ఏపీ సీఎం చంద్రబాబు గురువారం విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అదాని డేటా సెంటర్ పార్క్‌కు భూమిపూజ చేయనున్నారు. ప్రపంచంలోనే తొలి ఎకోఫ్రెండ్లీ డేటాసెంటర్ పార్క్ కావడం విశేషం. ఈ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటుతో అదాని గ్రూప్ దాదాపు లక్ష ఉద్యోగాలు కల్పించనుంది. వివిధ దశల్లో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది అదాని గ్రూప్. వివిధ దశల్లో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు విశాఖ కేంద్రంగా మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. లక్ష ఉద్యోగాలు కల్పించే అదాని డేటా సెంటర్ పార్క్‌కు గురువారం కాపులుప్పాడ ఐటీ పార్క్ వద్ద భూమి పూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, అదాని మ్యానేజింగ్ డైరెక్టర్ రాజేష్ అదానిలతోపాటు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అదాని గ్రూప్‌తో ఒప్పందం జరిగిన సరిగ్గా నెలరోజుల్లోనే డేటా సెంటర్ పార్క్ ఏర్పాటుకు భూమి పూజ జరగడం విశేషం. జనవరి 9న ఒప్పందం జరగ్గా..ఫిబ్రవరి14న కంపెనీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం ఒక రికార్డు. ఈ ఘనత పంచాయతీరాజ్, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ కృషి వల్ల మాత్రమే సాధ్యమైంది. దేశానికే డేటా హబ్ గా మారనున్న ఏపీ మంత్రి లోకేష్ కృషితో వచ్చిన అదాని డేటా సెంటర్ పార్క్ ఏర్పాటుతో దేశానికే ఆంధ్రప్రదేశ్ డేటా హబ్‌గా మారనుంది. ఇరవై ఏళ్లలో లక్ష ఉద్యోగాలు కల్పించే ఈ సెంటర్ కోసం అదానీ గ్రూప్ 70 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. విశాఖపట్నంలోని 500 ఎకరాల్లో మూడు ప్రాంతాల్లో 1 గిగా వాట్ డేటా సెంటర్ అదాని గ్రూప్ ఏర్పాటు చేయనుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పర్యావరణహిత డేటా సెంటర్ పార్క్. ఇందులో భాగంగా 5 గిగా వాట్స్ సోలార్ పార్క్ ని కూడా నెలకొల్పనున్నారు.
ఈ డేటా సెంటర్ ని ఇంటర్నెట్ కేబుల్ లాండింగ్ స్టేషన్ తో అనుసంధానించడం ద్వారా దేశవ్యాప్తంగా మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించే కీలక కేంద్రంగా ఏపీ మారనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, హార్డ్ వేర్ సప్లయర్స్,సాఫ్ట్ వేర్ ,స్టార్ట్ అప్, టెలికాం కంపెనీలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదాని గ్రూప్‌ని ఒప్పించిన లోకేశ్.. అదాని గ్రూప్ డేటా సెంటర్ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉందని తెలుసుకున్న ఐటీ మంత్రి నారా లోకేశ్.. ఏపీలో అమలు చేస్తున్న క్లౌడ్‌హబ్ పాలసీని కంపెనీ ప్రతినిధులకు వివరించారు. దఫదఫాలుగా వారితో చర్చించారు. డేటా సెంటర్ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్ తక్కువ ధరకే ఏపీలో అందుబాటులో ఉండటం, ఇంటర్నెట్ లాండింగ్ కేబుల్, మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం ముందుకు రావడంతో పాటు భూములు కేటాయింపు..ఆగమేఘాలపై అనుమతులు మంజూరు వంటి అంశాలతో అదాని గ్రూప్...ఒప్పందం చేసుకున్న నెలరోజుల్లోనే డేటా పార్క్‌కు భూమిపూజ చేస్తోంది.