లక్ష్మీపార్వతి అంటే తెలియని వారు తెలుగురాష్ట్రాల్లో లేరు. ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించిన నుంచీ నేటివరకూ నిత్యమూ వివాదాలకు కేంద్రబిందువు. ఇటీవల కాలంలో ఆమె నోటి మాట ద్వారా కూడా బాగా పాపులర్ అయ్యారు. తెలుగుని సంస్కృతంని కలిపి అకాడమీ ఏర్పాటు చేయడాన్ని సమర్థిస్తూ, ఆ రెండుభాషలు పేకముక్కల్లా కలిసిపోతాయంటూ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ విగ్రహాలు పడగొడుతుంటే అడగడంలేదేమని ఒక అభిమాని ఫోన్ చేస్తే ``ఫోన్ పెట్టరా, లం...కొడకా`` అంటూ తన భాషా పటిమని చూపించారు. ఇటీవల మరో సంచలన వ్యాఖ్యతో కలకలం రేపారు. 26 ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్న తనకు జగన్ కొత్త జీవితం ప్రసాదించాడని వైసీపీ ఫ్యాన్స్‌యే కాదు తెలుగు ప్రజలంతా అవాక్కయ్యే స్టేట్మెంట్ ఇచ్చారు. తాజాగా మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి వివేకానందరెడ్డి హ-త్యపై మాట్లాడారు. ఎవరైనా సొంత కుటుంబసభ్యుల్ని చంపుకుంటారా? అని మీడియాని ఎదురు ప్రశ్నించింది. బాబాయ్ అంటే జగన్ కి ప్రాణం అంటూ చెప్పుకొచ్చింది. తమ కుటుంబసభ్యుల్ని తామే హ-త్యచేస్తారా అని అమాయకంగా ప్రశ్నించింది. ఎన్టీఆర్ మరణానికి కుటుంబసభ్యులే కారణమని, చంద్రబాబే చంపించేశాడని ప్రతీ రోజూ ఆరోపించే లక్ష్మీపార్వతి వద్దే ఎన్టీఆర్ ప్రాణం విడిచారు. వివేకాని ఆయన కుటుంబసభ్యులు ఎలా చంపుకుంటారన్న ఆమె, ఎన్టీఆర్ విషయంలో చేస్తున్నవి తప్పుడు ఆరోపణలేనని తానే ఒప్పుకున్నట్టయ్యింది. అవినాశ్ రెడ్డి ఏమో కానీ, జగన్ రెడ్డి వివేకాని హ-త్య చేసి వుండడని నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం ద్వారా లక్ష్మీపార్వతి వైసీపీని బుక్ చేసినట్టయ్యింది.
news
వైసీపీలో చేరిన టిడిపి ఎమ్మెల్యేలు రాజకీయ భవిష్యత్తు శూన్యం
తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో దారుణ పరాజయం చవిచూశాక టిడిపి టికెట్ పై గెలిచి వైసీపీలోకి నలుగురు ఎమ్మెల్యేలు జంప్ కొట్టారు. మరొకరు మౌనం దాల్చారు. అప్పటికి వైసీపీకి తిరుగులేదని, టిడిపి వచ్చే ఎన్నికలకూ పుంజుకోదని వీరు భావించారు. వ్యాపారాలు, ఆస్తులు కాపాడుకోవడానికి, కేసుల నుంచి రక్షణగా ఉంటుందని..అధికార పార్టీ అండగా అక్రమాలు చేయొచ్చనే లక్ష్యంతో వైసీపీలో చేరకుండానే వైసీపీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. టిడిపి నుంచి ఎవరైనా తన పార్టీలో చేరాలంటే రాజీనామా చేయాలంటూ పులిలా గర్జించిన వైసీపీ అధినేత జగన్ రెడ్డివి పులిహోర కబుర్లేనని టిడిపి ఎమ్మెల్యేలను రాజీనామా చేయకుండానే తన పార్టీలోకి తీసుకున్నారు. తెలుగుదేశంలో ఉంటూ జగన్ మోహన్ రెడ్డితో సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరతాడని అందరూ ఊహించారు. అయితే అన్నం తినేవాడెవడూ వైసీపీలో చేరడంటూ స్టేట్మెంట్ ఇచ్చిన వంశీ, అన్నం తినడం మానేశాడేమో వైసీపీలో చేరాడు. అప్పటి నుంచీ టిడిపిపైనా, చంద్రబాబుపైనా, ఆయన భార్యపైనా, లోకేష్ పైనా, ఆయన భార్యపైనా చాలా అసభ్యమైన కూతలు కూస్తున్నాడు. ఇదే సమయంలో ఇక్కడ టిడిపి బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపడంలో విఫలమైంది. అయితే అనూహ్యంగా వైసీపీలో వంశీకి యార్లగడ్డ, దుట్టాల నుంచి తిరుగుబాటు ఎదురైంది. వల్లభనేని వంశీ అనే నటోరియస్ ని ఎదుర్కోవాలంటే తాము కలవక తప్పదని యార్లగడ్డ, దుట్టా డిసైడయ్యారు. తనకు పోటీనిచ్చే సరైన అభ్యర్థి టిడిపి దొరకడనే ధీమాలో ఉన్న వంశీకి వైసీపీలోనే ఉక్కపోత సృష్టించారు. వైసీపీలో మూడువర్గాల పోరుని వాడుకుంటే ఇక్కడ టిడిపికి బాగా కలిసి వస్తుందని టిడిపి కేడర్ ఆశాభావంతో ఉన్నారు. కేసులు, కేసినోలు, హైదరాబాద్ ల్యాండ్ సెటిల్మెంట్ల కోసం వైసీపీలో చేరితే..వైసీపీ వాళ్లే తనతో ఆడుకుంటుండడంతో తీవ్ర ఒత్తిడిలో వల్లభనేని వంశీ ఉన్నారు.
విశాఖ దక్షిణం నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్‌కుమార్ వైసీపీలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా, బయటపడలేని దుస్థితి. తనపై ఓడిపోయిన వైసీపీ అభ్యర్థిదే పెద్దరికం. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్‌ని మొహరించింది వైసీపీ. సొంతగూటికి వద్దామనుకున్నా టిడిపి గండి బాబ్జీ వంటి గట్టి కేండిడేట్ని నియోజకవర్గ ఇన్చార్జిగా వేసేసింది. చీరాల నుంచి గెలిచిన కరణం బలరాం, వైసీపీలో చేరాక బలహీనరాం అయ్యారు. టిడిపిలో ఉన్నప్పుడు నిత్య అసంతృప్తి వాదిగా ఉండే కరణం..వైసీపీలో తన ఆటలు సాగవని మౌనంగానే బతిమాలుకుని తన పనులు చక్కబెట్టుకుంటున్నారు. కొడుకుకి సీటు కోసం చేరితే అది దక్కే అవకాశం లేదని, ఇటు చీరాల సీటూ పోతుల సునీత బీసీ కోటాలో తన్నుకుపోయే చాన్స్ ఉందని కరణం క్యాంపులో ఆందోళన నెలకొంది. ఇక గుంటూరు పశ్చిమ టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి వైసీపీలో చేరాక కూరలో కరివేపాకు అయ్యారని ప్రచారం సాగుతోంది. వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఏసురత్నమే అన్నీ చూసుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో గిరికి సీటు కూడా కష్టమేనని అంటున్నారు. టిడిపికి దూరంగా ఉంటూ వైసీపీలో చేరాలని విశ్వప్రయత్నం చేసి విఫలమైన విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు..మళ్లీ టిడిపి తలుపు తట్టారు. కానీ గతంలాగ టిడిపిలో గంటా పవర్ పాలిటిక్స్ చేసే సీను ఉండకపోవచ్చని ప్రచారం సాగుతోంది. మొత్తానికి టిడిపి వీడి వైసీపీలో చేరిన ఈ ఎమ్మెల్యేలకు కొన్ని ప్యాకేజీలు దక్కడం, కేసుల నుంచి ఉపశమనం లభించడం మినహాయించి వచ్చే ఎన్నికలకి భవిష్యత్తు మాత్రం లేదని సమీకరణాలు స్పష్టం చేస్తున్నాయి.
అవినాశ్ రెడ్డి, జగన్ దంపతులని సిబిఐ ముందు ఇరికించాడా ? నెక్స్ట్ ఏమి జరగబోతుంది ?
వైఎస్ వివేకానందరెడ్డి హ-త్య కేసు విచారణలో ఇన్నాళ్లూ సీబీఐ సాధించిన పురోగతి ఒక ఎత్తు అయితే, అవినాశ్ రెడ్డి విచారణతో ఒక్కసారిగా కేసు చిక్కుముడి వీడిపోయే క్లూలను సంపాదించింది. సీబీఐ ఎప్పటి నుంచో అరెస్టు చేయొచ్చనే అనుమానాల నేపథ్యంలో ఎట్టకేలకు అవినాశ్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. 2019లో వివేకా హ-త్య జరిగితే ఏపీ పోలీసు దర్యాప్తుని ముందుకు సాగనీయలేదు కొన్ని శక్తులు. అలాగని సీబీఐ దర్యాప్తుకి దిగితే వారిపైనే రివర్స్ కేసులు బనాయించి బెదిరించారు. దీనిపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలతో కేసు విచారణ తెలంగాణ రాష్ట్రానికి బదిలీ అయ్యింది. ఇక్కడి నుంచి కేసు విచారణ వేగం అందుకుంది. అవినాశ్ రెడ్డిని ఐదు గంటలకు పైగానే విచారించిన సీబీఐ, కాల్ డేటాని ముందు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసిందని వివిధ పత్రికల్లో ప్రత్యేక కథనాలు వచ్చాయి. వివేకా హ-త్య జరిగిన రోజు అవినాశ్ రెడ్డి రెండు నంబర్లకు చేసిన కాల్స్ ఇప్పుడు దర్యాప్తులో కీలకం అయ్యాయి. ఈ రెండు నంబర్లు ఒకటి నవీన్ దని, ఇంకొకటి తాడేపల్లి ప్యాలెస్ నంబరే కావడం సీబీఐ అనుమానాలకు బలం చేకూరుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి భార్య భారతితో మాట్లాడాలంటే నవీన్ నంబర్‌కే చేస్తానని అవినాశ్ రెడ్డి సీబీఐ ముందు వెల్లడించాడని ఆంధ్రజ్యోతి కథనం కుమ్మేసింది. .జగన్ తో మాట్లాడాలంటే మరో నంబర్ ఉపయోగించానని అవినాశ్ రెడ్డి చేప్పడంతో ఈ కేసులో చిక్కుముడులు దాదాపు వీడిపోయినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతి జగన్ భార్య కాకముందే అవినాశ్ రెడ్డి మేనత్త కూతురు. భారతి, అవినాశ్ రెడ్డి బంధుత్వం పులివెందుల ప్రాంతీయులకు బాగా తెలుసు. భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో వియ్యం అందుకున్నాడు. వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని అవినాశ్ రెడ్డి ప్రచారం చేయడం, గంగిరెడ్డి వివేకా గుండెపోటుకి కుట్లు వేయడం, అనంతరం అనుమానాస్పద మరణం ఇవ్వన్నీ గొలుసుకట్టు అనుమానాలు ఒకేచోటుకి చేరుతున్నాయి. అవినాశ్ రెడ్డి తన తమ్ముడని, వివేకానందరెడ్డి తన సొంత బాబాయ్ అని..ఒక కన్ను మరోకన్నుని పొడుస్తుందా అని ప్రశ్నించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులకు వివేకానందరెడ్డి హ-త్యరోజు అన్ని కాల్స్ అవినాశ్ రెడ్డి ఎందుకు చేశారనే దానిపైనే ఇప్పుడు సీబీఐ ఫోకస్ పెట్టింది.
వైసీపీలో జగన్ `రెడ్డి నేతలు` తిరుగుబాటు..అదే బాటలో మరికొందరు
గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాని క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. ఆ తరువాత జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. నాలుగేళ్ల వైసీపీ పాలన పూర్తయ్యేసరికి వైసీపీ నేతలకు జగన్ పాలనపై మొహం మొత్తింది ఏమో, వైసీపీ అధినేత తీరు మారదని డిసైడయ్యారేమో అసంతృప్తి గళం వినిపించడం ఆరంభించారు. ఇది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మొదలై, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి మీదుగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వరకూ పాకింది. వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగురవేసే వాళ్లని బుజ్జగించడం పద్ధతి మానేసి వేటేసే ఆట మొదలు పెట్టారు జగన్ మోహన్ రెడ్డి. నెల్లూరు నుంచి వైసీపీలో గెలిచినవాళ్లలో అత్యధికశాతం జగన్ రెడ్డి సామాజికవర్గం వారే. వీరిలో చాలా మంది టిడిపితో టచ్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. క్లీన్ స్వీప్ చేసిన జిల్లా నెల్లూరు నుంచి సొంత సామాజికవర్గ నేతలే వైసీపీని వీడిపోయేందుకు తహతహలాడుతూ ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడనున్నారని టాక్. అత్యధిక మెజారిటీతో గెలిచిన సొంత సామాజికవర్గం వారే జగన్ రెడ్డిపై అపనమ్మకంతో ఉంటే, అంటరానివారిగా జగన్ రెడ్డి చూసే ఇతర సామాజికవర్గాల వారు వైసీపీలో కొనసాగాలని ఎవరు అనుకుంటారు? అన్ని జిల్లాల నుంచీ అసంతృప్త నేతలు ఒక్కొక్కళ్లూ బయటకొచ్చి తమ గళం వినిపించేందుకు సిద్ధం అవుతున్నారని ప్రచారం సాగుతోంది. బిల్లులు కాలేదని ఒకరు, తమ నియోజకవర్గానికి నిధులు ఇవ్వలేదని మరొకరు, తన మనుషులకు పదవులు ఇవ్వలేదని ఇలా వైసీపీని టార్గెట్ చేసేందుకు సరైన సమయం వేచి చూస్తున్నారని తెలుస్తోంది. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంటుంది. వైసీపీలో సంతృప్తిగా ఉన్న నేతలు లిస్టు తీస్తే జగన్ రెడ్డి, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, సజ్జలరెడ్డి మాత్రమేనని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.