నెల్లూరులో అతనో ఆటో డ్రైవర్‌. పేరు పి వెంకటేశ్వర్లు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల్లో కుటుంబమంతా లబ్ధి పొంది ఉన్నాడు. అయితే, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన మనసు నొచ్చుకున్నాయి. అందరిలా ఆయన ఊరికే ఉండలేదు. తను నడుపుతున్న ఆటో వెనుక ‘‘ఏపీలో ఏం పీకుతావ్‌ కేసీఆర్‌’’ అంటూ మూడు నెలల క్రితం ప్లెక్సీ అతికించాడు. ‘‘నాన్న చనిపోతే రూ.50వేలు తక్షణ సాయం అందింది. అమ్మ విజయకు నెలా నెలా రూ.2వేల చొప్పున వృద్ధాప్య పింఛను, అక్క భర్త చనిపోతే ఆమెకూ రూ.50వేలు ఇచ్చారు. ఇప్పుడు డబుల్‌ బెడ్‌రూం వచ్చింది. అన్న మురిళీకి ఇల్లొచ్చింది. ఇంత చేస్తున్న చంద్రబాబుపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు తట్టుకోలేక ఈ ప్లెక్సీ పెట్టా’’నంటున్నాడు

nellore 16022019

ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ ఇలా ఉంది. సామాన్య ఆటో డ్రైవర్ కూడా, ఏపి అంటే ప్రాణం ఇస్తున్నాడు. ఏపిని ద్వేషించే వారికి ఆంధ్రా వాడి ఆత్మ గౌరవం దెబ్బ చూపిస్తున్నాడు. ఇలాంటి ఆంధ్రా ద్వేషితో, మన ఖర్మకు ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి, చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతాడు. ఆంధ్రా ప్రజలని, ఆంధ్ర రాష్ట్రాన్ని అడుగడుగునా అవమానాలు చేస్తుంటే, ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా, అనుకుండా, ఆ మాటలు సమర్ధిస్తున్నా అన్నట్టు, అతనితోనే కలుస్తూ, ఏపిలోకి వచ్చి రాజకీయం చేస్తున్నా అని బహిరంగంగా ప్రకటిస్తాడు. ప్రతివ విషయంలో వాళ్ళు ఆంధ్రా ప్రజలను అవమానిస్తూ, మా తెలంగాణా గొప్పది అంటూ వాళ్ళ రాష్ట్రాన్ని పొగుడుతూ, మన రాష్ట్రాన్ని హేళన చేస్తుంటే, వారికే భజన చేస్తాడు. రాజకీయాలు వేరు, రాష్ట్రం వేరు. ఎవరు ఉన్నా లేకపోయినా, ఆంధ్రులకు ఆత్మాభిమానం ఉండి, ఆత్మ గౌరవం ఉంటుంది. అవి, వారిని అవమానించిన వారి కాళ్ళ దగ్గరే తాకట్టు పెడితే, ఆంధ్రుడు చూస్తూ ఊరుకోడు జగన్.. రాజకీయాలు పక్కన పెట్టి మా ఆంధ్రుల ఆత్మగౌరవానికి కొంచెం అయిన విలువ ఇవ్వు.

nellore 16022019

అలాగే కేసీఆర్ ఆంధ్రా వాడి జోలికి రాకు.. నువ్వు ఏపి వచ్చి, ఎంతగా చంద్రబాబును తిడితే నాలుగు ఓట్లు ఎక్కువే పడతాయే తప్ప ఒక్క ఓటు కూడా తగ్గదు అని ఏపి ప్రజలు అంటున్నారు. మా ఏపి ప్రజలు గొర్రెల మంద కాదు, నీ లాంటి సొల్లు వాగుడు వినాటానికి. నీ వల్ల సర్వం కోల్పోయి, రోడ్డున పడ్డ రాష్ట్రం మాది. నీలాంటి వాళ్ళని వెనకేసుకుని వచ్చే కుల పిచ్చ వెధవలు, మా రాష్ట్రంలో ఉన్నారు, వాళ్లకి సరైన బుద్ధి చెప్తాం. హాయగా ఎన్నికలు గెలిచావ్, ఫార్మ్ హౌస్ లో పార్టీ చేసుకో. మా రాష్ట్రం జోలికి, మా ముఖ్యమంత్రి జోలికి వస్తే, ఏమి చెయ్యాలో మా ప్రజలకి బాగా తెలుసు. ఇప్పటికే మోడీ, జగన్, కలిసి ఎన్నో కుట్రలు చేస్తున్నారో, నువ్వు వస్తే మాకు పెద్దగా ఊడేది ఏమి లేదు, మరింత గట్టిగా, కసిగా పని చేసి, మా రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. మేము ఆంధ్రులం, గొర్రెల మందలం కాదు. నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే, మా ఏపి ప్రజలు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి, మా రాష్ట్రాన్ని కాపాడుకుని, చంద్రబాబుని మళ్ళీ గెలిపించుకుంటాం.

మంత్రి సోమిరెడ్డి, కడప నేత రామసుబ్బారెడ్డి రానున్న ఎన్నికలలో పోటీచేసేందుకుగాను ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. సుబ్బారెడ్డి జమ్మలమడుగు నుండి పోటీచేయనుండగా సోమిరెడ్డి సర్వేపల్లి నుండి పోటీకి అధిష్టానం ఆమోదం తెలిపింది. ఈ ఇద్దరి రాజీనామాలు కూడా ఆమోదం పొందాయి. కాగా ఇప్పుడు వీరిబాటలోనే మరికొందరు ఎమ్మెల్సీలు రాజీనామాలకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. వీరి నిర్ణయాన్ని పార్టీ పాలసీగా తీసుకుంటే మరికొన్ని ఎమ్మెల్సీ ఖాళీ కానున్నాయి. రేపు పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉండగా లోకేష్ తో పాటు ఎనిమిది మంది రాజీనామా చేసే అవకాశం ఉంది.

lokesh 16022019

వీరిలో నారా లోకేష్, నారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, కరణం బలరాం, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, పయ్యావుల కేశవ్, అన్నం సతీష్ తదితరులు ఎన్నికలలో పోటీకి సిద్ధంగా ఉన్నారు. రాజీనామా నిరయంతో గెలుపుపై ధీమాతోనే అనే సంకేతం ప్రజలలోకి ఇవ్వడంతో పాటు అసంతృప్తులను శాంతింపజేసేందుకు అవకాశం ఉంటుందని పార్టీ ఆలోచనగా తెలుస్తుంది. నిన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శాససన మండలి ఇన్‌చార్జి కార్యదర్శి సత్యనారాయణరావును శుక్రవారం కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ చైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సోమిరెడ్డి విలేకరులతో మాట్లాడారు.

lokesh 16022019

‘వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నా. అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా. ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఎమ్మెల్సీగా ఉండకూడదన్న వ్యక్తిగత నిర్ణయంతోనే రాజీనామా చేశా. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకు తెలియజేశా. సీఎం ‘ఆలోచించావా? పునఃపరిశీలించుకో’ అన్నారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాను అని స్పష్టంగా చెప్పా. సీఎం సరే అన్నారు. నా తరఫున ఎవరికీ ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎంకు సూచించలేదు. పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయం. సర్వేపల్లి నుంచి నా పోటీపై కూడా తుది నిర్ణయం పార్టీదే. మంత్రి పదవిలో కొనసాగుతాను. సర్వేపల్లి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకు ఉంది.’ అని సోమిరెడ్డి అన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారంతో వైకాప అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ లో ఆస్తులున్న వారిపై బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఈ సారి తమ పార్టీ అభ్యర్థుల ఎంపిక చివరి నిమిషం వరకు సాగదీయబోమని, సరైన సమయంలో ప్రకటించుకుంటూ ముందుకు వెళతామని తెలిపారు. ఎన్నికల ముందు చెప్పిన అన్ని అంశాలను నెరవేర్చామని ఆయన స్పష్టంచేశారు. ప్రజల్లో ఉన్న సానుకూల దృక్పథాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేందుకు పార్టీ యంత్రాంగం కృషి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.

cbn 16022019

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రధాని మోడీ జీర్ణించుకోలేరని, ఏపీని చూస్తుంటే కేసీఆర్‌కు కూడా కంటగింపుగా ఉందని సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎలా వెళ్లాలనేది ఇవాళ నిర్ణయిస్తామన్నారు. కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను తాము డబ్బులు ఇచ్చి ఎలాగోలా పూర్తి చేపిస్తున్నామని, అయినా కేంద్రం కొర్రీల మీద కొర్రీలు వేస్తోందని విమర్శించారు. ఉగ్రవాదం, తీవ్రవాదానికి తెదేపా ఎప్పుడూ వ్యతిరేకమని, దేశ భద్రతలో పార్టీ ఎప్పుడూ రాజీపడదని స్పష్టంచేశారు. రక్షణశాఖలో కుంభకోణాలను తెదేపా ఖండిస్తోందని, అందుకే రఫేల్‌పై రాజీలేని పోరాటం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

cbn 16022019

జగన్ కు ఎన్నికల అంటే వ్యాపారమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ హైదరాబాద్‌లో విలాసంగా కూర్చుని, అక్కడే కేసీఆర్ సహకారంతో అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో నివసించడమే ఇష్టంలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. వైకాపా టికెట్లకు ప్రజాసేవ కొలమానం కాదు.. డబ్బు సంచులే కొలమానమని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. జగన్ ఒకసారి పోటీ చేసిన వారికి మరోసారి అంత తేలిగ్గా అవకాశమివ్వరని, డబ్బులు ఎవరికిస్తే వారికే టికెట్లు ఇచ్చే వ్యక్తి అని విమర్శించారు. వైకాపాలో అంతా ఒక్కసారి మాత్రమే ఆడే ఆటగాళ్లని (వన్‌టైం ప్లేయర్స్‌) ఎద్దేవాచేశారు.

బీజేపీ పార్టీకి దేశ వ్యాప్తంగా ఉన్న ముసుగు పార్టీలు ఒకటి జగన్, రెండు కేసీఆర్, మూడు అన్నాడీఎంకే... అన్నాడీఎంకేని అడ్డు పెట్టుకుని, పార్లమెంట్ లో ఎన్ని నాటకాలు ఆడారో, తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో చూసాం. అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో బీజేపీ సౌత్ లో బలపడాలి అంటే, ఇక్కడ ఈ ముసుగు వీరులతో డైరెక్ట్ పొత్తుకు రెడీ అవుతుంది. ఈ బలహీనలు ముగ్గురినీ కేసులతో భయపెట్టి, వారిని కంట్రోల్ లో పెట్టుకుని, ఇప్పుడు వారితో పొత్తు పెట్టుకుని, ఇక్కడ కొన్ని సీట్లు సొంతగా గెలిచే ఎత్తులు వేసింది. ఇందులో భ్గంగానే, అన్నాడీఎంకేతో నిన్న బీజేపీ పొత్తుల పై చర్చించింది. ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, అమిత్ షా, ఇటు జగన్ మోహన్ రెడ్డితో కూడా, ఎన్నికల ముందే పొత్తుకు రెడీ అవుతునట్టు సమాచారం. కేసుల భయంతో, జగన్ కూడా అమిత్ షా షరతులకు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.

bjp jagan 16022019 2

నిన్న తమిళ నాడు వెళ్లి మరీ బీజేపీ నేతలు అన్నాడీఎంకేతో చర్చలు జరిపారు. రాష్ట్రమంత్రులు తంగమణి, వేలుమణిలతో భాజపా రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి, కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ మేరకు చర్చించారు. చెన్నైలోని ఓ పారిశ్రామికవేత్త నివాసంలో ఈ సమావేశం ఏర్పాటైంది. ఇంకా సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భాజపా ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చి వెళ్లగా... గురువారం భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈరోడులో పర్యటించారు. దీంతో పొత్తుల గురించి ప్రకటన వెలువడే అవకాశముందని అంతా ఆసక్తిగా భావిస్తున్న నేపథ్యంలో భాజపా తమిళనాడు ఎన్నికల ఇన్‌ఛార్జి, కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ రంగప్రవేశం చేశారు.

bjp jagan 16022019 3

గురువారం సాయంత్రం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... పార్టీల పొత్తుల గురించి చర్చలు జరిపేందుకే రాష్ట్రానికి వచ్చినట్టు స్పష్టం చేశారు. రాష్ట్రంలో భాజపా కూటమి బలంగా ఉందని, అన్నాడీఎంకేతో కూటమి ఏర్పాటుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. పీయూష్‌ గోయల్‌ పాల్గొననున్న కార్యక్రమాల గురించి పలు వార్తలు వినిపించినా వాటికి భిన్నంగా చెన్నై ఆళ్వార్‌పేటలోని పారిశ్రామికవేత్త పొళ్లాచ్చి మహాలింగం నివాసానికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి తంగమణి, స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి ఎస్పీ వేలుమణితో సమావేశమయ్యారు. భాజపాకు కేటాయించే నియోజకవర్గాల గురించి చర్చించినట్టు సమాచారం. ఇక్కడ తమిళనాడులో ఈ పొత్తులు చర్చలు అయిపోగానే, నెక్స్ట్ జగన్ దగ్గరకే అంటూ బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read