తెలుగుదేశం పార్టీ పై పన్నిన అతి భారీ కుట్ర బయట పడింది. తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను సీబీఐ కేసులో ఇరికించేందుకు పన్నిన అతి భారీ కుట్ర బయట పడింది. నిన్నటి నుంచి సిబిఐలో జరుగుతున్న పరిణామాలు తెలిసిందే. వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటూ, అరెస్ట్ లు చేసుకుంటున్నారు. ఈ సందర్భంలోని రమేష్ ని సిబిఐ కేసులో అరెస్ట్ చేసే కుట్ర బయట పడింది. సతీష్‌బాబు సానా అనే వ్యక్తి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో రమేష్ పేరు ప్రస్తావించినట్లు ఒక స్టేట్‌మెంట్‌ను సృష్టించారు. ఆ స్టేట్‌మెంట్‌ను సృష్టించిన విచారణ అధికారి అయిన సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్‌ని సీబీఐ అధికారులు ఈ రోజు అరెస్టు చేశారు.

cbi 22102018 2

సెప్టెంబర్ 26న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం సతీష్‌బాబు సానా ఒక వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్ తప్పుడు సాక్ష్యాలను సృష్టించారు. అయితే ఆ రోజు సతీష్ అసలు ఢిల్లీలో లేరని విచారణలో వెల్లడైంది. దాంతో ఈ ఘటన పై పూర్తి స్థాయిలో అధికారులు విచారణ జరిపి దేవేందర్‌ను అరెస్ట్ చేశారు. వాస్తవానికి విచారణలో సతీష్ సానా ఇచ్చిన వాంగ్మూలానికి, దేవేందర్‌కుమార్ నమోదు చేసిన వాంగ్మూలానికి సంబంధం లేదని అధికారులు తేల్చారు. సీఎం రమేష్ పేరును సతీష్ సానా చెప్పకపోయినా డీఎస్పీ దేవేందర్ కుమార్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు గుర్తించారు.

cbi 22102018 3

సతీష్ సానా ఢిల్లీలో ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదని, సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్ తప్పుడు స్టేట్‌మెంట్‌ను సృష్టించారని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఇదంతా సియం రమేష్ ని ఎదో కేసులో ఇరికించే కుట్రలో భాగంగా, పై నుంచి వచ్చిన ఆదేశాలు మేరకు సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్‌, తప్పుడు స్టేట్మెంట్ సృష్టించారు. ఇలా ఎందుకు చేసారు, ఎవరి ఒత్తిడి మేరకు చేసారు అనే విషయం విచారణలో తేలనుంది. ఇటీవల సీఎం రమేష్‌ ఇంట్లో ఐటీ సోదాలు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటి సియం రమేష్ ఇళ్ళ పై దాడులు చేసి, హడావిడి చేసి, ఉత్తి చేతులతో ఊపుకుంటూ వెళ్లారు. ఇప్పుడు ఈ కుట్ర బయటపడటంతో, ఇది ఏ టర్న్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

సోమవారాన్ని పోలవారంగా మార్చి ప్రతివారమూ సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు ఈ సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా స్పిల్‌వే, లోయర్‌ కాపర్‌ డ్యామ్‌ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘‘పోలవరం ప్రాజెక్టు పనులు 59.6శాతం పూర్తి. ఈనెల 24 నాటికి లోయర్‌ కాపర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌంటింగ్‌ పనులు పూర్తి. డిసెంబర్‌ నుంచి గేట్లు ఏర్పాటు చేసే పనులు ప్రారంభిస్తాం. రూ.9870కోట్లకు సంబంధించి కేంద్రానికి నివేదికలు ఇచ్చాం. కృష్ణా డెల్టాకు ఈ సీజన్‌లో 73 టీఎంసీల నీరు మళ్లించాం. వచ్చే మే నాటికి కుడి, ఎడమ కాల్వల ద్వారా నీరందిస్తాం’’ అని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో దిగువ కాఫర్‌ డ్యాంకు సంబంధించి గతవారానికి మిగిలిన 154 మీటర్ల జెట్‌ గ్రౌటింగ్‌ పనులను నిర్మాణ సంస్థ యుద్ధప్రాతిపదికన చేపట్టింది.

polavaram 22102018 2

సుమారు 1620 మీటర్ల మేరకు జెట్‌ గ్రౌటింగ్‌ పూర్తి చేయాలి. కానీ మధ్యలో పనుల్లో జాప్యం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చూపరాదన్న ప్రభుత్వ ఆదేశంతో... జెట్‌ గ్రౌటింగ్‌ను సోమవారానికి పూర్తి చేయనున్నారు. ఇప్పటిదాకా ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో 59.32శాతం పనులు పూర్తి అయ్యాయి. వాస్తవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా నాటికి 48వ పిల్లర్‌ వద్ద ప్రయోగాత్మకంగా ఒక గేటును అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ సాధ్యంకాలేదు. ఒకటికి రెండుసార్లు సమీక్షించి వెంటనే నిర్మాణ పనిని పూర్తి చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే డిజైన్ల అనుమతిలో ఉన్న ఆటంకాలు తొలగకపోవడం, ప్రతిదానికీ సీడబ్ల్యూసీ కొర్రీలు పెట్టడంతో పోలవరంపై కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని సీఎం చంద్రబాబు ఇటీవల ఆరోపించారు.

polavaram 22102018 3

దీనికి తగ్గట్టుగానే కొన్ని పనుల విషయంలో పురోగతి కనిపించడంలేదు. మెయిన్‌ డ్యాం 45.80% పూర్తికాగా స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌, అప్రోచ్‌ చానల్‌, పైలెట్‌ చానల్‌లలో 79% పనులు పూర్తయ్యాయి. రేడియల్‌ గేట్ల విషయంలో 61.85% పురోగతి నమోదు చేయగా.. డయాఫ్రమ్‌ వాల్‌ వందశాతం, కాంక్రీట్‌ 56.6%, కుడికాలువ 90%, ఎడమకాల్వ 64.22% పనులు పూర్తయ్యాయి. నదుల అనుసంధానం ద్వారా పవిత్ర సంగమానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు. నీటి భద్రత అనేది ప్రభుత్వ విధానమని, పట్టిసీమ రాకపోతే కృష్ణా డెల్టా ఎండిపోయేదన్నారు.

అమరావతికి రుణం ఇచ్చే విషయంలో వైసీపీ పెడుతున్న కొర్రీలు అన్నీ ఇన్నీ కావు. వరుస పెట్టి ప్రపంచ బ్యాంక్ కు రుణం ఇవ్వద్దు అంటూ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై పలు మార్లు వాళ్ళు వచ్చి ఇక్కడ పరిస్థితి చూడటం, మరోసారి ఎవరో ఒకరు లేఖలు రాయటం, మళ్ళీ వాళ్ళు రావటం, నిబంధనలు అడ్డుగా పెట్టి వైసీపీ ఇలా రెచ్చిపోతుంది. దీంతో, ప్రపంచ బ్యాంక్‌ బృందం మరోసారి ఇక్కడికి రాబోతోంది. అమరావతిలోని కొన్ని ప్రాధాన్య రహదారులు, వరద నియంత్రణ ప్రాజెక్టులకు సుమారు రూ.7,000 కోట్ల రుణ సహాయం అందజేయాలన్న ఏపీసీఆర్డీయే అభ్యర్థన దరిమిలా ఇప్పటికే పలుసార్లు ఈ బ్యాంక్‌ ప్రతినిధులు రాజధానిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఇదే కోవలో ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అంటే 4 రోజులపాటు అమరావతిలో గడపనున్న ప్రపంచ బ్యాంక్‌ బృంద సభ్యులు ఏపీసీఆర్డీయే ఉన్నతాధికారులతో చర్చలు జరపడంతోపాటు క్షేత్ర పరిశీలన కూడా చేయనున్నారని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠాతోనూ వారు భేటీ అయ్యే అవకాశముంది.

worldbank 22102018 2

కాగా.. తాజా బృందంలో సుమారు 20 మంది సభ్యులు ఉండబోతున్నట్లు సమాచారం. గతంలో ఇక్కడికి వచ్చిన బృందాల్లో సభ్యుల సంఖ్య ఇంచుమించుగా 10కి అటూఇటూగా ఉండేది. ఈసారి వీరి సంఖ్య అధికం కావడానికి తాము రుణం అందజేయాలని భావిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాలనూ మరింత కూలంకషంగా పరిశీలించాలని ప్రపంచ బ్యాంక్‌ భావిస్తుండడమే కారణమని సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంక్‌ బృంద సభ్యులు సీఆర్డీయే రుణం కోరిన ప్రాజెక్టుల వల్ల ప్రభావితులవబోయే వివిధ వర్గాలకు కల్పిస్తున్న పునరావాస, సహాయక చర్యలు, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనా మార్గాలతోపాటు ఆయా ప్రాజెక్టుల పరిసరాల్లోని పర్యావరణంపై అవి చూపబోయే ప్రభావం వంటి అంశాలను పరిశీలిస్తారని తెలిసింది.

worldbank 22102018 3

ఇదిలా ఉండగా.. ప్రపంచ బ్యాంక్‌ బృందాలు ఇప్పటికే పలు పర్యాయాలు అమరావతిలో పర్యటించడం, ఏపీసీఆర్డీయే ఉన్నతాధికారులు సైతం అమెరికాలోని ఆ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయానికి వెళ్లి, దాని ఉన్నతాధికారులతో చర్చలు జరపడం వంటివి జరిగినప్పటికీ రాజధాని ప్రాజెక్టులపై అది రుణమిచ్చే విషయంపై ఇంతవరకూ స్పష్టమైన ప్రకటన రాలేదు. తాము అడిగిన రుణమిచ్చేందుకు ప్రపంచ బ్యాంక్‌ సూత్రప్రాయంగా అంగీకరించిందని, నేడో రేపో సదరు మొత్తం అందడం ఖాయమని సీఆర్డీయే అధికారులు చెప్పడమే తప్ప అటువైపు నుంచి మాత్రం ఆ దిశగా నిర్దిష్ట ప్రకటనేమీ వెలువడడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం నుంచి ఇంకొకసారి అమరావతి సందర్శనకు రాబోతున్న ప్రపంచ బ్యాంక్‌ బృందం పర్యటన పూర్తయిన తర్వాతైనా ఈ రుణంపై స్పష్టమైన ప్రకటన వస్తుందో లేక ఎడతెరిపి అన్నదే లేనట్లుగా సాగుతున్న సుదీర్ఘ పరిశీలనా ప్రక్రియ మరి కొంతకాలం కొనసాగుతుందో అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

 

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 11వ గ్లోబల్‌ అగ్రికల్చరల్‌ లీడర్‌షిప్‌ అవార్డును అందుకోనున్నారు. బుధవారం, అక్టోబర్ 24న ఢిల్లీలో జరిగే 11వ అంతర్జాతీయ వ్యవసాయ నాయకత్వ సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ అవార్డును ఆయనకు అందజేస్తారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌. స్వామినాథన్‌, కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చాన్సలర్‌ ఆర్బీ సింగ్‌, నాబార్డ్‌ చైర్మన్‌ హెచ్‌కే బన్వాలా తదితరులతో కూడిన కమిటీ చంద్రబాబును నాయకత్వ పురస్కారానికి ఎంపిక చేసింది. కొద్ది రోజుల క్రితం ఈ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.

gvl 22102018 2

వ్యవసాయం, దాని అనుబంధ రంగాల సమస్యలను పరిష్కరించి వినూత్న విధాన నిర్ణయాలను ప్రకటించడం ద్వారా వ్యవసాయదారుల జీవితాల్లో చెప్పుకోదగిన మార్పును తీసుకొచ్చినందుకు ఆయనకు ఈ అవార్డును ఇవ్వనున్నట్లు సదస్సు నిర్వాహకులు తెలిపారు. కాగా.. సేంద్రియ వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలు ప్రవేశపెట్టినందుకు నాయకత్వ పురస్కారాన్ని ఏపీకి చెందిన రైతు గద్దె సతీశ్‌బాబును ఎంపిక చేశారు. హైదరాబాద్‌కు చెందిన నాగార్జున ఆగ్రో కెమికల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. వ్యవసాయ, వ్యాపార పురస్కారానికి ఎంపికైంది.

 

gvl 22102018 3

ఇది ఇలా ఉంటే, ఎప్పుడు రాష్ట్రానికి, చంద్రబాబుకి ఏదన్నా మంచి పని చేసి ప్రచారం వస్తుందని తెలిస్తే చాలు, ఇటు పవన్ కళ్యాణ్ కాని, అక్కడ నుంచి జీవీఎల్ కాని రంగంలోకి దిగుతారు. జీవీఎల్ అయితే ఏ మాత్రం మొహమాటం కూడా లేకుండా, తప్పుడు ప్రచారం చేస్తూ, చంద్రబాబు పై విష ప్రచారం చేస్తారు. ఉదాహరణకు చంద్రబాబు ఐక్యరాజ్య సమితి వెళ్ళే సమయంలో, ఆహ్వానం అందకుండా కొనుక్కుని వెళ్తున్నారని ఒకసారి, అసలు ఆహ్వానం పంపించిన ఐక్యరాజ్యసమితి డైరెక్టర్ దొంగోడు అని ఒకసారి ప్రచారం చేస్తూ, ఆ ఎపిసోడ్ మొత్తం రక్తి కట్టించాడు. మరి ఈ సారి ఏకంగా, వాళ్ళ నాయకుడు, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అవార్డు ఇస్తున్నారు, మరి జీవీఎల్ ఏమి చేస్తారో.

Advertisements

Latest Articles

Most Read