చిత్తూరు జిల్లా చంద్రగిరిలో మరోసారి వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పసుపు కుంకుమ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతలను నిలువరించే ప్రయత్నం చేసిన టీడీపీ నాయకులను దూషిస్తూ దాడికి దిగారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అనుచరుల దాడిలో పలువురు టీడీపీ నేతలకు తీవ్ర గాయాలయ్యాయి. గొడవతో పసుపు కుంకుమ కార్యక్రమం రసాభాసగా మారింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించినటువంటి పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం చోటు చేసుకుంది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.

chevireddy 02022019 1

దీంతో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీకి పోటీగా చెవిరెడ్డి అనుచరులు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అధికారులు, టీడీపీ నేతలు వారించినా పట్టించుకోకుండా వైసీపీ శ్రేణులు టీడీపీ నేతల పై దాడి చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారులని, అధికార తెలుగుదేశం పార్టీ వారిని అక్కడ పని చేసుకోనివ్వకుండా, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అనుచరులు బలవంతంగా అక్కడ అధికారుల దగ్గర నుంచి చెక్కులు లాక్కుని, హంగామా చేసే ప్రయత్నం చెయ్యటంతో, అక్కడికి వచ్చిన లబ్దిదారులు కూడా షాక్ అయ్యారు. ఎంతో ఆశగా, ఇక్కడకు వస్తే, ఇలా గొడవ చేస్తున్నారని మండిపడుతున్నారు.

chevireddy 02022019 1

రాష్ట్రమంతటా ఒక పండుగ వాతావరణంలో డ్వాక్రా మహిళలకు చెక్కులు, వృద్ధులకు పెంచిన పెన్షన్ డబ్బులు ఇచ్చి, భోజనాలు పెట్టి, బట్టలు ఇచ్చి పంపుతుంటే, ఇక్కడ మాత్రం చెవిరెడ్డి అనుచరులు కావాలని గొడవ చేస్తున్నారు. ప్రభుత్వానికి వచ్చే మంచి పేరు రానివ్వకుండా, అనవసర రాద్ధాంతం చేస్తూ, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసినా వారిని కూడా లెక్క చెయ్యకుండా, ఇష్టం వచ్చినట్టు విర్రవీగుతున్నారు. మరో పక్క, వీళ్ళ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. చెవిరెడ్డి ఇలా చెయ్యటం మొదటి సారి కాదు. జగన్ అండ చూసుకుని, నా ఇష్టం అంటూ రెచ్చిపోతూ ఉంటాడు. వీళ్ళు అధికారంలో లేకపోతేనే ఇలా ఉన్నారు అంటే, పొరపాటున అధికారం వస్తే, ఇక రావణ కాష్టమే.

ఆటోల పై జీవితకాల పన్ను రద్దు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి పెద్దసంఖ్యలో ఆటో డ్రైవర్లు తరలివచ్చారు. పన్ను ఎత్తివేత నిర్ణయంపై ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆటో డ్రైవర్లనుద్దేశించి మాట్లాడారు. తన జీవితానికి ఆటో డ్రైవర్ల జీవితానికి ఎన్నో దగ్గర పోలికలు ఉన్నాయన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని డ్రైవర్లు పోషిస్తుంటే రాష్ట్రాన్ని నడుపుతూ ప్రజల సంక్షేమాన్ని తాను చూస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆటోవాలాలకు ముఖ్యమంత్రి మరిన్ని వరాలు కురిపించారు. ఆటో డ్రైవర్‌ చొక్కా ధరించి తన నివాస ప్రాంగణంలో స్వయంగా ఆటో నడిపి అందరిలోనూ హుషారు నింపారు.

auto 02022019 1

ఇంధన ఛార్జీలు, ఇన్సూరెన్స్ భారం కూడా తగ్గించేలా చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. ఆటోడ్రైవర్లందరికీ పెద్దన్నగా తానుంటాన్నారు. ‘ప్రయాణికుల క్షేమం మీరు చూసుకోండి.. మీ క్షేమం నేను చూసుకుంటాను’ అని వారితో సీఎం అన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ. ‘మీరు ఎలాగైతే ముందుండి ప్రేక్షకుల్ని సురక్షితంగా గమ్యానికి చేరుస్తారో అదే మాదిరిగా తాను కూడా అదరికి అండగా ఉంటూ డ్రైవర్ లా ముందుండి రాష్ట్రాన్ని ముందుకు చేరుస్తానని’ అన్నారు. ఆటొ డ్రైవేర్స్ అందరికీ తాను అన్నగా ఉంటానని వారి కష్టాలు తనకి తెలుసని ఈ సంధర్బంగా మూడు చక్రాల మోటార్ వెహికిల్ ట్యాక్స్ ని రద్ధు చేస్తునట్టుగా ప్రకటించారు. ఇది కేవలం మోదటిదే అని మున్ముందు ఇంకా చాలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వారిని ఇంకా కూడా ఎమ్పౌఏర్ చేయాలనే భావనా తనకి ఉందని వెల్లడించారు.

auto 02022019 1

రాష్ట్రంలో ఉన్న 3,75,000మంది ఆటో డ్రైవర్లకు భవిష్యత్తులో ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామని.. ఇందుకోసం ఆటో డ్రైవర్స్ అంతా కలిసి ఒక యూనియన్‌గా ఏర్పడాలని చంద్రబాబు సూచించారు. ఈ 3,75,000 మంది ఆటో డ్రైవర్లు ఆటో వెనకాల ‘థాంక్యూ సీఎం’ అని రాయించుకోవాలని.. టీడీపీ జెండా పెట్టాలని అన్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం పెరుగుతుందని అప్పుడు ఆటో డ్రైవర్స్ కూడా వాటినే వాడుతారని అన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకోవచ్చునని.. విద్యుత్ బిల్లు విషయంలో ఆటో డ్రైవర్లకు కొంత మినహాయింపునిచ్చే విషయం కూడా ఆలోచిస్తామని చెప్పారు. టీడీపీ అంటేనే పేదల ప్రభుత్వం అని.. పేదవాళ్ల కళ్లలో ఆనందం చూడాలన్నదే తన కోరిక అని అన్నారు. ఈ ట్యాక్స్ రద్ధు వల్ల 140 కోట్ల నష్టం వస్తుందని చెప్పినప్పటికి ఆటో డ్రైవర్ల కష్టమే తనకి ముఖ్యమని ఈ నిర్ణయం తిస్కున్నానని ఆయన వెల్లడించారు.

పేదవాడు ఎప్పుడు సంతోషంగా ఉంటే, ఆ రోజే నిజమైన పండుగ.. ఈ రోజు ఏపిలో అదే పరిస్థితి నెలకొంది... ముఖ్యంగా పల్లెటూరుల్లో సందడి వాతావరణం నెలకొంది.. అటు డ్వాక్రా మహిళలు, ఇటు వృద్దులు, వికాలంగులు, ఒంటరి మహిళలు, అందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకుంటే, ఈ రోజు వారికి చంద్రబాబు ప్రకటించిన వరాలు చేతికి అందుతున్నాయి.. పల్లెటూరుల్లో ప్రతి ఇంటి నుంచి ఒకరు కంటే, ఎక్కువ లబ్దిదారులు ఉన్నారు. ఎక్కడ చూసినా, బోజనాలు, కొత్త బట్టలు పెట్టి మరీ, పెంచిన పెంచన్లు ఇస్తూ, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకమ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2 నుంచి 3రోజుల పాటు రాష్ట్రమంతటా పెన్షన్లు, పసుపు కుంకుమ పేరుతో సందడి చేస్తోంది.

dwacra 02022019 2

ప్రభుత్వం పెన్షన్లను రెట్టింపు చేసింది. మహిళలు స్వయం ఉపాధి ద్వారా మెరుగైన జీవనోపాధి పొందటానికి, ప్రతి కుటుంబం నెలకు రూ. 10 వేలు ఆదాయం పొందడానికి ప్రతి మహిళకు డ్వాక్రా, మెప్మాల ద్వారా రూ. 10 వేలు ఆర్థిక సహాయం చేయబోతున్నారు. పెన్షన్‌ల సొమ్మును ప్రభుత్వం రెట్టింపు చేసింది. జనవరి నుంచే ఇది అమలులోకి వస్తుందని ప్రకటించారు. జనవరిలో పెంచిన రూ. వెయ్యితో పాటు, ఫిబ్రవరిలో ఇచ్చే రూ. 2 వేలు కలిపి ఒక్కొక్కరికి రూ. 3వేలు ఇస్తారు. దివ్యాంగులకు అవయవలోపాన్ని దృష్టిలో ఉంచుకొని అదే తరహాలో రెట్టింపు చేశారు. బ్యాంకర్లతో చర్చించి నగదు సిద్ధం చేశారు. లబ్ధిదారులకు రూ.3వేల చొప్పున పంపిణీ చేయడానికి రూ.2వేల నోటు ఒకటి, రూ.500 నోట్లు రెం డు ఇచ్చే విధంగా బ్యాంకర్లు నగదును ఎం పీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లకు అందజేశారు.

dwacra 02022019 3

ఈ నెల 2 నుంచి పసుపు కుంకుమ పేరుతో డ్వాక్రా, మెప్మా మహిళలకు ఇచ్చే చెక్కులు ఇప్పటికే మండల, మున్సిపల్‌ కేంద్రాలకు చేరాయి. పెన్షన్‌, పసుపు కుంకుమ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సందేశంతో కూడిన లేఖను అధికారులు అందజేయబోతున్నారు. ఈ లేఖలు ఇప్పటికే ఆయా కార్యాలయాలకు చేరాయి. అక్కడి నుంచి పంపిణీ కేంద్రాలకు త రలిస్తున్నారు. గ్రామాలలో పంచాయతీ, రెవెన్యూ కార్యదర్శులు, గ్రామోద్యోగులు పంపిణీ ఏర్పాట్లను చేపట్టారు. మున్సిపల్‌ కేంద్రాలు, నగరపాలక సంస్థలో బిల్‌ కలెక్టర్లు, ఇతర సిబ్బంది వీటిని అందజేస్తున్నారు. ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. తొలిదశలో జి ల్లా సమాఖ్యలో పని చేస్తున్న సుమారు 10 - 15 మందికి వీటిని అందజేస్తారు. డ్వాక్రా మహిళలందరికీ స్మార్ట్‌ఫోన్లు అందజేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వార్నీ... నిన్న పార్లమెంటులో 5 లక్షల వరకూ ఇన్కం ట్యాక్సు లేదని చెప్పగానే మోదీగారితో సహా అరగంటసేపు బల్లలు చరుస్తూ టేబుళ్లు ఇరగ్గొట్టేంత హంగామా చేశారు. వాళ్ల హడావుడి చూసి నిజంగా మోదీగారు ఐదేళ్లలో మొదటిసారి జనానికి ఏదో మేలు చేస్తున్నారేమోనని అందరూ తెగ ఆనందపడిపోయారు. పార్టీలకు అతీతంగా అందరూ కొంచెం సేపు మోడీని అభినందించారు. తీరా చూస్తే మరోసారి జనం చెవిలో పువ్వులు పెట్జారని బోధపడింది. అసలు 5 లక్షల ఆదాయం దేశంలో ఎంతమందికి ఉందండీ? దీంతో పేద, మధ్యతరగతి జీవులకు ఏరకంగా లాభమో చెప్పండి? పోనీ కాస్త సంపాయించుకునేవాళ్లకైనా మేలు జరిగిందేమోనని చూసుకుంటే... 5 లక్షలు దాటి వంద రూపాయలు ఎక్కువైనా ఆ ఐదు లక్షలక్కూడా చచ్చినట్లు ట్యాక్సు కట్టాల్సిందేనంట.

jumla 02022019

కేంద్రం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో వేతనజీవులకు గొప్ప ఊరటగా పేర్కొంటున్న "ఆదాయపుపన్ను మినహాయింపు పరిమితి పెరుగుదల"లో మతలబు ఉందంటున్నారు ఆర్ధిక నిపుణులు. ఈ ప్రకటనను పరిశీలిస్తే... పన్నుకు అర్హమైన సంవత్సరాదాయం రూ.5 లక్షల వరకు ఉంటే ఆదాయపుపన్ను చెల్లించవలసిన అవసరం లేదని పైకి కనిపిస్తున్నప్పటికీ, నిశితంగా పరిశీలిస్తే అందులోని మతలబు బోధపడుతుందంటున్నారు. ఆర్థికమంత్రి గోయల్ ప్రకటన ప్రకారం పన్నుకు అర్హమైన వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్నప్పుడు మాత్రమే పూర్తిగా పన్ను మినహాయింపు వస్తుంది. ఈ రూ.5 లక్షల పరిమితి దాటినట్లయితే ప్రస్తుతం అమలులో ఉన్న పన్ను రేటు స్లాబ్ ప్రకారమే పన్ను వసూలు చేస్తారు.

jumla 02022019

ఉదాహరణకు మీ వార్షికాదాయం రూ.6 లక్షలుగా ఉంటే, ఆ పై లక్ష రూపాయలు మాత్రమే పన్నుకు అర్హమైన ఆదాయం అనుకుంటే పొరపాటు. అప్పుడు ప్రస్తుత స్లాబ్ ప్రకారం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వార్షికాదాయం వరకూ 5 శాతం పన్ను (రూ.12,500), ఆ పైన ఉన్న మిగిలిన లక్ష రూపాయల మొత్తానికి 20 శాతం (రూ.20,000) మొత్తం రూ.32,500 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి ఇప్పటికీ రూ.2.5 లక్షలుగానే ఉంది. బీజేపీ వేసిన జూమ్లాలో ఇది ఒకటి. ప్రజలు పిచ్చోళ్ళు వాళ్ళని ఎలా అయినా బకరాలను చెయ్యచ్చు అనుకునుటుంది బీజేపీ పార్టీ.

Advertisements

Latest Articles

Most Read