ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం క్షీణించింది. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయన్ని కుటుంబ సభ్యులు లండన్ తీసుకువెళ్తున్నారు. అక్బరుద్దీన్ కోలుకోవాలని దేవుడిని ప్రార్థించాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభిమానులను కోరారు. గతేడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచార సమయంలోనే అక్బురుద్దీన్ తన ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని తనకు ఆరోగ్యం సహకరించటంలేదని అన్నారు. తన మూత్రపిండాలు పూర్తిగా చెడిపోయాయని. గతంలో తనపై జరిగిన దాడి సమయంలో పొట్టలోకి దూసుకెళ్ళిన తూటాల ముక్కలు కీడ్నీల దగ్గర ఉన్నాయని, వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. డిసెంబర్ 20, 2018 న ఒక విందుకు హాజరైన సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి రావటంతో ఒవైసీ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. 2011 ఏప్రిల్ 30న చాంద్రాయణ గుట్టలో ప్రత్యర్ధులు అక్బరుద్దీన్ పై దాడికి పాల్పడ్డారు.
ప్రత్యర్ధులు ముందుగా కత్తులతో దాడిచేసి తర్వాత కాల్పుల జరిపారు. ఆ దాడిలో ఆయన శరీరంలోకి 2 బుల్లెట్లు దూసుకు పోయాయి. 17 కత్తి పోట్లు ఉన్నాయి. గతేడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచార సమయంలోనే అక్బురుద్దీన్ తన ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని తనకు ఆరోగ్యం సహకరించటంలేదని అన్నారు. తన మూత్రపిండాలు పూర్తిగా చెడిపోయాయని. గతంలో తనపై జరిగిన దాడి సమయంలో పొట్టలోకి దూసుకెళ్ళిన తూటాల ముక్కలు కీడ్నీల దగ్గర ఉన్నాయని, వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. డిసెంబర్ 20, 2018 న ఒక విందుకు హాజరైన సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి రావటంతో ఒవైసీ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. 2011 ఏప్రిల్ 30న చాంద్రాయణ గుట్టలో ప్రత్యర్ధులు అక్బరుద్దీన్ పై దాడికి పాల్పడ్డారు. ప్రత్యర్ధులు ముందుగా కత్తులతో దాడిచేసి తర్వాత కాల్పుల జరిపారు. ఆ దాడిలో ఆయన శరీరంలోకి 2 బుల్లెట్లు దూసుకు పోయాయి. 17 కత్తి పోట్లు ఉన్నాయి.