ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గత మూడు రోజులుగా పెరుగుతూనే ఉంది. నిన్న 24 గంటల్లోనే, కొత్తగా 67 కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి వరకు 111 కేసులు ఉనంట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు, ఈ రోజు తాజాగా విడుదల చేసిన బులిటెన్ లో, 21 కొత్త కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 132 కు చేరింది. నిన్న రాత్రి పది గంటల నుంచి, ఈ రోజు ఉదయం పది గంటల వరకు, మొత్తంగా 21 కేసులు పోజిటివ్ గా తేలాయి. మొత్తంగా ఇప్పటి వరకు, 1800 టెస్ట్ లు చేసారు. 132 పోజిటివ్ రాగా, 1175 నెగెటివ్ వచ్చాయి. ఇంకా 493 రిజల్ట్స్ రావాల్సి ఉంది. ముఖ్యంగా, ఢిల్లీలోని ఒక సభకు వెళ్లి వచ్చిన వారు, ఎక్కువగా ఈ కరోనా పోజిటివ్ బారిన పడుతున్నారు. వారు వారి సన్నిహితులు, బంధవులలో కూడా, ఈ లక్ష్యనాలు కనిపిస్తున్నాయి. వీరి వల్లే, ఇన్ని కేసులు వచ్చాయని, నిన్న జగన్ చెప్పిన సంగతి కూడా తెలిసిందే. వారి అందరినీ ప్రభుత్వం ముందుకు వచ్చి, టెస్ట్ లు చేసుకోవాలని, జగన్ కోరిన విషయం కూడా తెలిసిందే.

ఇప్పటి వరకు గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో, ఒక్కో జిల్లాల్లో, 20 కేసులతో, అత్యధికంగా కరోనా నిర్ధరణ అయింది. రాష్ట్రంలో బుధవారం రాత్రి 10 నుంచి గురువారం ఉదయం 10 వరకు 21 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇప్పటివరకు మొత్తం 1800 మందికి పరీక్షలు నిర్వహించగా, 132 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో, కర్నూల్ లో ఎక్కువ మంది, తరువాత అనంతపురంలో ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఇప్పటి వరకు, కర్నూల్ లో, కేవలం 61 మందిని మాత్రమే టెస్ట్ చేసారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, కర్నూల్ లో, 189 మంది ఉన్నారని, రెండు రోజుల క్రితం, ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల్లో తేలింది. ఇంకా వీరిలో, దాదాపుగా 120 మందికి టెస్టింగ్ చెయ్యాల్సి ఉంది.

ఇక ఈ రోజు బులిటెన్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో, 11 జిల్లాల్లో కరోనా కేసులు వచ్చాయి. విజయనగరం, శ్రీకాకుళంలో, ఇప్పటి వరకు ఒక్క కరోనా పోజిటివ్ కేసు కూడా లేకపోవటంతో, అక్కడ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అయినా అపత్రమత్తంగానే ఉన్నారు. ఇక అనంతపురంలో, 153 మందిని టెస్ట్ చేస్తే, 2 పోజిటివ్ వచ్చాయి. అలాగే, చిత్తూరులో, 93 మందిని టెస్ట్ చేస్తే, 8 పోజిటివ్ వచ్చాయి. తూర్పు గోదావరిలో, 229 మందిని టెస్ట్ చేస్తే, 9 పోజిటివ్ వచ్చాయి. గుంటూరులో, 302 మందిని టెస్ట్ చేస్తే, 20 పోజిటివ్ వచ్చాయి. కడపలో, 174 మందిని టెస్ట్ చేస్తే, 15 పోజిటివ్ వచ్చాయి. కృష్ణాలో, 47 మందిని టెస్ట్ చేస్తే, 15 పోజిటివ్ వచ్చాయి. కర్నూల్ లో, 61 మందిని టెస్ట్ చేస్తే, 1 పోజిటివ్ వచ్చాయి. నెల్లూరులో, 253 మందిని టెస్ట్ చేస్తే, 20 పోజిటివ్ వచ్చాయి. ప్రకాశంలో, 133 మందిని టెస్ట్ చేస్తే, 17 పోజిటివ్ వచ్చాయి. విశాఖలో, 202 మందిని టెస్ట్ చేస్తే, 11 పోజిటివ్ వచ్చాయి. ఇక పశ్చిమ గోదావరిలో, 96 మందిని టెస్ట్ చేస్తే, 14 పోజిటివ్ వచ్చాయి.

ఒక పక్క ప్రపంచం వణికి పోతుంది. కరోనా మహమ్మారి, అమెరికా లాంటి దేశాన్ని కూడా గడగడలాదిస్తుంది. మన దేశంలో కూడా, నెమ్మదిగా అందుకుంటుంది. ప్రధాని దగ్గర నుంచి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కరోనాని ఎదుర్కోవటం పైనే శ్రద్ధ పెట్టారు. విదేశాల నుంచి వచ్చిన వారిని, కరోనా లక్షణాలు ఉన్న వారిని ట్రేస్ చెయ్యటం, వారికి టెస్ట్ లు చెయ్యటం, తేడాగా ఉన్న వారికి ట్రీట్మెంట్ ఇవ్వటం. తరువాత స్టేజ్ వస్తే ఎలా ఉంటుందో అని, ఇప్పటి నుంచి వెంటిలేటర్లు, హాస్పిటల్స్ రెడీ చేస్తున్నారు. అయితే మన రాష్ట్రంలో కూడా, ఇవి ఒక పక్క జరుగుతున్నట్టు కనిపిస్తున్నా, కేసులు మాత్రం, అమాంతం పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్క రోజే, ఇంకా చెప్పాలి అంటే, నిన్న రాత్రి నుంచి, 9 గంటల్లో 43 పోజిటివ్ కేసులు వచ్చాయి. అంటే, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మన ముఖ్యమంత్రి, ప్రభుత్వం, ఎంత అలెర్ట్ గా ఉండాలి ? కరోనా పై ఎంత అప్రమత్తంగా ఉండాలి ? రాబోయేది కూడా అలోచించి, అన్నీ సన్నద్దం చెయ్యాలి.

ఇవి చేస్తున్నారో లేదో కాని, మన దగ్గర మాత్రం, అమరావతి పై పగ, ప్రతీకారం తీర్చుకోవటంలో మాత్రం, నిరంతం బిజీగా ఉంటున్నారు. ప్రపంచం మొత్తం,కరోనా భయంతో భయపడుతుంటే, రాష్టం పై కరోనా విజృంభణ ఎలావుంటుందో నిన్న, 12 గంటల్లో, 43 కరోనా కేసులు నమోదై, దేశంలో ఇప్పటివరుకు ఏ రాష్ట్రములో నమోదు కానీ, అన్ని కేసులు ఒకేసారి నమోదై, రాష్ట్ర ప్రజలు భయంతో బిక్కు బిక్కు మంటుంటే, మన జగన్ మొహన్ రెడ్డి గారు, నిన్న అత్యున్నత స్థాయి సమావేశంలో అమరావతి రాజధాని భూముల్లో, అభివృద్ధిని విస్మరించి, ఆ భూముల్ని, ఇళ్లపట్టాలని, నవరత్నాలకి పంచటం పై, హైకోర్టు స్టే విదిస్తే దాని పై సుప్రీం కోర్టులో, పీల్ దాఖలు చేయాలని, దానికి ఏర్పాట్లు చెయ్యాలని, ఆదేశాలు జారీచేశారు.

పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి సంబంధించి నిబంధనల్లో సవరణలు చేస్తూ నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఖాళీ ఇళ్ల స్థలాల విక్రయంపై నిషేధం విధిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వం కేటాయించిన ఉచిత ఇంటి స్థలంలో లబ్ధిదారులు కనీసం ఐదేళ్ల పాటు హక్కు కలిగి ఉండాల్సిందేనని జీవోలో పేర్కొంది. ప్రతి లబ్ధిదారు ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని పేర్కొంటూ ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టులో, అమరావతి భూములు విషయంలో ఎదురు దెబ్బ తగులుతూ ఉండటంతో,ఈ మేరకు ప్రభుత్వం ఈ మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐదేళ్ల కాలపరిమితి తర్వాత మాత్రమే బదలాయింపు, విక్రయానికి అనుమతి ఇస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో, ఇప్పుడు అమరావతిలో భూపంపిణీ పై, హైకోర్ట్ తీర్పు పై, ఈ కొత్త జీవోతో, సుప్రీం కోర్ట్ కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక పక్క కరోనాతో అల్లాడుతుంటే, ఈ సమయంలో కూడా అమరావతిని ఇబ్బంది పెట్టే నిర్ణయం తీసుకున్నారు, జగన్ గారు.

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 87కు చేరాయి. ఇవాళ ఒక్కరోజే 43 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యశాఖ వెల్లడించింది. కడప జిల్లాలో 15 మందికి కరోనా సోకింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ 14 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఇవాళ 5 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యశాఖ తెలిపింది. ప్రకాశం జిల్లాలో ఇవాళ 4 కరోనా కేసులు, నెల్లూరు జిల్లాలో ఇవాళ 2 కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఇవాళ 2 కరోనా కేసులు నమోదు కాగా... విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఇవాళ ఒక్కో కేసు నమోదయ్యాయని వైద్యశాఖ వెల్లడించింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరోజే 14 మందికి కరోనా సోకింది. ఈ మేరకు ఆ జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు వైద్యఆరోగ్య శాఖ నివేదికను వాట్సాప్‌ ద్వారా వెల్లడించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనా సోకిన బాధితుల సంఖ్య 87కి చేరింది. ఏలూరులో ఆరు, భీమవరంలో రెండు, పెనుగొండలో రెండు, ఉండి, గుండుగొలను, ఆకివీడు, నారాయణపురంలో ఒక్కోటి చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.

జిల్లాలో మొత్తం 30 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్‌ తెలిపారు. వైద్యపరీక్షల్లో 14 పాజిటివ్‌, 10 నెగిటివ్‌, ఇంకా 6 నివేదికలు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. అయితే కరోనా పాజిటివ్‌ కేసుల సమాచారం ఇంకా వైద్యఆరోగ్యశాఖ ధ్రువీకరించాల్సిఉంది. దేశ రాజధానిలో మత ప్రార్థనలకు హాజరై రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారు వెయ్యికి పైగా ఉంటారని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఈ సంఖ్య చూసి రాష్ట్రం ఉలిక్కిపడింది. దిల్లీ వెళ్లొచ్చిన వారు లాక్‌డౌన్‌ ప్రకటించే నాటికే స్థానికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనడం, వాటికి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరవడం మరింత కలవరపాటుకు కారణమవుతోంది. రాష్ట్రంలోని పరిస్థితిని నిత్యం సమీక్షిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.

కార్మికులు, కూలీలకు ఆహారం, తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. రైతుబజార్ల సంఖ్యను పెంచుతున్నామన్న మంత్రి బొత్స... సంచార దుకాణాల ద్వారా నిత్యావసరాలు అందిస్తున్నామని వివరించారు. ఎవరికి అనుమానిత లక్షణాలున్నా వెంటనే ఆస్పత్రికి తరలిస్తున్నామని స్పష్టం చేశారు. ఆస్పత్రులు, క్వారంటైన్లలో వసతులు పెంచాలని సీఎం ఆదేశించినట్టు బొత్స తెలిపారు. నియోజకవర్గ స్థాయిలోనూ అత్యవసర ఏర్పాట్లు చేశామని చెప్పారు. అరటి, టమాటా, అరటి, బత్తాయి పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు బొత్స సత్యనారాయణ వివరించారు.

క్రైసిస్ మ్యానేజ్మెంట్ అంటే, ఏపి ప్రజలకు గుర్తుకు వచ్చేది చంద్రబాబు. 1996 తుఫాను సమయంలో కాని, 2009లో వచ్చిన కృష్ణా వరదలు కాని, ఉత్తరఖాండ్ వరదలు కాని, హూద్ హూద్ కాని, తిత్లీ కాని, అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, చంద్రబాబు ముందుండి నడిపించే వారు. అయితే, ఇప్పుడు కరోనా వచ్చిన సమయంలో చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ లో ఉండకుండా, హైదరాబాద్ లో పడుకున్నారు అంటూ, వైసీపీ విమర్శలు చేస్తూ వస్తుంది. నిజానికి చంద్రబాబు, గత 5 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఉదయం 9 నుంచి, రాత్రి 11 వరకు సచివాలయంలో ఉంటూ, ఎంత కష్టపడే వారు ప్రజలకు తెలుసు. ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత, ఆయన ప్రతి శనివారం, ఆదివారం హైదరాబాద్ వెళ్తున్నారు. తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయటం, కుటుంబంతో గడపటం కోసం వెళ్తున్నారు. అలాగే, మొన్న కూడా హైదరాబాద్ వెళ్ళగా, వెంటనే ప్రధాని మోడీ లాక్ డౌన్ ప్రకటించటం, తరువాత దాన్ని పొడిగించటంతో, చంద్రబాబు అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది.

అయితే ఇదే విషయం పై, నిన్న జూమ్ యాప్ లో, చంద్రబాబు చేసిన వీడియో కాన్ఫరెన్స్ , మీడియా సమావేశంలో, ఒక విలేకరి, చంద్రబాబుని ఇదే ప్రశ్న అడిగారు. వైసీపీ నేతలు, మీకు బాధ్యత లేదు అని, మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు అని విమర్శిస్తున్నారు, మీరు ఏమి చెప్తారు అని అడిగితే, చంద్రబాబు దానికి స్పందిస్తూ, విమర్శించే వారు, విమర్శిస్తూనే ఉంటారు, నేను లాక్ డౌన్ కు ముందు హైదరాబాద్ వచ్చాను, తరువాత లాక్ డౌన్ ప్రకటించటం, దాన్ని పొడిగించటం చేసారు, బయటకు రాలేని పరిస్థితి వచ్చింది, ఇక్కడ ఉన్నా, నా మనసు అంతా అక్కడ జరుగుతున్న విషయాల పైనే ఉంది. ఉదయం 10 గంటల నుంచి, సాయంత్రం 7 గంటల వరకు, ఆఫీస్ లో కూర్చుని, సమాచారం మొత్తం తెప్పించుకుంటున్నాను అని అన్నారు.

ఎవరికి ఇబ్బంది ఉన్నా, పక్క రాష్ట్రాల్లో చిక్కుకున్న మన రాష్ట్రం ప్రజల ఇబ్బందులు ఉన్నా, అక్కడ అధికారులతో మాట్లాడుతున్నాం, అలాగే పార్టీ నాయకులకు, ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇస్తున్నాం, ప్రజలకు ఏ సమాచారం ఇవ్వాలి, అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రధాని మంత్రికి, చీఫ్ సెక్రెటరీకి, ముఖ్యమంత్రికి, ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాస్తూ, అలెర్ట్ చేస్తున్నాను, ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. నాకు ఏపికి రావాలనే ఉంది, కాని కేంద్రం ఇచ్చిన ఆదేశాలు పాటించాలి, అక్కడ ఉన్నా, ఇంట్లోనే ఉండాలి కదా, ఎక్కడైనా, నేను తెలుగు ప్రజల గురించే ఆలోచిస్తున్నాను, విమర్శలు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, అని చంద్రబాబు అన్నారు. అలగే దాదపుగా, గంట పాటు ప్రజలకు వీడియో ప్రేజంటేషన్ ఇచ్చారు. ఏ ఆహరం తినాలి, ఇమ్మ్యూనిటి ఎలా పెంచుకోవాలి, వ్యాయామం చెయ్యటం, అలాగే, పరిశుభ్రత గురించి చెప్తూ, రైతుల సమస్యలు, ఆక్వా, పౌల్ట్రీ, హార్టికల్చర్ సమస్యలు, పేదలకు నిత్యావసరాలు, ఇలా అనేక విషయాలు ప్రస్తావిస్తూ, ప్రజలకు సలహాలు ఇస్తూ, ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ, చంద్రబాబు మాట్లాడారు.

Advertisements

Latest Articles

Most Read