మొన్నటి దాక, జగన్ కేసుల్లో కొంచెం బెట్టు సడలించిన, సిబిఐ, మళ్ళీ జగన్ కేసుల విషయంలో, పట్టు బిగిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రంతో, జగన్ సఖ్యతగా ఉన్నారు కాబాట్టి, ఇక కేసుల విషయంలో ఎలాంటి పురోగతి ఉండదని అందరూ అనుకున్నారు. కేసులు కొట్టేసే అవకాసం ఉండదని, జగన్ ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే అని, కాకపోతే, విచారణ జాప్యం చేసే అవకాసం ఉందని అందరూ అనుకున్నారు. దీనికి తగ్గట్టుగానే, జగన్ తాను ప్రతి వారం కోర్ట్ కి రాలేను అని చెప్పారు. అయితే ఎవరూ ఊహించని విధంగా, సిబిఐ, ఎంతో ఘాటుగా వాదనలు వినిపించింది. జగన్ ఎంపీగా ఉండగానే సాక్ష్యులను బెదిరించారని, ఇప్పుడు సియం అని, అతన్ని విచారణకు రావాల్సిందే అని తెలిపింది. అంతకు ముందు, పెన్నా చార్జ్ షీట్ విషయంలో, అదనపు చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇక ఈ రోజు ఓబుళాపురం మైనింగ్​ కేసు విషయంలో దూకుడు పెంచింది సిబిఐ.

cbi 10102019 2

హైకోర్టు విభజన నేపథ్యంలో.. ఏయే కేసులు ఎక్కడ విచారణ జరపాలో సెప్టెంబర్ 3న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, దాని ప్రకారం ఓబుళాపురం మైనింగ్​ కేసు కేసును విశాఖకు బదిలీ చేయాలని సిబిఐ, కోర్ట్ ని కోరింది. ఈ కేసును విశాఖ సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థ కోరింది. అయితే ఈ రోజు, సిబిఐ అనూహ్యంగా తన వాదనను మార్చేసింది. ఈ కేసును హైదరాబాద్‌ నుంచి విశాఖకు బదిలీ చేయొద్దని కోరుతూ సవరించిన మెమోను సిబిఐ కోర్ట్ ముందు దాఖలు చేసింది. ఈ నేరం జరిగిన సమయంలో నిందితుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌ నివాసులేనని సీబీఐ పేర్కొంది. ఈ కేసు విషయంలో రాష్ట్ర విభజన జరగకముందే ఛార్జిషీట్లు దాఖలయ్యాయని పేర్కొంది. ఓఎంసీ కేసును విశాఖకు బదిలీ చేస్తే విచారణ మరింత ఆలస్యమవుతుందని.. హైదరాబాద్‌ సీబీఐ కోర్టులోనే విచారణ జరపాలని కోరింది.

cbi 10102019 3

అయితే ఈ విషయంలో సిబిఐ, ఇలా మాట మార్చటం వెనుక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం ఉందా అనే అనుమానం కలుగుతుంది. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విశాఖపట్నంలో ఉన్న సిబిఐ కార్యాలయాన్ని, విజయవాడకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు ఎందుకు ఇచ్చిందో ఎవరికీ అర్ధం కాలేదు. రాష్ట్రమంతా కార్యాలయాలు ఉండాలని, అన్ని ప్రాంతాల్లో కార్యాలయాలు ఉండాలని, అందుకే అమరావతిని నిలుపుదల చేసాం అని చెప్తున్న జగన్ ప్రభుత్వం, సిబిఐ కోర్ట్ ని విశాఖ నుంచి విజయవాడ తరలించటంలో మర్మం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. ఈ రోజు సిబిఐ వాదనలు విన్న తరువాత, జగన్ ప్రభుత్వ నిర్ణయానికి, సిబిఐ మొన్నటి దాక వైజాగ్ కి బదిలీ చెయ్యమని, ఇప్పుడు వద్దు హైదరాబాద్ లోనే విచారణ చెయ్యాలి అని చెప్పటానికి, ఏమైనా లింక్ ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి.

సంబంధం లేని గొడవలోకి వెళ్లి, కేసిఆర్ మెప్పు పొందాలని చూసిన విజయసాయి రెడ్డికి, గట్టి షాక్ ఇచ్చారు టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్. రవి ప్రకాష్ కు,కేసీఆర్ కోటరీ అయిన మేఘా, రామేశ్వరరావు మధ్య, చిన్న సైజు యుద్ధమే నడుస్తుంది. టీవీ9 ని చేజేక్కించుకున్న తరువాత, రవి ప్రకాష్ ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. టీవీ9 కేసుల్లో, అరెస్ట్ చెయ్యకుండా రవి ప్రకాష్ కోర్ట్ కు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు. అయినా సారే, మరో కేసు పెట్టి, ఉన్నట్టు ఉండి రవి ప్రకాష్ ని అరెస్ట్ చేసారు. అయితే వీరి మధ్య జరుగుతున్న గొడవలోకి విజయసాయి రెడ్డి ఎంటర్ అయ్యారు. ఏకంగా సుప్రీం కోర్ట్ ఛీఫ్ జస్టిస్ కు లేఖ రాసి, ఆ లేఖను మీడియాకు విడుదల చేసారు. ఆ లేఖలో రవి ప్రకాష్ పై అనేక ఆరోపణలు చేసారు. రవి ప్రకాష్ అన్ని ఉల్లంఘనలు చేసారని, మనీ లాండరింగ్ చేసారని, అతని పై సిబిఐ, ఈడీ కేసులు పెట్టి, విచారణ చెయ్యాలని, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ను కోరారు విజయసాయి.

ravi 10102019 2

అయితే ఎవరైనా పిటీషన్ వేస్తారు. విజయసాయి రెడ్డి మాత్రం లేఖ రాయటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. అన్ని ఆధారాలు ఉంటె, కేసు ఫైల్ చేస్తే, సుప్రీం కోర్ట్ సరైన నిర్ణయం తీసుకుంటుంది. కాని, ఏదో ఒక ఉత్తరం రాసి, దాన్ని మీడియాకు లీక్ చెయ్యటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. ఈ వార్తా అన్ని టీవీ చానెల్స్ లో తో పాటుగా, సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. అయితే ఈ విషయం పై రవి ప్రకాష్ మాత్రం, జైలు నుంచి విజయసాయి రెడ్డికి షాక్ ఇచ్చే న్యూస్ చెప్పారు. విజయసాయిరెడ్డిపై పరువునష్టం దావా వేయాలని రవి ప్రకాష్ నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా, రూ. 100కోట్లకు పరువునష్టం దావా వెయ్యాలని రవి ప్రకాష్ నిర్ణయం తీసుకున్నారు. విజయసాయి రెడ్డి అబద్ధాలను వదిలేది లేదని చెప్తున్నారు.

ravi 10102019 3

గతంలో , ఇప్పుడు విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలే, రామేశ్వరరావు, మెఘా కృష్ణారెడ్డి అనుచరుడైన రామారావు చేశారని, ఇవన్నీ అసత్యమని అధికారులు తేల్చారని గుర్తు చేస్తున్నారు రవి ప్రకాష్ సన్నిహితులు. రామారావు నెలక్రితం పంపిన లేఖ కాపీనే ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు తన లెటర్ హెడ్‌పై పంపించారని ఆరోపిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై మలేషియా, సింగపూర్ విదేశీ నిధులు తరలించారంటూ అబద్ధపు ఫిర్యాదు చేసిన రామారావు, నెల క్రితం రవిప్రకాష్‌ పై ఆరోపణలు చేశారని రవి ప్రకాష్ సన్నిహితులు చెప్తున్నారు. వీటి అన్నిటి వెనుక పెద్దల హస్తం ఉందని, వారే ఇప్పుడు విజయసాయి రెడ్డి చేత, ఈ నాటకం ఆడిస్తున్నారని ఆరోపిస్తున్నారు.. ఈ నిరాధారమైన ఆరోపణలను అత్యుత్సాహంతో ప్రసారం చేసిన ఛానెళ్లపై కూడా చర్య తీసుకోవాలని నిర్ణయించినట్టు చెప్తున్నారు.

నిన్నటి నుంచి వైసీపీ అనుకూల మీడియాతో పాటుగా, సోషల్ మీడియాలో వైసిపీ వర్గం మొత్తం, చంద్రబాబు పై సిబిఐ దర్యాప్తు చేస్తున్నారు, చంద్రబాబు పై విచారణ చెయ్యమని, హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది అంటూ తెగ హడావిడి చేస్తున్నారు. చాలా మంది ఇది నిజం అని కూడా నమ్మారు. అయితే ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు వేరు, ఇక్కడ వైసీపీ చేస్తున్న ప్రచారం వేరు. అసలు జరిగింది ఇది. పెంటపాటి పుల్లారావు అని ఈయన మొన్నటి దాక సామాజికవేత్తగా ఉన్నారు. ఎక్కువగా పోలవరం మీద వ్యతిరేకంగా కధనాలు రాస్తూ, అలాగే సాక్షిలో ఎడిటోరియల్స్ రాస్తూ ఉండేవారు. ఎన్నికల ముందు, ఉన్నట్టు ఉండి జనసేన పార్టీలో చేరారు. జగన్ కి అనుకూలం అని పేరు ఉన్న వ్యక్తీ, పవన్ పక్కన చేరటంతో అందరూ అవాక్కయ్యారు. అయినా సరే, గతంలో మాదిరిగా, పోలవరం పై కేసులు వేస్తూనే ఉన్నారు. ఇదే కోవలో, ఢిల్లీ హైకోర్ట్ లో ఒక కేసు వేసారు.

polavarma 10102019 1

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఎన్నో అవకవతవకలు జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో, పారదర్శకత లేదని తెలియచేస్తూ, ఢిల్లీ హైకోర్ట్ లో కేసు వేసారు. రూ.16,010 వేల కోట్లుగా ఉన్న ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.57,941 కోట్లకు పెంచారని, ఇక్కడే అవినీతి జరుగుతుంది అనే విషయాన్ని పిటీషన్ లో దాఖలు చేసారు. ప్రధాని మోడీ, ఎన్నికల ప్రచారంలో, పోలవరం పై చేసిన రాజకీయ విమర్శలను కూడా, ఈ పిటీషన్ లో వేసారు. ఈ మొత్తం వ్యవహారం పై కోర్ట్ జోక్యం చేసుకోవాలని, పోలవరం పై సిబిఐ ఎంక్వయిరీ వెయ్యాలని, ఆదేశాలు ఇవ్వాలి అంటూ, పెంటపాటి పుల్లారావు, ఢిల్లీ హైకోర్ట్ లో పిటీషన్ వేసారు. పుల్లారావు తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌ కుమార్‌ వాదించారు.

polavarma 10102019 1

వాదనలు విన్న హైకోర్ట్, పుల్లారావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం పై విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే ఆ పిటిషన్‌ను వినతిపత్రంగా పరిగణించాలని మాత్రమే కేంద్ర జలశక్తి శాఖకు సూచించింది. ఈ పిటిషన్‌పై బుధవారం ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నరేంద్రభాయ్‌ పటేల్‌, జస్టిస్‌ హరిశంకర్‌తో కూడిన ధర్మాసనం వాదనలు విని, కేసు డిస్మిస్ చేసింది. కోర్ట్ ఇలా స్పష్టంగా చెప్తే, వైసిపీ మాత్రం, చంద్రబాబు పై దర్యాప్తుకు హైకోర్ట్ ఆదేశించింది అంటూ హడావిడి చేసారు. ఇక్కడ కోర్ట్, కేంద్రాన్ని ఈ విషయం పై చూడామని మాత్రమే చెప్పింది. అయితే ఇప్పటికే కేంద్రం, ఈ విషయం పై పార్లమెంట్ వేదికగానే, పోలవరంలో ఎలాంటి అవినీతికి తావులేదు అని స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా చంద్రబాబు పై బురద చల్లాలి కాబట్టి, ఇలా ప్రచారం చేసింది వైసీపీ...

సోషల్ మీడియాని, రాజకీయ పార్టీలు ఉపయోగించుకుని, తమ ఎజెండా చెప్తూ, ప్రత్యర్ధుల పై విమర్శలు చేస్తూ, ముందుకు పోతూ ఉంటం చూసాం. పార్టీ సానుభూతి పరులు, వారి పార్టీల గురించి, నాయకుల గురించి పోస్ట్ లు పెడుతూ, అవతలి పార్టీ వారు పెట్టే పోస్ట్ లకి కౌంటర్ లు ఇస్తూ, ఎవరి వాదన వారు వినిపిస్తూ, తమ వాదన గెలిచేలా చేస్తూ ఉంటారు. అయితే, ఈ ధోరణి పోయి, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చెయ్యటం, ఇప్పుడు ఎక్కువ అయిపొయింది. అయితే ఇప్పుడు, అభిమానులు కాదు, ఏకంగా రెండు ప్రధాన పార్టీల అఫిషియల్ పేజెస్ మధ్య కౌంటర్ లు నడుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, వైసీపీ అఫిషియల్ పేజెస్ మధ్య వార్ జరుగుతుంది. రాష్ట్రంలో కరెంటు కష్టాలు ఉన్న సంగతి తెలిసిందే. గత ౫ ఏళ్ళలో ఎప్పుడూ లేని విధంగా, దాదపుగా 3 నుంచి 5 గంటల పాటు కరెంటు పోతూ వస్తుంది. ముఖ్యంగా 5 జిల్లాల్లో ఈ సమస్య ఉందని ప్రభుత్వమే ఒప్పుకుంది.

power 10102019 2

అయితే దీనికి కారణం మాత్రం, బొగ్గు నిల్వలు లేవని, అలాగే వర్షాలు పడుతూ ఉండటం వాళ్ళ సోలార్, విండ్ ఎనర్జీ రావటం లేదని, సీలేరు దగ్గర గండి పాడటంతో, విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది అంటూ, రోజుకి ఒక కారణం చెప్తున్నారు. అయితే, బొగ్గు నిల్వలు అయిపోయే దాక ఏమి చేస్తున్నారు అంటే సమాధానం లేదు. అయితే పక్క రాష్ట్రం నుంచి అధిక విద్యుత్ కు ప్రభుత్వం విద్యుత్ ని కొనుగోలు చేస్తుంది. ఇదే విషయం పై, ముందుగా, తెలుగుదేశం పార్టీ తన అఫిషియల్ ఫేస్బుక్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. "తెదేపా హయాంలో విద్యుత్తును యూనిట్ కు రూ.4.50లు పెట్టి కొంటే రాష్ట్రం నష్టపోయిందని జగన్ గారితో సహా ఆ పార్టీ నేతలు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం యూనిట్ కు రూ.11.68లు చొప్పున ఎలా కొంటోంది? రాష్ట్రానికి నష్టం తెస్తోంది ఎవరు?" అంటూ ఒక పోస్ట్ పెట్టారు.

power 10102019 3

దీనికి వైసిపీ సోషల్ మీడియాలో పేజిలో, మరోసారి దొరికిన టిడిపి, అబద్ధపు ప్రచారంతో దొరికిపోయారు అంటూ, ఒక టేబుల్ వేసి, మేము కేవలం 3 రూపాయలకే కొంటున్నాం అని, వేసారు. అయితే తెలుగుదేశం పార్టీ పోస్ట్ చేసిన దాన్ని, తప్పు అంటూ ప్రజల్లోకి తీసుకు వెళ్ళటంతో, దీనికి టిడిపి మరోసారి తన ఫేస్బుక్ పేజిలో, నిజానిజాలతో, పోస్ట్ చేసింది. ట్రాన్స్ కో సీఎండీ, అక్టోబర్ 3న పత్రికల్లో, మేము రూ.11.68లకు విద్యుత్ కొంటున్నాం అని చెప్పిన విషయాన్నీ చూపిస్తూ, ఇది అబద్ధమా అని పోస్ట్ చేసింది. సింగరేణి బొగ్గును రూ.3,710కి టన్ను చొప్పున కొంటున్నామని స్వయంగా ట్రాన్స్ కో సీఎండీ చెప్పారు. అలాగే కర్ణాటక లోని కుడిగి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి యూనిట్ విద్యుత్తును రూ.11.68కి కొంటున్నట్టు చెప్పారు. అంటే ట్రాన్స్ కో సీఎండీ చెప్పింది అబద్దమా? నాలుగు రోజుల లెక్క చూపి తప్పించుకో చూస్తున్న వైసీపీకి... గత నాలుగు నెలల విద్యుత్, బొగ్గు కొనుగోళ్లపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా? అని ప్రశ్నిస్తోంది తెలుగుదేశం. అయితే, ఈ ప్రశ్నకు మాత్రం, ఇప్పటి వరకు వైసిపీ నుంచి సమాధానం లేదు. ఇక రాదు కూడా, ఎందుకంటే, ప్రభుత్వంలో ఉన్న అధికారే, మేము అధిక రెట్లకు కొంటున్నాం అని వివరణ ఇచ్చారు కాబట్టి.

Advertisements

Latest Articles

Most Read