ఆంధ్ర - తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కృష్ణా జిల్లా గారికపాడు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దేశవ్యాప్త లాక్డౌన్తో తెలంగాణలోని ఆంధ్రావాసులు రాష్ట్రానికి తరలివస్తున్నారు. పోలీసులు వాహనాలు అడ్డుకుంటున్న కారణంగా ఇబ్బంది పడుతున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గారికపాడు వద్ద (రాష్ట్ర సరిహద్దు) బుధవారం రాత్రి భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను మధ్యాహ్నం నుంచి పూర్తిగా నిలిపివేయటం వల్ల రాత్రికి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విద్యాసంస్థల మూసివేతతో, హాస్టల్స్ ఖాళీ చెయ్యాలి అని చెప్పటంతో, హైదరాబాద్ నుంచి వస్తున్న విద్యార్థులు.. రాష్ట్ర సరిహద్దు వద్ద తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
అయితే తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సమన్వయం కొరవడింది. తెలంగాణా హాస్టల్స్ ఖాళీ చెయ్యాలి అని చెప్పటంతో, వీరంతా పోలీస్ స్టేషన్ లకు చేరటంతో, వారికి noc ఇచ్చి, తెలంగాణా పోలీసులు పంపించారు. అయితే, ఇక్కడ ఏపి బోర్డర్ లో మాత్రం, వారిని ఆపేసారు. పర్మిషన్ లేదని నిలిపివేశారు. మధ్యానం నుంచి, దాదపుగా వేలాది మంది హైవే పై ఉన్నారు. మూడు కిమీ దాకా, ట్రాఫిక్ ఆగిపోయినట్టు తెలుస్తుంది. పరిస్థితి చేయి దాటి పోవటంతో, ఎట్టకేలకలు తెలంగాణా ప్రభుత్వం స్పందించింది.
హాస్టల్స్ ఖాళీ చెయ్యవద్దు అని, ప్రభుత్వం నుంచే అన్ని హాస్టల్స్, భోజనం పెడతాం అని, హాస్టల్స్ ఖాళీ చెయ్యవద్దు అని కోరారు. మరో పక్క ఏపి వైపు ఎక్కువ మంది రావటానికి ప్రయత్నం చెయ్యటంతో, ఇప్పుడే ఏపి ప్రభుత్వం కూడా స్పందించింది. మంత్రి బొత్సా, తెలంగాణా మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు. అయితే, ఇప్పటికే చేయి దాటి పోయింది. చాలా మంది ఏపి బోర్డర్ లో ఉన్నారు. మరి వీరిని, ఎటు పంపిస్తారు ? ఏమి చేస్తారు ? ఇలాంటివి తెలియాల్సి ఉంది. తెలంగాణా ప్రభుత్వం చేసిన పనితో, ఇప్పుడు లాక్ డౌన్ స్పూర్తి పోయినట్టు అయ్యింది. ఇప్పటికైనా, వీరి పై, ఏదో ఒక నిర్ణయం తొందరగా, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సి ఉంది.