ఒక పక్క కరోనా మహమ్మారి విరుచుకు పడుతుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా, మార్చ్ 31 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. అయితే, ఈ సందర్భంగా, జగన్ మోహన్ రెడ్డి చేసిన ఒక ప్రకటనతో మాత్రం, ప్రజలు అవాక్కయ్యారు. పదవ తరగతి పరీక్షలు యదాతధంగా ఉంటాయని ప్రకటించారు. అంటే, మార్చ్ 31 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయి. అయితే ఒక పక్క లాక్ డౌన్ అని చెప్తూ, ట్రాన్స్ పోర్ట్ ఉండదు అని చెప్తూ, ఆ రోజు పరీక్ష పీట్టటం పై అందరూ ఆశ్చర్యపోయారు. దీని పై జగన్ ను ప్రశ్న అడగగా, ఆయన ప్రెస్ మీట్ నుంచి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. మరో పక్క నిన్న, అత్యవసర పరిస్థితి జాబితాలో, పదవ తరగతి పరీక్షల పేపర్లు, రవాణాని చేర్చారు. ఒక పక్క దేశం మొత్తం, భయపడుతుంటే, ఏపి ప్రభుత్వం, ఇలా ఒకేసారి కొన్ని లక్షల మంది పిల్లలు రాసే పరీక్షలు ఎలా అంగీకరిస్తుంది అనే భయం పట్టుకుంది.

ప్రజలు ఆందోళన చెందుతున్నా, ప్రభుత్వం ముందుకు వెళ్ళటంతో, ఏమి జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. అయితే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలు వాయిదా వెయ్యాలి అంటూ, ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. ఈ పిటీషన్ ను హైకోర్ట్ పరిశీలనలోకి తీసుకుంది. అయితే వెంటనే ప్రభుత్వం తరుపు న్యాయవాది స్పందిస్తూ, ప్రభుత్వం ఈ విషయం పై వెంటనే స్పందిస్తుందని, ఆ నిర్ణయం వచ్చే దాకా వేచి చూడమని చెప్పారు. ఇలా చెప్పిన కాసేపటికే, ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం ప్రకటించింది.

కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31 నుంచి నిర్వహించాల్సి పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఏడుగురు కరోనా వైరస్‌ బారిన పడటంతో, కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. పది పరీక్షలు మళ్లీ ఎప్పడు నిర్వహించేది మార్చి 31 తర్వాత ప్రకటించనున్నట్టు చెప్పారు. అయితే, ఈ నిర్ణయంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కోర్టులో పిటీషన్ వెయ్యక ముందే, నిన్నటి నుంచి ప్రభుత్వం ఈ విషయం పై తర్జన బర్జనలు పడుతుందని, పరీక్షలు వాయిదా వెయ్యాలని, నిన్నే అనుకున్నామని, ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఏదైతేనేం, ప్రజలకు మంచి జరిగింది.

ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా అయుదు ఎదురు దెబ్బలు తగిలాయి. మొదటిది, గ్రామ సచివాలయ భవనాలకు రంగులు మార్చాలన్న హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. రంగులు మార్చాలన్న హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను విచారణ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం... కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకొంటారా అని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.

రెండోది... విశాఖ జిల్లాలో ల్యాండ్ పూలింగ్ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పేదల ఇళ్ల పట్టాల కోసం 6 వేల ఎకరాలకు పైగా భూసమీకరణ సంబంధించి ప్రభుత్వం జీవో 72 జారీ చేసింది. మూడోది... రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై మంగళగిరి మండలం కృష్ణాయపాలేనికి చెందిన ఆవల నందకిషోర్.... కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఇంద్రనీల్... సీఆర్డీఏ చట్టం ప్రకారం పేదలకు నాణ్యమైన ఇళ్లు కట్టించాల్సి ఉందన్నారు. ఆ పని చేయకుండా ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం విడుదల చేసిన 107 జీవోపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇదే కేసులో, నాలుగోది... అమరావతి లో పేదల అసైన్డ్ భూములను భూ పంపిణీ కి తీసుకోవడానికి వీలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయిదోది.... కరోనా వైరస్.. లోక్​​సభ కార్యకలాపాలపై ప్రభావం చూపింది. మరో రెండు వారాలపాటు సాగాల్సిన లోక్​సభను షెడ్యూల్​ కంటే ముందే నిరవధిక వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ సమావేశాల్లో, మండలి రద్దు బిల్లు వస్తుందని జగన్ చాలా ఆశపడ్డారు.

గౌ. జగన్మోహన్ రెడ్డిగారికి,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,
అమరావతి.
విషయం: కరోనా వ్యాధి నియంత్రణ చర్యలు-ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవడం గురించి...

కరోనా మహమ్మారి తీవ్రతతో ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లుతున్నాయి. వేలాదిమంది మృతి చెందడం, లక్షలాదిమంది వ్యాధి బారిన పడటం కనీవినీ ఎరుగని పరిణామం. ఇటలీ, స్పెయిన్ తదితర దేశాల్లో రోజుకు వందలాదిమంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఏదైనా విపత్తు సంభవించినా ఏవో కొన్ని జిల్లాలకో, ఏదో ఒక రాష్ట్రానికో నష్టంచేసేవి. కానీ కరోనా మహమ్మారి మాత్రం యావత్ ప్రపంచానికే పెను విపత్తుగా పరిణమించింది.
మనదేశంలోని అనేక రాష్ట్రాల్లో కోవిద్- 19 వైరస్ ఇప్పటికే శరవేగంగా విస్తరిస్తోంది. ప్రాణాంతకంగా మారిన ఈ కరోనా వైరస్ ను ఏవిధంగా నియంత్రించాలనే దానిపై ప్రధాని శ్రీ నరేంద్రమోది నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం అనేక మార్గదర్శకాలు ఇచ్చింది. విదేశాలనుంచి వచ్చేవారికి క్వారంటైన్ చేయడం, ఐసొలేషన్ లో పెట్టడం, స్థానికంగా ఈ వైరస్ ఎవరికీ సోకకుండా నిరోధించడం పైనే, ప్రభుత్వాలు పెద్దఎత్తున దృష్టి పెట్టాల్సివుంది. కేవలం లాక్ డౌన్ చేయడంతో ఆశించిన ప్రయోజనాలు నెరవేరవని, దానితో పాటుగా, పెద్దఎత్తున ప్రజారోగ్య చర్యలు యుద్దప్రాతిపదికన చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సమాఖ్య ఇప్పటికే సూచించింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మనరాష్ట్రంలో కూడా కరోనా వ్యాధి నిరోధక చర్యలు త్వరితగతిన చేపట్టాలి.

విదేశాలనుంచి దాదాపు 15వేల మంది రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఇప్పటికే చేరినట్లుగా తెలుస్తోంది. వాళ్లందరికీ క్వారంటైన్ కట్టుదిట్టంగా చేయాలి, పకడ్బందీగా ఐసొలేషన్ నిర్వహించాలి. ఆసుపత్రులలో ప్రత్యేక ఐసొలేషన్ వార్డులతో సరిపెట్టకుండా, కరోనా వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలి. అన్ని గ్రామాల్లో, వార్డులలో పారిశుద్య చర్యలు చేపట్టాలి, పరిసరాలను పరిశుభ్రం చేయాలి. ముందు జాగ్రత్త చర్యలపై అన్నివర్గాల ప్రజల్లో అవగాహన పెంచాలి. పరిశుభ్రత ప్రాధాన్యతపై అందరినీ చైతన్య పరచాలి. లాక్ డౌన్ చేయడం కోట్లాది ప్రజలపై ప్రభావం చూపడంతో పాటు లక్షలాది పేద కుటుంబాల ఉపాధికి గండిపడింది. ఇంట్లోనుంచి బైటకు రాకపోవడం వల్ల అటు ఉపాధిని కోల్పోయి, ఇటు రోజువారీ ఆదాయంలేక రెండిందాలా నష్ట పోయారు. రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ కూలీలు, అసంఘటిత కార్మికుల కుటుంబాల జీవనం దుర్భరం అయ్యింది. విపత్తులు సంభవించినప్పుడు బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవడం ప్రభుత్వాల తక్షణ బాధ్యత.

ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి 2నెలలకు సరిపడా రేషన్ (బియ్యం, పప్పులు, వంటనూనె, చక్కెర, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు) ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయడంతో పాటు, ప్రతి పేద కుటుంబానికి రూ 5వేలు నగదు తక్షణమే, ఏమాత్రం జాప్యం చేయకుండా అందజేసి ఈ విపత్కర సమయంలో వారిని ఆదుకోవాలని కోరుతున్నాం. బహిరంగ మార్కెట్ లో నిత్యావసరాలు అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు పెరిగిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే కూరగాయల ధరలు 300% పెరిగినట్లుగా మీడియాలో చూస్తున్నాం. కాబట్టి రైతు బజార్లలో చౌక ధరలకు కూరగాయలు అందుబాటులో ఉండేలా చూడాలి. బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడేవాళ్లపై కఠిన చర్యలు చేపట్టాలి. దళారుల బెడదకు అడ్డుకట్ట వేయాలి. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్యం- పరిశుభ్రతపై ప్రధాన దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

నారా చంద్రబాబు నాయుడు
శాసన సభ ప్రధాన ప్రతిపక్ష నేత

ఒక పక్క ప్రపంచం, దేశం, పక్క రాష్ట్రాలు కరోనా పై అప్రమత్తం అయ్యి, లాక్ అవుట్ చేసి, యుద్ధం చేస్తున్నాయి. మరి మన ప్రభుత్వం ? సరిగ్గా వారం కిందటి దాకా, ఎన్నికల కమీషనర్ కులం పై గోల గోల చేసారు. ఆదివారం నుంచి, గురువారం, శుక్రవారం దాకా, సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చే దాకా, ఎన్నికల కమీషనర్ కులం కులం అంటూ, గోల గోల చేసారు. దాదాపుగా, 70 పైన ప్రెస్ మీట్లు పెట్టారు. చివరకు, కోర్ట్ కొట్టేయటంతో, అప్పుడు కరోనా మీదకు డైవర్ట్ అయ్యారు. అప్పటి దాకా, జగన్ కు ప్రయారటీ ఎన్నికలు, ఈసీ కులం. దేశం మొత్తం కరోనా మీద ఉంటే, మనం అక్కడే ఆగిపోయాం. అయితే, గత రెండు రోజులుగా, పక్క రాష్ట్రాలు, కేంద్రం లాక్ డౌన్ ప్రకటించటంతో, ఇక తప్పక మనం కూడా అదే చెయ్యాల్సి వచ్చింది. జగనే ఈ ముక్క నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. సరే, ఇప్పటికైనా, కరోనా మీద ఏపి ప్రభుత్వం సీరియస్ అయ్యింది, అని అనుకున్న టైంలో, మరొక్కసారి రాజకీయాలు మొదలు పెట్టరు జగన్. కరోనా వస్తే, సరైన హెల్త్ ఫెసిలిటీస్ లేవు.

సరైన హాస్పిటల్స్, బెడ్స్, వెంటిలేటర్స్, టెస్టింగ్ సెంటర్స్, ఇలా ఏమి లేవు. అయినా వీటి మీద మన ప్రభుత్వానికి దృష్టి లేదు. ఎంత సేపు చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు. ఇప్పుడు ఆ చంద్రబాబు మీద కక్ష తీర్చుకోవటానికి, మరో నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇప్పటికే అమరావతిలో ఏదో జరిగిపోయింది అంటూ, మంత్రుల కమిటీ, సిట్, సిఐడి వేసిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు సిబిఐ ఎంక్వయిరీ వేస్తూ, జీవో ఇచ్చారు. అమరావతి రాజధాని పరిధిలో భూముల అవకతవకలు జరిగాయని, సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో కొందరు భూములను కొనుగోలు చేసిన వ్యవహారంపై మంత్రి వర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికలోని అంశాల మేరకు సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

ఈ కేసులో సీఐడీ.. ఐపీసీ సెక్షన్లు 420, 506ల కింద కేసు నమోదు చేసినట్టు ప్రభుత్వం తెలియచేసింది. ప్రస్తుతం వీటన్నిటిపైనా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినట్టు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే సబ్ కమిటీ ఏమి అయ్యింది, సిట్ ఏమైందో, సిఐడి ఏమైందో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు సిబిఐ అంటున్నారు. సరే, సిబిఐ ఎంక్వయిరీ జరిగితే, చంద్రబాబుకి ఎలాగూ క్లీన్ చిట్ వస్తుంది, అది రాజకీయంగా ఆయనకే ఉపయోగ పడుతుంది. కాని, ఇక్కడ విషయం, ఇప్పుడున్న పరిస్థితిలో అంత హడావిడిగా సిబిఐ విచారణకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ? తన బాబాయ్ కేసు సిబిఐ విచారణకు ఇచ్చారు కాబట్టి, ఇది కూడా ఇవ్వటానికి తప్ప, కోరనా పై శ్రద్ధ పెట్టి, ఆ గోల అయిన తరువాత, ఈ రాజకీయాలు చేసుకోవచ్చు కదా అని ప్రజల నుంచి వినిపిస్తున్న వాదన. సరే, చూద్దాం సబ్ కమిటీ, సిఐడి, సిట్, పట్టుకోలేనిది, సిబిఐ పట్టుకుంటుంది ఏమో.

Advertisements

Latest Articles

Most Read