిక శిధిలాలు చూసి, కుమిలి పోవాలి అనే ఉద్దేశంతోనే, ఇలా ఉంచేసారని నేతలు అన్నారు. ప్రభుత్వం మారిన తరువాత, ప్రతిపక్ష నాయకుడు హోదాలో, తన ఆఫీస్ కింద, ప్రజా వేదికను, తనకు కేటాయించాలని, చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసారు. అయితే, ఆ వెంటనే రెండో రోజే, అక్కడ కలెక్టర్ల సమావేశం పెట్టిన జగన్, వెంటనే ఈ ప్రజా వేదిక కూల్చివేయాలని, కరకట్ట మీద అక్రమంగా కట్టారని అన్నారు. చెప్పినట్టుగానే, రాత్రికి రాత్రి ప్రజా వేదిక కూల్చేసారు. అయితే, అప్పటి నుంచి ఆ శిధిలాలు మాత్రం, అక్కడ నుంచి తియ్యలేదు. ప్రతి రోజు చంద్రబాబు అవి చూస్తూ వెళ్ళాలని, అక్కడే ఉంచారని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ, ఇది జగన్ మనస్తత్వం అని చెప్తుంది.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు భేటీ అయ్యారు. అమరావతి రాజధానిగా చూపిస్తూ, సవరించిన మ్యాప్ రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఇండియా మ్యాప్ లో అమరావతిని, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చూపించక పోవటం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 రోజుల దాకా పట్టించుకోక పోవటంతో, పార్లమెంట్ మొదలైన వెంటనే, తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఈ విషయం పై, పార్లమెంట్ లో లేవనెత్తారు. అమరావతిని గుర్తించక పొతే, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదని, అమరావతిని శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీకి అవమానం అని, దీన్ని వెంటనే సరిదిద్దాలని కోరారు. దీనికి సంబంధించి బాధ్యత హోం శాఖది కావటంతో, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయం పై స్పందిస్తూ, వెంటనే తప్పు సరిదిద్దుతామని చెప్తూ, తప్పుని అంగీకరించటమే కాక, చెప్పినట్టే, కేవలం ఒక్క రోజులోనే తప్పుని సరిదిద్ది, కొత్త మ్యాప్ విడుదల చేసారు.

amit 27112019 2

దీంతో తెలుగుదేశం పార్టీ వెంటనే, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపింది. చంద్రబాబు కూడా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసి, ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపధ్యంలోనే, అడిగిన వెంటనే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడినందుకు, ఈ రోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలిసి, తెలుగుదేశం పార్టీ ఎంపీలు ధన్యవాదాలు చెప్పారు. కలిసిన వారిలో, గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌, సీతారామలక్ష్మి ఉన్నారు. అయితే వీరి భేటీ కేవలం దీనికి మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు పై ఫిర్యాదు చేసారు. ఆంధ్రప్రదేశ్ లో రౌడీ రాజ్యం నడుస్తుందని, ఫిర్యాదు చేసారు.

amit 27112019 3

తెలుగుదేశం పార్టీ కార్యక్తల పై, నేతల పై, ఇప్పటికీ దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయని, ఇప్పటి వరకు 640 మంది పై దాడులు జరిగాయని అన్నారు. అలాగే, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన సామాన్యులను కూడా ఇబ్బంది పెడుతున్నారని, వారి ఇళ్ళ ముందు గోడలు కట్టటం, పంటలు నరికేయటం, లాంటి చర్యలకు పాల్పడుతూ, ఊరు విడిచి వెల్లిపోయేలా చేస్తున్నారని, ఇప్పటికే ఈ విషయం జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేసామని, మరిన్ని వివరాలతో, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో జరుగుతున్న దురాగతాల పై ఫిర్యాదు చేస్తామని, అమిత్ షా కు తెలిపారు. దీనికి స్పందించిన అమిత్ షా, జరుగుతున్న విషయాలు అన్నీ మాకు తెలుసని, ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నామని, మాకు ఉన్న పరిమితుల్లో, మేము స్పందిస్తామని చెప్పినట్టు తెలుస్తుంది.

మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించిన చంద్రబాబు, మూడో రోజు, ఆయన బుధవారం, కడప సబ్ జైలుకు వెళ్లారు. అక్రమంగా అరెస్ట్ చేసిన తెలుగుదేశం కార్యకర్త, రెడ్యం వెంకట సుబ్బారెడ్డిని పరామర్శించారు. కడప సబ్ జైలులో సామాన్య కార్యకర్త కోసం చంద్రబాబు వెళ్ళటంతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జైలు బయట గుమి కూడారు. రెడ్యం వెంకట సుబ్బారెడ్డిని పరామర్శించిన అనంతరం చంద్రబాబు అక్కడే, మీడియాతో మాట్లాడారు. చిన్న కేసుకే వెంకట సుబ్బారెడ్డిని జైలులో పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం శ్రేణుల పై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, మానసికంగా వేధించి, పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. కొంత మంది పోలీసులు కూడా, ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ, చట్టాన్ని అతిక్రమించి, అతిగా స్పందిస్తున్నారని ఆరోపించారు. చట్టాన్ని అతిక్రమించిన ప్రతి ఒక్కరి పై, ప్రైవేటు కేసు పెడుతున్నామని, ఎవరినీ వదిలి పెట్టే సమస్యే లేదని, అందరికీ వడ్డీతో సహా తిరిగి ఇస్తామని చంద్రబాబు హెచ్చరించారు.

cbn 27112019 2

ఇదీ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి పై ఉన్న కేసు. కడప జిల్లలోని, ఖాజీపేట మండలం దుప్పలగట్టులో రెడ్యం వెంకట కొండమ్మ, రెడ్యం లక్ష్మీకుమారీలు పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గత సెప్టెంబరు 29వ తేదీన ఒక చిన్న వివాదం ప్రారంభం అయ్యింది. ఇంటి ముందు నిలిచిన మురికి నీరు విషయంలో, ఇరువురికీ వాగ్వాదం జరిగింది. దీంతో ఈ సంఘటన టీడీపీ నేత రెడ్యం ఆదినారాయణరెడ్డి, వైసీపీ నేత శివశంకర్‌రెడ్డి వర్గీయుల మధ్య గొడవకు దారి తీసింది. ఈ నేపదంలో ఖాజీపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు కొంత మందిని అరెస్ట్ చేసారు.

cbn 27112019 3

రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, రెడ్యం ఆదినారాయణరెడ్డిలతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసి, మైదుకూరు కోర్టుకు హాజరుపెట్టాగా, కోర్టు రిమాండ్‌కు ఆదేశించడంతో పోలీసులు వారిని కమలాపురం జైలుకు తరలించారు. కాగా ఇంటి వద్ద ఆడవాళ్ల మధ్య చిన్న వివాదాన్ని, రాజకీయం చేసి, తమ కుటుంబాలను అగౌరవం పరచాలని వైసీపీ నాయకులతో అక్రమ కేసులు పెట్టారని రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ఆరోపించారు. దీని వెనుక ఎమ్మెల్యే రఘురామిరెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. ఈ నేపధ్యంలో, నెల రోజులకు పైగా, జైలులో ఉన్న రెడ్యం వెంకట సుబ్బారెడ్డిని, చంద్రబాబు జైలుకు వెళ్లి పరామర్శించి, ధైర్యం చెప్పారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read