తెదేపా ఐదేళ్ల పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. తన పాలనలో దళారీ వ్యవస్థ.. అవినీతి లేదని చెప్పారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. చంద్రగిరి వచ్చాక తనకు చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయన్నారు. ఇక్కడే నివాసం ఉండి చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. 1978లో చంద్రగిరిలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశానని చెప్పారు. ఆ తర్వాత కుప్పం వెళ్లానని.. ఇప్పుడు అక్కడి నుంచి ఏడోసారి పోటీచేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. చంద్రగిరిలో ప్రతి ఎకరానికి నీరిచ్చే బాధ్యత తనదని చెప్పారు.

chevi 02042019

వైకాపా అధ్యక్షుడు జగన్‌ పెద్దరౌడీ అయితే..చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చిన్నరౌడీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి చిన్నచిన్న రౌడీలను ఎంతోమందిని చూశానన్నారు. చెవిరెడ్డిలాంటి వారిని ఓడించి ఇంటికి పంపించాలని ప్రజలను కోరారు. తెదేపా అభిమానులపై ఆయన అనుచరులు దాడులకు దిగడం దారుణమన్నారు. పులివెందులలో రౌడీయిజం ఎక్కువని.. అక్కడ జగన్‌పై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందన్నారు. పులివెందులలో జగన్‌ గెలిచే పరిస్థితి కూడా లేదని చెప్పారు. అక్కడ జగన్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని.. పండ్ల తోటలపై 20 శాతం పన్ను వసూలుతో రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నారని సీఎం ఆరోపించారు.

chevi 02042019

నిరుద్యోగులకు చంద్రబాబు శుభవార్త చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిరుద్యోగభృతిని ఇప్పటి వరకు డిగ్రీ ఉత్తర్ణులైనవారికి ఇచ్చామని.. భవిష్యత్తులో ఇంటర్మీడియట్‌ అర్హతతో ఇస్తామని ప్రకటించారు. చిత్తూరు జిల్లాను ఇండస్ట్రియల్‌ హబ్‌గా తయారుచేస్తామన్నారు. తనను చూస్తే పారిశ్రామిక వేత్తలు వస్తారని.. జగన్‌ను చూస్తే పారిపోతారని విమర్శించారు. ‘మహాత్మాగాంధీ పుట్టిన రాష్ట్రంలో ప్రధాని మోదీ పుట్టారు. గాంధీ అసత్యం చెప్పరు.. మోదీ సత్యం చెప్పరు. గాంధీది అహింసావాదం.. మోదీది హింసావాదం’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. పోలవరంపై కేసీఆర్‌ సుప్రీంకోర్టులో రెండు కేసులు వేశారని.. ఆ ప్రాజెక్టుతో భద్రాచలం మునిగిపోతుందంటూ ఫిర్యాదు చేశారన్నారు. గట్టిగా మాట్లాడితే భద్రాచలం కూడా తమదేనన్నారు. ఏపీకి నీళ్లు రాకుండా అడ్డుకునేందుకు కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

ఎన్డీఏకి గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ నేత జీవీఎల్ జోస్యం చెప్పారు. త్వరలో సైకిల్‌ పూర్తిగా కనుమరుగు కావడం ఖాయమని జీవీఎల్‌ జోస్యం చెప్పారు. టీడీపీలో కొంతమంది రాజకీయ బ్రోకర్లు తయారయ్యారని, నోరుపారేసుకోవడమే పనిగా పెట్టుకున్నారని జీవీఎల్‌ అన్నారు. చంద్రబాబు, రాహుల్‌, మమతకి ఓటమి భయం పట్టుకుందని, రాహుల్‌ అందుకే రెండు స్థానాల నుంచి పోటీచేస్తున్నారని జీవీఎల్‌ విమర్శించారు. చంద్రబాబును ప్రజలు పట్టించుకోకపోవడంతో జాతీయ నేతలను తీసుకొచ్చి ప్రచారం చేసుకుంటున్నారని జీవీఎల్‌ ఆక్షేపించారు. కేంద్ర పథకాలను బాబు తన పథకాలుగా చెప్పుకుంటున్నారని, కియా వ్యవహారంలో అన్నీ కేంద్ర ప్రభుత్వం చేస్తే.. తానే తెచ్చానని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని జీవీఎల్‌ తెలిపారు.

gvl 02042019

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మీకు మిత్రుడా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా జీవీఎల్ నర్సింహారావు అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లాలో జీవీఎల్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన.. సీఎం చంద్రబాబు, టీడీపీ సర్కార్‌‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు పోలవరం సొమ్మువరం అని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్లకు 1800కోట్లు అదనంగా చెల్లించి కమీషన్‌ జేబులో వేసుకున్నారని ఆరోపించారు. భారత్‌కు కియా రావడం వెనుక మోదీ పాత్ర ఉంటే ఏపీకి రావడంలో చంద్రబాబు పాత్ర ఎంతో కొంత ఉంది అని జీవీఎల్ చెప్పుకొచ్చారు.

gvl 02042019

పవన్ గురించి మాట్లాడిన ఆయన.. జనసేన పేరు కులసేనగా మార్చుకోవాలన్నారు. కాపు ఓట్లు ఎక్కువ ఉన్నచోటే పవన్‌ పోటీచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. పవన్‌ కల్యాణ్‌.. ప్యాకేజీ కల్యాణ్‌గా మారిపోయారని, పవన్‌ సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా నటిస్తున్నారని, నాటకాలకు పవన్‌ పుల్‌స్టాప్‌ పెడితే మంచిదని జీవీఎల్‌ సూచించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కుక్కలు చింపిన విస్తరిలా మారిపోయాయని అన్నారు. అయితే ఎంతసేపూ ఆయన టీడీపీ, జనసేన గురించే మాట్లాడటమే కాకుండా విమర్శలు గుప్పించారు కానీ వైసీపీ గురించి మాట్లాడకపోవడం గమనార్హం.

కోడి కత్తిని నమ్ముకుంటే జైలుకు పోతారని సీఎం చంద్రబాబు అన్నారు. నగరిలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘సీపీఎస్‌ రద్దు చేస్తూ కేంద్రానికి లేఖ రాస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తా. గాలేరు నగరి, సోమశిల, స్వర్ణముఖి పూర్తి చేసి నీళ్లిచ్చే బాధ్యత నాది. నగరి, పూత్తూరు, చిత్తూరును మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తా. ఇక్కడి ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉన్నారా?. నియోజకవర్గానికి ఏమైనా చేశారా?. ఏనాడైనా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేశారా?. ఆమెకు (వైసీపీ అభ్యర్థి రోజా) హైదరాబాద్‌లో టీవీ షోలు తప్ప.. ప్రజలను పట్టించుకోరు. ఆమె వల్ల ప్రజలకు ఏ ఉపయోగం లేదు. ఇక్కడి ఎమ్మెల్యేకు నోటి దురుసు. పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడినా పట్టించుకోలేదు. వాళ్ల నాయకుడు నన్ను 420 అంటాడా?. చెప్పుతో కొడతా అంటున్నాడు. ఇలాంటి వ్యక్తులను ఇంటికి పంపించాలి..మళ్లీ పోటీ చేయకుండా గుణపాఠం చెప్పాలి.’’ అని అన్నారు.

roja 02042019

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రచారానికి రాకుండా ఇవాళ లోటస్ పాండ్‌లో ఉండిపోయారని విమర్శించారు. లోటస్‌పాండులో డబ్బులు లెక్కపెట్టుకుంటూ కూర్చున్నారని ఆరోపించారు. తాను మాత్రం జనం మధ్యలోనే ఉన్నానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చిత్తూరు జిల్లా, మదనపల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్ తన తండ్రి వైఎస్‌ను అడ్డం పెట్టుకుని రూ లక్ష కోట్లు సంపాదించారని విమర్శించారు. జగన్ తప్పులు చేశారు కాబట్టే భయపడుతున్నారన్నారు. ప్రచారానికి రాకుండా కుట్ర చేయడానికి లోటస్‌పాండ్‌లో ఉన్నారని సీఎం ఆరోపించారు. జగన్ ఎప్పుడైనా ఏపీలో ఉన్నారా? అని ప్రశ్నించారు.

roja 02042019

కేసీఆర్, జగన్ లాలూచీ పడ్డారని ఆరోపిస్తున్న చంద్రబాబు.. ఇప్పుడు మరింత దూకుడుగా విమర్ళల దాడి పెంచారు. హైదరాబాద్‌లో కూర్చునే కేసీఆర్‌కు జగన్ ఊడిగం చేసుకుంటే అభ్యంతరం లేదని, కానీ ఏపీకి ద్రోహం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్‌కు కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చి, ఏపీకి లక్ష కోట్లు ఎగ్గొడతారని బాబు ఆరోపించారు. జగన్ పేరులోనే గన్ ఉందని, ఆయన జీవితమంతా నేరాలు, ఘోరాలేనని విమర్శించారు. ఐదేళ్లలో నియోజకవర్గానికి రోజా చేసిన ఒక్క పనైనా ఉందా అని ప్రశ్నించారు. ఆమెకి అభివృద్ధి తెలియదు కానీ నోరు పారేసుకోడం మాత్రం బాగా తెలుసన్నారు. నాయకుడిని బట్టే ఎమ్మెల్యేలు కూడా ఉంటారని.. జగన్మోహన్ రెడ్డిని బట్టే రోజా కూడా అలానే తయారయ్యారన్నారు. ఇలాంటి వాళ్ళను మళ్ళీ పోటీ కూడా చేయకుండా బుద్ధిచెప్పాలని.. డిపాజిట్లు కూడా రాకుండా బుద్దిచెప్పాలన్నారు.

ఏపీ రాజకీయాలుసంచలనంగా మారాయి. రాజకీయ పార్టీల ఆరోపణలు పీక్ స్టేజ్ కు వెళ్లాయి. ఇప్పటికే ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వైసీపీ ఫిర్యాదు చేసింది. ఏపీ డీజీపీ పైనా కంప్లయింట్ ఇచ్చింది. ఎన్నికల సంఘం దానిపై విచారణ జరిపింది. డీజీపీ ట్రాక్ రికార్డ్ బాగుందని.. ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. కానీ ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఏపీ డీజీపీ వాహనాన్నే తనిఖీ చేయడంతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎస్ కోట మండలం బొడ్డవరం జంక్షన్ వద్ద స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ తనిఖీలు నిర్వహించింది. అదే మార్గంలో అరకు వెళ్తున్న ఏపీ డీజీపీ వాహనాన్ని ఆపారు. ఆయన వెహికల్ ను కూడా తనిఖీ చేశారు. దీంతో స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్.. ఏపీ డీజీపీకే షాక్ ఇచ్చినట్లయింది. ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో ఇది సంచలనంగా మారింది.

dgp 02042019

అయితే ఇదంతా విజయసాయి రెడ్డి స్కెచ్ గా తెలుస్తుంది. అధికారుల పై ఒత్తిడి తేవటానికి, ప్లాన్ గా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ వాహనంలో, తెదేపా సొమ్ములు తరలిస్తోందని వైకాపా నేతలు ఆరోపించారు. ఈ మేరకు గురువారం వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా, కమిషనర్లు సుశీల్‌ చంద్ర, అశోక్‌ లావాసాలతో భేటీ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

dgp 02042019

గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా లేవని అందుకే మరోసారి ఫిర్యాదు చేయటానికి వచ్చామన్నారు. డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌, ప్రకాశం, గుంటూరు రూరల్‌, చిత్తూరు ఎస్పీలు, అధికారులు దామోదర్‌నాయుడు, యోగానంద్‌, ఘట్టమనేని శ్రీనివాస్‌లను బదిలీ చేయాలని కోరినా ఈసీ చర్యలు తీసుకోలేదని, దీనిపై మరోసారి వినతిపత్రం ఇచ్చామని చెప్పారు. వైకాపా అభ్యర్థుల పేర్లు పోలిన వారిని 35 అసెంబ్లీ స్థానాల్లోనూ, 4 లోక్‌సభ స్థానాల్లోనూ ప్రజాశాంతి పార్టీ పోటికి నిలపడం వెనక తెదేపా హస్తం ఉందని చెప్పారు. సీఎం చంద్రబాబుతో లాలూచి పడి కేఏపాల్‌ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

Advertisements

Latest Articles

Most Read