ఎన్నికలకు మరో నాలుగు నెలలే ఉండటంతో వైఎస్సాఆర్ కాంగ్రెస్ అభ్యర్థులపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన విజయవాడ లోక్ సభకు గట్టి అభ్యర్థిని బరిలోకి దింపాలని జగన్ యోచిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున కోనేరు రాజేంద్ర ప్రసాద్, టీడీపీ తరుపున కేశినేని నాని పోటీ చేశారు. అయితే కేశినేని విజయం సాధించారు. దీంతో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన కోనేరు రాజేంద్రప్రసాద్ దాదాపు రాజకీయాల్లో నుంచి తప్పుకున్నట్లే. ఎన్నికలకు రెండు నెలల ముందు వచ్చిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ గత ఎన్నికల్లో డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టారు. దాదాపు 80 నుంచి వంద కోట్ల వరకు ఖర్చు పెట్టారని ప్రచారం జరిగింది. ఎన్నికల తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరమై పోయారు. దాదాపు నాలుగున్నరేళ్లుగా విజయవాడ ఎంపీ అభ్యర్ధి అని చెప్పుకునేందుకు ఓ నాయకుడు ఆ పార్టీకి దొరకలేదు.

vij 20122018

ఉన్న నాయకులు కూడా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందనే భయంతో తప్పించుకు తిరిగే పరిస్థితి. ఆ మధ్య పారిశ్రామిక వేత్త దాసరి జైరమేష్ పేరు తెరపైకి వచ్చినా ఆయన సుముఖంగా ఉన్నారో లేదో తెలీని పరిస్థితి. వైసీపీ తరపున ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగినా దాని మీద క్లారిటీ మాత్రం ఇప్పటికీ లేదు. అయితే ఇప్పుడు మళ్ళీ, ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపార వేత్త పొట్లూరి వరప్రసాద్ పేరును జగన్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పీవీపీ గతంలోనూ విజయవాడ ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నించారు. జనసేన తరుపున గత ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. కాని పవన్ కల్యాణ్ జనసేన పార్టీ గత ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయకపోవడంతో పీవీపీ కి ఛాన్స్ దక్కలేదు. అయితే ఈసారి జగన్ పార్టీ నుంచి పోటీ చేయాలని పీవీపీ కూడా భావిస్తున్నారు. ఈ మేరకు జగన్ తో ఇప్పటికే పొట్లూరి వరప్రసాద్ చర్చించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

vij 20122018

విజయవాడ లోక్ సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల భాధ్యతను కూడా జగన్ పీవీపీ పై పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కేశినేని నాని పై, విజయవాడ ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉంది. అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుంది. దీంతో వైసీపీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఈ సారి కూడా మళ్ళీ కేశినేని నాని గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. ఇక మచిలీపట్నంలో బీసీలకు ఇస్తామంటున్న జగన్.. బాలశౌరి పేరును ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన వల్లభనేని బాలశౌరికి మచిలీపట్నం పార్లమెంట్‌ బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన ఎంత వరకూ సిద్దంగా ఉంటారన్నది అనుమానమే. గత ఎన్నికల్లో బందరులో పోటీ చేసిన కొలుసు పార్థసారథి జిల్లా పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. గతంలో ఆయన పెనమలూరు టిక్కెట్ ఆశించినా., చివరకు బందరులో పోటీ చేసి ఓడిపోయారు. పార్లమెంటుకు వెళ్లేందుకు సారథి ఇష్టపడకపోవడంతో బందరు స్థానం కూడా ఊగిసలాటలో ఉంది.

పార్లమెంట్‌ ఎన్నికలు నెలన్నర ముందుగానే వచ్చే అవకాశాలున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రాభవం కోల్పోకముందే ప్రజాతీర్పు కోరితే అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశముందనే అభిప్రాయం బీజేపీ అగ్రనేతల నుంచి వినిపిస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికల ముందు నిర్వహించిన అనేక సర్వేలు 2019 ఎన్నికల్లోనూ ఎన్డీఏ అధికారంలోకి రానున్నారని, అయితే ఈసారి బీజేపీ సీట్ల సంఖ్య తగ్గే అవకాశాలున్నాయని వెల్లడైంది. ఎన్డీఏ మిత్రపక్షాల మీదనే బీజేపీ ఆధారపడాల్సి ఉందని హెచ్చరికలు వచ్చాయి. తాజాగా రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లి ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం కాగా, మధ్యప్రదేశ్‌లో గట్టిపోటీ ఇచ్చినప్పటికీ అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ప్రతి పక్ష కాంగ్రెస్‌ మూడు రాష్ట్రాల్లోనూ పాగా వేయడం తోపాటు 2019 సార్వత్రిక ఎన్నికలకు ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటుకు యత్నా లు ముమ్మ రం చేసిన దరిమిలా ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకమునుపే సాధ్యమైనంత త్వరలో లోక్‌సభ ఎన్నికలకెళ్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అని బీజేపీ అధినాయత్వం యోచిస్తోంది.

bjp 20122018 2

రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో ‘హిందీ బెల్ట్‌’గా గుర్తింపు పొందిన ఈ రాష్ట్రాల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా, ఎంపీ ఎన్నికల్లో ఒకటి రెండు స్థానాలు తగ్గినప్పటికీ, కాంగ్రెస్‌ కంటే బీజేపీ అత్యధిక లోక్‌ సభ స్థానాలు గెలుపొందే అవకాశా లున్నాయని సర్వేలు చెబుతున్న విషయాన్ని బీజేపీ పెద్దలు గుర్తుచేస్తున్నారు. అయితే ఇక్కడ ఎన్డీఏ మళ్లి అధికారంలోకి రావాలంటే మిత్రపక్షాల సహకారం అత్యంత ఆవశ్యకం. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామి ఆర్‌ఎల్‌ఎస్‌పీ గుడ్‌బై చెప్పింది. ఆ పార్టీ అధ్యక్షుడు కుష్వాహ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, బీహార్‌లో లాలూప్రసాద్‌ నేతృత్వంలోని ఆర్జేడీ కూటమిలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. అంతకుముందే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాల్లోనే ఎన్డీఏ నుంచి బయటకొచ్చేసింది. శివసేన, అకాలీదళ్‌ కూడా బీజేపీ పెద్దల తీరుపై గుర్రుగా ఉంది. భాగస్వామ పక్షాలను పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మిత్రపక్షాలను బుజ్జగించి, రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కలిసి కట్టుగా పోటీ చేయాలని నిర్ణయానికి బీజేపీ పెద్దలు వచ్చినట్లు సమాచారం.

bjp 20122018 3

ముందస్తు ఎన్నికల ప్రక్రియకు బీజేపీ పెద్దలు చేపట్టిన చర్యలు ఫలప్రదిస్తే మాత్రం పార్ల మెంట్‌ రద్దు లాంఛనప్రాయమే అవుతుంది. అంత కంటే ముందు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టాల్సి ఉంది. ఆ తతంగానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు అనేక కొత్త పథకాలు ప్రకటించే అంశాలను బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. బడ్జెట్‌కు పార్లమెంట్‌ ఆమోదం లభించిన వెంటనే, లోక్‌సభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని మోడీ, అమిత్‌ షా ద్వయం యోచన. అదేగనుక జరిగితే సార్వత్రిక ఎన్నికలకు ఫిబ్రవరి ఆఖరి వారంలోనే షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశముంది. ఏప్రిల్‌ మొదటి వారానికంతా ఎన్నికల ప్రక్రియ ముగించి, రెండో వారంలోనే ఢిల్లిలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అయితే ఈ ఎన్నికలతో పాటే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయో లేదో, తెలియాల్సి ఉంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్‌కు బహిరంగంగా మద్దతిచ్చిన వైసీపీ మారుతున్న పరిణామాలతో మరో సెల్ఫ్ గోల్ చేసుకున్నామా అని మదనపడుతోంది. తెలంగాణలో వైసీపీ నేరుగా టీఆర్ఎస్‌కు మద్దతిచ్చింది. ఆ పార్టీకి చెందిన ప్రధాన మీడియా, సోషల్ మీడియా విభాగం కూడా కొన్నాళ్ల పాటు టీఆర్ఎస్ కోసమే పని చేసింది. కూకట్ పల్లి లాంటి నియోజకవర్గాల్లో.. టీఆర్ఎస్ కు మద్దతుగా.. వైసీపీ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. అందుకే గెలిచిన తర్వాత మాధవరం కృష్ణారావు .. జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. దానికి తగ్గట్లుగానే టీఆర్ఎస్ గెలవగానే.. ఏపీలోని వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు పెట్టుకుని.. కేకులు కట్ చేసుకుని సంబరాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ విజయాన్ని జగన్ విజయంగా వైసీపీ కార్యకర్తలు భావించారు. అంత వరకూ బాగానే ఉన్నా.. ఇలా మద్దతు ఇవ్వడం వల్ల జగన్ సాధించేమిటన్న విమర్శలు ప్రారంభమయ్యాయి.

ap 20122018 2

ఏపీకి ప్రత్యేకహోదాను వ్యతిరేకిస్తున్న కేసీఆర్ విజయంతో ఎలా వేడుకలు చేసుకుంటారని టీడీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. అదే సమయంలో ప్రజల్లో కూడా.. వైసీపీ తీరుపై చర్చ ప్రారంభమయింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తాము ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని ప్రకటించడంతో.. వైసీపీకి తాము చేసిన తప్పు అర్థమయిందన్న ప్రచారం జరుగుతోంది. వెంటనే బొత్స లాంటి నేతలు.. తమకు టీఆర్ఎస్ తో సంబంధం ఏమిటని.. మీడియా మందుకు వచ్చి చెప్పడం ప్రారంభించారు. అదే సమయంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ .. ఏపీకి వస్తా.. జగన్‌కు మద్దతిస్తానంటూ.. చేసిన ప్రకటన.. వైసీపీకి మరిన్ని ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. దీనిపై టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. వరుసగా.. పొరుగు రాష్ట్రం నుంచి పార్టీలు దండయాత్రలా వచ్చి.. జగన్ కు మద్దతిస్తే.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారు బాధపడుతున్నారు. వారి మద్దతు వల్ల లాభం కన్నా ఎక్కువగా నష్టం జరుగుతుందని భావిస్తున్నారు. అందుకే.. వైసీపీ నేతలు ఎక్కువగా స్పందించకుండా.. సంయమనం పాటిస్తున్నారు.

ap 20122018 3

ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఎలాంటి పాత్ర పోషిస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నేరుగా పోటీ చేసినా లేకపోతే.. జగన్ లేదా పవన్ లకు మద్దతిచ్చినా.. అదో సెంటిమెంట్ తరహా అస్త్రంగా టీడీపీ చేతికి చిక్కే అవకాశం ఉంది. అందుకే.. తెలంగాణ ఎపెక్ట్ ఏపీ రాజకీయాల్లో కీలకం కానుంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో .. కాంగ్రెస్ తో పొత్త పెట్టుకుని 13 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్న కేసీఆర్ మాటల వెనుక అర్థం ఎన్నికల్లో పోటీ చేయడమేనని కొంత మంది చెబుతున్నారు. కానీ టీఆర్ఎస్ వైపు నుంచి ఈ విషయంలో క్లారిటీ లేదు కానీ వైసీపీ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి. తెలంగాణలో మాదిరి.. చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా.. ఏపీ ఎన్నికల ఎజెండా మారితే.. తాము సైడైపోవాల్సి వస్తుందనేది ఆ భయం. ఏ విధంగా చూసినా ఏపీలో జరగనున్న ఎన్నికల్లో తెలంగాణ ఎఫెక్ట్ కానుందని అంచనా వేస్తున్నారు.

అమరావతిలో మరో ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్క్రుతం కాబోతోంది. 4 మీటర్ల రాక్ ఫౌండేషన్‌తో పాటు డయాగ్రిడ్ నిర్మాణాలను చేపట్టారు. సచివాలయం శాఖాధిపతుల కార్యాలయాలు జీఏడీ టవర్ల నిర్మాణంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. వచ్చే వారం మూడు రోజుల పాటు రెండో టవర్‌లో రాక్ ఫౌండేషన్‌ పనులు చెయ్యనున్నారు. ఈ పని కోసం, 11వేల 500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను ఉపయోగించబోతున్నారు. ఇది 17 వ తారీఖునే జరగాల్సి ఉన్నా, తుఫాను కారణంగా వాయిదా పడింది. రాజధాని అమరావతిలో గ్రాఫిక్స్ మాత్రమే ఉన్నాయని వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ... నాలుగు మీటర్ల లోతు నుంచి మొత్తం కాంక్రీట్ నింపి ఆ తర్వాత డయాగ్రీట్ భవనం కూడా భారత దేశంలో మొట్టమొదటి సారిగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సచివాలయ భవనాల నిర్మాణం మరో 18 నెలల్లో పూర్తి చేసేందుకు ఏపీ సీఆర్డీయే రంగం సిద్ధం చేసింది.

amaravati 20122018

ఎల్ అండ్ టీ, షాపూర్జీ, పల్లోంజీ, నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ.. మొత్తం మూడు కంపెనీలు నిర్మాణంలోపాలు పంచుకుంటున్నాయి. అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోంది. డిజైన్ల ప్రక్రీయ దాటి నిర్మాణంలోకి వచ్చింది. గ్రౌండ్ లెవెల్‌లో జరుగుతున్న పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, గెజిటెడ్ అధికారులు, నాలుగోతరగతి ఉద్యోగుల నివాసాల కోసం 10 టవర్ల నిర్మాణం ఇప్పటికే తుది దశకు చేరుకుంది. నిర్మాణ నగరాన్ని తలపించే విధంగా జరుగుతున్న పనుల్లో సుమారు 40 వేల మంది కార్మికులు బాగస్వాములవుతున్నారు. రాయపుడి గవర్నమెంట్ కాంప్లెక్స్ సమీపంలో శాస్వత సచివాలయం, శాఖాధిపతులు కార్యాలయాలు, సాధారణ పరిపాలన కార్యాలయాలు, కమిషనరేట్ల నిర్మాణం ప్రారంభమైంది.

amaravati 20122018

మొత్తం ఐదు టవర్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇందుకు 1,2 టవర్ల నిర్మాణాన్ని షాపూర్జీ, పల్లోంజీ సంస్థలు చేపట్టగా 3,4 టవర్ల నిర్మాణాలను ఎల్ అండ్ టీ, ఐదో టవర్ నిర్మాణాన్ని నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ చేపట్టింది. మరో పక్క, అమరావతిలో ముఖ్య పర్యాటక ఆకర్షణగా నిలిచే ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టును నీరుకొండలో గల ఎత్తయిన పర్వత ప్రాంతంపై చేపడుతున్నారు. కొండపై 32 మీటర్ల ఎత్తున నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై ఎల్‌అండ్‌టీకి చెందిన ‘డిజైన్స్ అసోసియేట్స్’ రూపొందించిన ఆకృతులను ముఖ్యమంత్రి పరిశీలించారు. మొత్తం ప్రాజెక్టుకు రూ.406 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. ఈ మొత్తంలో చాలావరకు విరాళాలుగా సేకరిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ట్రస్టు ఒకదాన్ని ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంక్రీట్‌తో కాకుండా కాంస్య విగ్రహంగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisements

Latest Articles

Most Read