ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది... ఈ మాట మొన్నటి దాక బాగా వినిపించేది. ఏ రంగం చూసినా, దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉండేది.. కాని ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, అన్నీ రివర్స్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయంలో మొన్నటి వరకు గొప్పగా చెప్పుకున్న ఎన్నో విషయాలలో ఇప్పుడు పతనం మొదలైంది. ఆదాయం తగ్గిపోవటంతో, పెట్టుబడులు రాకపోవటంతో, అన్ని విషయాల్లో మానం కిందకు పడిపోతున్నాం. ఈ నేపధ్యంలోనే, ఒక జాతీయ వార్తా పత్రికలో విచ్చిన కధనంలో, ఆంధ్రప్రదేశ్ ఆదయ పతనంలో దుకుసుకుపోతుంది. భారత దేశంలో అన్ని రాష్ట్రాల కంటే, ఏప్రిల్ – జూలై నెలల్లో ఆంధ్రప్రదేశ్ పన్నుల ఆదాయం దారుణంగా పడి పోయింది. గతంతో పోలిస్తే, 42.7 శాతం తగ్గిపోయింది. గత ఏడాది, ఇదే సమయానికి పన్నుల ఆదాయం, 5 శాతం వృద్ధి ఉంటే, ఇప్పుడు 42.7 శాతం పతనం అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరువాత, అత్యంత ఆదాయం పడిపోతున్న రాష్ట్రాల్లో పంజాబ్ ఉంది. మనకు 42.7 శాతం పతనం ఉంటె, రెండో స్థానంలో, 12.5 శాతం తగ్గుదలతో పంజాబ్ ఉంది. ఎంత తేడా ఉందొ చూసారా ? అందుకే పతనంలో దూసుకుపోతున్నాం అంటుంది. ఇందుకు అనేక కారణాలు చెప్పచ్చు. ముందుగా ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పెద్దల నిర్ణయాలు. అలాగే అన్ని పనులు ఆపెయ్యటం, రివర్స్ కు వెళ్ళటం. ఇక అన్నిటికంటే పెద్ద సమస్య ఇసుక కొరత. దీంతో ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఖర్చు పెట్టే వారు లేరు. ఇక కొత్త పెట్టుబడులు లేవు. ఇలా అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగమనంలో ఉండటంతో, ఈ పరిస్థితి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్ధిక మందగమనం కంటే, మన రాష్ట్రంలో అధికంగా ఉంది.
ఈ పరిస్థితి పై, టీడీపీ ఎంపీ, గల్లా జయదేవ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకు పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో పన్ను ఆదాయ వృద్ధి దారుణంగా పడిపోవడం. గల్లా జయదేవ్ ట్విట్టర్ వేదికగా జగన్ నిర్ణయాలను వ్యతిరేకించారు."YCP Govt's decision to stop all #development works has resulted in AP registering the highest fall in #tax revenues in the country in first quarter. Unless the development works are taken up immediately, the exchequer of the state will further deteriorate." అంటూ ట్వీట్ చేసారు. ఇక మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు "AP records highest fall in tax revenues in first quarter of 2019-20. New govt has continued spending without working on revenue sources. This government lacks basic administrative capabilities about revenues and welfare spending. Andhra headed for disaster without prompt action." అంటూ ట్వీట్ చేసారు.