విశాఖ నగరం పై టీమిండియా కెప్టైన్ విరాట్‌ కోహ్లి ట్వీట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య బుధవారం విశాఖపట్నం వేదికగా రెండో వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారమే ఇరు జట్లు విశాఖకు చేరుకున్నాయి. ఈ నేపధ్యంలో మంగళవారం తాను బస చేసిన హోటల్‌ నుంచి కోహ్లి బీచ్ రోడ్ కనబడేలా ఫోటో తీసుకుని దాన్ని ట్వీట్‌ చేస్తూ.. 'అద్భుతమైన ప్రదేశం. ప్రియమైన విశాఖకు వచ్చాను' అంటూ క్యాప్షన్‌ పెట్టాడు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. విశాఖపట్నం, దేశం, ప్రపంచం ప్రేమించే గమ్యస్థానం అవుతుంది. విశాఖ వన్డే సందర్భంగా కోహ్లి సేనకు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌ చేశారు.

cbn tweet 24102018 1

సరిగ్గా పది నెలల తర్వాత విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌తో స్థానికంగా సందడి మొదలైంది. ఏసీఏ-వీడీసీఏ మైదానంలో భారత్‌ ఏడు మ్యాచ్‌లాడగా ఆరింట్లో నెగ్గింది. 2013లో ఎదురైన ఏకైక ఓటమి విండీస్ పైనే కావడం గమనార్హం. ఈ మైదానంలో టాస్‌ ఓడిన జట్టు ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్‌ను కూడా గెలవలేదు. రాత్రి మంచు ప్రభావం ఉండడంతో టాస్‌ నెగ్గిన జట్టు ఫీల్డింగ్‌ తీసుకునే చాన్స్‌ ఉంది. ఈ పిచ్‌పై మరోసారి పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే వికెట్‌పై పచ్చిక లేకపోవడంతో స్పిన్నర్లూ కీలకమే.. ఇక్కడ అధిక వేడితో పాటు తేమ వాతావరణం ఉన్నా మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.

cbn tweet 24102018 1

2011లో విండీస్‌ జట్టు రెండోసారి వై.ఎస్‌.ఆర్‌. ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆడేందుకు వచ్చింది. ఆ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ చెలరేగి ఆడి 117 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇదే స్టేడియంలో 2010 అక్టోబరు 20న జరిగిన మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై కోహ్లీ 118 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 2016 అక్టోబరు 29న భారత్‌- న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 65 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 190 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. విశాఖ స్టేడియం కోహ్లీకి అచ్చొచ్చిన మైదానం. బుధవారం నాటి మ్యాచ్‌లో కూడా కోహ్లీ శతకం కొడతాడనే అభిమానులు ఆశిస్తున్నారు.

దేశంలో అసలు ఏమి జరుగుతుంది ? పరిపాలన ఉందా , లేదా ? ఒక్కో వ్యవస్థని సర్వనాసనం చేస్తున్నారు. పది నెలలు క్రితం, ఏకంగా సుప్రీం కోర్ట్ జడ్జిలు అందరూ, చీఫ్ జుస్తిస్ పై తిరగబడ్డారు. ఇప్పుడు సిబిఐ టాప్ బాస్ ని తప్పించటానికి, రెండో స్థానంలో ఉన్న గుజరాత్ కు చెందిన వ్యక్తి, తప్పుడు వాంగ్మూలం సృష్టించాడు. అది కాస్త బయట పడింది. నిన్న జరిగిన అనూహ్య పరిణామాల మధ్య, గత అర్ధరాత్రి 2 గంటల తరువాత సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా మన్నె నాగేశ్వరరావుని మోడీ నియమించారు. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా ను తొలగించారు. రాకేష్ ఆస్థానా అడ్డంగా దొరికిపోయాడు కాబట్టి అతని పై ఆక్షన్ తీసుకోవటంలో అర్ధం ఉంది. మరి, అలోక్ వర్మని ఎందుకు తప్పించారు ? ఆయన స్థానంలో వచ్చిన మన్నె నాగేశ్వరరావు పై అనేక ఆరోపణలు అన్నయనే వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

modi 24102084

ఇది ఇలా ఉంటే చార్జ్ తీసుకున్న మన్నె నాగేశ్వరరావు, వెంటనే సిబిఐ హెడ్ ఆఫీస్ సీజ్ చేసారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, సిబిఐ ఆఫీస్ అవినీతి ఆరోపణలతో సీజ్ అయ్యింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా, సస్పెన్షన్ కు గురైన దేవేందర్ కార్యాలయాలు ఉన్న 10, 11 అంతస్తుల్లో తనిఖీలు చేపట్టిన నాగేశ్వరరావు బృందం వారి చాంబర్లను సీజ్ చేసింది. అధీకృత ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులు ఉన్నావారు తప్ప, మిగతా వారు ఎవరూ సీబీఐ ఆఫీసులోనికి రాకుండా బందోబస్తును ఏర్పాటు చేయించిన నాగేశ్వరరావు, దగ్గరుండి తనిఖీలను జరిపించారు. అధికారులు వాడిన ఎలక్ట్రానిక్ పరికరాలు, కంప్యూటర్లను నాగేశ్వరరావు టీమ్ తమ అధీనంలోకి తీసుకుని, వాటిల్లో ఉన్న సమాచారాన్ని క్రోఢీకరించే పనిలో నిమగ్నమైంది.

modi 24102084

అయితే రోలు వెళ్లి మద్దెలుకు మోర పెట్టుకున్నట్టు, అన్ని అవినీతి ఆరోపణలు విచారణ చేసే, సిబిఐ మీద అవినీతి ఆరోపణలు వస్తుంటే, ఎవరికి చెప్పుకోవాలి ? ఎప్పుడన్నా విన్నమా ఇలాంటి వార్త. దేశపు అత్యున్నత నేర పరిశోధక సంస్థ అధిపతినీ అర్ధాంతరంగా సెలవు పంపించటం సి.బి.ఐ హెడ్ క్వార్టర్స్ ని సీల్ చేయడం. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కూడా ఎప్పుడు ఇటువంటి మనం వినలేదు చూడలేదు. కాంగ్రెస్ కంటే భిన్నంగా పరి పాలన అందిస్తాడని మోడీని ఎన్నుకుంటే అంత కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు ఈయన హయాంలో అత్యున్నత వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. వాటి యొక్క విలువ నమ్మకం రెండు కోల్పోయాయి. మోడీ షా హయాంలో అత్యున్నత రాజ్యాంగ సంస్థలన్నీ వారి జేబు సంస్థ లాగా మార్చేశారు.

 

 

విరాట్ కోహ్లి, మన ఇండియా క్రికెట్ టీంలో సచిన్ తరువాత అంత పేరు తెచ్చుకున్న క్రికెటర్. విరాట్ కోహ్లి అంటే, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే సుపరిచితుడు. విరాట్ కోహ్లి అంటే ఒక క్రేజ్. విరాట్ కోహ్లి నుంచి కంప్లిమేంట్ వచ్చింది అంటే అదో కిక్కు. అలాంటి విరాట్ కోహ్లి మన విశాఖపట్నం పై ప్రశంసలు కురిపిస్తూ, ట్వీట్ చేసారు. విరాట్ కోహ్లి తాజాగా వెస్టిండీస్‌ రెండో వన్డే కోసం, విశాఖపట్నం వచ్చాడు. వైజాగ్ చూసి ఫిదా అయిపోయాడు. "What a stunning place.Love coming to Vizag. " అంటూ ట్వీట్ చేసాడు కోహ్లి. హోటల్ రూమ్ నుంచి, బీచ్ రోడ్ కనిపించేలా ఫోటో తీసి, ట్వీట్ చేసాడు. ఇంతకు ముందు కూడా అనేక మంది, వైజాగ్ పరిశుభ్రత చూసి, ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

kohli 23102018 2

ఎక్కడో ఇండోర్‌లో జరగాల్సిన భారత్‌-వెస్టిండీస్‌ రెండో వన్డే.. అనుకోని విధంగా విశాఖపట్నానికి తరలి వచ్చింది. ఇక్కడీ వీసీఏ-వీడీసీఏ స్టేడియం బుధవారం వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. దేశంలో భారత క్రికెట్‌ జట్టుకు బాగా కలిసొచ్చిన మైదానాల్లో ఇది ఒకటి. టీమ్‌ఇండియా ఆటగాళ్లందరూ విశాఖ నగరాన్ని, ఇక్కడి మైదానాన్ని చాలా ఇష్టపడతారు. ముఖ్యంగా మహేంద్రసింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ లాంటి స్టార్లకు ఈ మైదానంలో మధురానుభూతులున్నాయి. ధోని ఏంటో ప్రపంచానికి తెలిసింది 2005లో ఇక్కడ పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తోనే. ఆ మ్యాచ్‌లో 148 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో ధోని పేరు మార్మోగిపోయింది.

kohli 23102018 3

అప్పటి నుంచి ధోనికి విశాఖతో బంధం ఏర్పడింది. ఎప్పుడు ఇక్కడ మ్యాచ్‌ ఆడేందుకు వచ్చినా.. ఈ నగరం గురించి, ఇక్కడి మైదానం గురించి ప్రత్యేకంగా మాట్లాడతాడు మహి. ఇక ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విశాఖలో బరిలోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. 65, 99, 118, 117.. ఇవీ ఇక్కడ కోహ్లి స్కోర్లు. రెండుసార్లు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులందుకున్నాడు. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఒక మ్యాచ్‌లో 70 పరుగులు చేస్తే.. ఇంకోసారి 90 పరుగులతో అజేయంగా నిలిచాడు. గత ఏడాది చివరగా ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు అతడి నాయకత్వంలోనే బరిలోకి దిగి శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. ధావన్‌ సైతం ఇక్కడ సెంచరీ కొట్టాడు.

నిన్న పవన్ కళ్యాణ్ గవర్నర్ ని కలిసారు. గవర్నర్ జోక్యం చేసుకుని, చంద్రబాబుని పని చేసేలా చెయ్యాలంట. అప్పుడే శ్రీకాకుళంలో తుఫాను బాధితులకు సహాయం అందుతుంది అంట. తను శ్రీకాకుళం పర్యటనకు వెళ్లి, ఒక పుస్తకంలో రాసిన నోట్స్ అంతా, నివేదిక లాగా తయారు చేసి, గవర్నర్ కు ఇచ్చాడు పవన్. సోషల్ మీడియాలో వైరల్ అయిన నోట్స్ లో, బిర్యాని, పార్సెల్, లక్ష అని ఉంది కదా, మరి ఏమి నివేదిక ఇచ్చాడు అంటే, మనకు తెలియదు మరి, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, పవన్ తాను చూసింది, రాసుకుంది, నివేదిక ఇచ్చాడు. చంద్రబాబు పూర్తిగా ఫెయిల్ అయ్యారని, గవర్నర్ జోక్యం చేసుకోకపోతే, అసలు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన జరగదు అని కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు అని పవన్ బయటకు వచ్చి మీడియాతో చెప్పారు.

pk 24102018 2

సరే ప్రతిపక్షం అన్న తరువాత ఇవన్నీ కామన్, వాళ్ళు వీళ్ళని తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు. ఎంత చేసినా చెయ్యలేదు అని చెప్పటమే ప్రతిపక్ష నైజం, మన రాష్ట్రంలో ఈ పాళ్ళు కొంచెం ఎక్కువ. అయితే నేను వీరుడిని, ధీరుడిని, ఎవరికీ భయపడను, తాట తీస్తా, తొక్క తీస్తా, కాళ్ళు విరగ్గోడతా, తుపాకీ ఉంది, నక్సల్స్ ఉన్నారు, అంటూ గాల్లో పిడిగుద్దులు గుద్డుతూ ఊగిపోయే పవన్ కళ్యాణ్, తెలంగాణా విషయం వస్తే మాత్రం, ఎందుకో కాని, తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. ఒక పక్కన ఎన్నికలు జరుగుతున్నా, ఒక్క మాట కూడా తాను ఉండే తెలంగాణా రాష్ట్రం గురించి మాట్లాడటం లేదు. నిన్న చంద్రబాబు గురించి అన్నీ తిట్లు తిట్టిన తరువాత, విలేకరులు అడిగిన రెండు ప్రశ్నలకు ఎంతో ధైర్యంగా సమాధానం దాటవేసాడు పవన్. అవును అండి, దీంట్లో వెటకారం లేదు, పవన్ ఫాన్స్ ఇలాగే చెప్పుకుంటున్నారు.

pk 24102018 3

ఒక విలేఖరి, సార్ శ్రీకాకుళం గురించి, ఇంత బాధపడుతున్నారు, అదే కొండగట్టు ప్రమాదంలో 62 మంది చనిపోయారు, దాని గురించి ఎందుకు ఇంతలా పట్టించుకోలేదు అని ప్రశ్న అడిగింది. పవన్ ఒకసారి ఏంటి వినిపించటం లేదు అంటూ ఉండగానే, పక్క నుంచి నాదెండ్ల మనోహర్, అటు వైపు ఎదో పంచాయతీ ఎన్నికల గురించి ప్రశ్న ఆడుతున్నారు అంటూ చెప్పగానే, పవన్ అటు తిరిగిపోయాడు. మళ్ళీ ఇంకో విలేఖరి, సార్ తెలంగాణా ఎన్నికలలో పోటీ గురించి చెప్పండి అంటే, దానికి ఇంకా టైం చాలా ఉంది, అంటూ వాచ్ చూపించి, నవ్వుతూ ప్రెస్ మీట్ ముగించి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి, చూస్తుంటే పవన్ ఎజెండా ఏంటో ఇట్టే అర్ధమైపోతుంది. https://youtu.be/AYIAwgCyo9Y , 4:58 నుంచి చూడండి

Advertisements

Latest Articles

Most Read