ఒకరికి ఒక ఓటే ఉండాలన్నది రూలు! కానీ.. ఘనత వహించిన మన ఎన్నికల అధికారులు.. కొందరు ఓటర్ల పేరు మీద ఒకటికి మించిన ఓట్లు ఇచ్చేశారు!! వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద కుమార్తె హర్షిణిరెడ్డి పేరుతో రెండు ఓట్లు.. ఆయన సోదరి షర్మిల పేరుతో రెండు ఓట్లు ఉండగా.. సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ పేరుతో మూడు ఓట్లు ఉన్నాయి!! విశాఖలో ఒక ఓటరు పేరుతో అయితే ఏకంగా తొమ్మిది ఓట్లున్నాయి! ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఒకటికి మించిన ఓట్లున్న ఓటర్లు చాలా మందే కనపడుతున్నారు. జగన్‌ ఇలాకా పులివెందులలో ఒకటికి మించిన ఓట్లున్న ఓటర్లు చాలా మందే కనపడుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. జగన్‌ కుటుంబసభ్యుల్లోనే ఇద్దరికి రెండేసి చొప్పున ఓట్లు ఉండడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఆయన కుమార్తె హర్షిణి రెడ్డి యడుగూరి సందింటి పేరుతో వేర్వేరు ఓటర్‌ ఐడీ నంబర్లతో రెండు ఓట్లున్నాయి. ఈ రెండూ ఇటీవల కాలంలో ఎన్నికల కమిషన్‌ అప్‌డేట్‌ చేసిన జాబితాలోనివే.

మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి పట్టణంలో నివాసం ఉంటున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది పేరు మీద 3 చోట్ల ఓట్లు నమోదయ్యాయి. ఈసీ ఇటీవల విడుదల చేసిన తాజా సవరణ 2019, చేర్పులు - తొలగింపులతో కూడిన అనుబంధం -2 ఓటరు లిస్టులో క్రమసంఖ్యలు 1397, 1398, 1399ల్లో వరుసగా ఆయన ఓట్లే ఉన్నాయి. మరోవైపు, విశాఖ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఎన్నికల అధికారులు ఇటీవల కొత్త ఓటర్ల జాబితాను పరిశీలించగా.. సీరియల్‌ నంబర్‌ 703 నుంచి 711 వరకూ ఆరిలోవకు చెందిన తాటికూరి మణికొండ అనే యువకుడి పేరు, ఫొటో ఉన్నట్టు బయటపడడంతో ఆశ్చర్యపోయారు. విశాఖ జిల్లాలో ఒకటికి మించిన ఓట్లున్న ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ఇవే కాదు.. ఒక పోలింగ్‌ బూత్‌ పరిధిలోనివారికి వేరే పోలింగ్‌బూత్‌ పరిధిలో ఓట్లు ఉండటం, ఒక ఇంట్లో కొన్ని ఓట్లు ఉంటే.. మరికొందరివి లేకపోవడం వంటి అవకతవకలు చాలానే జరిగాయి.

ఓటరు నమోదుకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించకపోవడం వల్లనే ఇన్ని తప్పులు దొర్లాయని సమాచారం. అయితే, ఎన్ని పొరపాట్లు జరిగినా.. తుది ఓటరు లిస్టు విడుదల చేసేటప్పుడు మార్పులు, చేర్పులు చూసుకొని ఓటరు లిస్టులు విడుదల చేయాల్సి ఉంది. అలాంటిది సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పేరే ఓటరు జాబితాలో మూడుసార్లు ఉండడం చూస్తుంటే సామాన్యుల విషయంలో ఇంకెన్ని అవకతవకలు జరిగాయోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తాడేపల్లి పట్టణ మున్సిపల్‌ కమిషనర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కె.వి.పద్మావతిని వివరణ కోరగా.. ఓటు కోసం ఎక్కువసార్లు దరఖాస్తు చేయడం వలన ఇలాంటి పొరపాట్లు జరిగాయని, ఎన్నికలు జరిగేనాటికి పోలింగ్‌ కేంద్రానికి మార్పులు చేసిన ఓటరు లిస్టును పంపిస్తామని ఆమె తెలిపారు.

రెండు సంవత్సరాల క్రితం, మన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాల్గున్న చివరి అసెంబ్లీ సమావేశాల్లో ఏమి చెప్పారో గుర్తుందా ? మేము అసెంబ్లీలో అగ్లీ సీన్స్ రిపీట్ చేస్తాం అని. అప్పటి నుంచి అసెంబ్లీకి రావటం అయితే మానేశారు కాని, అప్పటి నుంచి మాత్రం అగ్లీ సీన్స్ చూపిస్తూనే ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ, ఈ అగ్లీ సీన్స్ రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ‘యథా నేతా... తథా పార్టీ’ అన్నట్లు నోటి దురుసులో వైసీపీ నేతలకు తమ నాయకుడు జగనే ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘వయసుకైనా గౌరవం ఇవ్వాలి’ అనేది మన సంప్రదాయం. కానీ, తన తండ్రి వయసున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్‌ ఎన్నో సందర్భాల్లో కఠినమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబును నడిరోడ్డుపై తుపాకీతో కాల్చినా తప్పులేదు’’ అంటూ నంద్యాల ఉప ఎన్నికల సమయంలో జగన్‌ ఊగిపోయారు. ‘కాల్చి చంపాలి’ అని సాధారణ పౌరుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించినా నేరమే. కానీ, ఏకంగా రాష్ట్ర పాలనా సారథిని ఉద్దేశించే జగన్‌ ఇలా మాట్లాడారు. ఇదే ఎన్నిక సందర్భంగా ‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును గుడ్డలూడదీసి కొట్టాలి’ అని కూడా జగన్‌ దూషించారు. నిజానికి, ఈ వ్యాఖ్యలు వైసీపీకి రాజకీయంగా నష్టం చేశాయి. ‘తండ్రి వయసున్న చంద్రబాబును పట్టుకుని ఇలా తిట్టడమేమిటి’ అని సామాన్య జనం విమర్శించారు. అయినా... వైసీపీ తన వైఖరిని మార్చుకోలేదు.

వైసీపీ జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలూ తరచూ నోరు పారేసుకుంటూ సోషల్‌ మీడియాకు చిక్కుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ అభివృద్ధిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అభివృద్ధి చేయవా? ఏం చంద్రబాబు నాయుడు అమ్మ మొగుడి సొమ్ము గుడివాడకు తెస్తున్నాడా? నేను గుడివాడ వాడిని కాదంటున్నారు. చంద్రబాబు ఎక్కడివాడు? నీ పెళ్లాం ఎక్కడ ఉంటుంది? నీ కోడలు ఎక్కడుంటుంది?’’ అంటూ పరుషంగా మాట్లాడారు. ఏదైనా లక్ష్యాన్ని ఎంచుకుని, దానిని సాధించేందుకు ‘చావో రేవో’ అన్నట్లుగా ప్రయత్నించడం మామూలే. కానీ... వైసీపీ నెల్లూరు పట్టణ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అంతకుమించిన మార్గం ఎంచుకున్నారు. ‘‘మనముం దు ఉన్నది ఒక్కటే! జగనన్న కోసం చంపడమా.. చావడమా! 2019లో రాష్ట్రంలో ఒక్క వైసీపీ జెండా మాత్రమే ఎగరాలి. ఒక్క కనుసైగ జగన్మోహన రెడ్డి చేసిననాడు ఎవ్వరూ మిగల రు’’ అని హెచ్చరించారు.

అసెంబ్లీలో విపక్ష నేతలు ఆందోళనకు దిగడం సహజమే. అయితే... వైసీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టి కేకలు, నోటితో ఊలలు వేస్తూ గందరగోళం సృష్టించారు. నగరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆందోళన నిర్వహించేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యే రోజా ‘ఆ సీఐ ....కొడుకు’’ అని ఇన్‌స్పెక్టర్‌ను తిట్టిపోశారు. తాజాగా వైసీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు... ‘‘పోలీసులు తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తున్నారు. అందరి సమాచారం తీసుకున్నాం. అధికారంలోకి వస్తున్నాం. లెక్క తేలుస్తాం’’ అని హెచ్చరించారు. ఓటు ఎవరికి వేయాలన్నది పౌరుల వ్యక్తిగత ఇష్టం. అది... రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ... ‘మాకు ఓటేయకపోతే’ అని బెదిరించి ఇళ్లు ఖాళీ చేయించడం, దా డులు చేయడం వంటి ఘటనలు ఇప్పుడే చోటు చేసుకుంటున్నాయి. విశాఖలోని గాజువాక నియోజకవర్గంలో ‘మేం జనసేనకే ఓటు వేస్తాం’ అని చెప్పిన నేరానికి స్టీల్‌ప్లాంట్‌ లో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్న వ్యక్తిపైన, ఆయన భార్యపైనా దాడి చేశారు. గర్భిణీ అని కూడా చూడకుండా ఆమె ను కిందికి తోసేశారు. ఇక... సీఎం చంద్రబాబు ప్రాతిని ధ్యం వహిస్తున్న కుప్పంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. వైసీపీకి జైకొట్టకుండా టీడీపీ ప్రచారంలో పాల్గొన్నందుకు వసంతమ్మ అనే మహిళ చేత ఇల్లు ఖాళీ చేయించారు. గుంటూరులో ‘మేం తెలుగుదేశానికే ఓటు వేస్తాం’ అని చెప్పిన వృద్ధ దంపతులను అర్ధరాత్రి అని కూడా చూడకుండా ఇల్లు ఖాళీ చేయించారు.

కోడికత్తి పార్టీ నరేంద్ర మోదీతో, కేసీఆర్‌తో లాలూచీ పడిందని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ‘‘వారు బిస్కెట్లు వేస్తారు. అందుకే, కుక్కలాగా విశ్వాసంగా పడి ఉంటారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న కేసీఆర్‌కు ఎలామద్దతు పలుకుతారు? సిగ్గూ, రోషం ఉంటే కేసీఆర్‌ను జగన్‌ నిలదీయాలి’’ అని సవాల్‌ విసిరారు. మంగళవారం ఆయన చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీమాంధ్ర అభివృద్ధికి కేసీఆర్‌ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ‘‘శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులు తమ నియంత్రణలో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్‌లో రిట్‌ వేసింది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ను మూసివేయాలని డిమాండ్‌ చేస్తోంది. అవన్నీ జరిగితే హంద్రీ నీవా ద్వారా నీళ్లు రాకుండా పోతాయి’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీకి ఇవి చివరి ఎన్నికలు కావాలని, కుట్రదారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

cbn 03042019

‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని జగన్‌ తల్లి ప్రచారం చేస్తున్నారు. అలా అని వారి చెవిలో ఎవరైనా చెప్పారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘అన్ని నేరాలు చేసిన జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన తల్లి కోరుతున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి అని చెల్లి కూడా అడుగుతున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి అని తెలంగాణ నుంచి వచ్చిన ప్రత్యేక దూతలు కోరుతున్నారు. ఇలాంటి నేరస్థుడికి ఒక్క అవకాశం ఇస్తే అది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది’’ అని తెలిపారు. జగన్‌ ఒక సైకో అని, 31 అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. 15 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువతకు ప్రత్యేకంగా పిలుపు ఇస్తున్నానంటూ... ‘జగన్‌ను నమ్మితే జైలుకే! పవన్‌ కళ్యాణ్‌ను నమ్మితే అత్తారింటికే పోతారు. నన్ను నమ్మితే మాత్రం కెరీర్‌ బాగుంటుంది’’ అని హితవు పలికారు.

cbn 03042019

కేసీఆర్‌ బెదిరించి పంపిస్తుండటంతో హైదరాబాదు నుంచి వలస పక్షులు ఏపీకి వస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు. ‘‘ఎవరీ మోహన్‌బాబు? ఎవరీ జయసుధ? తితిలీ, హుద్‌హుద్‌ తుఫాన్‌ వచ్చినపుడు వచ్చారా?’ అని నిలదీశారు. కావాలంటే కేసీఆర్‌కు ఊడిగం చేసుకోవచ్చునని, జన్మభూమికి మాత్రం ద్రోహం చేయవద్దని సూచించారు. వైసీపీకి మోదీ, కేసీఆర్‌ నుంచి డబ్బులు వస్తున్నాయన్నారు. ‘‘ఆ డబ్బుతో వైసీపీ నేతలు తప్పుడు పనులు చేస్తున్నారు. ఓటుకు రెండు వేలు ఇస్తున్నారు. ఇదంతా ఎవడబ్బ సొమ్ము?’’ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో టీవీ షోలు చేసుకునే ఎమ్మెల్యే మనకు అవసరమా అంటూ రోజాను ఉద్దేశించి నగరి సభలో చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ‘‘నోటి దురుసు తప్ప పద్ధతి లేని ఎమ్మెల్యే మనకు అవసరమా? ఆమెతో పాటు ఆ పార్టీ నాయకుడు కూడా అంతే. పద్ధతి లేని నాయకుడు! నన్ను 420 అంటాడా? నన్ను చెప్పుతో కొట్టాలని, నడిరోడ్డులో ఉరి తీయాలని, కాల్చి చంపాలని అంటున్నారు. ఇలాంటి సంస్కారం లేని వ్యక్తులను మీరు రాజకీయాల్లో ఎప్పుడైనా చూశారా!? ఇలాంటి వారికి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేని విధంగా తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరారు.

తనయుల గెలుపు కోసం తండ్రులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. తొలిసారిగా తనయులు ఎన్నికల బరిలో దిగడంతో వారిని గెలిపించుకోవడానికి ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. అనంతపురం పార్లమెంట్‌ స్థానానికి ఎంపీ తనయుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, తాడిపత్రి అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే కుమారుడు జేసీ అశ్మిత్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇరువురు అధికార టీడీపీ తరపున బరిలోకి దిగడంతో వారి గెలుపును తండ్రులు తమ భుజస్కందాలపై వేసుకున్నారు. ఇరువురు అభ్యర్థులు రాజకీయాలకు కొత్తకాకున్నా మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గెలుపే ధ్యేయంగా తండ్రులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. జేసీ బ్రదర్స్‌ తమ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని రంగరించి పావులు కదుపుతున్నారు.

jc 03042019

ఒకవైపు ఎండలు మండుతున్న, అనారోగ్య పరిస్థితులు బాధపెడుతున్న పట్టించుకోకుండా ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ మెజార్టీ వస్తే ఎంపీ అభ్యర్థికి మంచిదన్న అలోచనతో ఎమ్మెల్యే జేసీ ప్రత్యేక దృష్టి నిలిపారు. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి ప్రచారానికి పదును పెంచారు. పోలింగ్‌కు కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒకవైపు టీడీపీ అభ్యర్థి జేసీ అశ్మిత్‌రెడ్డి, మరోవైపు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రచారానికి వెళుతున్నారు. కులాల వారిగా ఓట్లను సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

jc 03042019

మరోవైపు రాత్రి సమయాల్లో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గంలోని పలువురు నాయకులను కలుసుకుని చర్చలు జరుపుతున్నారు. టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. కీలక నాయకులతో రహస్య మంతనాలు జరుపుతూ హామీలను గుప్పిస్తున్నారు. అసంతృప్తులపై కూడా దృష్టి పెడుతున్నారు. చిన్నపాటి మనస్పర్థలు, స్థానిక కారణాల వల్ల అసంతృప్తితో ఉన్న నాయకులను కలుసుకుని బుజ్జగిస్తున్నారు. జేసీ మంత్రాం గం వల్ల నియోజకవర్గంలో పలుచోట్ల అసంతృప్తులు చల్లబడ్డారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారితో సైతం లోపాయికారి మద్దతు కూడగట్టుకునే ప్ర యత్నం చేస్తున్నారన్నా ప్రచారం ఉంది. వీరి కోసం మండలస్థాయి నాయకులు, బంధువులను వలవేస్తున్నారని తెలుస్తోంది.

Advertisements

Latest Articles

Most Read