ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీకి..జ‌గ‌న్ కు తొలి నుండి విధేయుడిగా ఉన్న మంగ ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి సీఆర్డీఏ ఛైర్మ‌న్‌గా నియ‌మించాల‌ని నిర్ణ‌యించారు. దీని కోసం గ‌త ప్ర‌భుత్వం చేసిన చ‌ట్టంలో అవ‌స‌ర‌మైన మార్పుల‌ను చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేశ్ మీద గెలిస్తే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌క‌టించారు. ఆయ‌న గెలిచినా..స‌మీక‌ర‌ణాల్లో భాగంగా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. దీంతో..ఇప్పుడు ఆయ‌న‌కు కీల‌క‌మైన సీఆర్డీఏ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి కీల‌క ప‌ద‌వి ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. రాజ‌ధాని వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య వేక్షించే సీఆర్డీఏ బాధ్య‌త‌ల‌ను ఆర్కేకు అప్ప‌గించాల‌ని డిసైడ్ అయ్యారు.

alla 13062019

అందులో భాగంగా సీఆర్డీఏ ఛైర్మ‌న్‌గా ఆళ్ల నున నియ‌మిస్తూ సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. అయితే, ఈ నిమాయ‌కానికి సంబంధించి చట్ట స‌వ‌ర‌ణ చేయాల్సి ఉంటుంది. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో సీఆర్డీఏ ఛైర్మ‌న్‌గా ముఖ్య‌మంత్రి ఉండే విధంగా బిల్లు ను ఆమోదించారు. ఇప్పుడు ముఖ్య‌మంత్రి కాకుండా.. ఎమ్మెల్యే స్థాయి వ్య‌క్తిని ఛైర్మ‌న్‌గా నియమించాలంటే ఖ‌చ్చితంగా చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. అవ‌స‌ర‌మైన విధి విధానాల‌ను పూర్తి చేసి త్వ‌ర‌లోనే ఆయ‌న‌కు కీల‌క‌మైన ఈ నామినేటెడ్ పోస్టును అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించారు. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క్రియ ను పూర్తి చేసి ఉత్త‌ర్వులు జారీ చేయ‌నున్నారు. ఆళ్ల రామ‌కృష్నారెడ్డి తాజా ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నుండి పోటీ చేసారు. ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లోనూ ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి గెలుపొందారు.

alla 13062019

మంగ‌ళ‌గిరి నుండి మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు మాజీ మంత్రి లోకేశ్ పోటీ చేసారు. ఆళ్ల రామ‌కృష్నారెడ్డిని మంగ‌ళ‌గిరి నుండి గెలిపిస్తే మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని జ‌గ‌న్ మంగ‌ళ‌గిరిలో ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ప్ర‌క‌టించారు. అయితే, మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ స‌మ‌యంలో తొలుత ఆర్కే పేరు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. కానీ, గుంటూరు జిల్లాలో ఎస్సీ-బీసీ సామాజిక వ‌ర్గాల‌కు అవ‌కాశంతో పాటుగా.. ఇదే జిల్లాలో జ‌గ‌న్ మ‌రో హామీ పెండింగ్‌లో ఉంది. మర్రి రాజ‌శేఖ‌ర్‌కు సైతం మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సి ఉంది. దీంతో..చివ‌రి నిమిషంలో ఆర్కేకు మంత్రి ప‌ద‌వి నిలిచిపోయింది. ఆర్కే వైసీపీలో ఎమ్మెల్యేగా ఉంటూనే నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మీద అనేక అంశాల్లో కోర్టుల్లో కేసులు వేసి న్యాయ పోరాటం చేసారు. ర్కే సోద‌రుడు ఆయోధ్య రామిరెడ్డి గ‌తం ఎన్నిక‌ల్లో న‌ర్స‌రావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోగా..ఆయ‌న బావ మోదుగుల వేణుగోపాల రెడ్డి తాజా ఎన్నిక‌ల్లో గుంటూరు ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో..ఆర్కేకు సీఎం జ‌గ‌న్ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

ఏపీ అసెంబ్లీ రెండో రోజు హాట్ హాట్‌గా నడుస్తోంది. అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. స్పీకర్ ఎన్నికపై ఇరు పార్టీల సభ్యుల మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగాయి. స్పీకర్ ఎన్నిక విషయంలో అధికారపక్షం సభా సంప్రదాయాలను పాటించలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా ఎన్నుకోవడం మంచి నిర్ణయం తీసుకున్నారని భావించానని.. తమను అడిగితే పూర్తిగా సహకరించాలనే ఉద్దేశంతో ఉన్నామన్నారు. కానీ పరిస్థితి మాత్రం అలా లేదన్నారు. ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఎన్నికైన తరువాత సంప్రదాయం ప్రకారం, అధికార, విపక్ష నేతలు స్వయంగా స్పీకర్ ను ఆయన స్థానం వద్దకు తీసుకుని వెళ్లాల్సి వుండగా, విపక్ష నేత చంద్రబాబు రాలేదన్న సంగతి తెలిసిందే. స్పీకర్ కు ధన్యవాదాలు చెప్పే సమయంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే విషయమై విమర్శలు గుప్పిస్తుండగా, చంద్రబాబు వివరణ ఇచ్చారు.

cbn 13062019 1

ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న తమ్మినేనితో తనకు సత్సంబంధాలున్నాయని, ఆయన పేరును చెప్పగానే తనకు సంతోషం వేసిందని అన్నారు. 2014లో తాము కోడెల పేరును అనుకున్న సమయంలో విపక్ష నేతకు సైతం విషయం చెప్పి, ఆయన సంతకం తీసుకున్నామన్నారు. కానీ, ఈ దఫా అధికార పార్టీ తమను అడుగుతారని భావించామని, అయితే, ఎవరూ తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు. కనీసం తమలో ఎవరికైనా చెబితే, ప్రపోజ్ చేయాలని అనుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రొటెం స్పీకర్ అయినా, కనీసం 'విపక్షనేత రండి' అని పిలవలేదని, ఇష్టమైతే రండి, లేకుంటే లేదన్నట్టుగా ప్రభుత్వ ప్రవర్తన ఉందని అన్నారు. ఈ విషయాలను తాను ప్రజలకు చెప్పేందుకే క్లారిటీ ఇస్తున్నానని స్పష్టం చేశారు.

cbn 13062019 1

గతంలో తాను సభానాయకుడిగా ఉన్నప్పుడు స్పీకర్‌ను ఎంపిక చేసిన తర్వాత.. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ దగ్గరకు మంత్రుల్ని పంపి ఆయన సంతకం తీసుకుని ఆరోజు నామినేషన్ చేయించ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. స్పీకర్ ఎంపికపై తమకు సమాచారం ఇస్తారని చూశామని.. కానీ కనీసం ఎవరూ తమను సంప్రదించలేదన్నారు. ఇవాళ కూడా సభకు వచ్చినప్పుడు కనీసం ఒక మాట కూడా చెప్పలేదన్నారు. ముఖ్యమంత్రిగా సభా గౌరవాన్ని పాటించలేదని.. ఇష్టమైతే రండి, లేకపోతే లేదన్నట్లు వ్యవహరించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలు ఏమనుకుంటారన్నది ఆలోచన చేయలదేని.. ఈ విషయాన్ని సభ ద్వారా ప్రజలకు చెబుతున్నానన్నారు. తామెప్పుడూ ఏక పక్షంగా చేయలేదని.. సభా సంప్రదాయాలు ఉంటాయి.. వాటిని వైసీపీ పాటించలేదన్నారు. అయినా సరే సభకు పూర్తిగా సహకరిస్తామన్నారు బాబు.

అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక సందర్భంగా, స్పీకర్ ప్రశంసా తీర్మానంలో చంద్రబాబుని ఇరికిద్దాం అనే వ్యూహం బెడిసికొట్టింది. స్పీకర్ పై ప్రశంసలు పక్కన పెట్టి, చంద్రబాబుతో గేమ్ ఆడదామని, వైసిపీ నేతలు, తాము తీసిన గోతిలో తామే పడిన పరిస్థితి అయ్యింది. అసలు విషయంలోకి వస్తే, స్పీకర్ ఎన్నిక గురించి కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. రాజశేఖర్ రెడ్డి లాంటి బద్ధ శత్రువు కూడా, అవి తప్పకుండా, చంద్రబాబుకి ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే వాళ్ళు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరిగాయి. స్పీకర్‌ ఎన్నికపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి అధికార పక్షం నుంచి ఏ సమాచారం రాలేదు. స్పీకర్‌ పదవికి అధికార పక్షం నుంచి తమ్మినేని సీతారాం బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అప్పడు టీడీపీ సభ్యులెవరూ వెంటలేరు. గతంలో ఉన్న ఆనవాయితీ ప్రకారం ప్రధాన ప్రతిపక్షానికి అధికార పక్షం నుంచి స్పీకర్‌ ఎన్నికపై సమాచారం ఇచ్చేవారని టీడీపీ వర్గాలు తెలిపాయి.

assembly 13062019

స్పీకర్‌ నామినేషన్‌ పత్రాలపై ప్రతిపక్ష సభ్యులు కూడా సంతకాలు చేస్తారని, ఆయన నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి పిలిస్తే హాజరవుతారని కూడా ఒక సీనియర్‌ ఎమ్మెల్యే గుర్తుచేశారు. కానీ తమకు ఏ సమాచారం రాకపోవడం ఆశ్చర్యపరచిందన్నారు. ప్రధాన ప్రతిపక్షం మద్దతు తీసుకోవాలన్నది రూలు కాదని, అదొక సంప్రదాయం మాత్రమేనని వ్యాఖ్యానించారు. అయితే సభలో కూడా ఇదే ఒరవడి కొనసాగింది. స్పీకర్ గెలిచారని, సియం సహా మిగతా పార్టీలు వారు వచ్చి తమ్మినేనిని స్పీకర్ స్థానంలో కూర్చోపెట్టాలి అని కోరారు. సియం గురించి ప్రస్తావన చేసినప్పుడు, ప్రతిపక్ష నేత గురించి కూడా ప్రస్తావన చెయ్యాలి. అది చెయ్యలేదు. దీంతో చంద్రబాబు, డిప్యూటీ లీడర్ అయిన అచ్చం నాయుడుని పంపించారు. అయితే ఇదంతా ముందుగానే ప్లాన్ చేసిన వైసిపీ, ఈ విషయంలో చంద్రబాబుది తప్పు, బీసిని అవమానించారు అంటూ మొదలు పెట్టింది. స్పీకర్ పై ప్రశంసలు కాస్త, చంద్రబాబు పై విషం చిమ్మటం కోసం వాడారు. అయితే ఇలాంటి పిల్ల వేషాలు, తన 40 ఏళ్ళ అనుభవంలో ఎన్నో చూసారు. అందుకే వెంటనే కౌంటర్ స్ట్రాటజీ మొదలు పెట్టి, సభలోనే వైసిపీని అభాసుపాలు చేసారు. 151 మంది ఉన్నా, 23 మంది ఉన్న పవర్ ఏంటో చూపించారు.

assembly 13062019

వాళ్ళ విష ప్రచారం తిప్పి కొడుతూ, అధికారపక్షం సభా సంప్రదాయం పాటించలేదని, ఇక్కడ జరిగే విషయం ప్రజలకు తెలియాలని చంద్రబాబు నాయుడు అన్నారు. రెండో రోజు గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం పేరు చెప్పినప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని భావించామని అన్నారు. అలాగే మమ్మల్ని కూడా అడుగుతారని, తాము కూడా పూర్తిగా సహకరించాలనే ఉద్దేశంతో ఉన్నామని.. అయితే అలా జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుమునుపు తాను సీఎంగా సభానాయకుడుగా ఉన్నప్పుడు స్పీకర్‌ను ఎంపిక చేసిన తర్వాత.. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ వద్దకు పంపించి ఆయన సంతకం తీసుకుని ఆరోజు నామినేషన్ చేయించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు స్పీకర్ ఎంపికపై కనీసం తమకు ఎవరైనా చెబుతారని చూశామని, ఎవరూ చెప్పలేదని చంద్రబాబు అన్నారు. గురువారం ఉదయం కూడా సభకు వచ్చినప్పుడు కనీసం ఒక మాట కూడా చెప్పలేదని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రిగా సభా గౌరవాన్ని పాటించలేదని, ఇష్టమైతే రండి, లేకపోతే లేదు అన్న విధంగా ప్రవర్తించారని, ప్రజలు ఏమనుకుంటారోన్న విషయం కూడా ఆలోచించాలని చంద్రబాబు అన్నారు. ఈ విషయం సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెబుతున్నానన్నారు. తామెప్పుడూ ఏక పక్షంగా చేయలేదని అన్నారు. కొన్ని సంప్రదాయాలు ఉంటాయని, వాటిని వైసీపీ పాటించలేదని, అయినా సభకు పూర్తిగా సహకరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తానికి చంద్రబాబుని ఎదో చేద్దామని, అనుకుంటే, ఆయన ఇచ్చిన కౌంటర్ లకు, వైసిపీ నేతలకు దిమ్మ తిరిగింది.

ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన రెండో రోజే అధికార, ప్రతిపక్ష సభ్యలు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. నూతన సభాపతికి ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ సందర్భంగా చంద్రబాబు టార్గెట్ గా వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో సభలో వేడి పెరిగింది. 23 మంది వైకాపా ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి వారిలో నలుగురిని మంత్రులను చేశారని సీఎం జగన్‌ ఘాటుగా విమర్శించారు. అయితే ఇదే పని చేసిన, చేస్తున్న కేసిఆర్ తో మాత్రం, జగన్ చట్టా పట్టాల్ వేసుకుని తిరుగుతున్న సంగతి ప్రజలు అందరూ చూస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. అయితే పదే పదే చంద్రబాబు 23 మందిని కొనేసాడు అంటూ జగన్ అతని బృందం చంద్రబాబుని టార్గెట్ చేసింది. నిజానికి గవర్నర్ బంగళా ముందు నుంచుని నాతో టచ్ లో 23 మంది ఉన్నారు, గంటలో నీ ప్రభుత్వం పడగొడతా అంటే, చంద్రబాబు అప్పుడు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.

cbn counter 13062019

అవేమి ప్రస్తావించని జగన్, కేవలం చంద్రబాబు కొనేసాడు కొనేసాడు అంటూ అసెంబ్లీలో చంద్రబాబుని టార్గెట్ చేసారు. అంబటి రాంబాబు, శ్రీకాంత్‌రెడ్డి, రోజా, చెవిరెడ్డి లాంటి ఉద్దండులు కూడా చంద్రబాబు పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీంతో చంద్రబాబు మైక్ అందుకున్నారు. తొలి ప్రసంగంలోనే జగన్‌ ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. ‘‘సీఎం ప్రసంగం ప్రతిపక్షాన్ని కించపరిచేలా ఉంది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. 1978లో రెడ్డి కాంగ్రెస్‌ నుంచి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడు పార్టీ మారలేదా? గెలిచిన నాలుగురోజుల్లోనే పార్టీ మారారు. అప్పట్లో బాట్టం శ్రీరామ్మూర్తిగారు మీకంటే ఎక్కువ ఘాటుగా విమర్శించారు. ఆ చరిత్రను ఒకసారి చూసుకోండి. తండ్రికి వారసులుగా చెప్పుకుంటున్నవారు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి. మీ తండ్రి చేసింది తప్పని ఒప్పుకోవాలి."

cbn counter 13062019

"అధికార పక్షం సంప్రదాయాలు పాటించకపోయినా మేము పాటిస్తాం. సభాపతిగా తమ్మినేని పేరు ప్రకటించగానే ప్రొటెం స్పీకర్‌ మమ్మల్ని కూడా అడుగుతారని భావించా. ప్రతిపక్ష నేతను ఆహ్వానిస్తే బాగుండేది. గతంలో స్పీకర్‌ను ఎంపిక చేశాక మంత్రులను జగన్‌ వద్దకు పంపించి నామినేషన్లు వేయించా. కోడెల అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వాళ్లు కూడా సంతకాలు చేశారు. స్పీకర్‌ ఎన్నికపై కనీసం ఒక్కమాట అయినా చెబుతారని ఎదురుచూశా’’ అని చంద్రబాబు వివరించారు. అయితే దీనికి సమాధానం చెప్పలేని జగన్, అప్పుడు చరిత్ర ఎందుకుయ్యా, నువ్వు మామని వెన్నుపోటు పొడిచావ్ అంటూ, చంద్రబాబు అడిగినదానికి సమాధానం చెప్పలేక, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసారు. ఫిరాయింపులు ఈ రాష్ట్రంలో మొదలు పెట్టింది ఎవరో జగన్ గారి కొత్త స్నేహితుడు, కేసిఆర్ గారికి బాగా తెలుసు. ఈసారి కలిసినప్పుడు ఒకసారి అడిగితే వారు కరెక్ట్ గా చెప్తారు.

Advertisements

Latest Articles

Most Read