ఒక పక్క డీజీపీ, హోం మంత్రి, మంత్రులు, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉంది అంటూ భరోసాలు ఇస్తుంటే, వస్తున్న వార్తలు మాత్రం, అలా అనిపించటం లేదు. స్థానిక సంస్థల పుణ్యమా అని, అరాచకం రాజ్యమేలుతుంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు, అరాచకాలు సృష్టిస్తూ, వీరంగం చేస్తున్నారు. మొన్న ఒక ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే పై హ-త్యా ప్రయత్నం చేసిన వైసీపీ నేతలు, ఇప్పుడు మాజీ మంత్రిని టార్గెట్ చేసారు. అనంతపురం జిల్లాలోని, రాయదుర్గంలో, తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పై, దా-డి-కి తెగబడింది వైసీపీ. చిన్న చిన్న కారణాలు చూపించి తెలుగుదేశం పార్టీ వారికి చెందిన నామినేషన్లు ఎన్నికల అధికారులు తిరస్కరిస్తున్నారని తెలుసుకుని, అధికారులతో మాట్లాడటానికి, మున్సిపల్ కార్యాలయం వద్దకు కాల్వ వెళ్లారు. అయితే, అధికారులతో మాట్లాడుతూ ఉండగానే, వైసీపీ నేతలు, వచ్చి కాల్వ శ్రీనివాసుల పై దాడి చేసారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోని, కాల్వ శ్రీనివాసుల పై దాడి చేసారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.
కాల్వ శ్రీనివాసులతో పాటుగా, మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు పై కూడా దాడి చేసారని సమాచారం. అయితే, దాడి చేసిన వారిని వదిలేసి, తెలుగుదేశం నేత అయిన, కాల్వ శ్రీనివాసులని పోలీసులు స్టేషన్ కు తీసుకువెళ్ళారు. దీంతో, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు వెళ్ళటంతో, పరిస్థితి అదపు తప్పుతుందని గమనించి, చేసేది ఏమి లేక, కాల్వ శ్రీనివాసులని పోలీసులు వదిలి పెట్టారు. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులును అక్రమ నిర్బంధించడాన్ని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఖండించారు. రాయదుర్గం పురపాలికలో తెదేపా అభ్యర్థి నామినేషనును తిరస్కరించడాన్నిప్రశ్నించినందుకు కాలువ శ్రీనివాసులును పోలీస్ స్టేషన్ కు తరలించడమేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై పోలీసుల సాయంతో వైకాపా నేతలు దాడులతో పేట్రేగిపోతున్నారన్నారని మండిపడ్డారు.
``జగన్ అధికారంలోకి వఛ్చిన తర్వాత బడుగు బలహీనవర్గాలకు రక్షణ కరువైంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కును హరిస్తున్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం దుర్మార్గం. పేద మధ్య తరగతి ప్రజలు స్వేచ్చగా తిరగలేని దౌర్భాగ్యం స్థితి కల్పించా''రని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా మాజీ మంత్రులను, శాసనసభ్యులను అదుపులోకి తీసుకోవడం హేయమన్నారు. ఇళ్లల్లో ఉన్న తెదేపా నాయకులను అక్రమంగా నిర్బంధించడం అన్యాయమన్నారు. రాష్ట్రాన్ని నేరగాళ్ల రాజ్యంగా మార్చడం గర్హనీయమన్నారు. ఎన్నికలలో నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు.. రానున్న ఎన్నికల్లో వైకాపా దురాగతాలకు ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు. ప్రజా, న్యాయ క్షేత్రంలో జగన్, వైకాపా మంత్రులకు ప్రజలే గుణపాఠం చెప్పాలని పిలుపిచ్చారు. ముస్లిం మైనారిటీ , మహిళలపై వైకాపా నేతలు దాడులు చేస్తున్నా నిలవరించకపోవడంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.