విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్ద ఆర్​ ఆర్ వెంకటాపురం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలంటూ పరిశ్రమ వద్ద ధర్నాకు దిగారు. ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమను తరలించాలని స్థానికులు నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న స్థానికులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరిని అరెస్టు చేశాక.. మరికొందరు గేటు వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. పరిశ్రమ వద్దకు డీజీపీ గౌతమ్ సవాంగ్ చేరుకుని..ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్నారు. పరిశ్రమ చుట్టు పక్కల తాగునీరు కలుషితమైందని...ప్రమాదం తర్వాత మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. కరోనా భయం వల్ల బంధువులు కూడా ఇంటికి రానివ్వడంలేదన్నారు. ఎవరు గట్టిగా మట్లాడినా పోలీసులు వారిని అరెస్ట్ చేస్తున్నారన్నారు. సీఎం జగన్ తమ గ్రామంలోకి వచ్చి పరిస్థితిని పరిశీలించాలని కోరారు. ప్రమాద ఘటన పై పరిశ్రమ యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

బాధితుల చికిత్సకు డబ్బు చెల్లించాలని కొన్ని ఆస్పత్రులు అడుగుతున్నాయన్నారు. ప్రభుత్వం వేసిన కమిటీ...బాధిత 5 గ్రామాల్లో తిరిగి ప్రజలతో మాట్లాడాలని వారు కోరారు. బాధిత 5 గ్రామాల్ల ఆక్సిజన్ స్థాయి పెంచాలని డిమాండ్ చేశారు. తక్షణం సహాయచర్యలు చేపట్టకుంటే ఇక్కడకు ఎవరూ రారన్నారు. గ్యాస్ లీక్ ఘటనకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమన్నారు. ప్రమాదం జరిగినప్పుడు సైరన్ కూడా మోగలేదని స్థానికులు తెలిపారు. కంపెనీలో ఉపాధి పొందుతున్న వారిలో స్థానికేతరులే ఎక్కువగా ఉన్నారన్నారు. వైసీపీ నేతలు, చెప్తున్న మాటలు నమ్మసక్యంగా లేవని అన్నారు. ఇప్పటి వరకు, ఎందుకు కంపెనీ యాజమాన్యం వ్యక్తులను అరెస్ట్ చెయ్యలేదని ప్రశ్నిస్తున్నారు.

ఇక్కడ, గాలి, నీరు అంతా, కలుషితం అయిపోయాయని, రాను రాను, మా పై దీర్ఘకాలికంగా, ఆరోగ్య ఇబ్బందులు వస్తాయని అంటున్నారని, ట్రీట్మెంట్ చేసేసి పంపించి వేస్తున్నారని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని చెట్లు కూడా మాడిపోయయని, ఆ గాలి పీల్చిన మాకు, భవిష్యత్తులో ఎన్నో ఇబ్బండులు వస్తాయని అంటున్నారు. ఇవన్నీ అడుగుతుంటే, కోటి ఇచ్చాం, పది కోట్లు ఇస్తాం అని డబ్బులతో లెక్క చెప్తున్నారని, మాకు ఇవేమీ వద్దు అని, కంపెనీని ఇక్కడ నుంచి తరలిస్తాం అని చెప్పాలని, ఇక్కడ నుంచి తరలించాలని వాపోయారు. ఇవన్నీ అడగటానికి వస్తే, మమ్మల్ని అడ్డుకుని, కొంత మందిని అరెస్ట్ చేసారని, కంపెనీ వారితో మాత్రం ముచ్చట్లు, మాకు అరెస్ట్ లా అని వాపోతున్నారు.

విశాఖ గ్యాస్ లీక్ మటన పై వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రెస్ మీట్ లో, స్పందించిన ఒక విషయం పై దుమారం రేగింది. అంతకు ముందు ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ఘటన పట్ల ఆవేదనను వ్యక్తం చేసారు. గురువారం తెల్లవారుజాము సమయంలో విశాఖ ఎల్‌జీ పాలిమర్స్, రసాయన వాయువు లీకేజీ ఘటన గురించి విశాఖలో ఘటనా స్థలానికి దగ్గరగా వున్న గ్రామాలతో పాటుగా, గ్యాస్ లీకేజీ ప్రభావానికి గురైన వారందరిని ఆస్పత్రులకు తరిస్తున్నామని, ప్రతి ఇంటింటి వెళ్ళి బాధితులెవ్వరైనా ఉన్నారా అని వరిశీలించి, అవసరమై సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మంత్రి కన్నబాబు విశాఖలోనే మకాం చేసి అన్ని సహయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. బాధితులకు అవసరమైతే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలను అందించే విధంగా చర్యలు చేపట్టాలని వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డికి సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసారు.

అయితే ఈ సమయంలో, జగన్ మాట్లాడుతూ, ‘‘ఎల్ జి పాలిమర్స్ మల్టీ నేషనల్ కంపెనీ. మృతుల కుటుంబాలకు రూ కోటి పరిహారం అందించేలా చూస్తా. ఎల్ జి సంస్థ ఏ మేరకు పరిహారం ఇస్తుందో చూస్తాం. ఆ పై సాయం ప్రభుత్వం నుంచే అందిస్తాం. చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఎల్ జి కంపెనీలో ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నా. సంస్థను తిరిగి ప్రారంభించాక అక్కడే ఉన్నా,వేరే చోటకు తరలించినా బాధిత కుటుంబాలకు ఉపాధి చూపిస్తామని’’ అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యాల పై అటు సోషల్ మీడియాలో, ఇటు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. చంద్రబాబు మాట్లాడుతూ, "ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి చాలా క్యాజువల్ గా మాట్లాడారు. ఇది క్యాజువల్ గా తీసుకోవాల్సిన అంశం కాదు. ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు బాధితులను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని మహాత్మాగాంధీ చెప్పారు."

"ఇందులో కూడా బాధితులను దృష్టిలోపెట్టుకుని మాట్లాడాలే తప్ప పరిశ్రమ యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడరాదు. దీనిని ముఖ్యమంత్రి తేలిగ్గా తీసుకోవడం కరెక్ట్ కాదు. తేలిగ్గా ఏదేదో చెప్పేసి 278, 284,285,337,338(2) సెక్షన్ల కింద కేసు బుక్ చేస్తే చాలదు. సింపుల్ కేసులు పెట్టి నార్మల్ గా ఈ కేసును పరిగణించడం కరెక్ట్ కాదు. అంతకు ముందు కూడా కరోనాపై ఇలాగే ‘‘అదేదో చిన్న జ్వరం, పారాసిటమాల్ వేసుకుంటే పోతుందని, బ్లీచింగ్ జల్లాలని’’ అని తేలిగ్గా మాట్లాడారు. ఇప్పుడు ఇంత తీవ్ర ప్రమాదాన్ని కూడా చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. దీని దుష్ప్రభావం సుదీర్ఘకాలంలో తీవ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు, మీడియాలో కథనాలు వస్తున్నాయి,వీటన్నింటిని పరిశీలనలోకి తీసుకోవాలి." అని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 7,320 నమూనాలు పరీక్షించగా... కొత్తగా 54 మందికి కరోనా నిర్ధరణ అయ్యినట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం కేసుల సంఖ్య 1,887కు ఎగబాకింది. వైరస్ బారిన పడి ఇవాళ కర్నూలు జిల్లాలో ఇద్దరు, విశాఖ జిల్లాలో ఒకరు మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 41కి చేరింది. మరోవైపు కరోనా నుంచి కోలుకుని 842 మంది డిశ్ఛార్జి అయ్యారు. 1,004 కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా మరో 54 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. గత పది రోజులతో పోల్చుకుంటే, ఈ రోజే తక్కువ. అయితే కేసులు తగ్గుతున్నయాని, సంతోషించినా, ఇక్కడ మరో కలవర పెట్టే విషయం ఏమిటి అంటే, మొన్న పది రోజుల నుంచి ఎక్కువగా కేసులు వస్తున్నా, అవి కృష్ణా, గుంటూరు, కర్నూల్ నుంచే ఎక్కువ వచ్చాయి. అయితే ఈ రోజు వచ్చిన 54 కేసుల్లో, 40 కేసులు కృష్ణా, గుంటూరు, కర్నూల్ కాకుండా, మిగతా జిల్లాల నుంచి రావటం కలవర పెట్టే అంశం.

అనంతపురం జిల్లాలో మరో 16 మందికి కరోనా నిర్ధరణ అయింది. అలాగే విశాఖపట్నంలో అనూహ్యంగా 11 కేసులు వచ్చాయి. పశ్చిమ గోదావరిలో 9 కేసులు వచ్చాయి. మొన్నటి దాకా కేసు లేదు అనుకున్న విజయనగరం జిల్లా కూడా ఓపెన్ అయ్యింది. ఇవాళ మరో కేసు నమోదు కాగా, మొత్తంగా నాలుగు కేసులు వచ్చాయి. విజయనగరం జిల్లాలో కరోనా - పాజిటివ్ కేసులు బయట పడటంతో జిల్లా యంత్రాంగం ఆవ్రమత్తమైంది. వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందకుండా, హుటాహుటీన చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా కేసు వెలుగులోకి వచ్చిన ప్రాంతాన్ని కంటైన్మెంటు జోన్ గా ప్రకటించి, రాకపోకలను పూర్తిగా నిషేధించారు. బలిజిపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

ఎక్కడైనా కరోనా వ్యాధి నిర్ధారణ అయినప్పుడు, ఆ చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల ప్రాంతాన్ని కంటైన్మెంటు జోన్‌గా ప్రకటించాలన్నది ప్రభుత్వ నిబంధన. దీని ప్రకారం చిలకలపల్లి, పలగర గ్రామాల్లోని కొంత ప్రాంతాన్ని కంటైన్మెంటు జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతానికి ఇతర ప్రాంతంతో రాక పోకలను పూర్తిగా నిషేధించారు. కంటైన్మెంటు జోన్లో ఉన్న చిలకలపల్లిలో 799 ఇళ్లు ఉండగా, సుమారు 2952 మంది నివాసం ఉంటున్నారు. చిలకలపల్లిలోనే మరో ప్రాంతంలో 1012 ఇళ్లు ఉండగా, వీటిలో 4388 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. మూడు కిలోమీటర్లు లోపలే ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా కంటైన్మెంజ్ జోన్లో చేర్చారు. సమీప గ్రామంలో పలరగలో 764 ఇళ్లలో దాదాపు 2538 మంది నివసిస్తున్నారు. ఈ మూడు ప్రాంతాలూ కలిపి సుమారు 9,878 మంది కంటైన్మెంటు జోన్లో ఉన్నారు.

విశాఖపట్నం ఆర్ ఆర్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజి దుర్ఘటన బాధాకరం. ఒకవైపు కరోనాతో రాష్ట్రం, ప్రపంచం భయభ్రాంతులు అవుతోన్న పరిస్థితుల్లో, జన జీవనం స్థంభించిన పరిస్థితిలో, విశాఖలో ఇలా జరగడం చాలా బాధేస్తోంది. రాత్రంతా అసలు నేను నిద్ర పోలేక పోయాను. తెల్లవారు జామున 3గంటలకు ఈ ప్రమాదంలో విష వాయువులు పీల్చి జనం ఎక్కడికక్కడే పడిపోవడం, 12మంది చనిపోవడం, 350మందిపైగా తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రుల పాలు కావడం, అందులో 44మంది పిల్లలు ఉండటం, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్లందరినీ ఆసుపత్రుల్లో చేర్చడం, అక్కడి విష వాయువులకు పాడి పశువులు విపరీతంగా చనిపోవడం, 200పశువులు అస్వస్థత కావడం, చెట్లు రంగుమారడం ప్రమాద తీవ్రతకు నిదర్శనం. సమాచారం నాకు అందగానే హుటాహుటిన స్పందించాను. గణబాబు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు ధైర్యంగా వెళ్లి రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టడం అభినందనీయం. ప్రధాని హైలెవల్ కమిటి మీటింగ్ పెట్టడం, హోం, డిఫెన్స్ మంత్రులతో సమీక్షించడం, హుటాహుటిన ఎన్ డిఆర్ ఎఫ్ ను మొహరింపజేసి సహాయ పునరావాస చర్యలు చేపట్టడం చూశాం. జరిగింది తలచుకుంటే చాలా బాధేస్తోంది, మనసు కలిచివేస్తోంది. నిస్సహాయంగా చూడటం తప్ప మనం ఏమీ చేయలేక పోయామనే బాధ వేస్తోంది. సంఘటనా స్థలానికి వెళ్లడానికి అనేక విధాలా నేను ప్రయత్నించారు. కేంద్రమంత్రికి, కేబినెట్ సెక్రటరీకి, అందరినీ అనుమతులు కోరాను. ఇప్పటిదాకా రాలేదు. దీనిపై రోజంతా సమీక్షలు చేశాను. కేంద్రానికి కూడా ఎప్పటికప్పుడు లేఖలు రాశాను.

స్టెరైన్ ప్రమాదం గతంలో ప్రపంచంలో ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు.. ఇది జరిగితే ఎలా ఎదుర్కోవాలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లు లేవు. పర్యావరణ పరంగా, ఆరోగ్యపరంగా వాటిల్లే దుష్ప్రభావంపై సమాచారం లేదు. ఇలాంటి సమయంలో దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సివుంది. జాతీయ, అంతర్జాతీయ నిపుణులు అంతా ఇక్కడికి రావాలి, ఆయా రంగాల శాస్త్రవేత్తలు ఇక్కడికొచ్చి పరిశోధనలు చేయాలి. ప్రజల ఆరోగ్యంపై దీని దీర్ఘకాలిక దుష్ప్రభావాన్ని అధ్యయనం చేయాలి. నిన్న కూడా నేను అనేకమంది మేధావులు, నిపుణులతో చర్చించాను, వారిచ్చిన సమాచారంపై చర్చించాను. గ్యాస్ లాగా ఉండే స్టైరీన్ లిక్విడ్ గా మారింది. ఈ ప్రమాదంలో అదే విడుదల అయ్యిందా లేక మరో రసాయనం కలిసి గ్యాస్ రూపంలో విడుదల అయ్యిందా అనేది అధ్యయనం చేయాలి. అలాంటప్పుడు దీనిని తేలిగ్గా తీసుకోవడం సబబు కాదు. సమగ్ర దర్యాప్తు విచారణలు లేకుండా ఏం జరిగిందని నిర్ధారించలేం. అక్కడి ఇతర పరిశ్రమల్లోని ఎయిర్ క్వాలిటి డివైస్ లలో, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వద్ద ఎయిర్ క్వాలిటి డివైస్ లలో ఏ సమాచారం నమోదు అయ్యిందో పరిశీలించాలి. ఇది మానవ తప్పిదమా, సాంకేతిక ప్రమాదమా, ఒకవేళ సాంకేతిక ప్రమాదం అయినా దానిని విజువలైజ్ చేయక పోయినా అది తప్పే. లాక్ డౌన్ లో దీనిని మూసివేసినా, మళ్లీ తెరిచేటప్పుడు ఇదేమీ నిత్యావసర వస్తువుల పరిశ్రమ ఏమీ కాదు. లాక్ డౌన్ తర్వాత ఇప్పుడు తెరిచేటప్పుడు అన్నీ ముందే తనిఖీ చేసి ఆయా శాఖలన్నీ ఇవన్నీ పరిశీలించాకే దీనికి అనుమతులు ఇవ్వాల్సివుంది. ఒకప్పుడు ఇది పట్టణ శివారు అయినా ఇప్పుడు నగరానికి మధ్యలో ఉంది.

ఇదేరకమైన ప్రమాదాలు భోపాల్ తదితర చోట్ల జరిగాయి. అక్కడ కూడా సహాయ చర్యలు, ఆర్ధిక సాయం, పరిహారం పంపిణీ ఇలాంటివి చేశారు. ఆయా దుర్ఘటనల్లో ఏం చేశారు, ఎలా చేశారు అనేది చూడాలి. స్టైరీన్ ప్రమాదం ఎక్కడా జరగలేదు. అటువంటప్పుడు దీనిపై మరింత నిశితంగా సమగ్రంగా పరిశీలించాలి, విచారించాలి. దీనికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ , సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆసుపత్రులలో చికిత్స పొందే వాళ్లకు రేపు మళ్లీ సమస్యలు వస్తే ఏం చేయాలో ముందే అధ్యయనం చేయాలి. భవిష్యత్తులో దీనివల్ల ఎదురయ్యే దుష్పరిమాణాలను కూడా ఎదుర్కొనేలా సంసిద్దం కావాల్సివుంది. వాటన్నింటినుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దేశంలో నిపుణులైన వైద్యులు,శాస్త్రవేత్తలు వీటన్నింటిపై సమగ్రంగా విచారించాలి. కానీ దీనిని హ్యాండిల్ చేసిన తీరు చూస్తే చాలా బాధేస్తోంది. ముఖ్యమంత్రి మాటల్లోనే, ఆయన ఏమన్నారంటే ‘‘ఎల్ జి పాలిమర్స్ మల్టీ నేషనల్ కంపెనీ. మృతుల కుటుంబాలకు రూ కోటి పరిహారం అందించేలా చూస్తా. ఎల్ జి సంస్థ ఏ మేరకు పరిహారం ఇస్తుందో చూస్తాం. ఆ పై సాయం ప్రభుత్వం నుంచే అందిస్తాం. చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఎల్ జి కంపెనీలో ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నా. సంస్థను తిరిగి ప్రారంభించాక అక్కడే ఉన్నా,వేరే చోటకు తరలించినా బాధిత కుటుంబాలకు ఉపాధి చూపిస్తామని’’ చాలా క్యాజువల్ గా మాట్లాడారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి చాలా క్యాజువల్ గా మాట్లాడారు. ఇది క్యాజువల్ గా తీసుకోవాల్సిన అంశం కాదు. ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు బాధితులను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని మహాత్మాగాంధీ చెప్పారు.

బాధితులను కాపాడిన ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్ ఇతర సిబ్బందిని అభినందిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతతో పనిచేయాలే తప్ప తేలిగ్గా తీసుకోరాదు. దీని పరిణామాలు ఎలా ఉంటాయో అధ్యయనం చేయాలి. ఏయే చర్యలు తీసుకోవాలో వాటన్నింటినీ తీసుకోవాలి. జరిగిన దుర్ఘటన దుష్ఫ్రభావం విశాఖ ప్రజలపై ఎంత మేర పడింది..ఎయిర్ క్వాలిటి ఎంతమేర దుష్ప్రభావానికి లోనైంది. అక్కడ నివసించే ప్రజల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు మొత్తం ఎస్టాబ్లిష్ చేయాలి. దాని ప్రకారం వాళ్లకు చికిత్స అందించాలి. ప్రపంచ స్థాయిలో నిపుణులైన అన్నిరకాల డాక్టర్లను భాగస్వాములను చేయాలి. ప్రజల ప్రాణాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదు. ఆ విషయం అందరూ గుర్తుంచు కోవాలి. బెస్ట్ సిటిలలో ఒక్కటైన విశాఖలో ఇటువంటి పరిస్థితి ఊహించలేదు. నిన్న రాత్రి కూడా నిద్ర రాలేదు. మనం పోలేక పోతున్నామనే నిస్సహాయత, లాక్ డౌన్ వల్ల అక్కడికి పోలేక పోతున్నామనే బాధ కలిచివేస్తోంది. అందుకే టిడిపి తరఫున అచ్చెన్నాయుడు, చినరాజప్ప, రామానాయుడు త్రిసభ్య బృందాన్ని పంపిస్తున్నాం.అక్కడి ప్రజానీకానికి భరోసా ఇవ్వడానికి, వారిని అన్నివిధాలా ఆదుకోడానికి, అండగా ఉండటానికి పంపిస్తున్నాం. ఫాక్టరీ తరలింపుపై కావాలంటే ఆలోచిస్తాం, పరిహారంపై ఫాక్టరీపై చర్చిస్తాం అని తేలిగ్గా తీసుకోరాదు. ఆ ఫ్యాక్టరీని ముందుగా క్లోజ్ చేయాలి. అక్కడ నుంచి ఫాక్టరీని వెంటనే తరలించాలి. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. సురక్షిత ప్రాంతానికి ఈ ఫ్యాక్టరీని తరలించాలి. ప్రజల ప్రాణాలు ఆరోగ్యం అన్నింటికన్నా ముఖ్యం.జరిగిన దుర్ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకోవడం, నిపుణులతో మాట్లాడటం చేస్తూనే ఉన్నాను. ప్రాణాలకు తెగించి బాధితులను ఆదుకోడానికి వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించిన అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

Advertisements

Latest Articles

Most Read