ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వైకాపా ప్రభుత్వం కొంతమంది పొట్ట కొడుతోందని బాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తన భూమినే వైకాపా మాఫియా కబ్జా చేశారని అన్నారు. విశాఖ రాజధాని అంటే అక్కడి ప్రజలు భయపడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ విషయాన్ని అక్కడ ఎవరిని అడిగినా చెబుతారని విజయవాడలో 'మీట్​ ది మీడియా'లో అన్నారు. విశాఖలోనే కాదు.. విజయనగరంలో కూడా ప్రజలు భయపడుతున్నారన్నారు. చేపలుప్పాడలో తన భూమిని కూడా వైకాపా మాఫియా కబ్జా చేసిందని తెలిపారు. తన స్థలం చుట్టూ కంచె వేశారని...తీరా అది తనదని తెలిశాక వెనక్కి తగ్గారని వివరించారు. ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వైకాపా ప్రభుత్వం కొంతమంది పొట్ట కొడుతోందని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఇప్పటివరకూ జగన్‌ ప్రభుత్వం... ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటీ చేయలేదన్నారు. ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌... ప్రతిపక్షనేతలు నామినేషన్‌ వేయలేని పరిస్థితులు తీసుకొచ్చారని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటలను వైకాపా పక్కన పెట్టిందన్నారు. కరోనాపై వస్తున్న వార్తల్లో వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కన్నా పిలుపునిచ్చారు. ఈ విషయంలో మీడియా పాత్ర కీలకమని కన్నా సూచించారు.

ముఖ్యమంత్రి జగన్​కు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని.. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా దాడులు జరుగుతున్నాయని భాజాపా నేత జీవీఎల్ నరసింహన్ విమర్శించారు. ఈ ఘటనలపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా జరుగుతున్న దాడులు, బెదిరింపులపై ముఖ్యమంత్రి జగన్ స్పందిచాలని భాజాపా నేత జీవీఎల్ నరసింహరావు డిమాండ్ చేశారు. జగన్​కు ప్రజాస్వామ్యంపై గౌరవం లేకపోవటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రతిపక్ష అభ్యర్థులను నామపత్రాలు దాఖలు చేయనీయకుండా వైకాపా నాయకులు అడ్డుకోవటం, దాడులు చేయటం హేయమైన చర్య అని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అవినీతికి కొమ్ముకాసిన పలువురు ఐఏఎస్​లు జైలుకు వెళ్లారని, ఆ పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను హెచ్చరించారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రహసనంగా మారాయని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ మండిపడ్డారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తూ ఎన్నికల్లో గెలవాలని అధికారపార్టీ చూస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థులపై దాడులు చేస్తూ... ఎలగైనా గెలవాలని అధికార పార్టీ చూస్తోందని పీసీసీ అధ్యక్షుడు శైలజనానాథ్ విమర్శించారు. దాడుల ఘటనలపై రాజకీయ పార్టీలు, పాత్రికేయులు ఎన్ని ఆధారాలు చూపినా.. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవటం దారుణమన్నారు. మాచర్ల దాడి ఘటనలో నిందితుడికి మెుదట స్టేషన్​ బెయిల్ ఇచ్చి, నామినేషన్ దాఖలు చేశాక.. నాన్ బెయిలబుల్ కేసుగా మార్చారని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమైన హింస, పట్టణ ప్రాంతాలకు చేరిందన్నారు. దాడి ఘనటలపై పోలీసులు చోద్యం చుస్తున్నారే తప్ప.. చర్యలు తీసుకోవటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. లౌకికవాదాన్ని కాపాడేందుకు సీపీఎంతో కలిసి పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు.

రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉందని, రాష్ట్రంలో శాం-తి-భ-ద్ర-త-ల-కు ఎలాంటి ముప్పు లేదు అని రాష్ట్ర డీజీపీ గౌతం సవంగ్ స్పష్టం చేసారు. ఎన్నికలు జరుగుతున్న వేళ అన్ని చోట్లా, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసామని అన్నారు. ఎవరైనా గొ-డ-వ-లు చేస్తే వారి పై, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మేము పోలీసులం అని, తమకు పార్టీలతో సంబంధం ఉండదని, ఎవరు ఫిర్యాదు ఇచ్చినా, దాని పై స్పందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా, మా-చ-ర్ల-లో జరిగిన ఘటన తరువాత, బుద్దా వెంకన్న, బొండా ఉమా పై హ-త్యా ప్రయత్నం చేసిన తురక కిషోర్ కు స్టేషన్ బెయిల్ ఇచ్చారు అంటూ, తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు పై, అలాగే ఈ విషయం పై తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ పై కూడా డీజేపీ స్పందించారు. మా-చ-ర్ల దాడి ఘటన నిందితులను అరెస్టు చేసి గురజాల స-బ్-​జై-లు-కు పంపామని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. మా-చ-ర్ల దా-డి ఘటన నిందితులపై సెక్షన్​ 3-0-7 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని వారిని గురజాల స-బ్-​జై-లు-కు పంపామన్నారు.

dgp 14032020 2

దా-డి ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగించటంతో పాటు పోలీసులకు చెప్పి వెళ్లామంటున్న తెలుగుదేశం నేతల వ్యాఖ్యలపైనా విచారణ చేస్తున్నామని డీజీపీ తెలిపారు. స్థానిక ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల నేతల ఫిర్యాదులూ స్వీకరించటంతో పాటు వెంటనే విచారణ జరిపిస్తున్నామన్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉన్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. అన్ని పార్టీల నేతల ఫిర్యాదులూ స్వీకరిస్తూ... వెంటనే విచారణ జరిపిస్తున్నామన్నారు. ఘటనల వివరాలు, దర్యాప్తు సమాచారం ఎప్పటికప్పుడు ఎస్​ఈసీకి ఇస్తున్నామని వెల్లడించారు. అయితే డీజీపీ చెప్పే మాటలకు, రాష్ట్రంలో జరుగుతున్న పనులకు పొంతన లేదని, 5 కోట్ల ప్రజలే, రాష్ట్రంలో ఏమి జరుగుతుందో చూస్తున్నారని టిడిపి ఆరోపిస్తుంది.

dgp 14032020 3

ఇక పొతే, ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక నగరి తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉ-ద్రి-క్త-త-ల-కు దారితీసింది. అధికార పక్షం తప్ప ఇతరులెవ్వరూ బరిలో ఉండకూడదన్న రీతిలో అధికార పార్టీ కార్యకర్తలు పెట్రేగిపోయారు. యాభై వార్డుల్లో దాదాపు పదహారు వార్డులకు అధికార పక్షం తప్ప మరే ఇతర పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల పర్వం....మూడు దా-డు-లు....ఆరు పత్రాల చించివేతగా సాగింది. తిరుపతిలో పులివెందుల సంస్కృతిని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుగుణమ్మ మండిపడ్డారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపా సభ్యులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించిన ఆమె....నగరంలోని 9,10,11,12 వార్డుల్లో తెదేపా నేతలను బయటకు నెట్టేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

నిన్న ఆంధ్రప్రదేశ్ డీజీపీని, హైకోర్ట్ పిలిపించిన సంగాతి తెలిసిందే. ఈ సందర్భంగా, చంద్రబాబు ని వైజాగ్ లో అరెస్ట్ చెయ్యటం, 151 నోటీస్ ఇవ్వటం పై, హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే సందర్భంలో, అమరావతిలో, పోలీసులు చేసిన దాని పై కూడా, హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విచారణ సందర్భంగా.. రాజధానిగా అమరావతి కొనసాగాలంటూ ఉద్యమిస్తున్న రైతులు, మహిళలపై.. గతంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై త్రిసభ్య ధర్మాసనం.... డీజీపీ సవాంగ్​ని వివరణ కోరింది. మందడం వీధుల్లో 500 మంది పోలీసులు కవాతు చేస్తున్న పెన్‌డ్రైవ్‌లోని వీడియోను చూశారా అని అడిగింది. అంతమంది పోలీసులు ఒక గ్రామంలో ఎందుకు తిరగాల్సి వచ్చిందని నిలదీసింది. ఆ వీడియోలో పోలీసుల హెచ్చరికలు అభ్యంతరకరంగా ఉన్నాయన్న ధర్మాసనం.... శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే హెచ్చరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. వీడియోను చూశానని డీజీపీ హైకోర్ట్ కు సమాధానం చెప్పారు.

pendrive 13032020 2

అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా.. జనవరి 10న పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారని బదులిచ్చారు. చట్ట నిబంధనల మేరకు అనుగుణంగా వ్యవహరించని అధికారులపై చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. రూల్‌ ఆఫ్‌లాను తప్పక పాటించాల్సేందేనని తేల్చిచెప్పింది. ఇందుకోసం పోలీసు విభాగాల అధిపతిగా డీజీపీ చర్యలు తీసుకుంటారని తాము ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు కోర్టు వ్యాఖ్యానించింది. స్పందించిన గౌతం సవాంగ్‌.... అది తన కర్తవ్యమని తెలిపారు. రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా సక్రమంగా అమలయ్యేలా చూస్తానని.. మౌఖికంగా కోర్టుకు హామీ ఇచ్చారు. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

pendrive 13032020 3

నెల రోజుల్లో రెండుసార్లు హాజరు... హైకోర్టు ఆదేశాల మేరకు నెల రోజుల వ్యవధిలో డీజీపీ రెండు సార్లు న్యాయస్థానానికి హాజరు కావాలని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. విశాఖలో ఇద్దరు యువకుల మిస్సింగ్ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు జ్యుడీషియల్ విచారణకు సరైన సమాచారం అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం ఇటీవల జరిపిన విచారణలో డీజీపీ స్వయంగాతమఎదుటహాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం విశాఖలో చంద్రబాబుకు సీఆర్పీసీ 151 సెక్షన్ నోటీసులు జారీ చేయడంపైనా డీజీపీని హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నెల రోజుల వ్యవధిలో రాష్ట్ర డీజీపీ రెండుసార్లు న్యాయస్థానానికి హాజరై వివరణ ఇచ్చారు.

అధికార పార్టీకి చెందిన నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నా... చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. హడావుడిగా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ఎస్ఈ​సీని ప్రశ్నించింది. అధికార పార్టీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిందంటూ వచ్చిన ఫిర్యాదులపై... తక్షణం ఎందుకు స్పందించడం లేదని హైకోర్టు ఈసీని ప్రశ్నించింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తే చర్యలు తీసుకునేందుకు తమకు అధికారాలుంటాయని గతంలో కోర్టుకు చెప్పిన ఈసీ... ప్రస్తుతం కోడ్‌ అమల్లో ఉంటే వెంటనే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ మేరకు తెదేపా నేత కోవెలమూడి రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు...అధికార పార్టీ నేతలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పట్టించుకోవడం లేదన్న పిటిషనర్‌... అనంతపురం జిల్లా తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మహిళలకు చీరలు, దుస్తులు పంపిణీ చేశారని కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాల్ని ఈసీకి అందజేశామని చెప్పారు. కడపలో గ్రామ వాలంటీర్లు, వార్డు కార్యదర్శులతో ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా సమావేశం నిర్వహించి వైకాపాకు ప్రచారం చేయాలని కోరారని... ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎన్నికల ప్రచారం కోసం వినియోగించుకోవడం తగదని వివరించారు.

ec 14032020 2

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో వైకాపా నేతలు ఇళ్ల స్థలాల పంపిణీ నిమిత్తం కూపన్లు ఇస్తున్నారని... తమకు ఓటేయకపోతే ప్రభుత్వం నుంచి అందాల్సిన వివిధ పథకాల లబ్ధిని ఆపేస్తామని బెదిరిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఈ చర్యలన్నీ కోడ్‌ ఉల్లంఘనేనన్న పిటిషనర్‌... ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు.నివేదిక కోరాం...పిటిషనర్‌ వాదనలపై స్పందించిన ఈసీ తరపు న్యాయవాది... తాడిపత్రి ఘటనపై తమకు అందిన ఫిర్యాదును అనంతరపురం జిల్లా కలెక్టర్‌కు పంపి నివేదిక కోరామన్నారు. దర్మాసనం స్పందిస్తూ, ఈమెయిల్‌ ద్వారా నివేదిక తెప్పించుకోవచ్చని పేర్కొంది. జిల్లా ఎన్నికల అధికార్లు ప్రస్తుతం మీ నియంత్రణలోనే ఉంటారని గుర్తుచేసింది. కలెక్టర్‌ సరైన నివేదిక ఇవ్వకపోతే ఏమి చేస్తారు..? ప్రభుత్వ నియంత్రణలో ఉన్నవారు ఇచ్చే వివరాలను మీరు విశ్వసిస్తారా..? అని ప్రశ్నించింది. అసలు మీరు జిల్లా కలెక్టరును నివేదిక కోరారా... లేక జిల్లా ఎన్నికల అధికారిని నివేదిక కోరారా అని ప్రశ్నించింది. జిల్లా కలెక్టరును జిల్లా ఎన్నికల అధికారిగా నోటిఫై చేశారా..? లేదా..? అని అడిగింది.

ec 14032020 3

ఈసీ తరపు న్యాయవాది బదులిస్తూ తప్పుడు నివేదిక ఇస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. కోడ్‌ ఉల్లంఘన ఫిర్యాదులపై ఈసీ సకాలంలో స్పందించలేదన్న హైకోర్టు... తమ ఆదేశాల ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది.హడావుడిగా ఎన్నికల నిర్వహణపై అసహనంఎన్నికలు హడావుడిగా నిర్వహించడంపైనా హైకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ వివరాల్ని తమకు అందించాక... 40-45 రోజుల వ్యవధి కావాల్సి ఉంటుందని చెప్పిన ఈసీ ప్రకటనకు, ఎన్నికల నిర్వహణకు మధ్య తక్కువ సమయాన్ని నిర్ణయించడం ఏంటని ప్రశ్నించింది. ఎన్నికల ప్రకటన జారీచేసే అధికారం మీదా..? ప్రభుత్వానిదా అని నిలదీసింది. ఎన్నికల ప్రకటన తామే జారీచేస్తామని తెలిపిన ఈసీ... పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసిందన్నారు. ఫలితంగా ఎన్నికల ప్రచార తేదీ, నామినేషన్ల దాఖలు, ఉపసంహరణకు సమయం తగ్గిందన్నారు. ఎన్నికల షెడ్యూల్‌, నోటిఫికేషన్‌ జారీ వివరాల్ని కోర్టుకు తెలిపారు. ఆ వివరాల్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం... ఆర్డినెన్స్‌ ప్రతిని తమకు అందజేయాలని పేర్కొంటూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Advertisements

Latest Articles

Most Read