విజయవాడ బెంజ్ సర్కిల్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వేదిక ఫంక్షన్ హాల్ దగ్గర జేఏసీ మీటింగ్ లో పాల్గున్న చంద్రబాబు, అక్కడ అమరావతి పరిరక్షణ సమితి ఆఫీస్ ని ప్రారంభించారు. అన్ని పార్టీల నాయకులు అక్కడకు చేరుకున్నారు. అయితే అమరావతి పరిరక్షణ కోసం, జేఏసీ ఆధ్వర్యంలో, బస్సు యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. బస్సు యాత్ర కోసం అందరూ రెడీ అవుతున్న సమయంలో, పోలీసులు వచ్చి బస్సులని ఆపేసారు. పర్మిషన్ లేదని, డీజీపీ పర్మిషన్ ఉంటేనే మేము బస్సులని వాదులుతామని, పోలీసులు చెప్పారు. ఈ రోజు సాయంత్రం నుంచి బస్సులు వదలకుండా, అక్కడ వారిని కూడా అరెస్ట్ చెయ్యటంతో, తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో విషయం తెలుసుకున్న జేఏసీ నాయకులు, పార్టీల నాయుకులు, బెంజ్ సర్కిల్ నుంచి, బస్సులు ఆపిన ప్రదేశానికి, పాదయాత్రగా బయలు దేరారు. పోలీసులు అక్కడ భారీగా మోహరించి వారిని అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు సహా నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

benz 08012020 2

అయితే పోలీసులు ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళటానికి వీలు లేదని చెప్పటంతో, చంద్రబాబు, ఇతర పార్టీల నాయకులు బెంజ్ సర్కిల్ లోనే ధర్నాకు కూర్చున్నారు. అసలు అమరావతి పరిరక్షణ సమితి బస్సులు ఎందుకు ఆపరాని ? అక్కడకు మేము పాదయాత్రకు వెళ్తుంటే, మీకు ఇబ్బంది ఏమిటి అని, ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చెయ్యండి అంటూ, చంద్రబాబుతో పాటుగా, మిగతా నేతలు అక్కడే కూర్చున్నారు. బెంజ్ సర్కిల్ కావటంతో, విషయం తెలుసుకున్న ప్రజలు, తెలుగుదేశం నేతలు భారీ ఎత్తున అక్కడకు చేరుకున్నారు. తమను బస్సులు ఆపిన చోటుకు పంపించాలని అప్పటి వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు అక్కడే కూర్చున్నారు..

benz 08012020 3

చంద్రబాబు మెరుపు ధర్నా చెయ్యటంతో, పోలీసులు ఒక్కసారిగా అవకయ్యారు. ఎక్కవు ఫోర్సు ని తెప్పిస్తున్నారు. సమయం దాడిచే కొద్దీ ప్రజలు వస్తూ ఉండటంతో, అందరినీ ఆపేసి, అక్కడ నాయకులని అరెస్ట్ చేస్తున్నారు. వచ్చిన వారిని వాచినట్టు, అరెస్ట్ చేస్తున్నారు. చంద్రబాబుని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బెంజ్ సర్కిల్ కావటంతో, పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ట్రాఫిక్ ఆగిపోయింది. ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. ప్రశాంతంగా బస్సు యాత్ర చేసుకుంటుంటే, అది కూడా తప్పేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చూస్తూ కూర్చోమని, ఆందోళను తీవ్రతరం చేస్తామని, ఎంత మందిని ఆరెస్ట్ చేస్తారో చేసుకోండి అంటూ చంద్రబాబు అక్కడే కూర్చున్నారు.

ఎన్నికలు ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తరువాత ఒక మాట.. సహజంగా ఏ రాజకీయ పార్టీ తీరు అయినా ఇలాగే ఉంటుంది. అయితే జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం, పాదయాత్రలో ఒక మాట చెప్తూ ఉండే వారు. మాట తప్పను మడం తిప్పను, ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ బాగు చెయ్యటానికి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ, ఆయాన చేసిన ప్రచారం చూసి అందరూ, ఆయన్ను నమ్మి, అందలం ఎక్కించారు. అయితే, ఆయాన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మాట తప్పి, మడం తిప్పుతూనే ఉన్నారు. 45 ఏళ్ళకు పెన్షన్ కాని, సన్న బియ్యం కాని, సీపీఎస్ కాని, తిత్లీ సహాయం కాని, ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే ఆయన సొంత బాబాయ్ కి సంబంధించిన కేసులో కూడా, జగన్ వెనక్కు తగ్గారు. ఎన్నికల ముందు వైఎస్ వి-వేక కేసు పై, సిబిఐ విచారణ జరపాలి అంటూ, ప్రతి రోజు జగన్ మోహన్ రెడ్డి, తన ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పే వారు. ఇది చంద్రబాబు చేయించారని, చంద్రబాబు గతంలో ఎంతో మందిని ఇలాగే చేసారు అంటూ ప్రచారం చేసారు.

court 08012020 2

అయితే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే, ఈ కేసుని సిబిఐకి ఇస్తారని అందరూ అనుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఊసే లేదు. గతంలో చంద్రబాబు వేసిన సిట్ ని తీసేసి, కొత్తగా సిట్ వేసారు. అది కూడా చాలా రోజులు ఆక్టివ్ గా లేదు. గత నెల, రెండు నెలల నుంచి ఆక్టివ్ అయ్యారు. అయితే, ప్రతిపక్షాలు అన్నీ సిబిఐకి ఇవ్వండి, మీరే కదా గతంలో కోరారు అంటే, ఆ విషయం పై ప్రభుత్వం మాట్లాడటం లేదు. మరో పక్క సిట్ కావాలని ప్రత్యర్దులని ఇబ్బంది పెడుతుంది, ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలి అంటూ, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. ప్రభుత్వం తమని కావాలని టార్గెట్ చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో కాకుండా విచారణ జరపాలని కోరారు.

court 08012020 3

దీంతో ఈ కేసు హైకోర్ట్ లో విచారణ జరుగుతుంది. ఈ రోజు జరిగిన విచారణలో, జగన్ గారి ప్రభుత్వం, ఈ కేసుని, సిబిఐకి బదిలీ చెయ్యాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించారు. ఇప్పటికే ప్రభుత్వం, సిట్ విచారాణకు ఆదేశాలు ఇచ్చిందని, ఈ విచారణ కూడా చివరకు వచ్చిందని, అందుకే సిబిఐ విచారణ అవసరం లేదని వాదనలు వినిపించారు. అడ్వకేట్ జనరల్ కోర్టుకు ఈ విషయం తెలిపారు. దీని పై వాదనలు విన్న హైకోర్ట్, కేసుని ఈ నెల 20కి వాయిదా వేసింది. తదుపరి విచారణ ముగిసేవరకు, తుది నివేదికను స్థానిక కోర్టులో దాఖలు చేయొద్దని సిట్ కు హైకోర్ట్ ఆదేశించింది. అలాగే ఈ కేసుకు సంబంధించి వి-వేకా భార్య వేసిన అనుబంధ పిటిషన్‌పై ఈ నెల 19లోగా కౌంటర్లు దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్ ని హైకోర్టు ఆదేశించింది.

జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, కొంత మంది అప్పటి మంత్రులు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్న సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డితో పాటుగా, విజయసాయి రెడ్డి ఏ1, ఏ2గా అన్ని చార్జ్ షీట్లలో ఉంటే, కొంత మంది మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు వివధ చార్జ్ షీట్లలో ఉన్నారు. 2012 నుంచి జరుగుతున్న ఈ కేసులో, కొంత మంది ఇప్పటికీ విచారణకు హాజరు అవుతూ ఉండగా, మరి కొంత మందికి కోర్ట్ లలో ఊరట లభించింది. మరి కొంత మంది, తమను విచారణ నుంచి తప్పించాలి అంటూ, కోర్ట్ ల్లో పిటీషన్లు వేసారు. తమకు ఈ కేసులో సంబంధం లేదని కొంత మంది, మా పాత్ర పరిమితం అని కొంత మంది, ఇలా కోర్ట్ ల్లో కేసులు వేసారు. అయితే చాలా కొద్ది మందికి మాత్రమే కోర్ట్ ల్లో ఊరట లభించగా, చాలా మందికి కేసుల్లో భాగస్వామ్యం ఉండటంతో, వారు కోర్ట్ విచారణకు హాజరు కావల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు మరో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, తనని జగన్ అక్రమ ఆస్తుల కేసు నుంచి తప్పించాలి అంటూ, కోర్ట్ లో పిటీషన్ వెయ్యగా, ఆయనకు ఊరట లభించలేదు.

rajagopal 08012020 2

జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, గాలి జనర్ధర్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో కూడా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, గనులశాఖ మాజీ డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌, తనను ఈ కేసుల నుంచి తప్పించాలని, తన పాత్ర ఈ కేసుల్లో లేదు అంటూ, సుప్రీం కోర్ట్ లో పిటీషన్ వెయ్యగా, ఆయనకు సుప్రీం కోర్ట్ లో ఊరట లభించలేదు. గనులశాఖ మాజీ డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌, సుప్రీం కోర్ట్ లో వేసిన పిటీషన్ పై, న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. అయితే ఈ సందర్భంలో వీడీ రాజగోపాల్‌, తనను జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు, గాలి జనర్ధర్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసు నుంచి తప్పించాలని, తనకు ఈ కేసులతో సంబంధం లేదని, చెప్తూ, సుప్రీం కోర్ట్ కు విన్నవించుకున్నారు.

rajagopal 08012020 3

అయితే సీబీఐ తరుపు న్యాయవాది ఆకాంక్ష కౌల్‌ కలగ చేసుకుని, తమకు కౌంటర్ దాఖలు చేసే అవకాసం ఇవ్వాలని కోరగా, సిబిఐ విజ్ఞప్తి మేరకు ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేయడానికి సుప్రీం కోర్ట్ 4వారాల సమయం ఇచ్చింది. అయితే ప్రధానంగా, రాజసేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, రాజగోపాల్‌ గనుల శాఖ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు రఘురాం సిమెంట్స్‌తో పాటు ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ, బళ్లారి ఐరన్‌ ఓర్‌ సంస్థలకు గనుల కేటాయింపు విషయంలో రూల్స్ ని అతిక్రమించారన్నది ఆయన పై ఆరోపణ. ఈ అభియోగాలతో జగన్‌ పై నమోదైన అక్రమ ఆస్తుల కేసులో రాజగోపాల్ ని కూడా సీబీఐ నిందితునిగా చేర్చింది. అయితే, తనను ఈ కేసు నుంచి తప్పించాలని ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, హైకోర్టు అంగీకరించలేదు. దీంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు.

మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతుంది. అయితే రాష్ట్రంలో ఎక్కడ సంక్రాంతి శోభ అయితే లేదు. సంక్రాంతి కానుకలు లేవు. ఇసుక లేక పనులు లేక, మొన్నటి దాక ఇబ్బందులు పడ్డారు. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో మరో సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదే అమరావతి రాజధాని తరలింపు. దీంతో అమరావతిలో రైతులు గత 22 రోజులుగా నిరసనల్లో ఉన్నారు. పనులు అన్నీ మానుకుని, ఇంట్లో ఆడవాళ్ళతో సహా రోడ్డున పడ్డారు. వారికి పండుగ లేదు, పబ్బం లేదు. జీవితాలు నాశనం అవుతున్నాయనే ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం మాత్రం, ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో వారు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు 10 మంది గుండె ఆగి చనిపోయారు. మొన్న జనవరి ఒకటిన కూడా వారి జీవితాల్లో సంతోషం లేదు. అలాగే వైకుంఠ ఏకాదశి రోజున కూడా, వారు రోడ్ల మీదే ఉన్నారు. ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తూ ఉండటంతో, ఇప్పటికే పిండి వంటలు తయారు చేస్తూ పల్లెటూరుల్లో హడావిడి ఉండేది. అవేమి కనిపించటం లేదు.

cbn 08012020 2

అయితే ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, నేను ఎలా పండుగలు చేసుకుంటాను అంటూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అన్నీ బహిష్కరించారు. మొన్న జనవరి ఫస్ట్ రోజున కూడా, అమరావతి ప్రజల మధ్యే గడిపారు. తన సతీమణితో కలిసి, రైతులతో కలిసి ఆందోళనలో పాల్గున్నారు. అయితే ఇప్పుడు సంక్రాంతి పండుగని కూడా జరుపుకోకూడదని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏడాది, నారా, నందమూరి కుటుంబాలు, చంద్రబాబు సొంత ఊరు అయిన, చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం, నారా వారి పల్లెలో సంక్రాంతి పండుగ జరుపుకునేవారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా, ఆయన మూడు రోజులు అక్కడ గడిపేవారు. అయితే ఈ సారి మాత్రం, చంద్రబాబు పండుగకు దూరంగా ఉంటున్నారు.

cbn 08012020 3

అమరావతిలో ప్రజలు ఆందోళనలతో రోడ్డు మీద ఉంటే, తాను పండుగలు ఎలా జరుపుకుంటానని, అందుకే దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇలా ఉంటే, చంద్రబాబు కూడా ప్రజలకు ఒక పిలుపు ఇచ్చారు. సంక్రాంతి పండుగకు సొంత ఉళ్ళకు వచ్చే అందరూ, అమరావతి ఆవశ్యకత పై, అక్కడ ప్రజలకు తెలిసే విధంగా చెప్పాలని, అలాగే భోగి పండుగ రోజున, జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలు తగల బెట్టాలని, ఆ ప్రతులు, భోగి మంటల్లో వెయ్యాలని పిలుపిచ్చారు. అలాగే అందరూ అమరావతి వచ్చి, అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీ భావం తెలపాలని కోరారు. అమరావతిని రక్షించుకోవాలని, మనకంటూ ఒక మంచి రాజధాని కట్టాలని ప్లాన్ చేస్తే, వీళ్ళు అమరావతిని ఇలా చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

Advertisements

Latest Articles

Most Read