విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి గురించి తెలియని తెలుగు వాడు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. పీఠాధిపతి కంటే ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన అత్యంత ప్రీతిమంతుడిగా గుర్తింపు ఎక్కువ. రాజకీయ నాయకులే కాదు... అధికారులూ ఆ స్వామి ప్రసన్నం కోసం క్యూ కడుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? మరి... సాక్షాత్తూ ముఖ్యమంత్రులే వచ్చిపోతుంటే తమదేముందని ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లు కూడా శారదా పీఠాన్ని దర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పనులైనా విశాఖలోని శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతిని ప్రసన్నం చేసుకుంటే అయిపోతాయనే, రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారనే భావన కలిగేలా ముఖ్యమంత్రులు, మంత్రులు కొంతమంది ఆయన దర్శనం కోసం పోటీపడుతున్నారు.

sunitha 11062019 1

ఇలాంటి మహా మహిమ గల సమిజీ పట్ల, గాయని సునీత ఫైర్ అయ్యారు. ఓ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి తన సందర్శకుల జాబితాలో గాయని సునీత కూడా ఉన్నారన్న వ్యాఖ్యపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. అంత గొప్ప వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు. ఇలా ప్రతి ఒక్కరు తన పేరు వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రతిరోజు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ జీవితంలో ఎదగడానికి ప్రయత్నిస్తుంటాం. ఈ క్రమంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా సూటిపోటి మాటలతో బాధపెడుతుంటారు. నేనెప్పుడూ అలాంటివి పట్టించుకోకుండా ముందుకెళ్లాలనుకుంటా. కానీ కొన్నిసార్లు మాత్రం స్పందించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది అందుకే స్పందించాను." - సునీత, గాయని

వైఎస్ జగన్ తో వైసీపీ ఎమ్మెల్యే రోజా భేటీ కానున్నట్లు వార్తలు వెలువడ్డాయి. మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృ‌ప్తితో ఉన్న రోజాను వైఎస్ జగన్ అమరావతికి పిలిపించారని.. రోజా హుటాహుటిన నగరి నుంచి విజయవాడ పయనమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రోజా స్పందించారు. కొద్దిసేపటి క్రితం విజయవాడకు రోజా చేరుకుని మీడియాతో మాట్లాడారు. తనను ఎవరూ అమరావతికి రమ్మనమని చెప్పలేదని.. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల కోసం తానే ఇక్కడికి వచ్చానని చెప్పారు. మంత్రి పదవి దక్కలేదన్న బాధ తనకు లేదని అన్నారు. కులాల సమీకరణ కారణంగానే తనకు పదవి దక్కలేదని అన్నారు. కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు రోజా దూరంగా ఉంటూ వస్తున్నారు.

roja 11062019

అంతేకాదు జూన్ 8న అమరావతిలో జరిగిన కొత్త మంత్రుల స్వీకారోత్సవానికి కూడా రోజా హాజరుకాలేదు. ఎమ్మెల్యే రోజాకు నామినెటేడ్ పోస్ట్, ఆర్టీసీ చైర్మ‌న్, మ‌హిళా క‌మీష‌న్ చైర్మ‌న్ ఇచ్చే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.. వాటిపై కూడా ఆమె మాట్లాడారు. నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని తనకు ఎవరూ చెప్పలేదని అన్నారు. అలాగే మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరు ఎమ్మెల్యేల హాజరు అవసరం లేదని, అందుకే రాలేదని ఆమె స్పష్టం చేశారు. మంత్రి పదవులు దక్కించుకున్నవారికి రోజా శుభాకాంక్షలు తెలిపారు.

సోమవారం సీఎం జగన్ ఆధ్వర్యంలో తొలి కేబినెట్ భేటీ జరిగింది. సుమారు ఐదున్నర గంటలపాటు కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొదటి కేబినెట్ సమావేశంలో జగన్, అటు మంత్రులకి, ఇటు అధికారులకు షాక్ ల మీద షాక్ లు ఇచ్చారు. ముందుగా అధికారులను ఉద్దేశిస్తూ, మంత్రులకు చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకోవద్దని అధికారులకు సూచించారు. తన కేబినెట్‌లో మంత్రులు డమ్మీలు కాదని, హీరోలని చెప్పారు. మంత్రులు, అధికారులు కలిసి పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని కోరారు. అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఈ సందర్భంగా జగన్ మంత్రులకు కూడా సూచించారు. గతంలో ఆయా మంత్రిత్వశాఖల్లో జరిగిన అవినీతిని ప్రజలకు తెలిసేలా వెబ్‌సైట్‌లో పెట్టాలని మంత్రులకు జగన్‌ సూచించారు.

cabinet 11062019

ఇక మొదటి సారి అధికారంలోకి వచ్చాం, ఆర్ధికంగా నిలదొక్కుకుందాం అని అనుకున్న మంత్రులకు జగన్ షాక్ ఇచ్చారు. "అవినీతి రహిత పాలనే లక్ష్యం. అవినీతి మరక అంటితే మందలింపులుండవ్‌. అలాంటి ఆరోపణలు వచ్చిన వెంటనే సంబంధిత మంత్రిని పదవి నుంచి తొలగించడమే. రెండున్నరేళ్లపాటు పదవికి గ్యారెంటీ ఉండదు. రాష్ట్ర మంత్రిమండలి తొలి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రులకు ఈమేరకు కర్తవ్యబోధ చేశారు. నా దృష్టిలో లేకుండా క్షేత్రస్థాయిలోగానీ బహిరంగంగా గానీ ఏ హామీలు ఇవ్వకండి.. అలా మీ అంతట మీరే హామీలిచ్చేస్తే వాటిని అమలు చేయలేకపోతే మీ వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతింటుంది. ప్రభుత్వంపైనా ఆ ప్రభావం పడుతుంది అని జగన్ అన్నారు.

cabinet 11062019

"కాంట్రాక్టులు, టెండర్లు, ఇంజినీరింగ్‌ పనుల్లో అవకతవకలు జరిగి ఉంటే వాటిని రద్దు చేసి, కొత్తగా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేద్దాం. న్యాయ కమిషన్‌ ఏర్పాటు చేసేందుకు ఒక న్యాయమూర్తిని నియమించాలని ఇప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరాం. కమిషన్‌ ఏర్పాటయ్యాక టెండర్ల వివరాలను ఆ కమిషన్‌ ముందుంచుతాం. న్యాయ కమిషన్‌ సూచనలు, సిఫార్సుల మేరకు టెండర్లు పిలుస్తాం. గత ప్రభుత్వం వారికి కావాల్సిన కొద్దిమంది గుత్తేదార్లకే కాంట్రాక్టు దక్కేలా టైలర్‌ మేడ్‌ ప్రీ క్వాలిఫికేషన్‌ సిద్ధం చేసి వాటి ఆధారంగా వారికి కావాల్సినవారికే టెండర్లు కట్టబెట్టుకున్నారు. అలాంటి అవకతవకలను చక్కదిద్దుదాం. వాటిలో వృథా అవుతున్న మొత్తాన్ని ఆదా చేసేందుకు ఆ పనులను రద్దు చేద్దాం. రివర్స్‌ టెండర్ల విధానం ద్వారా ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా చేసి ఎక్సెస్‌ రేట్లు రాకుండా చూస్తాం." అని జగన్ అన్నారు. అయితే ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన అందరూ, ఇలా అవినీతి లేని సమాజం నిర్మిస్తాం అని చెప్పటం, ప్రజలు అవి వినటం, మళ్ళీ వీళ్ళే అవినీతి చెయ్యటం చూస్తూనే ఉన్నారు ప్రజలు. అంతెందుకు, ఈ మాటలు చెప్పిన జగనే, అవినీతి కేసుల్లో జైలు జీవితం గడిపి, బెయిల్ పై బయట తిరుగుతున్న సంగతి తెలిసిందే. చూద్దాం, నిజంగా మార్పు తెస్తే మంచిదేగా...

మ‌న రాష్ట్రానికి కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా కేంద్ర మాజీమంత్రి సుష్మాస్వ‌రాజ్ నియ‌మితుల‌య్యారంటూ మీడియాలో ఓ వార్త తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది. నేష‌న‌ల్ మీడియా కూడా దీన్ని ప్ర‌సారం చేసింది. సోమవారం దేశ రాజ‌ధానిలో సుష్మాస్వ‌రాజ్ ఉప రాష్ట్ర‌ప‌తి ఎం వెంక‌య్య నాయుడిని క‌లుసుకోవ‌డం, దాదాపు అదే స‌మ‌యంలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ భేటీ కావ‌డంతో ఈ వార్త పుట్టుకొచ్చింది. దావాన‌లంలా వ్యాపించింది. ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ ఖాయ‌మ‌య్యార‌నే వార్త‌లు ఊపందుకున్నాయి. జోరుగా చ‌క్క‌ర్లు కొట్టాయి. చివ‌రికి- సుష్మా స్వరాజ్ స్వ‌యంగా ఇందులో జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. ఇదంతా అస‌త్యం అంటూ ఆమె వివ‌ర‌ణ ఇచ్చుకునేంత వ‌ర‌కు వెళ్లిందీ ప‌రిస్థితి.

govenor 11062019

ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా సుష్మా స్వరాజ్ నియ‌మితుల‌య్యార‌నే వార్త‌ను పుట్టించిందెవ‌రో తెలుస్తే ఆశ్చ‌ర్య‌పోతారు. ఈ వార్త‌ను పుట్టించింది స్వ‌యంగా కేంద్ర మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌. ఈ వార్త పుట్టుకుని రావ‌డానికి ఆయ‌నే కార‌ణం. ఆయ‌న చేసిన ఓ ట్వీట్‌.. ఈ వార్తకు కారణ‌మైంది. బీజేపీ నాయ‌కురాలు, మాజీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వ‌రాజ్ ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితుల‌య్యారు.. అనేది దీని సారాంశం. అప్ప‌టికే చెల‌రేగుతున్న ఊహాగానాలు, అనుమానాల‌కు ఈ ట్వీట్ మ‌రింత బ‌లాన్ని ఇచ్చిన‌ట్ట‌యింది. అది త‌ప్పుడు స‌మాచారం అని ఆయ‌నకు త‌రువాత తెలిసిన‌ట్టుంది. ఆ ట్వీట్‌ను డిలెట్ చేసేశారు. ఈ వ్య‌వ‌హారం మొత్తానికీ కేంద్ర‌బిందువైన సుష్మాస్వ‌రాజ్ కూడా దీనిపై స్పందించారు. తానేదో మర్యాద‌పూర‌కంగా ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడిని క‌లిశాన‌ని, అంత మాత్రాన త‌న‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా చేసేశార‌ని ఆమె వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. కేంద్ర‌మంత్రి బాధ్య‌త‌ల నుంచి వైదొల‌గిన త‌రువాత కాస్త ఖాళీ స‌మ‌యం దొర‌క‌డంతో తాను వెంక‌య్య నాయుడిని క‌లుసుకున్నాన‌ని చెప్పుకొచ్చారు. అంత మాత్రానికే ట్విట్ట‌ర్ త‌న‌ను గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మించిందంటూ ట్వీట్ చేశారు.

Advertisements

Latest Articles

Most Read