రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి, తిమ్మిని బమ్మిని చేస్తూ, అంతా నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసెంబ్లీలో తన వాదన వినిపించుకోవటం కోసం, ఆయన పడే పాట్లు అన్నీ ఇన్ని కావు. మొన్నటి మొన్న, హైలీ respected రెడ్డి అంటూ, కియా ప్రెసిడెంట్ ఉత్తరం రాసారని చెప్పి, రాష్ట్రం మొత్తం నవ్వుల పాలు అయ్యారు. ఇలాగే ఈ రోజు కూడా, తన వాదన వినిపించటం కోసం, ఇలాగే తెలిసి తెలియకుండా మాట్లాడి, చంద్రబాబు చేతిలో మరోసారి బుక్ అయ్యారు. నిన్న అమరావతికి ఎందుకు రుణం ఇవ్వమో చెప్తూ, ప్రపంచ బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం, ఈ నెల 15న, అమరావతికి రుణం ఇవ్వండి అంటూ గతంలో ఇచ్చిన ప్రతిపాదన వెనక్కు తీసుకుందని, అందుకే రుణం ఇవ్వలేకపోయాం అంటూ ప్రపంచ బ్యాంక్ చెప్పింది.

buggana 22072019 1

అయితే ప్రపంచ బ్యాంక్ క్షేత్ర స్థాయి పరిశీలనకు వస్తాం ని కోరగా, జగన్ ప్రభుత్వం నెల రోజుల టైం అడిగిందని, దీంతో ప్రభుత్వానికి పెద్దగా ఇష్టం లేదో అనుకుంటా అని అనుకున్న కేంద్రం, అమరావతి ప్రతిపాదనను వెనక్కు తీసుకునట్టు తెలుస్తుంది. అయితే, ఇదే విషయం పై ఈ రోజు అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల ప్రకటన చదువుతూ, బుగ్గన అనేక ఆరోపణలు చంద్రబాబు పై చేసారు. చంద్రబాబు అవినీతి చేసారని ప్రపంచ బ్యాంక్ నమ్మింది అని, అందుకే లోన్ ఇవ్వలేదని చెప్పారు. ఇదే సందర్భంలో జగన్ అంటే వాళ్ళకు ఎంతో నమ్మకం అని, అందుకే ఇదే ప్రకటనలో, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హెల్త్ సెక్టార్ లో, 300 మిలియన్ డాలర్ల సయం చేస్తామని ముందుకొచ్చారని, ఇది జగన్ మీద వాళ్ళకు ఉండే నమ్మకం అని చెప్పారు.

buggana 22072019 1

అయితే ఈ సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ, అసలు విషయాన్నీ బహిర్గతం చేసారు. జగన్ ను చూసి, ఎవరైనా అప్పు ఇస్తారా అని చెప్తూ, హెల్త్ సెక్టార్ కి 300 మిలియన్ డాలర్ల లోన్, వీళ్ళ ప్రతిభగా చెప్పుకుంటున్నారని, కీలక డాక్యుమెంట్ బయట పెట్టారు. ఈ ఒప్పందం చంద్రబాబు హయంలోనే జరిగింది. కాకపోతే జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత సంతకాలు పెట్టారు. 11 అక్టోబర్ 2018న, చంద్రబాబు ప్రభుత్వం హెల్త్ సెక్టార్ లో లోన్ కోసం అప్లై చేసింది. 15 మే 2019న, ప్రపంచ బ్యాంక్ బోర్డు సమావేశం అయ్యి, లోన్ ఇవ్వటానికి ఒప్పుకుంది. అప్పటికి ఇంకా చంద్రబాబు సియంగానే ఉన్నారు. ప్రభుత్వం మారిన క్రమంలో, 27 జూన్ 2019న, కొత్త ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. డాక్యుమెంట్ లో ఇంత క్లియర్ గా ఉంటే, కేవలం జగన్ మీద నమ్మకంతో ప్రపంచ బ్యాంక్ లోన్ ఇచ్చింది అంటూ, జగన్ ను లేపటానికి చూసి, చంద్రబాబుకి మరోసారి బుగ్గన బుక్ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో, ఎప్పుడూ చూడని సీన్స్ కనిపిస్తున్నాయి. నాలుగు రోజుల క్రిందట, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక, మంత్రి అనిల్ వాక్ అవుట్ చేసిన విషయం తెలిసిందే. ఒక మంత్రి వాక్ అవుట్ చెయ్యటం, ఇప్పుడే చూస్తున్నా అని లోకేష్ కూడా ఎద్దేవా చేసారు. అయితే ఆ మంత్రి మళ్ళీ తిరిగొచ్చు, లోకేష్ పై వ్యక్తిగత దాడి చెయ్యటం, దానికి లోకేష్ ఘాటుగా బదులు ఇస్తూ, మీ వెనుక ఉన్న జైలు బ్రతుకు చూసుకోండి అని చెప్పటం, ఇవన్నీ చూసాం. అయితే ఈ రోజు కూడా ఒక మంత్రి శాసనమండలి నుంచి వాక్ అవుట్ చెయ్యటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ రోజు వంతు మంత్రి బొత్సా సత్యన్నారాయణది. అధికార పక్షంగా ఉంటూ, మంత్రులుగా ఉంటూ, ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి కాని, ఇలా వాక్ అవుట్ చేసి వెళ్ళిపోతున్నారు.

botsa 2072019 2

దీంతో వైసిపీ చూపిస్తున్న ఈ వింత పోకడ రాజకీయ వర్గాల్లో చర్చనీయంసం అవుతుంది. ప్రతిపక్షం వాక్ అవుట్ చెయ్యటం, ప్రభుత్వం పై నిరసన తెలపటం చూసాం కాని, ఇలా అధికార పక్షం, అదీ అందరికీ జవాబుదారీగా ఉండాల్సిన మంత్రులు వాక్ అవుట్ చెయ్యటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు శాసనమండలి సమావేశాలు మొదలు కాగానే, రాష్ట్రంలో కరువు తాండవిస్తు ఉండటం, వర్షాలు లేక పోవటం వంటి అంశాల పై చర్చ మొదలైంది. వ్యవసాయ మంత్రి, కురసాల కన్నబాబు తన సోదరుడు హఠాన్మరణం తరువాత, ఆయన బదులుగా వ్యవసాయ బడ్జెట్ కూడా బొత్సానే చదివారు, సభలో ప్రవేశపెట్టారు. కరువు పై చర్చలో కూడా, వ్యవసాయ మంత్రి తరుపున, బొత్సా పాల్గున్నారు.

botsa 2072019 3

ఈ సందర్భంగా ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు బొత్సా సమాధానం ఇచ్చారు. అన్ని జిల్లాల నుంచి కరువు నివేదికలు తెప్పిస్తున్నామని, త్వరలోనే పూర్తీ లెక్కలు చెప్తామని అన్నారు. రాష్ట్రంలో తక్కువ వర్ష పాతం, రైతుల ఆత్మహత్యలు పై నివేదిక సిద్ధం చేస్తున్నామని అనంరు. అయితే చర్చ జరుగుతూ ఉండగానే శాసనమండలి నుంచి బొత్సా వెళ్ళిపోయారు. చర్చ పై సమాధానం ఇవ్వకుండా, కనీసం చర్చలో పాల్గునకుండా మంత్రి వెళ్ళిపోవటం పై, ప్రతిపక్షాలు ఆందోళన చేసాయి. అయితే ఆయన ఎందుకు వాక్ అవుట్ చేసారో, రికార్డుగా చెప్పలేదు. మంత్రే చర్చలో లేనప్పుడు, ఇంకా ఈ చర్చ ఎందుకని ? ప్రభుత్వం తరుపున ఎవరో ఒకరు సమస్యల పై మాట్లాడటానికి ఉండాలి కదా అని తెలుగుదేశం నేతలు విమర్శలు చేసారు. మరి ఈ వివాదం పై బొత్సా ఏమంటారో చూడాలి.

గత రెండు నెలల నుంచి జగన్ మొహన్ రెడ్డికి ఒకే ఒక టార్గెట్. చంద్రబాబుని ఎదో ఒక అవినీతి కేసులో ఇరికించాలి. దీని కోసం జగన్ పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సెక్రటేరియట్ కు వెళ్ళిన మొదటి రోజే, అక్కడి ఉద్యోగులకు ఒక ఆఫర్ ఇచ్చారు. చంద్రబాబు చేసిన అవినీతి ఉంటె చెప్పండి, మిమ్మల్ని సన్మానిస్తాం అని. ఇప్పటికి రెండు నెలలు అయినా, ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఇక తన పరిధిలో అన్ని ఫైల్స్ తిరగేస్తున్నారు. చంద్రబాబు పై చాలా కమిషన్ లు వేసారు. మరో 15 రోజుల్లో మొత్తం బయట పెడతా అని వార్నింగ్లు ఇస్తున్నారు. ఇదే కోవలతో చంద్రబాబు హయంలో కుదిరిన విద్యుత్ ఒప్పందాల పై జగన్ పట్టుదలగా ఉన్నారు. ఎవరు చెప్పారో కాని, ఈ విషయం మాత్రం వదిలి పెట్టటం లేదు. అటు కేంద్రం కూడా , ఈ విషయంలో రెండు లేఖలు రాసింది.

current 22072019 2

విద్యుత్ ఒప్పందాలు, రెగ్యులేటరీ కమిషన్ చేస్తుందని, దీంట్లో అవినీతి ఆస్కారం ఉండదని, పెట్టుబడిదారులను భయపెట్టద్దు అని వార్నింగ్ ఇచ్చింది. అయినా జగన్ ఎదో జరిగి పోయింది అనే భ్రమలో ముందుకే వెళ్తున్నారు. ఈ నేపధ్యంలోనే, ఈ రోజు విద్యుత్ ఒప్పందాల పై ఉన్నతస్థాయి సమీక్ష చేస్తున్నామని, ఈ సమీక్షకు హాజరుకావాలని, ఒప్పందాలు చేసుకున్న అన్ని విద్యుత్ కంపెనీలను ప్రభుత్వం సమీక్షకు ఆహ్వానించింది. వీరందిరనీ వెలగపూడి సచివాలయాని రావాల్సిందిగా ఆహ్వానం పంపారు. అయితే, ఈ సమీక్షకు మేము హాజరు కావటం లేదని, కేంద్ర సంస్థలు అయిన, ఎన్టీపీసీ, ఎస్‌ఈసీఐ నిర్ణయం తీసుకుంటూ, వారి నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలిపాయి. అంతే కాదు, జగన్ ప్రభుత్వం ఇలాగే మొండిగా వెళ్తే, కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాయి.

current 22072019 3

మా ఒప్పందాలు కూడా జగన్ ప్రభుత్వం రద్దు చేస్తే, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ రెండు కేంద్ర సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే ప్రైవేటు కంపెనీ అయిన గ్రీన్ కో, ప్రభుత్వ వైఖరి పై ట్రిబ్యునల్ కు వెళ్ళటంతో, జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టి, ట్రిబ్యునల్ స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వానికి అటు కేంద్రం కాని, ఇటు బిజినెస్ వర్గాలు, ఫిచ్ రేటింగ్స్, ఇలా అనేక మంది హెచ్చరికలు జారీ చేసారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పున:పరిశీలన చేయడం పారిశ్రామిక అభివృద్ధికి మంచిది కాదని, పెట్టుబడి దారులు వెళ్లిపోతారని, హెచ్చరించారు. ఎవరు ఎన్ని చెప్పినా, జగన్ మాత్రం, నేను సమీక్ష చేస్తాను, ఉండే వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు పోతారు అనే ధోరణిలో, కేవలం చంద్రబాబుని టార్గెట్ చేసుకుని వ్యవహరిస్తున్నారు. ఇలా అయితే జగన్ ప్రభుత్వానికి పవర్ షాక్ తప్పదేమో ?

ప్రతి రోజు ఎదో ఒక ట్వీట్ చేసి, వార్తల్లో నిలిచే కేశినేని నాని, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజేపీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేసారు. రాష్ట్రంలో కాల్ మనీ వ్యవహారం తారా స్థాయిలో ఉందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం ఈ మధ్య వార్తలో చూస్తున్నామని, ఈ సమస్య అందరికంటే ఎక్కువగా మీకే తెలుసనీ, దీని పై ఆక్షన్ తీసుకోండి అంటూ, ఒక పేపర్ కటింగ్ జత చేసి కేశినేని నాని ట్వీట్ చేసారు. కాల్ మొనీ మాఫియా నుంచి ప్రజలను కాపాడాలని కేశినేని నాని కోరారు. అయితే ఈ ట్వీట్ ని కూడా బుద్దా వెంకన్నను పరోక్షంగా టార్గెట్ చేసినట్టు అర్ధమవుతుంది. తెలుగుదేశం హయంలో, అప్పట్లో విజయవాడలో కాల్ మనీ కలకలం రేగిన సంగతి తెలిసిందే. అప్పట్లో బుద్దా వెంకన్న పై కూడా వైసిపీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ నేపధ్యంలో, కేశినేని నాని, కావాలనే టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది.

nani 22072019 2

విజయవాడలో కాల్ మనీ కేసులు వెలుగు చూసిన సమయంలో, ప్రసుత్తం డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్, అప్పట్లో విజయవాడ సిపీగా పని చేసారు. తరువాత కాల్ మొనీ కేసులు తగ్గుతూ వచ్చాయి. అయితే కేశినేని ఎవరినీ టార్గెట్ చేసుకుని ఈ ట్వీట్ చేసినా, మళ్ళీ ఈ కాల్ మనీ వ్యవహారం అధికమైంది. రాష్ట్రంలో ప్రతి రోజు ఈ కాల్ మనీ వేధింపులకు సంబంధించి కేసులు ఎక్కవ అయ్యాయి. ఏకంగా పులివెందుల మాఫియా నుంచి నాకు రక్షణ కావలి అని, ఒక మాజీ ఎమ్మెల్యే, కడప ఎస్పీకి మోర పెట్టుకున్నారు అంటే తీవ్రత అర్ధమావుతుంది. వైఎస్ఆర్ కు అత్యంత ఆప్తుడు అయిన కదిరి మాజీ ఎమ్మెల్యే జొన్నరామయ్య, నన్ను పులివెందుల మాఫియా బెదిరిస్తుందని, అప్పు తీర్చేసినా, ఇంకా ఇంకా తెమ్మని బెదిరిస్తున్నారని, ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చారు.

nani 22072019 3

నిజానికి వీరి అరాచకం తట్టుకోలేక , కదిరి మాజీ ఎమ్మెల్యే జొన్నరామయ్య ఆత్మహత్య ప్రయత్నం చేసారు. రామయ్య ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న కుటుంబ సభ్యులు ఆయనతో కలిసి ఎస్పీని కలిసి తమకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే, ఇలాంటి వార్తలు రోజు రోజుకీ ఎక్కువ అయిపోతున్నాయి. ఈ రోజు కేశినేని నాని, అనంతపురంలో జరిగిన విషయం ప్రస్తావిస్తూ, కాల్ మనీ బారి నుంచి కాపాడాలని కోరారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి, ఈ కాల్ మనీ వ్యవహారం ఒక మచ్చగా మిగిలింది. ఇది వెలుగులోకి వచ్చిన తరువాత, వారిని కట్టడి చేసినా, ఆ మచ్చ మాత్రం అలాగే ఉండి పోయింది. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం రాగానే, మళ్ళీ ఎక్కడికక్కడ, ఈ కాల్ మనీ మాఫియా రెచ్చిపోతుంది. జగన కనుక వీటిని కంట్రోల్ చెయ్యకపోతే, ఆయనకు ప్రభుత్వానికి కూడా అపవాదులు తప్పవు.

Advertisements

Latest Articles

Most Read