జగన్ పార్టీలో చేరిన వారం రోజుల లోపే, మోహన్ బాబుకు షాక్ తగిలింది. ఆ పార్టీ వారసత్వం లాగా, కోర్ట్ మొట్టికాయలు మొదలయ్యాయి. వైసీపీ నేత మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టు తీర్పునిచ్చింది. చెక్‌బౌన్స్‌ కేసులో మోహన్‌బాబుకు ఈ శిక్ష పడింది. శిక్షతో పాటు రూ.41.75 లక్షల జరిమానా కూడా కోర్టు విధించినది. 2010లో చెక్‌బౌన్స్‌ కేసు వ్యవహారంలో నిర్మాత వైవీఎస్‌ చౌదరి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్‌, ఏ2గా మంచు మోహన్‌బాబుగా కోర్టు తేల్చింది. రూ. 48 లక్షలు చెక్ బౌన్స్ వ్యవహారంపై చౌదరి కోర్ట్‌కు వెళ్లారు. 2010 సంవత్సరంలో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది. కాగా ఇందుకు సంబంధించి మంచు ఫ్యామిలీ ఇంత వరకూ స్పందించలేదు.

mohan 02042019 2

ఇది ఇలా ఉంటే, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు మండిపడ్డారు. ఇటీవల మీడియా సమావేశంలో బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. మోహన్‌బాబును ఊసరవెల్లితో పోల్చారు. మేజర్‌ చంద్రకాంత్‌ సినిమాలో నటించినందుకు ఎన్టీఆర్‌కు ఇవ్వాల్సిన పారితోషికం ఎగ్గొట్టిన మోహన్‌బాబు ఉత్తముడని లక్ష్మీపార్వతి స్టేట్‌మెంట్‌ ఇస్తే, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బుద్దావెంకన్న సవాల్‌ చేశారు. దీనిపై మోహన్‌బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు..

mohan 02042019 3

‘‘టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు నోరు ఉంది కదా అని ఊరికే పారేసుకోకండి.. ఎలెక్షన్స్ ఉండేది ఇంకో పది రోజులే.. దాని తర్వాత.. మీరు మా ఇంటికి రావాలి.. మేము మీ ఇంటికి రావాలి.. ఒకళ్లనొకళ్లు ముఖాలు చూసుకోవాలి. ఎలక్షన్స్‌లో మీరూ విమర్శించొచ్చు.. మేము మిమల్ని విమర్శించొచ్చు, కానీ డీసెన్సీ ఉండాలి. అన్నిటికీ ఒక హద్దు ఉంటుంది. నెల రోజుల ముందు తిరుపతికి వచ్చి మా ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడారో మర్చిపోకండి’’ అంటూ మోహన్‌బాబు ట్వీట్ చేశారు.

రౌడీ పార్టీగా పేరు ఉండి, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తీవ్ర పదజాలంతో తిడుతూ, మీ అంతు చూస్తూ, మిమ్మల్ని జైలుకి తీసుకుపోతా అంటున్నాడు A1.... A2 అయితే, కొంత మంది అధికారులు పేర్లు చెప్పి మరీ, వీరు మా హిట్ లిస్టు లో ఉన్నారు, మా A1 సియం అయిపోతున్నాడు, సియం అవ్వగానే, వీరి సంగతి చూస్తాం అంటున్నాడు.. తిరుపతిలో ఉండే ఒక స్మగ్లర్ ఏమో, ఉరికించి ఉరికించి కొడతాం అంటాడు.. ఇప్పుడు లిస్టు లో నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మల్యేగా ఉన్న అనిల్ కుమార్ యదావ్ చేరాడు. ఇతగాడి నోటి దూల గురించి, ఇది వరకు చాలా సార్లు వార్తలు వచ్చాయి కూడా. తాజాగా నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.

nellore 02042019

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఒక్క కనుసైగ చేస్తే చాలు ఒక్కరు కూడా మిగలరని అనిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు చంపడమో?చావడమో?..విజయమో.? వీరస్వర్గమో? అంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. 2019 ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాల్సిందేనని అనిల్‌ కుమార్‌ అన్నట్లు ఆ వీడియోలో ఉంది. కాగా.. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు తాగి ఊగినట్లున్న వీడియో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అది మార్ఫింగ్ వీడియో అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాజా వ్యవహారంపై అనిల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.

 

nellore 02042019

ఆ పార్టీ ఏంటో, ఆ విధానాలు ఏంటో, వీళ్ళు ఎమ్మల్యేలు ఏంటో... వీళ్ళ మాటలు వింటుంటే, మనం అసలు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలోనే ఉన్నామా ? లేక ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా అనిపిస్తుంది... ఎవరైనా ఎలక్షన్స్ లో ఎలా గెలుస్తారు ? ప్రజల మనసులు గెలిచుకుని గెలుస్తారు... వీళ్ళు మాత్రం, చంపేస్తాం అంటున్నారు... యుద్ధం చేస్తాం అంటున్నారు... జగన్ మోహన్ రెడ్డి కను సైగ చేస్తే, అందరినీ చంపేస్తాం అంటున్నారు... ఈ వ్యాఖ్యలు అంటుంది ఒక ఎమ్మల్యే అంటే నమ్మగలరా ? మనం చంపటమో, చావటమో అంటున్నాడు... విజయమో వీర స్వర్గమో అంటున్నాడు... జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిని కాల్చేయాలి అంటాడు... ఎమ్మల్యే ఎవడు అడ్డు వస్తే వాడిని చంపాలి అంటాడు... ఏంటిది ? పొరపాటున వీరు అధికారంలోకి వస్తే, ప్రజల పరిస్థితి ఏంటి ? వీరికి మానసిక జబ్బుకి చికిత్స చెయ్యాలి...

40 ఏళ్ళ పులివెందుల కోట బద్దలుకొట్టే టైం వచ్చిందా ? వైఎస్ ఫ్యామిలీ రక్తం పారించిన చోట, నీళ్ళు పారించి, చంద్రబాబు దేవుడు అయ్యాడా ? ప్రజల్లో వస్తున్న స్పందన ఏమి చెప్తుంది ? సోమవారం సాయంత్రం కడప జిల్లా పులివెందులలో ఎన్నికల ప్రచార రోడ్‌షోలో చంద్రబాబు గర్జించారు. అక్కడకు వచ్చిన ప్రజలు, వారి స్పందన చూసి, ఉత్సాహంగా మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పులివెందులలో జగన్‌ ట్యాక్స్‌ నడుస్తోందని, రైతులు పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితులు నెలకొన్నాయని చంద్రబాబు ఆరోపించారు. వీటన్నింటినీ అరికడతామన్నారు. రైతుల నుంచి జగన్ వాటా తీసుకుంటున్నారని ఆరోపించారు. కష్టం రైతులది, దోపిడీ మాత్రం జగన్ వర్గానిది అని, వైసీపీ నేతలకు దోచుకోవడం తప్ప మరేమీ చేతకాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

puluvendula 01042019 3

‘‘పులివెందులలో జీఎస్టీ మాదిరిగా జేఎస్టీ (జగన్‌ ట్యాక్స్‌) ఉంది. 20శాతం వసూలు చేస్తున్నారు. ఇలాంటి ట్యాక్స్‌ ఎక్కడా చూడలేదు. ఈ ఆటలు మా వద్ద సాగవు. ట్యాక్స్‌ వసూలుచేసే అధికారం ఎవరిచ్చారు? కష్టం రైతులది, దోపిడీ మాత్రం జగన్‌ వర్గానిది. నదుల అనుసంధానం పూర్తిచేసి రాయలసీమను రతనాల సీమ చేస్తా. పులివెందులను ఉద్యాన పంటల హబ్‌గా మారుస్తా. రైతులు పండించే పంటలను ప్రపంచం మొత్తం మార్కెటింగ్‌ చేయించే పూచీ నాది. శీతల గిడ్డంగులను నిర్మిస్తాం. పులివెందులకు నీళ్ల కోసం సతీశ్‌రెడ్డి పోరాటం చేశారు. పులివెందుల అభివృద్ధి కోసం జగన్‌ ఎప్పుడైనా మాట్లాడారా? వైకాపా నేతలకు దోచుకోవడం తప్ప మరేదీ చేతకాదు.

puluvendula 01042019 3

ప్రతి ఎకరానికి నీళ్లిచ్చే బాధ్యత నాది. ప్రతి రైతుకు గిట్టుబాటు ధర ఇస్తాం. బ్రాహ్మణి స్టీల్‌ ప్లాంట్‌ పేరుతో దగా చేసి జగన్‌ జైలుకెళ్లారు. కడప స్టీల్‌ప్లాంట్‌ను పూర్తిచేస్తాం. జగన్‌కు ఎవరైనా ఓటేస్తే కేసీఆర్‌కు అధికారం ఇచ్చినట్టే. జగన్‌కు లోటస్‌పాండే ముద్దు.. ఇక్కడి ప్రజలతో నటిస్తారు. రాష్ట్రంలో ఉండని వారికి ఓటు అడిగే హక్కులేదు. మోదీ మళ్లీ గెలిస్తే మైనార్టీలు ఈ దేశంలో బతకలేరు. ఎంతో పోరాడి కియా మోటార్స్‌ను నేను ఏపీకి తీసుకొచ్చా. ప్రాణాంతకమైన యురేనియం పరిశ్రమను వైఎస్‌ తీసుకొచ్చారు. మేం మాత్రం ప్రజలకు ఉపాధి కల్పించే పరిశ్రమలు తెస్తున్నాం’’ అని చంద్రబాబు అన్నారు.

ఎన్నికల ప్రచారం ఉదృతంగా సాగుతుంది. చంద్రబాబు ఎక్కడ చూసినా, రోడ్ షోలతో ఆదరగొడుతున్నారు. అప్పుడప్పుడు జగన్, పవన్ కనిపిస్తున్నారు. సాయంత్రం 6 దాటితే, పవన్ కాని, జగన్ కాని ఒక్క మీటింగ్ లో ఉన్నట్టు కూడా, ఈ ఎన్నికల ప్రచారంలో చూడలేదు. చంద్రబాబు మాత్రం, రాత్రి 10 గంటల దాకా ప్రజల మధ్యే ఉంటున్నారు. ఇంకా 8 రోజులే ప్రచారానికి సమయం ఉండటంతో, నాయకులు మరింత దూకుడు పెంచారు. అయితే, మన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం, ఈ రోజు ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. ఇంత ఉదృతంగా ప్రచారం జరుగుతున్న టైంలో, ఎందుకు బ్రేక్ ఇచ్చారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ప్రతి రోజు ప్రచారం ఆపేసి, హైదరాబాద్ లోటస్ పాండ్ కు వెళ్ళిపోతున్న జగన్, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టటం, వైసీపీ వర్గాలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది.

lotuspond 02042019

"వరుస సభల కారణంగా ఆయన గొంతు బొంగురుపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది, ఎన్నికల వ్యూహంపై ఆయన మంగళవారం పార్టీ నాయకులతో సమావేశమై చర్చిస్తారు, అలాగే జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. దీనితో పాటు ఇప్పటి వరకు జరిపిన ప్రచార సరళిపై ఆయన పార్టీ నేతలు మంతనాలు జరపనున్నారు." అంటూ వైసీపీ నేత ఒకరు మీడియాకు చెప్పారు. అయితే, తెలుగుదేశం నేతలు మాత్రం వేరే విధంగా స్పందిస్తున్నారు. ఇలాంటి పీక్ టైంలో, ప్రచారం చెయ్యకుండా ఎవరూ ఇంట్లో కుర్చోరు అని, హైదరాబాద్ లో కూర్చుని , కేసీఆర్ తో కలిసి ఎదో కుట్రలు పన్నుతున్నారని, చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.

lotuspond 02042019

ఇక మరో పక్క, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేసేశారు. ఇందులో భాగంగానే నేడు (మంగళవారం) చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరు జిల్లా మదనపల్లెలో, 1.45 గంటలకు చంద్రగిరిలో, 3 గంటలకు నగరిలో తమ పార్టీ అభ్యర్థుల తరపున చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం 4.45 గంటలకు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లిలో, 6.15 గంటలకు వేదాయపాలెంలో చంద్రబాబు రోడ్ షోలో ప్రసంగం చేయనున్నారు.

Advertisements

Latest Articles

Most Read