వైజాగ్ లో, డాక్టర్ సుధాకర్ పై ప్రవర్తించిన తీరు, అమానవీయ కోణం, దేశ ప్రజలనే కాదు, హైకోర్ట్ ని కూడా కలిదించాయి. ఒక డాక్టర్ ని, రోడ్డు పై పడేసి, పెడ రెక్కలు విడిచి, వెనక్కు తీసుకొచ్చి, తాడులతో కట్టేస్తూ, చొక్కా లేకుండా రోడ్డు మీద మోసుకు వెళ్తూ, ఆటోలో పడేయటం, ఆయన్ను కొట్టటం ఇవన్నీ, చూసిన వారు, ప్రభుత్వ తీరుని ఖండిస్తున్నారు. ఆయన తప్పు చేసారే అనుకున్న, ప్రవర్తించే తీరు ఇది కాదని, అందరూ చెప్తున్న మాట. అయితే డాక్టర్ సుధాకర్ కేసు, హైకోర్ట్ సుమోటోగా తీసుకున్న సంగతి తెలిసిందే. దీని పై విచారణ చేసిన హైకోర్ట్, బుధవారం డాక్టర్ సుధాకర్ ని, తమ ముందు హాజరు పరచాల్సిందిగా కోరింది. అయితే, నిన్న బుధవారం కేసు విచారణకు రావటంతో, కోర్ట్ ఆదేశాల ప్రకారం, డాక్టర్ సుధాకర్ ని, హాజరు పరచలేక పోయారు. డాక్టర్ సుధాకర్ ను నేరుగా హాజరు పరచాలేమని, ప్రభుత్వ తరుపు నయ్యవాది, కోర్ట్ కు తెలిపారు. ఆయన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుమతి ఇవ్వాలని కోర్ట్ కు తెలిపారు.

అయితే దీని పై, సుధాకర్ తరుపు న్యాయవాది మాట్లాడుతూ, ఇది ప్రభుత్వం కావాలని చేస్తుంది అని, డాక్టర్ సుధాకర్ కు తగిలిన గాయాలు, కోర్ట్ వారు చూడకుండా, ఆ గాయాలు మానే వరకు, కోర్ట్ ఎదుట హాజరు పరచకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని కోర్ట్ కు తెలిపారు. నేరుగా ఆయన్ను కోర్ట్ ముందుకు ప్రవేశపెట్టలేని పక్షంలో, విశాఖలో ఉన్న ఒక న్యాయవాదిని, ఆయన వద్దకు పంపి, వాంగ్మూలం నమోదు అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అక్కడే ఆయన ఆ గాయాలు చూసి, వాంగ్మూలం నమోది చెయ్యవచ్చని, కోర్ట్ కు తెలిపారు. డాక్టర్ సుధాకర్ తరుపు న్యాయవాది, అభ్యర్ధనను కోర్ట్ కూడా అంగీకరించింది. విశాఖ జిల్లా జడ్జిని డాక్టర్ సుధాకర్ వద్దకు వెళ్ళాలని ఆదేశించింది.

గురువారం సాయంత్రంలోగా, అయన వాంగ్మూలం నమోదు చేసి, ఆయనకు తగిలిన గాయాలు కూడా పరిశీలించాలని కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో, నిన్న సాయంత్రమే, జిల్లా జడ్జి, డాక్టర్ సుధాకర్ వద్దకు వెళ్లి, వాంగ్మూలం నమోదు చేసారు. సుమారుగా, రెండు గంటలకు పైగా, ఆయన వాంగ్మూలం తీసుకున్నారు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా, కోర్ట్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. డాక్టర్ మద్యం తాగారు అందుకే ఇలా చేసాం అంటున్నారు, మద్యం తాగితే, ఇలా చేతులు కట్టేసి, తీసుకొస్తారా ? లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఏమో వదిలేసారు, ప్రభుత్వం దగ్గరుండి మద్యం అమ్ముతూ, మందు బాబుల నుంచి అధిక ధరలు అమ్ముతూ, ఆదాయం ఆర్జిస్తున్నారు, డాక్టర్ సుధాకార్ విషయంలో ఇలా అంటూ, కోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, రాష్ట్రంలో అన్ని పంచాయతీ భవనాలు, ప్రభుత్వ భవనాలకు, బ్రాండింగ్ చేస్తూ, వైసీపీ పార్టీ రంగులు వేసిన కార్యక్రమం మొదలు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్రంలో ఏదైనా పని వేగంగా జరుగుతుంది అంటే, అది రంగులు వెయ్యటమే అని, వెటకారం ప్రజలు మాట్లడకుంటూ ఉండటం వింటున్నాం. రాష్ట్రంలో ఎవరికి పనులు లేకపోయినా, పెయింట్లు వేసే వారికి, మాంచి ఉపాధి ఈ రాష్ట్రంలో ఉంది. వాటర్ ట్యాంకులు నుంచి కరెంటు స్థంబాలు దాకా, అన్నిటికీ రంగులు వేసేస్తున్నారు. పంచాయతీ భవనం అయినా, స్కూల్ అయినా, అన్ని రకాల ప్రజలు వస్తారు, అన్ని పార్టీలు, అన్ని కులాలు వారు, వారి వారి పనులు కోసం, వస్తూ ఉంటారు. అయితే, అలాంటి వాటికి, ఒక పార్టీకి సంబంధించిన రంగులు వెయ్యటం పై, అందరూ ఆశ్చర్యపోయారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, స్కూల్స్ లోను, పంచాయతీ భవనాల్లోనే జరుగుతాయి, అలాంటి చోట, పార్టీ రంగులు వెయ్యటం తప్పు అని అందరూ అంటున్నారు.

అయితే ఈ నేపధ్యంలోనే, హైకోర్ట్ లో కొంత మంది కేసు వేసారు. హైకోర్ట్ ఈ కేసు పై విచారణ జరిపి, ఒక పార్టీ రంగులు, ప్రభుత్వ భవనాలకు వెయ్యటం పై, అభ్యంతరం వ్యక్తం చేస్తూ, వెంటనే రంగులు మార్చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే, ఇలా రంగులు వెయ్యటమే తప్పు అనుకుంటే, ఏకంగా హైకోర్ట్ ఇచ్చిన తీర్పు పై, సుప్రీం కోర్ట్ కు వెళ్లారు. అయితే సుప్రీం కోర్ట్, ఇంకో రెండు మాటలు ఎక్కువ ప్రభుత్వాన్ని విమర్శించింది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఫోటో ప్రతి చోటా పెట్టారు, మేము కూడా సుప్రీం కోర్ట్ లో సీజే ఫోటో పెట్టుకోమా, అలాగే అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కాషాయం రంగు వేసేద్దమా అంటూ, ప్రశ్నించింది. మీరు చేసింది తప్పు అంటూ, సుప్రీం కోర్ట్ లో కూడా తీర్పు వచ్చింది.

దీంతో హైకోర్ట్ మళ్ళీ ఆదేశాలు ఇస్తూ, ఇప్పటికే సుప్రీం కోర్ట్ మా తీర్పుని సమర్ధిస్తూ ఆదేశాలు ఇచ్చింది, ఇప్పటికైనా మీరు రంగులు తొలగించండి, మూడు వారాల్లో రంగులు తొలగించండి, అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళవద్దు అంటూ, ఆదేశాలు ఇచ్చింది. అయితే, ప్రభుత్వం, కొత్త రంగులు అంటూ, వైసీపీ మూడు రంగులు అలాగే ఉంచి, కింద పక్క మాత్రం మట్టి రంగు వేసారు. వైసీపీ మూడు రంగులకు నిర్వచనం చెప్తూ, జీవో ఇచ్చారు. ఆకుపచ్చ రంగు, పాడి పంటలకు నిర్వచనం అని, నీలు రంగు నీలి విప్లవానికి నిర్వచనం అని, తెలుపు పాల విప్లవానికి నిర్వచనం అని, తెలుపుతూ, జీవో నంబర్‌ 623 ఇచ్చారు. అయితే ఈ జీవో సవాల్ చేస్తూ, న్యాయవాది సోమయాజులు హైకోర్ట్ లో కేసు వేయటంతో, పోయిన వారం ఆ జీవో సస్పెండ్ చేసిన ప్రభుత్వం, విచారణ ఈ రోజుకి వాయిదా వేసింది. ఈ రోజు విచారణ చేసిన కోర్ట్, మేము ఆ రంగులు వెయ్యొద్దు అని చెప్పినా, ఎందుకు వేసారు అని అడగగా, ఆ రంగులు ఏ ఉద్దేశంతో వేసామో, పూర్తీ వివరాలు జీవోలో ఇచ్చామని కోర్ట్ కు తెలిపారు. మరో రంగు పెట్టామని చెప్పారు. అయితే ఈ రోజు వాదనలు పూర్తికావటంతో, హైకోర్ట్, ఈ కేసు పై తీర్పుని రిజర్వ్ లో పెట్టింది.

పోతిరెడ్డిపాడులో లేని సమస్యను సృష్టించి, అటు కేసీఆర్, ఇటు జగన్ చేస్తున్న రచ్చ పై, చంద్రబాబు స్పందిచటం లేదు అన్న విమర్శలకు చంద్రబాబు స్పందించారు. ఆయన మాట్లాడుతూ, "పోతిరెడ్డిపాడు తెచ్చింది ఎన్టీఆర్. మచ్చుమర్రి మేమే చేశాం. హంద్రీ నీవా, గాలేరు నగరి, తెలుగు గంగ అన్నీ ఎన్టీఆర్ ప్రారంభిస్తే మేమే పూర్తి చేశాం. పోలవరం జీవనాడి అయితే ముచ్చుమర్రి ప్రాణనాడి అని ఆ రోజే చెప్పాం. గుడ్డొచ్చి పిల్లను వెక్కరించినట్లు మాట్లాడుతున్నారు. కర్నూలు దీక్షలో ఏం మాట్లాడారు..? ఇండియా పాకిస్తాన్ గా రెండు రాష్ట్రాలు మారతాయని అనలేదా..? మళ్లీ అదే కాళేశ్వరానికి ఎందుకు పోయారు..? మీరిద్దరూ కలిసి పని చేయడం లేదా..? కెసిఆర్ చాలా దయార్ద్ర హృదయుడు, వాళ్ల భూభాగం గుండా నీళ్లు తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడని మీరు చెప్పలేదా..? ఇవన్నీ మీరు చేస్తూ, ఇప్పుడు టిడిపిపై నెపం వేయడం ఏమిటి..? తెలుగుగంగ ఎన్టీఆర్ ప్రారంభించారు. భూగర్భంలో నీళ్లు పంపాలని అనుకుంటే ఓపెన్ కెనాల్స్ ద్వారా పంపాలని పట్టుబట్టి సాధించారు. ఇందిరాగాంధీ, ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరు అయ్యారు. "

"రాయలసీమకు నీళ్లిచ్చిందెవరు..? పట్టిసీమ పూర్తి చేసిందెవరు..? నదుల అనుసందానం చేపట్టింది ఎవరు..? పట్టిసీమ ద్వారా నదులు అనుసందానం చేసి గోదావరి నీటిని కృష్ణా ఆయకట్టుకు నీళ్లు ఇచ్చి, శ్రీశైలం నుంచి రాయలసీమకు టిడిపి ప్రభుత్వం నీళ్లిచ్చింది. గండికోటలో పరిహారం చెల్లించి 12టిఎంసిలు నిలబెట్టాం, అందులో 25టిఎంసిలు నిలబెట్టవచ్చు ఎందుకు నిలబెట్టలేక పోయారు..? ఇప్పుడు చిత్తూరు, అనంతపురానికి ఎందుకు నీళ్లివ్వలేక పోయారు..? మీ తండ్రి హయాంలో కట్టిన ప్రాజెక్టుల్లో సీపేజి వస్తే వాటికి అడ్డుకట్ట వేశాం. గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ కు తెచ్చి బొల్లాపల్లి పూర్తి చేసి, నేరుగా బనకచర్లకు తీసుకెళ్లి నల్లమల అడవిలో టన్నెల్ ద్వారా రాయలసీమకు తీసుకెళ్లి రాష్ట్రం సస్యశ్యామలం చేసేందుకు సిద్దం చేస్తే, 66ప్రాజెక్టులు చేపడితే అవన్నీ ఎందుకని రద్దు చేశారు..?"

"ఈ ఏడాదిలో ఒక్క రూపాయి ప్రాజెక్టులపై ఖర్చు చేయలేక పోయారే..? మీ నాయన ఇచ్చిన టెండర్లు నేను రద్దు చేయలేదే. కోర్టులకు వెళ్తే ప్రాజెక్టులు ఆగిపోతాయని ముందుచూపుతో ఆలోచించి వాళ్లతోనే పనులు చేయించి ప్రాజెక్టులు పూర్తి చేయించాను. హక్కులు కాపాడుకోడానికి మనం సిద్దంగా ఉండాలి. అంతే తప్పమిగులు జలాలపై హక్కు వదులుకుంటూ వీళ్ల తండ్రి రాసిన లేఖ వల్లే ఏపికి కష్టాలు. ఈ రోజు జడ్జిమెంట్ కూడా మనకు వ్యతిరేకం వచ్చింది. ఆరోజు ఎన్టీఆర్ ప్రాజెక్టులు చేపడితే అస్యూర్డ్ వాటర్ ఏదని వీళ్ల తండ్రి అడ్డంపడి అడిగారు, వాటర్ ఈజ్ అస్యూర్డ్ అని ఎన్టీఆర్ జవాబిచ్చారు. ఈయనకు(జగన్మోహన్ రెడ్డి) ఏం తెలుసు ఇవన్నీ, ఈయనకు ఏం అవగాహన ఉంది వీటన్నింటిపై. ఇప్పుడేదో రాయలసీమ ఉద్దరిస్తానని ఫోజులు కొడుతున్నారు. వీళ్ల ఊరికి(పులివెందుల) నీళ్లు నేనే ఇచ్చాను. చీనీ చెట్లు ఎండిపోతుంటే నేను ఇచ్చిన నీళ్లే కాపాడాయి. రాయలసీమకు నీళ్లు ఇవ్వకుండా నేనుండే ఇంటిని ముంచాలనే దురుద్దేశంతో నీళ్లన్నీ సముద్రం పాలు చేశారు. ఇప్పుడు రాయలసీమ నీళ్ల కోసం అల్లాడుతున్నాయి. పద్దతి ప్రకారం చేస్తే సహకరించడానికి సిద్దంగా ఉన్నాం. హక్కుల కోసం పోరాడిన పార్టీ టిడిపి. మీలా దుర్మార్గ రాజకీయం చేసే పార్టీ కాదు."

బీసీలకు రిజర్వేషన్ ను తగ్గిస్తూ హైకోర్ట్ తీర్పు ఇవ్వటం, అక్కడ సరిగ్గా రాష్ట్ర ప్రభుత్వం పోరాడలేదని, రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీం కోర్ట్ లో రివ్యూ పిటీషన్ వెయ్యాలని కోరినా పట్టించుకోక పోవటంతో, తెలుగుదేశం పార్టీ బీసీల తరుపున పోరాడటానికి సుప్రీం కోర్ట్ లో పిటీషన్ వేసింది. 50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఇస్తే, బీసీలు బాగా నష్టపోతారని, తెలుగుదేశం పార్టీ నేతలు ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పల్లా శ్రీనివాసలు సుప్రీం కోర్ట్ లో పిటీషన్ వేసారు. అయితే దీని పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్ట్, 50 శాతానికి మించి రిజర్వేషన్లు కుదరవు అని తీర్పు చెప్పింది. 2016లో జయరాజు కేసులో, సుప్రీం కొన్ని మినహాయింపులు ఇచ్చిన విషయాన్ని కోర్ట్ కు చెప్పారు. 2010లో 50 శాతం మించ కూడదు అని ఇచ్చిన తీర్పు సమయానికి, బీసీ జనగణన డేటా లేదని, ఇప్పుడు ఆ సమాచారం మొత్తం ఉందని కోర్ట్ కు చెప్పారు. అయినా సరే సుప్రీం కోర్ట్ ఒప్పుకోలేదు. బీసీల కోసం, తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటం విఫలం అయ్యింది.

దీని పై తెలుగుదేశం పార్టీ నేత కాలవ శ్రీనివాసులు మాట్లాడారు. రాష్ట్రంలో సగంపైగా జనాభా ఉన్న వెనుకబడిన తరగతులతో జగన్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రివర్యులు కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "బీసీల హక్కుల్ని, దశాబ్దాల కాలంగా వారు అనుభవిస్తున్న హక్కుల పరిరక్షణలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ రోజు సుప్రీంకోర్టు, గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ 50 శాతానికి లోబడే రిజర్వేషన్లు ఉండాలని చెప్పిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు సుప్రీంకోర్టులో బలమైన వాదనలను రాష్ట్ర ప్రభుత్వం తరపున గతంలో వినిపించలేక పోయారు అంతకుముందు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, ప్రజలకు నష్టం కలిగించే అంశాలైనప్పటికీ రాజధాని, ఇతరత్రా అంశాల్లో కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని వినియోగించి నిష్ణాతులైన లాయర్లను వినియోగించారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో కక్షపూరితంగా జగన్ ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తోందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. సుమారు 26 ఏళ్లుగా స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల వారు, మహిళలు తెలుగుదేశం పార్టీ వల్ల అవకాశాలు పొందారు. 1994లో పంచాయతీరాజ్ చట్టం సవరించిన తర్వాత 34 శాతం రిజర్వేషన్లను బీసీలు పొందుతున్నారు. 1987 నుంచి స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండటం వల్లే వేలాది మంది క్షేత్రస్థాయిలో వెనుకబడిన తరగతుల వారు నాయకులుగా ఎదగగలిగారు."

"తదనంతర కాలంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా రాణించగలిగారు. ఇవాళ రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం తగ్గడం వల్ 16వేల పదవులు బీసీలు కోల్పోతున్నారు. బీసీలకు వైసీపీ ప్రభుత్వం ఏ రకమైన న్యాయం చేస్తోంది 34 శాతం రిజర్వేషన్లను పరిరక్షించడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల కేంద్రం నుంచి నిధులు రాలేకపోతున్నాయని, అందుకే త్వరగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని వైసీపీ ప్రభుత్వ పెద్దలు చెప్పారు. ఇప్పుడు బకాయిలు వచ్చాయి. ఎన్నికలతో సంబంధం లేకుండా కేంద్రం నిధులు ఇచ్చింది. పాత బకాయిలను కూడా విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే వాతావరణం కూడా లేదు. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను పరిరక్షించేందుకు సత్వరం కొత్త ఆర్డినెన్స్ విడుదల చేయాలి. ఆ ఆర్డినెన్స్ పై ఎవరైనా కోర్టుకు వెళితే సమర్థవంతమైన లాయర్లను పెట్టి బలమైన వాదనలు వినిపించాలి. 2010లో 60.55 రిజర్వేషన్ల శాతాన్ని పరిరక్షించుకోగలిగాం. అలాంటి పరిరక్షణ ఇప్పుడు కూడా జరగాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేకపోతే వెనుకబడిన తరగతుల వారు బలమైన వర్గాలతో పోటీపడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. "

"ఈ సందర్భంలో బీసీల రిజర్వేషన్లను పరిరక్షించుకోవడానికి ప్రభుత్వానికి కలిగిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బీసీల పట్ల వైసీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే జగన కు చెప్పాలి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో పాఠశాలలు, ప్రజారవాణ స్తంభించిపోయాయి. అలాంటప్పుడు ఈ రెండు మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించే అవకాశం లేదు. ఈ సందర్భంలో 34 శాతం రిజర్వేషన్లను పరిరక్షించడానికి ప్రభుత్వానికి కలిగిన అవకాశాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు ప్రభుత్వం ఆలోచన చేయాలి. తమిళనాడులో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో 48శాతం బీసీ జనాభా ఉందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. వీరికి 34శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సహేతుకం. దానికి చట్టబద్ధత తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. ఇప్పటికైనా జగన్ బీసీలకు 34శాతం రిజర్వేషన్లను పరిరక్షిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. న్యాయస్థానంలో బలమైన వాదనలను వినిపించి చట్టబద్ధత కల్పించి బీసీల హక్కుల్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీ ప్రజా ప్రతినిధులు దీనిపై ఆలోచన చేయాలి. ఐక్య పోరాటాలకు ముందుకు రావాలి. బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వినియోగించడం మానుకోవాలి." అని కాలువ అన్నారు.

Advertisements

Latest Articles

Most Read