మొన్నటి దాక ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో, మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అంటూ జబ్బలు చరుచుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారటంతో మొత్తం తారు మారు అయ్యింది. ప్రస్తుతం అంతా రివర్స్ లో నడుస్తుంది. నాడు ఏపి నెంబర్ వన్ డెస్టినేషన్ అనుకున్న కార్పొరేట్ దిగ్గజాలు, నేడు బాబోయ్ అనుకునే పరిస్థితి వచ్చింది. ప్రముఖ కాంట్రాక్టు కంపెనీలు అన్నీ ఆంధ్రప్రదేశ్ అంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఒక పక్క అమరావతి, పోలవరం ఆగిపోయాయి. మరో పక్క బందర్ పోర్ట్ విషయంలో కూడా క్లారిటీ లేక పోవటంతో, నవయుగ కంపెనీ తన మిషనరీ మొత్తం వేరే సైట్ కు తరలించింది. ఇక విద్యుత్ రంగంలోని కంపెనీలు అయితే వణికి పోతున్నాయి. 40 కంపెనీలు కలిసి కోర్ట్ కు కూడా వెళ్ళటంతో, కోర్ట్ ఏపి ప్రభుత్వానికి షాక్ ఇస్తూ, స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే.

l t 28072019 1

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి పై దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా పేరు ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీ అయిన ఎల్&టీ సంస్థ ఎండీ, సీఈవో అయిన ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ స్పందించారు. రాష్ట్రంలో మా పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో ఎప్పుడు, ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి మాకు ఎదురు కాలేదు. ఒక ప్రభుత్వం టెండర్లు పిలిచి, పనులు ఇస్తుంది. మరో ప్రభుత్వం వచ్చి ఆ పనులు కుదరదు ఆపేయమంటుంది. ఇదేక్కడ పధ్ధతి ? ఇలా అయితే ఏ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఇక చూసే పరిస్థితి లేదు అని చెప్పారు. మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాజెక్ట్ లు నడుస్తున్నాయి. అందులో చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మికంగా తీసుకున్న అమరావతి ప్రాజెక్ట్ సహా, వంతెనలు, రహదారులు, సోలార్ ప్రాజెక్టులు, స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయని చెప్పారు.

l t 28072019 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదపుగా 9 వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నయాని చెప్పారు. దేశ వ్యాప్తంగా 3 లక్షల కోట్లు పనులు చేస్తుంటే, అందులే 3 శాతం ఏపిలో ఉన్నాయని అన్నారు. ఎక్కడా లేని పరిస్థితి, మాకు ఇక్కడ ఎదురవుతుందని అన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం, 25 శాతం ప్రాజెక్ట్ పనులు అవ్వక పొతే, పనులు ఆపేయమని కోరటం విడ్డురంగా ఉందని అన్నారు. ఇవేమీ మాకు ఊరికే ఇవ్వలేదని, అంతా ట్రాన్స్పరెంట్ గా టెండర్ విధానంలో జరిగిందని అన్నారు. ఒక ప్రభుత్వం టెండర్ ఇవ్వటం, ఇంకో ప్రభుత్వం వచ్చి రద్దు చేసుకుంటూ పొతే, ప్రగతి ఆగిపోతుందని అన్నారు. తాజా పరిణామంతో, శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజిలో ఎల్ అండ్ టీ షేర్లు ధర 1 శాతం పడిపోవడంతో ఇన్వెస్టర్స్ కు కొన్ని వేల కోట్ల నష్టం వచ్చింది.

సినీ హీరో, అలాగే రాజకీయాల గురించి ఆక్టివ్ గా మాట్లాడే శివాజీ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నిన్న దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో శివాజీని అడ్డుకున్న సంగతి తెలిసిందే. దాని పై ఈ రోజు శివాజీ మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇది వరకు తనకు సెక్యూరిటీ ఉండేదని, తెలంగాణాలో కూడా సెక్యూరిటీ ఉండేదని, ఇప్పుడు ప్రభుత్వం మారగానే రెండు చోట్లా తీశేసారని అన్నారు. ఈ సందర్భంగా, తనకు కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డి నుంచి ప్రాణ హాని ఉందని, తనకు సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా జగన్ ప్రభుత్వాన్ని కోరానని, అయినా ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదని అన్నారు. జగన్ మీద తాను వ్యతిరేకంగా మాట్లాడానని, ఇలా ఇబ్బంది పెడుతున్నారేమో, కాని నేను జగన్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై, మాట్లాడుతూనే ఉంటానని అన్నారు.

sivaji 28072019 2

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం సీన్ మారిపోయిందని అన్నారు. అందరూ రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారని శివాజీ అన్నారు. ఈ పరిస్థితి వెంటనే చక్కదిద్దుకోవాలని శివాజీ అన్నారు. అలాగే గోదావరి నీతి తరలింపు విషయంలో కేసిఆర్ ను నమ్మవద్దు అంటూ జగన్ ను హెచ్చరించారు. తానను కనుకు ఎవరైనా చంపేస్తే, దానికి మేఘా కృష్ణా రెడ్డి కారణం అని, శివాజీ అన్నారు. నిన్న దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో ఆయనను అడ్డగించటం పై కూడా స్పందించారు. మా అబ్బాయ్ అడ్మిషన్ కోసమని అమెరికా వెళ్ళటానికి కోర్ట్ లో పర్మిషన్ తీసుకున్నాను అని, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎవరూ తనను అడ్డుకోలేదని, నేను ఇక్కడ ఫ్లైట్ ఎక్కగానే, ఇక్కడ ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్ దుబాయ్ ఎయిర్ పోర్ట్ అథారిటీకి మెయిల్ చేసారని, వారు నన్ను అక్కడ అడ్డుకున్నారని అన్నారు.

sivaji 28072019 3

వారు అప్పుడు నన్ను అడిగారని, ఇక్కడ ఉండి ఎంబసీతో మాట్లాడుకుంటారా అని అడిగితే, వీకెండ్ కదా, ఏ పని అవ్వదు, నేను నా దేశం వెళ్ళిపోతా, అక్కడ చూసుకుంటా అని చెప్పానని అన్నారు. జరిగింది ఇది అయితే, నేను మారు వేషంలో పారిపోయాను అంటూ, ఇక్కడ కొన్ని ఛానెల్స్ కావాలని ప్రచారం చేశాయని అన్నారు. ఇక్కడ హైదరాబాద్ పోలీసులకు నన్ను పట్టుకోవటం చేత కాలేదు, దుబాయ్ పోలీసులు పట్టుకున్నారు అని ఆ ఛానల్ చెప్పాలనుకుంటుందా అని ప్రశ్నించారు. మై హోం రామేశ్వరరావును, మెగా కృష్ణారెడ్డిని లేదంటే, వారికి సంబంధించిన పార్టీలను ఏదో విధంగా సంతోష పెట్టాలని అనుకుంటున్నారా? అని ఆ టీవీ ఛానల్ పై మండిపడ్డారు. ఇప్పటివరకూ అమెరికాకు యాభై సార్లు వెళ్లానని, ఈ సారి కూడా కేసు పెట్టారు కాబట్టి, కోర్ట్ ద్వారానే పర్మిషన్ తీసుకుని వెళ్లానని, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్ధం కావటం లేదని అన్నారు.

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందామురి బాలకృష్ణ పై ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. చంద్రబాబు వియ్యకుండు అయిన బాలకృష్ణ, ఆయన బంధువులు, అమరావతి రాజధాని ప్రకటన చేసేకంటే ముందే, అమరావతి ప్రాంతంలో 500 ఎకరాలు కొన్నారంటూ ఆరోపణలు చేసారు. చంద్రబాబు వియ్యంకుడిగా, బాలక్రిష్ణకు ముందే చెప్పి, అక్కడ భారీగా భూములు కొన్నారని, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఆరోపించారు. నిన్న మంత్రి బొత్సా సత్యన్నారాయణ మాట్లాడుతూ, అమరావతిలో అతి పెద్ద స్కాం జరిగింది అని, దాన్నే ఇన్ సైడర్ ట్రేడింగ్ గా చెప్తూ, ఈ స్కాంను బయటకు తెస్తామని అన్నారు. బొత్సా ప్రెస్ మీట్ పెట్టగానే, వైసీపీ నేతలు, మీడియాకు ఈ లీకులు ఇచ్చారు. బాలకృష్ణ 500 ఎకరాలు కొన్నారంటూ లీకులు ఇచ్చారు.

balayya 28072019 2

ఇదే విషయాన్ని కొన్ని పత్రికలు ప్రధానంగా ఈ రోజు ప్రచురించాయి. బాలకృష్ణ, ఆయన బంధువులు, 500 ఎకరాలు అమరావతిలో కొన్నారని, రాజధాని ప్రకటన కంటే ముందే, వీళ్ళు కొన్నారంటూ, బొత్సా ప్రెస్ మీట్ వివరాలు చెప్తూ, ఇది కూడా రాసారు. ఒక ఇంగ్లీష్ పత్రికల్లో కూడా ఈ వార్త ప్రచురించింది. దీంతో ఇది నిజమేనేమో అని కొంత మంది నమ్మే పరిస్థితి. కాని బాలకృష్ణ పై మాత్రం, ఎప్పుడూ ఎలాంటి మచ్చ లేదు. తన తండ్రి సియంగా ఉన్నప్పుడు కాని, బావ సియంగా ఉన్నప్పుడు కాని, ఎప్పుడు పలనా అవినీతి చేసారు అనే ఆరోపణలు ఈ 40 ఏళ్ళ కాలంలో ఎప్పుడూ రాలేదు. ఈ రోజు వచ్చిన వార్తా పై, వెంటనే నారా లోకేష్ ట్విట్టర్ లో ఈ వార్తను ఖండించారు. ఈ వార్తా అటాచ్ చేస్తూ, జగన్ మోహన్ రెడ్డి గారు, అధికారంలో ఉన్నది ఇప్పుడు మీరే, ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న మీరు, బాలకృష్ణ గారు, ఆయన బంధువులు అమరావతిలో 500 ఎకరాలు కొన్నారని, నిరూపించండి అంటూ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి లోకేష్ ఛాలెంజ్ చేసారు.

balayya 28072019 3

ఇది లోకేష్ ట్వీట్ "వైకాపా నాయకులు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళ ఫేక్ బతుకు మారలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అసత్యాలతో కాలం నెట్టుకొస్తున్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతియ్యడానికి ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటూ బురద జల్లుతున్నారు. తండ్రి అధికారాన్నీ, శవాన్నిపెట్టుబడిగా పెట్టి ఎదిగిన చరిత్ర మీ నాయకుడిది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఏ రోజూ అటు వైపు కూడా చూడకుండా స్వఛ్చమైన మనస్సు, నీతి, నిజాయితీతో ఎదిగారు మా బాలా మావయ్య. అటువంటి వ్యక్తి రాజధానిలో భూములు కొన్నారని ఆరోపణలు కాదు, దమ్ముంటే నిరూపించండి. లేక రాజధాని రైతులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి."

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, నగిరి ఎమ్మెల్యే రోజానే షాక్ అయ్యే ఘటన నిన్న నగిరిలో చోటు చేసుకుంది. అందరినీ తన మాటలతో, హావభావాలతో గడగడలాడించే రోజానే, షాక్ అయ్యే పరిస్థితి ఏంటి అనుకుంటున్నారు. ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా రోజాని జగన్ మోహన్ రెడ్డి నియమించిన సంగతి తెలిసిందే. మంత్రి అవ్వాలని కలలు కన్న రోజాకి జగన్ షాక్ ఇవ్వటంతో, ఆమె అలక పాన్పు ఎక్కటంతో, జగన్ ఆమెకు ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా అవకాసం ఇచ్చారు. ఇటీవలే అమరావతిలో ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా రోజా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో, శనివారం రోజాకు భారీ సన్మాన సభ ఏర్పాటు చేసారు. ఈ ఏర్పాట్లు అన్నీ స్థానిక వైసిపీ నేతలు పోటా పోటీగా చేసారు. ఆమెను పట్టణంలో, ఓపెన్ టాప్ జీప్ లో ఊరేగిస్తూ, ఏజేఎస్‌ కల్యాణ మండపంలో సన్మాన సభకు తీసుకొచ్చారు.

roja 28072019 2

అయితే ఈ సన్మాన సభలో, నగరి నియోజకవర్గ వైసీపీ బూత్‌ కమిటీల కన్వీనర్‌ చంద్రారెడ్డి హడావిడి పై, మరో వర్గం అయిన నగరి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కేజే కుమార్‌ రివెర్స్ అయ్యారు. రోజా వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ వేదిక పైకి దూసుకువచ్చి ఎమ్మెల్యే రోజాతో వాగ్వాదానికి దిగారు. హాల్ లో ఉన్న వారి మద్దతుదారుల అరుపులతో కల్యాణ మండపం దద్దరిల్లిపోయింది. కుల అహంకారం ఎక్కవై, తమ లాంటి వారిని దూరం పెడుతున్నారు అంటూ, వేదిక పై తీవ్రంగా గొడవ పడ్డారు. వారి మద్దతదారులు కూడా పైకి వచ్చేయటంతో, పోలీసులు కూడా చేతులు ఎత్తేసారు. ఈ పరిణామంతో, రోజా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏమి జరుగుతుందో అర్ధం కాక, గందరగోళాని గురయ్యారు. కొద్ది సేపటికి కేజే కుమార్‌ శాంతింపచేసారు. అయినా కూడా తరువాత అదే వాతావరణం కొనసాగింది.

roja 28072019 3

కేజే కుమార్‌ మాట్లాడుతూ, రోజాని టిడిపిలో నుంచి వైసీపీలోకి తెచ్చింది నేనే అని, అప్పటి నుంచి ఆమెకు అన్నీ దగ్గరుండి చూసుకుంటూ రెండు సార్లు గెలిపించామని అన్నారు. ఎన్నో కష్టాలు పడ్డామని గుర్తు చేసారు. తీరా అధికారం వచ్చిన తరువాత, పదవులు వచ్చిన తరువాత, కుల రాజకీయాలు ఎక్కువయ్యాయని, ఎమ్మెల్యే కుటుంబ పాలన ఎక్కువైందని ఆరోపించారు. వీటిని చూస్తూ ఊరుకోం, జగన్ దగ్గర తేల్చుకుంటాం అంటూ, రోజా అక్కడ ఉండగానే వార్నింగ్ ఇచ్చారు.అన్ని కులాల వారూ ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేగా రోజా గెలిచారనేది రోజా గుర్తు పెట్టుకోవలాని అన్నారు. అయితే ఈ పరిణామం ఊహించని రోజా, తమకు అందరూ సమానమే అని, అన్ని కులాలు ముఖ్యమే అని చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read