ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈ రోజు జరిగిన సంఘటన పై, నారా లోకేష్ స్పందించారు. ఈ రోజు నిమ్మల రామానాయడు అసెంబ్లీ క్యస్షన్ హావర్ లో, 45 ఏళ్ళకే, రెండు వేలు పెన్షన్ ఇస్తానన్నారు కదా, అది ఎప్పుడూ ఇస్తారు అంటూ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే జగన్ లెగిసి, అసలు నేను ఆ హామీ ఇవ్వలేదు, 4 ఏళ్ళలో 75 వేలు ఇస్తాం అన్నాను అంటూ, ఆ వీడియో అసెంబ్లీలో ప్లే చేసారు. దీని పై అభ్యంతరం చెప్తూ, మేము ఇచ్చిన వీడియో కూడా వెయ్యాలని, మాకు మాట్లాడే అవకాసం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళన చేసారు. ఈ దశలో, వారికి జవాబు చెప్పలేని అధికార పక్షం, అచ్చెంనాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడుని, ఈ అసెంబ్లీ సమావేశాల ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ తీర్మానం చేసారు.

lokesh 23072019 2

దీంతో అసెంబ్లీలోకి వచ్చిన మార్షల్స్ తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఎత్తి అవతల పడేసారు. ఈ సందర్భంలో, నిమ్మల రామానాయుడుని ఎత్తి పడేస్తున్న ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటోని పోస్ట్ చేసిన నారా లోకేష్, మీరు చెప్పిన హామీ, ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ వర్గాలకు 45 ఏళ్ళకే పెన్షన్ ఎప్పుడూ ఇస్తున్నారు అని అడిగినందుకు, ఇలా తీసుకొచ్చి బయట పడేసారని, వారెవా... రాజన్న రాజ్యం... అంటూ పోస్ట్ చేసారు. ప్రజల పక్షాన నిలిచినందుకు రాజన్న రాజ్యంలో పరిస్థితి ఇది అంటూ ట్వీట్ చేసారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని మార్షల్స్‌ ఎత్తి అవతల వేస్తున్న ఫోటోను కూడా నారా లోకేష్ పోస్ట్ చేసారు. మరో పక్క జగన్ మాట తప్పిన విషయం పై కూడా లోకేష్ వీడియో ఒకటి పోస్ట్ చేసారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు పోస్ట్ చేసారు.

lokesh 23072019 3

ఆ వీడియోలో, జగన్ మోహన్ రెడ్డిని, సాక్షి విలేకరి కొమ్మినేని శ్రీనివాస్, మీకు 45 ఏళ్ళకే 2 వేలు పెన్షన్ హామీ ఇవ్వాలని ఎందుకు అనిపించింది అని అడుగుతూ ఉంటారు. దానికి జగన్ స్పందిస్తూ, నేను వారి కష్టాలు చూసాను, ఎన్నో పనులు చేసి 45 ఏళ్ళకే వాళ్ళు అలిసిపోతున్నారు, అందుకే వారికి 2 వేలు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా, దానికి వైఎస్ఆర్, చేయూత అని పేరు పెట్టాను, 45 ఏళ్ళు దాటిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసి సోదరలుకు, పెన్షన్ ఇస్తాను అంటూ జగన్ సమాధానం చెప్తారు. అయితే ఇదే విషయం లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. "46 ఏళ్లకి @ysjaganగారికి ఉద్యోగం వచ్చింది. 45 ఏళ్ల పెన్షన్ రత్నం మాయమయ్యింది. పాదయాత్రలో గుర్తొచ్చిన ప్రజల కాళ్ల నొప్పులు మీరు కుర్చీ ఎక్కగానే మర్చిపోయారా? బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ అన్న మీరు ఇప్పుడు పెనం మీద దోశ తిప్పినంత ఈజీగా మాట మార్చి వారిని మోసం చేసారు. జగన్ గారు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ రూపంలో ఒక్కో మహిళకు లక్షా ఇరవై వేల రూపాయిలు ఇవ్వాలి. జగన్ గారు మడమ తిప్పడం, మాట మార్చడం ద్వారా ఒక్కో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళకి రూ.45 వేల నష్టం కలుగుతోంది." అని లోకేష్ ట్వీట్ చేసారు.

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, చెప్పిన మాట పొదుపు. చంద్రబాబు ఎన్నో దుబారా ఖర్చులు పెట్టారు, నేను అలా దుబారా ఖర్చులు పెట్టను, నా జీతం ఒక్క రూపాయి, నేను కిన్లే వాటర్ మాత్రమే తాగుతాను అంటూ చెప్పుకొచ్చారు. ఇవన్నీ విన్న ప్రజలు, అబ్బో , గొప్ప మార్పు చూడబోతున్నాం అంటూ, ఎంతో సంబర పడ్డారు. దానికి తగ్గట్టుగానే, ప్రమాణస్వీకారానికి కేవలం 26 లక్షలు ఖర్చ్ అయ్యింది అంటూ, ఎదో జీఓ చూపించి హడావిడి చేసారు. నిజానికి అది అడ్వాన్సు ఇచ్చినట్టు జీఓలో ఉంది. అయినా సరే, ప్రజలు మాత్రం, జగన్ మోహన్ రెడ్డి దుబారా ఖర్చులు పెట్టరు, ఎంతో గొప్ప వ్యక్తిత్వం జగన్ కు ఉంది. మాట ఇస్తే మాట తప్పరు అని చెప్తారు కదా అని అనుకుంటూ, ప్రజా ధనం ఇక మొత్తం ఆదా అయిపోతుంది అని అనుకున్నారు.

indiatoday 23072019 2

అయితే రెండో రోజు నుంచే జగన్ షాక్లు మీద షాక్లు ఇవ్వటం మొదలు పెట్టారు. ముందుగా తన హెలిప్యాడ్ కోసం, 42 ఇళ్ళను లేపెసరని వార్తలు వచ్చాయి. తన ఇంటి దగ్గర నుంచి, హెలిప్యాడ్ దగ్గరకు, 1.5 కిమీ రోడ్డు వెయ్యటానికి ౧౦ కోట్లు జీఓ ఇచ్చారు. తరువాత తన ఇంటి దగ్గర బ్యారికేడ్ లకు అని 75 లక్షలు విడుదల చేస్తూ జీఓ ఇచ్చారు. తరువాత తన ఇంటి ఆవరణలో టాయిలెట్లు కట్టాలని 35 లక్షలు జీఓ విడుదల చేసారు. తరువాత, తన ఇంటిలో కరెంట్ పని చెయ్యటానికి అని, 9 నెలలకు, 8.5 లక్షలు విడుదల చేసారు. అంటే, కరెంట్ పని చెయ్యటానికి, నెలకు లక్ష రూపాయాలు అన మాట. సరే ఇవన్నీ అంటే ముఖ్యమంత్రి ఇంటి కోసం, ఆయన భద్రత కోసం కదా, కొంచెం రేట్లు ఎక్కువైనా పర్లేదులే, పాపం నెలకు రూపాయి జీతం మాత్రమే తీసుకుంటున్నారు కదా అని ప్రజలు అనుకుంటున్న టైంలో మరో షాక్ ఇచ్చారు.

indiatoday 23072019 3

ఆయనకు హైదరాబాద్ లో ఉంటున్న లోటస్ పాండ్ కోసం, నిన్న 24.50 లక్షలు విడుదల చేస్తూ జీఓ విడుదల చేసారు. అక్కడ బ్యాగేజ్ చెకింగ్ రూమ్,సీసీటీవీ రూమ్,స్టాటిక్ రూమ్‌లతో పాటు, బ్యారికేడ్ లు పెట్టాతనికి, ఈ డబ్బులు రిలేజ్ చేసారు. ప్రజల సొమ్ముతో ఎక్కడో హైదరాబాద్ లో ఉండే, జగన్ ఇంటికి సోకులు ఏంటి అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రేపు బెంగుళూరు ప్యాలెస్ కోసం, ఇడుపులపాయ ఎస్టేట్ కోసం, కడప ఇంటి కోసం కూడా ఇలాగే విడుదల చేస్తారా అని ప్రశ్నించారు. అయితే ఈ దుబారా ఖర్చుల పై నేషనల్ మీడియా కూడా ఉతికి ఆరేసింది. ప్రజల సొమ్ముతో జగన్ సోకులు చేసుకుంటున్నారంటూ, నేషనల్ మీడియా వాయించి పెట్టింది. మొత్తానికి, దేశం మొత్తం మన వైపు చూసేలా చేస్తా అని చెప్పిన జగన్ గారు, 50 రోజుల్లోనే చేసి చూపించారని, తెలుగుదేశం విమర్శిస్తుంది.

అప్పటి వరకు ఆమె ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్... చిన్న తనంలోనే, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కాని ఆమె కెరీర్ పై వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉండగా చేసిన పనులకు, మచ్చ పడింది. ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఆమె శ్రీలక్ష్మి. దయనీయ స్థితిలో, నడవలేని పరిస్థితిలో, ఆమె జైలు జీవితం కూడా అనుభవించారు. ఇదంతా ఓబులాపురం గనులు గాలి అండ్ గ్యాంగ్ కొట్టేసిన కేసులో, ఆమె కీలక అధికారిగా ఉండి, అనుమతులు ఇవ్వటమే కారణం. తరువాత, ఆమె అరెస్ట్ అవ్వటం జైలుకు వెళ్ళటం అన్నీ చూసాం. అయితే అప్పట్లో అందరూ ఆమె పై జాలి పడ్డారు. పాపం రాజకీయ ఒత్తిడులకు ఈమె బలయ్యారని అందరూ బాధపడ్డారు. ఆమె తరువాత జైలు నుంచి బయటకు రావటం, మళ్ళీ విధుల్లో చేరటం అన్నీ జరిగిపోయాయి.

srilakshmi 23072019 2

ప్రస్తుతం ఆమె తెలంగాణాలో పని చేస్తున్నారు. అయితే ఎవరి వల్ల ఆమె కష్టాలు పడ్డారని ప్రజలు భావించారో, వారితోనే మళ్ళీ పని చేస్తాను అని ఆమె చెప్పటం, ప్రజలను కూడా షాక్ కు గురి చేసింది. అన్యాయంగా వాళ్ళు చేసిన తప్పుకు, ఈమె బలయ్యారని అందరూ అనుకున్నారు. కాని ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే, నేను తెలంగాణా నుంచి డెప్యుటేషన్ పై వచ్చి, ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఆధ్వర్యంలో పని చేస్తానని ఆమె కోరారు. అయితే, ఆమె ఆంధ్రప్రదేశ్ రావాలి అనుకోవటం, జగన్ కూడా ఓకె అనటం జరిగిపోయాయి. అయితే, అనూహ్యంగా ఈ డెప్యుటేషన్లకు కేంద్రం అడ్డు పడుతుంది. ఏపి ఇంటలిజెన్స్ అధికారిగా, తెలంగాణా అధికారి స్టీఫెన్ రవీంద్రను పెట్టుకుంటామని అడగ్గా, దానికి కూడా కేంద్రం ఒప్పుకోలేదు.

srilakshmi 23072019 3

అయితే మరి శ్రీలక్ష్మి పట్టుదల ఎందుకోసమో తెలియదు కాని, ఏపిలో పని చెయ్యటానికి ఆమె కంకనం కట్టుకున్నారు. అందుకే ఈ రోజు విజయసాయి రెడ్డితో కలిసి పార్లమెంట్లో ప్రత్యక్షం అయ్యారు. అక్కడ హోం మంత్రి అమిత్ షా కార్యాలయానికి వెళ్లి దాదాపుగా అరగంట పాటు వేచి చూసారు. తరువాత అమిత్ షా రావటంతో, ఆయనతో 15 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. అక్కడ నుంచి, మళ్ళీ ప్రధాని కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రధానిని కలిసారో లేదో క్లారిటీ లేదు. మరి అమిత్ షా , ప్రధాని కార్యాలయం నుంచి, విజయసాయి రెడ్డికి, శ్రీలక్ష్మికి ఎలాంటి హామీ లాబించిందో కాని, ప్రజలు మాత్రం, ఇవన్నీ చూస్తూ, ఎవరు ఏంటో ఆర్ధం కావటం లేదని అంటున్నారు. శ్రీలక్ష్మి, రాజకీయ బాధితురాలు అనుకుని జాలి పడ్డాం, కాని ఆమె ఎవరి వల్ల అయితే జైలుకు వెళ్లిందో, మళ్ళీ వారితోనే పని చెయ్యాలి అనుకోవటం ఏంటో అర్ధం కావటం లేదని ప్రజలు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబుకు అవమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసెంబ్లీ మొదలైన దగ్గర నుంచి, చంద్రబాబు ఎంత టార్గెట్ చేస్తున్నా, ఎంత హేళన చేస్తున్నా, ఎంత ఎగతాళి చేస్తున్నా, చంద్రబాబు మాత్రం ఎక్కడ బ్యాలన్స్ తప్పటం లేదు. నేను ప్రజల సమస్యల పై పోరాడుతూనే ఉంటా, మీరు ఎన్ని చేసినా, నాకు ఏమి పర్వాలేదు అంటూ చంద్రబాబు చెప్పారు. ఇది ఇలా ఉంటే, ఈ రోజు వైసిపీ నేతల ప్రవర్తన మరీ ఎక్కవై పోయింది. చంద్రబాబు నాయుడు పై, మైక్ తీసుకుని మరీ దౌర్జన్యం చేస్తూ, ఖబర్దార్, ఖబర్దార్ అంటూ కనీసం పది సార్లు అంటూ బెదిరింపులు దిగారు. మైక్ లో అలా ఖబర్దార్ అంటూ ఏకంగా ప్రతిపక్ష నాయకుడిని బెదిరిస్తున్నా, డిప్యూటీ స్పీకర్ మాత్రం, అలా చూస్తూ ఉండి పోయారు కాని, అలా అనకూడదు అని మాత్రం చెప్పలేదు.

kotamreddy 23072019 1

ఈ రోజు అసెంబ్లీలో 45 ఏళ్ళకే, 2 వేల పెన్షన్ అంటూ, జగన్ చేసిన హామీ పై, జగన్ వెనక్కు తగ్గటం పై, తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది. ఈ సమయంలో, మైక్ అందుకున్న వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబుని బెదిరిస్తూ, దౌర్జన్యం చేస్తూ వ్యాఖ్యలు చేసారు. ఎంతో పౌరుషంగా, ‘చంద్రబాబు నాయుడు ఖబర్దార్..మీ సభ్యులకు చెప్పు.. ఖబర్దార్ చంద్రబాబు’ అంటూ ఒకటికి పది సార్లు ఈ వ్యాఖ్యలు చేసారు. ఆయాన ఎమోషన్ చూసి, చంద్రబాబుని ఏమైనా భౌతికంగా దాడి చేస్తారా అన్నంతలా అనిపించింది. చెప్పిన హామీ గురించి, ఎప్పుడూ అమలు చేస్తున్నారు అని ప్రశ్నించినందుకు, వైసిపీ నేతలు సమాధానం లేక, ఇరుక్కు పోయాం అని తెలుసుకుని, ముందుగా టిడిపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసారు.

kotamreddy 23072019 1

తరువాత చంద్రబాబు పై దూషణలకు, బెదిరింపులకు దిగారు. చంద్రబాబు మాత్రం, మీ లాంటి వారిని ఎంతో మందిని చూసా, ఏమి చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు ఒక లుక్ ఇచ్చారు. మరో పక్క సభలో వైసిపీ వైఖరి, తమకు మైక్ ఇవ్వకపోవటం పై టిడిపి సభ్యులు నిరసన తెలిపారు. ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడం, సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం పట్ల నిరసన తెలుపుతూ అసెంబ్లీ నుంచి వాక్ అవుట్ చేసారు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, రామానాయుడి పై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని తెలుగుదేశం సభ్యులు డిప్యూటీ స్పీకర్ ను కోరారు. అయితే ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లగా, జగన్ తో చర్చించి తమ చెప్తామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read