చంద్రబాబు హయంలో విద్యుత్ ఒప్పందాల సమీక్ష పై ఎవరి మాట వినకుండా, చివరకు కేంద్రం చెప్పినా పెడ చెవిన పెట్టి, దూకుడుగా వెళ్తున్న జగన్ కు, హైకోర్ట్ బ్రేక్ వేసింది. ఈ సందర్భంగా కోర్ట్ చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వానికి ఇబ్బందికరమనే చెప్పాలి. విద్యుత్ ఒప్పందాల సమీక్ష పై ఇచ్చిన జీఓ పై, 40 విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు హైకోర్ట్ కు వెళ్ళాయి. ఈ సందర్భంగా హైకోర్ట్ న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేసారు. విద్యుత్ ఒప్పందాలు పై సమీక్ష ప్రభుత్వానికి సంబంధం ఏంటి, అది మీ బాధ్యత కాదు కదా అని ప్రశ్నించారు. అది విద్యుత్ నియంత్రణ మండలి బాధ్యత అని తెలిసినా, మీరు ఎందుకు ప్రభుత్వం తరుపున ఇంత తొందరపడుతున్నారు అంటూ హైకోర్ట్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు, విద్యుత్ కంపెనీలను ఎందుకు బెదిరిస్తున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం అనే చెప్పాలి.
ఇలాంటి నిర్ణయాల్లో మీరు నియమించిన ఉన్నత స్థాయి కమిటీ జోక్యం చేసుకుంటే కుదరదు అని కోర్ట్ తేల్చి చెప్పింది. మీరు ఇలాంటి హడావిడి నిర్ణయాలు చేస్తే, రాష్ట్రానికి చాలా ఇబ్బంది వస్తుంది, అలోచించి సరైన నిర్ణయం తీసుకోండి, విద్యుత్ నియంత్రణ మండలి వేదికగా సమస్యను పరిష్కరం చేసుకోవటమో, లేక వేరే ఏదైనా మార్గంలో, సమస్యలు లేకుండా చూసుకోండి అంటూ ప్రభుత్వానికి కోర్ట్ సూచించింది. ఇవన్నీ చెప్తూ, ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని నియముస్తూ, ప్రభుత్వం జారే చేసిన జీవో 63ను నాలుగు వారాల పాటు సస్పెండ్ చేస్తూ హైకోర్ట్ నిర్నయం తీసుకుంది. అంతే కాకుండా, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, వివధ కంపెనీలకు ఇచ్చిన నోటీసులను కూడా కోర్ట్ రద్దు చేసింది.
అయితే విచారణ సందర్భంగా, పిటీషన్ తరుపున న్యాయవాదులు, ప్రభుత్వ నిర్ణయాల పై విరుచుకుపడ్డారు. విద్యుత్ ఒప్పందాల విషయంలో ప్రభుత్వం తన పరిధికి మించి వ్యవహరిస్తుందని అన్నారు. 2015లో చేసుకున్న ఒప్పందాల్లో, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలకన్నా తక్కువ ధరకే రేట్లు నిర్ణయించారని, ఇప్పుడు వీళ్ళు కొత్తగా హై పవర్ కమిటి అంటూ, మళ్ళీ ధరలు నిర్ణయిస్తామని అంటున్నారని అన్నారు. యూనిట్ ధరను రూ.2.44కు తగ్గించాలని, బెదిరింపు ధోరణిలో, షోకాజ్ నోటీసులు పంపారని, ఇలా తమ పరిధిలో లేని అంశాలతో తమను బెదిరిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. అయితే ప్రభుత్వం వాదనలో కొంత వేడి తగ్గిందనే చెప్పాలి. మొన్నటి దాక బెదిరింపు ధోరణిలో ఉన్న ప్రభుత్వం, నిన్న కోర్ట్ లో మాత్రం కొంచెం తగ్గారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం వాదనలు వినిపిస్తూ, దిస్కంలు ఆర్ధిక సంక్షోభంలో ఉన్నాయని, ధరలు తగ్గించమని కోరామని, ఏమైనా ఉంటె, ఈఆర్‌సీలో పరిష్కరించుకుందామని, ఒప్పందాలు రద్దు చేసి ఆలోచన లేదని, కంపెనీలు అవగాహన లోపంతో కోర్ట్ దాకా వచ్చాయని వాదన వినిపించారు. మరో పక్క రెండు రోజుల క్రితం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాత్రం, చంద్రబాబు స్కాం చేసారని, అందుకే రద్దు చేస్తున్నాం అని చెప్పారు. మొత్తానికి ఈ విషయంలో ప్రభుత్వం కొంచెం వెనకడుగు వేసినట్టే కనిపిస్తుంది.