ఈ రోజు ప్రవేశపెపెట్టిన కేంద్ర బడ్జెట్ పై, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కేంద్రం బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రానికి మరోసారి అన్యాయం జరిగిందని, ఏపి ప్రజల ఆకాంక్షని అసలు పట్టించుకోలేదని చంద్రబాబు అన్నారు. చాలా రంగాలకు బడ్జెట్ లో స్థానం కల్పించలేదని, పేదల సంక్షేమం పూర్తిగా మర్చిపోయారని అన్నారు. సామాన్య ప్రజలకు భరోసా కల్పించటం, రైతులకు, మహిళలకు, యువతకు తోడ్పాటు అందించే అంశాలు లేవని అన్నారు. రాష్ట్ర సమస్యలు అయిన ప్రత్యెక హోదా, ఆర్ధిక లోటు వంటి అంశాలు విభజన చట్టంలో ఉన్నాయని, వాటిని అసలు పట్టించుకోలేదని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ బడ్జెట్ వల్ల ఏమి ఉపయోగం లేదని చంద్రబాబు అన్నారు. విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క అంశం పైనా స్పష్టత ఇవ్వలేదని, ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం చూపించే వివక్ష కొనసాగుతూనే ఉందని చంద్రబాబు అన్నారు.

రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ పుడ్చాల్సి ఉంటే, రూ.4వేల కోట్లు మాత్రమే ఇప్పటి వరకు ఇచ్చారని, మిగిలినది ఇస్తామని, లేకపోతే ఇంతే ఇస్తామని, ఇలా ఏమి చెప్పలేదని, అసలు లోటు బడ్జెట్ పై కేటాయింపులు ఈ బడ్జెట్ లో లేవని అన్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్‌ఆర్‌ తదితర విద్యాసంస్థల ఏర్పాటు బాధ్యత కేంద్రానిది అని, వీటికి ఈ బడ్జెట్ లో ఒక్క పైసా కూడా కేటాయించలేదని చంద్రబాబు అన్నారు. ఇక రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల కేటాయింపులు లేవని చంద్రబాబు అన్నారు. ఈ రెండు ప్రాజెక్ట్ లు నిలిచిపోయి రెండు నెలలు అవుతున్నా, అటు కేంద్రం కాని, ఇటు రాష్ట్రం కాని పట్టించుకోవటం లేదని చంద్రబాబు అన్నారు. మరో పక్క మరో విభజన హామీ అయిన విశాఖ, విజయవాడ మెట్రోలతో పాటు కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు తదితర అంశాల పై అసలు ప్రస్తావనే లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే డిజిటల్ చెల్లింపుల పై వేస్తున్న పన్ను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించటం మంచి విషయమని, డిజిటల్ చెల్లింపులకు కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నప్పుడు మేమిచ్చిన సిఫార్సుల్లో ఇదే కీలకం అని, దాన్ని ఇప్పటికైనా అమలు చేసినందుకు ప్రజలకు మేలు చేస్తుందని చంద్రబాబు అన్నారు.

గత నెల రోజులుగా వైసీపీ చేస్తున్న దాడులలో చనిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇవ్వటానికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు నుంచి జిల్లాల పర్యటన మొదలు పెట్టారు. ముందుగా, ఈ రోజు, ప్రకాశం జిల్లా చినగంజాం మండలం రుద్రమాంబపురంలోని తెలుగుదేశం కార్యకర్త పద్మ కుటుంబాన్ని పరామర్శించారు. వైసీపీ దాడిలో, ఆమెను రోడ్డు మీద వివస్త్రను చేయడంతో మనస్తాపానికి గురై, ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఈ రోజు చంద్రబాబు ఆమె కుటుంబ సభ్యలను పరామర్శించి, 7.65 లక్షల రూపాయల ఆర్ధిక సాయం, పార్టీ వైపు నుంచి అందించారు. కుటుంబ నేపధ్యం అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన పద్మ పిల్లల్ని, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా చదివిస్తామని హామీ ఇచ్చారు. కుటుంబానికి అండగా ఉంటానని, ఏ సహాయం కావాలన్నా, తన వద్దకు వస్తే అన్నీ చూసుకుంటానని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఓక్ మహిళ అని కూడా చూడకుండా, రోడ్డు పైకి ఈడ్చుకొచ్చి, తన్నారని, చివరకు ఆమె చావుకు కారణం అయ్యారని మండిపడ్డారు. ఆమెను నడి రోడ్డు పై వివస్త్రను చేసి సెల్‌ఫోన్‌లో వీడియో తీసుకున్నారని, ఇలాంటి పనులు దారుణమని అన్నారు. నాగరిక సమాజంలో బ్రతుకుతూ, ఒక ఒక ఆడబిడ్డ పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా అని ధ్వజమెత్తారు. ఇంత పెద్ద ఘటన జరిగితే, జగన్ మాట్లాడడు, హోంమంత్రి ఇలాంటివి అన్నీ మామూలే, అందరికీ కాపలా ఉన్దేలం అంటున్నారు అని అన్నారు. కళ్ల ముందే దోషులు తిరుగుతున్నా, వారిని ఏమి చెయ్యలేని ఈ ప్రభుత్వం ఎందుకని అన్నారు. రాష్ట్రాన్ని మరో పులివెందుల చేద్దామనుకుంటున్నారా ? అని ప్రశ్నించారు. ఈ దాడిలో పద్మ భర్తకు కూడా తీవ్ర గాయాలయ్యాయని చంద్రబాబు అన్నారు. మనవాళ్లను కొట్టి తిరిగి మనవాళ్లపైనే కేసులు పెడతున్నారని, ఇలా అయితే ప్రజలు తిరగబడతారని అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు, రాష్ట్రానికి పెద్దగా ఏమి ఇవ్వలేదు కేంద్రం. విభజన చట్టంలో ఎన్నో హామీలు ఉన్నా, వాటికి అరకోర కేటాయింపులు చేస్తూ వచ్చింది. ఇవన్నీ మూడేళ్ళు చూసిన చంద్రబాబు, బీజేపీతో ఖటీఫ్ కొట్టి, రాజకీయంగా ఎంతో నష్టపోయే నిర్ణయం తీసుకుని, రాష్ట్ర హక్కుల కోసం పోరాడారు. బలమైన మోడీ, షా లకు, రాష్ట్రం కోసం ఎదురు తిరిగి, రాజకీయంగా ఎంత నష్టపోయారో మొన్న ఎన్నికలు చెప్పాయి. అదే సమయంలో, అప్పట్లో ఢిల్లీ నుంచి ఏమి సాధించ లేకపోయారు అని హేళన చేసిన జగన్, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. కేంద్రం మెడలు వంచి అన్నీ సాదిస్తామని చెప్పారు. అందుకే ప్రజలు 22 ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించారు. అయితే ఈ రోజు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. జగన్, విజయసాయి రెడ్డికి, మోడీతో ఉన్న దగ్గర సంబంధాలు చూసి, అబ్బో ఇక ఏపికి నిధుల వరద పారుతుందని అందరూ అనుకున్నారు. విజయ్ గారు అని మోడీ ప్రత్యేకంగా పలకరించటం చూసి, వీళ్ళు చుట్టాల కంటే ఎక్కువ దగ్గరయ్యపోయారు, ఇదంతా ఏపికి మంచి జరగటానికి సంకేతాలు అని ప్రజలు భావించారు.

అయితే ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో, మళ్ళీ ఏపికి పాత ట్రీట్మెంటే ఇచ్చింది కేంద్రం. విభజన హామీల ప్రస్తావన లేదు, అమరావతి నిర్మాణం గురించి, పోలవరం గురించి అసలు ఒక్క మాట కూడా లేదు. లోటు బడ్జెట్ తో అల్లాడుతున్న రాష్ట్రం, ఎన్నో విభజన హామీలు పెండింగ్ లో ఉన్నాయి, అవాన్నీ జగన్ సాధిస్తారు అని ప్రచారం చేసిన వైసీపీ, మరి ఇప్పుడు ఏమి సమాధానం చెప్తుందో ? లేకపోతె సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ అని ప్రజలను కూడా అనమంటుందో. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ బడ్జెట్ లో మనకు వచ్చిన కేటాయింపులు, సెంట్రల్ వర్సిటీకి రూ.13 కోట్లు, ఏపీ ట్రైబల్‌ వర్సిటీకి రూ. 8కోట్లు మాత్రమే. ఇక మిగతా విద్యాసంస్థలు అయిన ఐఐటీ, ఐఐఎం, నిట్‌, ఐఐఎస్‌ఈఆర్‌, ట్రిపుల్‌ ఐటీలకు మాత్రం ఒక్క పైసా కూడా బడ్జెట్‌లో కేటాయించలేదు.

మొన్నటి దాక మొరుమోగిన అమరావతి పేరు, ఇప్పుడు సోయలో కూడా లేకుండా పోతుంది. మొన్నటి దాకా కేంద్రం నిధులు ఇవ్వకపోయినా, చంద్రబాబు కిందా మీదా పడి, ఆంధ్రుల కోసం, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం పరుగులు పెట్టించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, మొత్తం తారు మారు అయ్యింది. కేంద్రం ఎలాగూ పట్టించుకోవటం లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూడా, అమరావతిని పక్కన పడేసింది. ఈ రోజు విడుదలైన కేంద్ర బడ్జెట్ లో, విభజన చట్టం ప్రకారం రాజధానికి ఇవ్వాల్సిన కేటాయింపులు పైసా కూడా లేదు. ఇక వచ్చే వారం వచ్చే రాష్ట్ర బడ్జెట్ లో కూడా అమరావతికి నిధుల కేటాయింపు ఉండదు అని ఇప్పటికే సంకేతాలు వచ్చయి. దీంతో ఇప్పుడు, అమరావతి నిర్మాణంపై దాదాపు నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే గత 40 రోజుల నుంచి అమరావతి నిర్మాణం ఎక్కడికక్కడ ఆగిపోయింది. 40 వేల మంది కూలీలతో ఎప్పుడూ సందడిగా ఉండే అమరావతి నిర్మాణ ప్రదేశం, నేడు ఎవరూ లేక నిర్మానుషంగా తయారయ్యింది.

చంద్రబాబు ప్రభుత్వం, అమరావతి నిర్మాణానికి, 1.09 లక్ష కోట్ల రూపాయల అంచనాతా, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని ప్రణాలికలు రచించింది. అమరావతిలో వివిధ కట్టడాలకు 62 వేల కోట్ల రూపాయల పనులు చేసందుకు ప్రతిపాదించారు. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే సమయానికి దాదాపు 40 వేల కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయి. అలాగే మరో 4200 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచే పనిలో ఉన్నారు. మరో 7600 కోట్ల రూపాయల పనులు డీపీఆర్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ దశలో వచ్చిన జగన్, అన్ని పనులు ఆపేశారు. మొన్న సమీక్ష చేసి, అమరావతి అంతా స్కాం అని, అక్కడ అవినీతి బయటకు తీసే వరకు, పనులు ఏమి జరగవ్ అని చెప్పారు. అయితే కేంద్రం అయినా ఏమైనా నిధులు ఇస్తుందని అందరూ భావించారు. ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో, అమరావతి అనే ఊసే లేదు. అటు మోడీ, ఇటు జగన్ కలిసి, అమరావతిని పక్కన పడేసారు.

Advertisements

Latest Articles

Most Read