రెండు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, సినిమాకు, రాజకీయం కలిసి నడుస్తూ ఉంటాయి. ఎన్టీఆర్ దగ్గర నుంచి మొన్నటి పవన్ కళ్యాణ్ దాకా ఉదాహరణ. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లో సక్సెస్ అయినంతగా, ఎవరూ కాలేదు. తెలుగు సినిమాలో టాప్ హీరోలుగా పేరు ఉన్న చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా ఫెయిల్ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో అందరి అంచనాలు తారు మారు చేస్తూ జగన్ అధికారంలోకి రావటం, తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం జరిగిపోయాయి. ఇక పవన్ కళ్యాణ్ అయితే, తన పార్టీ గెలిచింది ఏమి లేదు కాని, తెలుగుదేశాన్ని నష్ట పరచటంలో మాత్రం సక్సస్ అయ్యారు. అయితే ఇప్పుడు జగన్ విధానాల పై, ప్రతిపక్షాలు అన్నీ కలిసి పోరాడాల్సిన పరిస్థితి వచ్చే అవకాసం ఉంది. ఈ నేపధ్యంలో, వచ్చే రెండు మూడు ఏళ్ళలో, మళ్ళీ తెలుగుదేశం, జనసేన కలిసే అవకాశాలు ఉన్నాయి. వీరికి బీజేపీ తోడయ్యినా ఆశ్చర్యం లేదు.
ఏ సోషల్ ఇంజనీరింగ్ తో అయితే జగన్ అధికారంలోకి వచ్చారో, అది పూర్తిగా మారి పోయే అవకాసం కనిపిస్తుంది. అందుకే, ఇప్పటి నుంచి వైసిపీ తన వ్యూహాలకు పదను పెట్టింది. చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆక్టివ్ గా లేరు. ఆయన బీజేపీలొకి వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే, గత నెల రోజులుగా వైసీపీ అడుగులు చుస్తే, చిరంజీవిని తమ వైపుకు తిప్పుకునే వ్యూహం పన్నినట్టు కనిపిస్తుంది. తన పై రాజకీయ విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ కు షాక్ ఇస్తూ, చిరంజీవి దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ఇలా చేస్తే, కాపు సామాజికవర్గం చీలితే, మళ్ళీ తనకే కలిసి వస్తుందని అనే ఆలోచలో ఉన్నారు. ఈ నేపధ్యంలోనే, చిరంజీవి కొత్త సినిమాకు, జగన్ మీడియా కాని, ఏపి ప్రభుత్వం కాని పూర్తిగా సహకరించింది. చిరంజీవి, వర్గం, అభిమానుల్లో ఇమేజ్ పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది వైసీపీ.
సైరా సినిమా ఆడియో రిలీజ్ మీడియా పార్టనర్ గా సాక్షి వ్యవహరించింది. తరువాత సినిమా ప్రమోషన్ కూడా సాక్షి తన బుజాల మీదకు తీసుకుంది. ఇది చిరంజీవి అభిమానులకు కూడా షాక్ కు గురి చేసింది. అదే విధంగా సాహో సినిమాకు ఏపీలో స్పెషల షోలకు అనమతి ఇవ్వని ఏపీ ప్రభుత్వం..తాజాగా సైరా సినిమాకు మాత్రం అర్దరాత్రి నుండి తెల్లారి 10 గంటలకు వరకు ఏకంగా ఆరు షోలకు చివరి నిమిషంలో అనుమతి ఇచ్చింది. ఇక తాడేపల్లి గూడెంలో ఎస్వీ రంగారావు విగ్రహానికి అనుమతులు లేవు. అయితే జగన్ ప్రభుత్వం అనుమాతలు ఇవ్వటంతో, విగ్రహావిష్కరణకు చిరంజీవి వచ్చారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్ని పనులు దగ్గరుండి చూసారు. ఇక, చిరంజీవి తాడేపల్లి గూడెం పర్యటన మొత్తం వైసీపీ నేతలు చాలా క్లోజ్ గా చిరంజీవితో ఉండటం, అదే సందర్భంలో జనసేన నాయకులు ఎవరూ లేకపోవటం రాజకీయంగా చర్చకు కారణమైంది. మొత్తానికి చిరంజీవిని దగ్గరకు తీసే ప్రయత్నం మొదలైందని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.