ముఖ్యమంత్రి చంద్రబాబుపై తాను అలిగినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు స్పష్టంచేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ తాను తెదేపా కార్యకర్తనని, 1982 నుంచి పార్టీ సిద్ధాంతాల కోసం పని చేస్తున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎలాంటి భేదాభిప్రాయాలూ లేవన్నారు. దిల్లీలో జరిగిన ధర్మపోరాట దీక్షలోనూ ఆయనతో వెళ్లి రాష్ట్రపతిని కలిసిన విషయాన్ని గుర్తుచేశారు. శుక్రవారం తాను విశాఖపట్నం వెళ్లడానికి దిల్లీలో విమానం ఎక్కుతుండగా పొలిట్‌బ్యూరో సమావేశ సమాచారం అందిందని, దానివల్లే అప్పటికప్పుడు ప్రయాణం మార్చుకోలేక హాజరు కాలేకపోయానన్నారు.
అదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకీ తెలియజేశానని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ పార్టీలోకి రావడం తనకిష్టం లేదన్నదీ అభూత కల్పనేనన్నారు. ఆయన మంచి వ్యక్తి అని, ఆయన తెదేపాలోకి రావడం స్వాగతించదగ్గ విషయమేనన్నారు. నిన్న ఉదయం నుంచి కొన్ని మీడియా చానల్స్ కావాలని విష ప్రచారం చేసే ప్రయత్నం చేసాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత చంద్రబాబు పై కోపంగా ఉన్నారని, అధినేతకు ముచ్చెమటలు పట్టిస్తున్నారని, ఈయాన కూడా తొందరలోనే పార్టీ మారతారు అంటూ, ఏకంగా అశోక్ గజపతి రాజు గారి పైనే స్టొరీలు రాసారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి ఆయన అందుకే రాలేదు అంటూ హడవిడి చేసారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అధినేత చంద్రబాబుపై అలిగినందువల్లే అశోక్‌గజపతిరాజు ఈ సమావేశానికి రాలేదని ఆ మీడియా సంస్థలు హడవిడి చేసాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి కిశోర్ చంద్రదేవ్ వ్యవహారం కూడా చంద్రబాబు, అశోక్‌గజపతి మధ్య దూరం పెరగడానికి మరో కారణం అంటూ స్టొరీలు అల్లేశారు. అయితే, ఇవన్నీ తప్పుడు వార్తాలు అని, అసలు కారణం ఇది అంటూ, వెంటనే రాజు గారు మీడియా ముందుకు వచ్చి, అసలు విషయం చెప్పారు. ఇప్పుడు పాపం ఈ మీడియా సంస్థల నోట్లో పచ్చి వేలక్కయి పడింది.