కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు తెలిపినా ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్..జిల్లాల కలెక్టర్లను ఎలా తొలగిస్తారని సీఎం జగన్ ప్రశ్నించారు. కనీసం సీఎస్​తో గానీ వైద్యశాఖ కార్యదర్శితో మాట్లాడకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ రమేశ్​కుమార్​పై ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రమేశ్​కుమార్ చంద్రబాబు ప్రభుత్వం నియమించిన వ్యక్తి అని అన్నారు. ఆయన సామాజికవర్గం అని అన్నారు. ఆయన ఇష్టానుసారంగా ఆదేశాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు. మాచర్ల సిఐని ఎలా తప్పిస్తారు, ఆశ్చర్యం వేస్తుంది అంటూ, మాచర్ల ఘటన చిన్నదిగా చేసి చుపించారు. ప్రతోడు విచక్షణాధికారం అంటాడు, ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపొయింది అంటూ, జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఎవడో చెప్పాడు.. ఇంకెవడో రాశాడు అంటూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల పై, తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మేమంతా ఎందుకు, ఎలక్షన్ కమిషన్ ఎవడైతే ఉంటాడో, వాళ్ళనే ముఖ్యమంత్రిగా పెట్టుకోండి అంటూ జగన్ వ్యాఖ్యలు చేసారు.

ప్రజలు ఓట్లేసి 151 స్థానాలు తమకు ఇస్తే, అధికారంలో ఉన్నామని, అధికారం జగన్‌ మోహన్‌రెడ్డిదా లేదా రమేశ్ కుమార్‌దా? అంటూ ఏకంగా ఎలక్షన్ కమిషన్ ఎవరు అనే విధంగా జగన్ స్పందించారు. ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ఈరోజు మాట్లాడిన వ్యాఖ్యలు చాలా బాధాకారంగా ఉన్నాయని, విచక్షణ కోల్పోయి మాట్లాడారని, కులాలు, మతాలకు అతీతంగా పని చేయాలని, కానీ రమేశ్ కుమార్ కరోనా వైరస్ పేరుతో ఎన్నికలు వాయిదా వేశారని అన్నారు. అదే సమయంలో గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను తప్పిస్తూ ప్రకటన చేశారని, కరోనా సాకు చెప్పి అలా ఎలా చేస్తారు..? ప్రజలు ఓట్లు వేస్తే వైకాపా 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది, అధికారం వైఎస్ జగన్​దా, రమేశ్ కుమార్​దా? ఏమైనా అంటే విచక్షణాధికారం అంటున్నారు అంటూ వ్యాఖ్యలు చేసారు.

కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జగన్ అన్నారు. కరోనా మాత్రమే కాదు.. ఏ జబ్బులు వచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా సమావేశం పెట్టాల్సి వస్తుందని అనుకోలేదని వ్యాఖ్యానించారు. కరోనా గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. 60 ఏళ్లు పైబడిన వారిపైనే కరోనా ఎక్కువ ప్రభావం చూపిస్తుందని చెప్పారు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు లేనివారు కరోనా విషయంలో భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కరోనా పెద్ద రోగం కాదని, పేరాసిటమాల్ వేసుకుంటే కరోనా తగ్గిపోతుందని జగన్ అన్నారు. మొత్తానికి ప్రపంచం మొత్తం వణికిపోతుంటే, జగన్ మాత్రం కరోనా అనేది పెద్ద విషయం కాదని అన్నారు.

ఎప్పుడో ఏడాది క్రితం, ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసి, మీడియా సమావేశం పెట్టిన జగన్, ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెడుతున్నారు. రాష్ట్రంలో అరాచకం జరుగుతూ ఉంటే, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని, ఈ అరాచకానికి సహకారం అందించిన అధికారుల పై, ఈసీ చర్యలు తీసుకుంది. అలాగే, కరోనా దేశంలో విస్తరిస్తూ ఉండటం, పక్కన ఉన్న తెలంగాణా ఎమర్జెన్సీ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల వాయిదా, అధికారులని సస్పెండ్ చెయ్యటం పైవైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావంతో ఎన్నికలు వాయిదా వేశారని చెప్పడాన్ని ప్రభుత్వం విశ్వసించట్లేదని సమాచారం. గవర్నర్‌ బిశ్వభూషణ్​తో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఆరు వారాల పాటు స్థానిక ఎన్నికల వాయిదా సందర్భంగా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే గవర్నర్ తో ఏమి చర్చించారు, ఎన్నికల కమిషన్ పై ఫిర్యాదు చేసారా అనే దాని పై తెలియాల్సి ఉంది. అయితే ఎప్పుడూ లేనిది జగన్ ఎందుకు మీడియా సమావేశం పెడతారో, ఏమి చెప్తారో చూడాలి.

jagan 15032020 2

రాజకీయ పోరాటంతోనే స్థానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిందని తెదేపా నేత అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక పరిస్థితులే ఎన్నికల వాయిదాకు కారణమన్నారు. స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా పడడం రాజకీయ పోరాటల ఫలితమేనని మాజీ మంత్రి, తెదేపా నేత అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అన్నారు. ఎన్నికల వాయిదాకు కరోనా అని ఎన్నికల కమిషన్ అంటున్నా... రాష్ట్రంలోని అప్రజాస్వామిక విధానాలేనని అభిప్రాయపడ్డారు. ఇలా ఎన్నికలను మధ్యలో వాయిదా వేయడమనేది దేశ చరిత్రలోనే ఇదే ప్రథమమన్నారు. ఎన్నికల ప్రక్రియను మొత్తం రీషెడ్యూల్ చేయాలని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. నామినేషన్ల ప్రక్రియలో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థులు చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాచర్ల ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

jagan 15032020 3

ఎన్నికల ప్రక్రియను మొత్తం రీషెడ్యూల్ చేయాలని తెదేపా డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తెదేపా అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయనివ్వలేదని ఆరోపించారు. విజయవాడలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు దీపక్ రెడ్డి, అశోక్​బాబు, బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు. వైకాపా ఉచ్చులో కొందరు అధికారులు పడ్డారని ఆరోపించారు. వారిపై విచారణ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డోన్‌, మాచర్లలోనూ తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్‌ వేయనివ్వలేదని దీపక్ రెడ్డి అన్నారు. నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని అన్నారు. తాము చేసిన ఫిర్యాదులు అన్నింటిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. అవసరమైనతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని చెప్పారు.

9117 ఎంపీటీసీలు, 639జడ్పీటీసీలు, 302 నగర పంచాయతీలు, 557 కార్పొరేషన్లు, 1631 మునిసిపాలిటీల్లో మొత్తం కలిపి 12,336 నామినేషన్లు టీడీపీ తరుపున రాష్ట్రవ్యాప్తంగా వేయడం జరిగిందని, టీడీపీనేత, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అన్నిరకాలుగా టీడీపీని అడ్డుకోవడానికి, ఎన్నికల్లో నిలవకుండా చేయడానికి అధికారపార్టీ చేయాల్సిన దా-రు-ణా-లు, దా-ష్టీ-కా-లు చేసిందని, అయినాకూడా ఎక్కడా వెనక్కు తగ్గకుండా ప్రతిపక్షపార్టీ స్థానిక ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చేలా బరిలో నిలవడం జరిగిందన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక, కుల, నోడ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా, ఎన్నికల అధికారులను, పోలీసులను అడ్డంపెట్టుకొని, వివిధ రకాలుగా బెదిరించి ఎంపీటీసీల్లో 166మందిని, మునిసిపాలిటీల్లో 40మందిని అడ్డుకోవడం జరిగిందన్నారు. నామినేషన్లు ఫైల్ అయ్యాక టీడీపీకిచెందిన 18 మంది ముఖ్యనేతలపై బైం-డో-వ-ర్ కే-సు-లు పెట్టారని, వాటిలో తప్పుడు కే-సు-లు 2 నమోదైతే, కి-డ్నా-ప్ కే-సు-లు 9 నమోదయ్యాయని, నామినేషన్లు లాక్కోవడం, చించేయడం వంటి సంఘటనలు 24 చోట్ల జరిగాయన్నారు. అన్నింటికన్నా ఎక్కువ 87చోట్ల పోలీసులు, 84చోట్ల వైసీపీవారు, తమపార్టీకి చెందిన వారిని బెదిరించడం, కొ-ట్ట-డం వంటి సంఘటనలు జరిగాయన్నారు. ఇవన్నీ కలిపితే 224 సంఘటనల వరకు పోలీసులను అడ్డుపెట్టుకొని చేసిన దా-డు-లే ఉన్నాయన్నారు.

ఇవి పూర్తయ్యాక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో తప్పులు చూపించి 220వరకు (ఎంపీటీసీ, జడ్పీటీసీలు కలిపి) నామినేషన్లు తిరస్కరించడం జరిగిందన్నారు. ఈ పనికూడా ఎన్నికల విధుల్లో ఉన్నవారిని అడ్డుపెట్టుకొని, అన్యాయంగా, అక్రమంగా చేసిందేనని దీపక్ రెడ్డి తెలిపారు. తరువాత టీడీపీ అభ్యర్థులను భయపెట్టి, కొ-ట్టి, ఇతరేతర మార్గాల్లో ప్రలోభపెట్టి, డబ్బు ఎరచూపి, తప్పుడుకేసులు పెట్టి 498 ఎంపీటీసీ, 72 జడ్పీటీసీ నామినేషన్లను వెనక్కు తీసుకొనేలా చేయడం జరిగిందన్నారు. 83 ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీని వైసీపీ ఇప్పటికే ఏకగ్రీవం చేసుకుందని, ఎన్నిరకాలుగా పోలీసులను, ఎన్నికల అధికారులను ఉపయోగించుకొని చివరకు వైసీపీ సాధించింది మొత్తం 84స్థానాలేనన్నారు. డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ కే-సు-ల-కు సంబంధించి చెప్పిన లెక్కలన్నీ తప్పుడు లెక్కలేనని, కేవలం తెలుగుదేశంపార్టీ వారిపై పెట్టిన అ-క్ర-మ కే-సు-ల వివరాలు మాత్రమే ఆయన వెల్లడించారన్నారు. తమపార్టీ తరుపున ఇచ్చిన ఫిర్యాదులపై డీజీపీగానీ, ఇతర పోలీస్ అధికారులు గానీ ఏవిధమైన చర్యలు తీసుకోలేదని, ఆయన చెప్పిన వివరాలతోనే తేలిపోయిందన్నారు. ఎన్నికల కమిషన్ కు ఇప్పటివరకు అన్నిరకాల ఆధారాలతో సహా, ఏంజరిగిందో ఫిర్యాదుచేసినప్పటికీ వాటిపై ఏవిధమైన చర్యలు లేవన్నారు.

తామిచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ నుంచి కూడా ఏరకమైన వివరణ రాలేదని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోలేకపోతే, ఆ ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల కమిషన్ కైనా పంపాలని దీపక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వైసీపీప్రభుత్వం, అధికార యంత్రాంగాన్ని వాడుకొని ఎన్నికల్లో గెలవడంకోసం నేరాలకు పాల్పడిందని, ప్రభుత్వయంత్రాంగాని నిర్వీర్యంచేసేలా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ప్రజల కష్టార్జితం నుంచి, వారు కట్టే పన్నుల నుంచే తమకు జీతాలు వస్తున్నాయన్న విషయాన్ని, ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులు, పోలీసులు గుర్తుంచుకోవాలని, వారంతా ఏఒక్క పార్టీకో కొమ్ముకాయకుండా ప్రజల పక్షాన నిలవాలని దీపక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలను వే-ధిం-పు-ల-కు గురిచేస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ప్రతి ఉద్యోగిని, ప్రతి పోలీస్ అధికారిని కోర్టులముందు నిలిపేవరకు టీడీపీ వదిలిపెట్టదని దీపక్ రెడ్డి స్పష్టంచేశారు. నేతలు చెప్పారని ఒత్తిడికి తలొగ్గే వారంతా, డీజీపీ మాదిరే కోర్టు ముందునుంచోవాల్సి వస్తుందని, జైలుకుపోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఎన్నికల బరిలోనిలిచిన టీడీపీ కార్యకర్తలు, నేతలు ధైర్యంగా ఉండాలని, ప్రజలంతా టీడీపీకి అండగా నిలవబోతున్నారని, అదేమనకు కొండంత అండనిస్తుందని ఆయన స్పష్టంచేశారు.

రాష్టంలో ఎన్నికల ప్రక్రియ 6 వారాలపాటు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత సమీక్ష నిర్వహించి.. ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్‌ వెల్లడించారు. పార్టీలు, ఉద్యోగులు, అన్ని వర్గాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. "‘కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా ఊహించని మార్పులు వచ్చాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పేపర్‌ బ్యాలెట్‌ వల్ల కరోనా విస్తరించే ప్రమాదం ఉంది. విధిలేని పరిస్థితుల్లోనే స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నాం. పార్టీలు, ఉద్యోగులు, అన్ని వర్గాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆరు వారాల తర్వాత సమీక్ష చేపడతాం. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే ఎన్నికలు నిర్వహిస్తాం. ఆరు వారాల తర్వాత ఎన్నికల ప్రక్రియ మళ్లీ ప్రారంభమవుతుంది. ఆరు వారాల తర్వాత కొత్త షెడ్యూల్‌ విడుదల చేస్తాం’" అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ అన్నారు.

ec 15032020 2

ఎన్నికల ప్రక్రియ వాయిదా పడినప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల నియమావళి కొనసాగుతుందని రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు కొనసాగుతారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నెలకొన్న హింసాత్మక చర్యలను రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. కొన్నిచోట్ల బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగడం దారుణమని వ్యాఖ్యానించింది. విధుల్లో విఫలమైన పలువురు అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను తప్పిస్తున్నామని వెల్లడించింది. శ్రీకాళహస్తి, పలమనేరు, డీఎస్పీలను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. మాచర్ల సీఐను సస్పెండ్ చేయాలని... తిరుపతి, పలమనేరు, రాయదుర్గం , తాడిపత్రి సీఐలు బదిలీ చేయాలని సూచించింది. తిరుపతి, మాచర్ల, పుంగనూరు ఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. అవసరమైతే ఈ ప్రాంతాల్లో కొత్త షెడ్యూల్​ను ప్రకటిస్తామని తెలిపింది.

ec 15032020 3

అయితే, ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ చూస్తే, కరోనా ఒక సాకుగానే కనిపిస్తుంది. కరోనా పట్ల కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అందులో సందేహం లేదు. అయితే, ఇదే ప్రెస్ మీట్ లో, ఈసీ, ఏకంగా, గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను తప్పించటం. శ్రీకాళహస్తి, పలమనేరు, డీఎస్పీలను బదిలీ, మాచర్ల సీఐను సస్పెండ్, తిరుపతి, పలమనేరు, రాయదుర్గం , తాడిపత్రి సీఐలు బదిలీ వంటి విషయాలు ఈసీ చెప్పటం, ఒక సంచలనం. ఎంత అరాచకం లేకపోతే, ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే అన్ని మాధ్యమాల్లో ఈ అరాచకాలు వస్తున్నాయి, ఒక వేళ ఈసీ చర్యలు తీసుకోకపొతే, కోర్ట్ లు దగ్గర భంగపాటు తప్పదు. అందుకే ముందుగానే ఈ అరాచకాలు చూసిన ఈసీ, చర్యలు తీసుకోకపొతే, ఇంకా ఎందుకు అనుకుని, వారు ఈ చర్యలు తీసుకున్నారు.

Advertisements

Latest Articles

Most Read